Brahmamudi August 23rd episode: పబ్‌కి వచ్చావా? పార్టీకి వచ్చావా? అప్పుకి క్లాస్ పీకిన రుద్రాణి
ఆస్తి కోసమే కళ్యాణ్ ని ఇంటికి పిలవడం లేదని కావ్యని కోప్పడతాడు రాజ్. అస్తి కోసమే కళ్యాణ్ ని ఇంటికి రానివ్వడం లేదు అని భార్యపై కోప్పడిన భర్తకి చుక్కలు చూపిస్తుంది కావ్య. కళ్యాణి ఇంటికి రప్పించడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్.పండక్కి ఒక పూట పూజ కోసం నేను పిలుస్తాను వాళ్ళని శాశ్వతంగా ఇంట్లో ఉంచే బాధ్యత నీది అని కాస్త అంటుంది ఇందిరా దేవి. ఇంటికి వచ్చిన పప్పుని అవమానించి పంపిస్తాను అని రుద్రాణి తో అంటుంది ధాన్యలక్ష్మి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 23వ తేదీ ఎపిసోడ్ 496 లో ఏం జరిగిందంటే..
మా ఇంటికి వెళితే అమ్మ, రుద్రాణి అత్త వాళ్ళు నిన్ను అవమానిస్తారు, అక్కడ ఏం జరుగుతుందో అని భయపడతాడు కళ్యాణ్. వాళ్లు ఎన్ని మాటలు అన్నా నేను పట్టించుకోను అంటుంది అప్పు. నీ సంగతి నాకు తెలియదా, కోపంతో ఎన్నిసార్లు తల పగలగొట్టి జైలుకు వెళ్లలేదు ఉంటాడు కళ్యాణ్. నావల్ల అక్కడ ఎలాంటి గొడవ జరగదు అని నీకు మాటిస్తున్నాను, అమ్మమ్మ తాతయ్య వచ్చి పిలిచాక కూడా వెళ్లకపోతే మర్యాదగా ఉండదు అనే భర్తకి హామీ ఇచ్చి ఒప్పిస్తుంది అప్పు.

మరోవైపు పూజ దగ్గర హడావిడి చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది కావ్య. నీ కోడలికి పూజలు, పండుగలు వస్తే కాళ్ళు ఆగవు అంటుంది చిట్టి. పెళ్లయిన కొత్తలో నేను కూడా అలాగే చేసేదాన్ని కదా అంటుంది అపర్ణ. నీ కోడలితో పోటీపడుతున్నావా అంటుంది చిట్టి. లేదు తనకి ఉన్నంత ఓపిక, సహనం నాకు లేవు అంటుంది అపర్ణ. ఇదంతా ధాన్యలక్ష్మి బయట నుంచి చూస్తూ ఉంటుంది, రుద్రాణి ఆమె దగ్గరికి వచ్చి కావ్యని అందరూ పొగుడుతున్నారు అంటుంది.
అప్పుకి జరగబోయే అవమానం గురించి తెలియక కావ్య అంత హడావిడి చేస్తుంది అంటూ ముత్తైదువులను పిలవమని చెప్పాను పిలిచావా, అప్పు రాకముందే వాళ్ళు ఇంట్లో ఉండాలి అంటుంది ధాన్యలక్ష్మి. పిలిచాను వచ్చేస్తారు అనేలోగానే ముత్తయిదువులందరూ వస్తారు.వాళ్ళని చూసిన అపర్ణ వాళ్ళు ఆశ్చర్యపోతారు. సరేలే దాందేముంది వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి పంపిద్దాం అంటుంది చిట్టి. కాసేపటి తర్వాత కళ్యాణ్, అప్పు ఇంటికి వస్తారు,కొడుకుని, కోడల్ని హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించమని ధాన్య లక్ష్మికి చెప్తుంది ఇందిరా దేవి.

హారతి ఇచ్చి ఆహ్వానించడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ కొత్త కోడలు ఎలా వచ్చిందో చూసారా అని వెటకారంగా మాట్లాడుతుంది ధాన్య లక్ష్మి. వచ్చేది పూజ కోసం అని తెలుసు కదా ఈ బట్టల్లో రావటం ఏమిటి అంటుంది రుద్రాణి. ఇలాంటి పిల్లనా నీ కొడుకు చేసుకున్నాడు అని వెటకారంగా మాట్లాడుతారు ముత్తయిదువులు. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు తెలుసు, కానీ మా అమ్మ మారదు అని నిరూపించడం కోసమే వచ్చాను ఇక మేము వెళ్తాము అంటాడు కళ్యాణ్. గుమ్మం లోంచే నువ్వు వెళ్ళిపోతే ఆ బాధ నేను మరిచిపోలేను అంటాడు ప్రకాష్.
అపర్ణ,రాజ్ వాళ్ళందరూ కూడా లోనికి రమ్మని ఆహ్వానిస్తారు, అయినా వెళ్ళిపోతున్న కళ్యాణ్ దంపతులని ఆగమని కొత్త కోడలు గుమ్మం వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే ఇంటికి అరిష్టం, అయినా భావుక ప్రపంచం దాటి బయట ప్రపంచంలోకి ఇప్పుడే అడుగు పెట్టారు, ప్రపంచంలో మీ అమ్మ రుద్రాణి అత్త లాంటివాళ్ళు చాలామంది కనిపిస్తారు అలాంటి సమయంలో అడుగు ముందుకే వెయ్యాలి కానీ వెనక్కి వేయకూడదు అని కళ్యాణ్ కి నచ్చ చెప్పి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది కావ్య.

మళ్లీ బట్టల గురించి మాట్లాడి అవమానించబోయిన ధాన్యలక్ష్మితో వాళ్ల కోసం అమ్మమ్మ గారు బట్టలు కొన్నారు మార్చుకుంటుంది అని ఆమెకి నచ్చ చెప్తుంది కావ్య. ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరూ మాట్లాడుకోవటం చూసి ఆనందపడతారు సీతారామయ్య దంపతులు. అపర్ణ అప్పుతో మాట్లాడుతూ మీ అత్తగారి మాటలు పట్టించుకోవద్దు, నువ్వు ఇ క్కడ ఫ్రీగా ఉండు అని ధైర్యం చెప్తుంది.
కళ్యాణి రెడీ చేయటానికి రాజ్ తీసుకు వెళ్తాడు, అప్పు ని రెడీ చేయమని స్వప్నతో చెప్తుంది కావ్య. ఇదంతా చూస్తున్న రుద్రాణి వీళ్ళ హడావిడి చూస్తుంటే అప్పు ని శాశ్వతంగా ఇక్కడే ఉంచేసేలా ఉన్నారు అంటుంది. తనని ఎలాగైనా అవమానించి పంపించకపోతే నా పేరు ధాన్యలక్ష్మి కాదు అంటుంది ధాన్యలక్ష్మి. అక్కతోపాటు గదిలోకి వెళ్లిన అప్పు ఇప్పుడు చీర అవసరమా అంటుంది. ఇప్పుడు నువ్వు కృష్ణమూర్తి కూతురివి కాదు దుగ్గిరాల కోడలివి, కొన్ని నచ్చకపోయినా చేయాలి అంటుంది స్వప్న.

అప్పుడే నగలు తీసుకువచ్చిన కావ్య బాగా చెప్పావు అక్క అంటూ ఎలా ఉన్నావు అని అప్పుని పలకరిస్తుంది. ఈ మాట అడగడానికి ఇన్ని రోజులు పట్టిందా అంటుంది అప్పు. కోపం వచ్చిందా అంటుంది కావ్య, లేదు అర్థం చేసుకున్నాను అంటూ కావ్యని హగ్ చేసుకుంటుంది అప్పు. అంతేలెండి ఎంతైనా మీ ఇద్దరూ ఒకటే, అయినా పెద్దదాన్ని కదా క్షమించేస్తాను అని నవ్వుతూ అంటుంది స్వప్న. నువ్వు చాలా మారిపోయావు అక్క అంటుంది అప్పు. కావ్యని కోడలిగా చూసి నేను కూడా అలాగే మారిపోయాను అంటుంది స్వప్న.
తరువాయి భాగంలో చీర కట్టుకొని కూల్ డ్రింక్ సర్వ్ చేస్తుంది అప్పు. ఒక ఆవిడ మీద కూల్ డ్రింక్ ఒలిగిపోతుంది, ఆవిడ అప్పుని సరిగ్గా ఇవ్వడం రాదా అని మందలిస్తుంది. ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలాగే అవమానిస్తావా అని అప్పు పై కోప్పడుతుంది ధాన్య లక్ష్మి. నేను కావాలని చేయలేదు అంటుంది అప్పు.


Click it and Unblock the Notifications











