Brahmamudi August 24th episode: అప్పును టార్గెట్ చేసిన ధాన్యలక్ష్మి .. ఆవేశం అణుచుకుంటున్న కళ్యాణ్!

అస్తి కోసమే కళ్యాణ్ ని ఇంటికి రానివ్వడం లేదు అని భార్యపై కోప్పడిన భర్తకి చుక్కలు చూపిస్తుంది కావ్య. కళ్యాణి ఇంటికి రప్పించడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్.పండక్కి ఒక పూట పూజ కోసం నేను పిలుస్తాను వాళ్ళని శాశ్వతంగా ఇంట్లో ఉంచే బాధ్యత నీది అని కాస్త అంటుంది ఇందిరా దేవి. ఇంటికి వచ్చిన పప్పుని అవమానించి పంపిస్తాను అని రుద్రాణి తో అంటుంది ధాన్యలక్ష్మి. ఇంటికి వచ్చిన అప్పుని గుమ్మంలోనే అవమానిస్తుంది ధాన్యలక్ష్మి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 24వ తేదీ ఎపిసోడ్ 497 లో ఏం జరిగిందంటే..

కన్నీరు పెట్టుకుంటున్న కావ్య దగ్గరికి వచ్చిన అపర్ణ ఎందుకు ఏడుస్తున్నావు, అప్పు ఏమైనా అన్నదా అని అడుగుతుంది. తనని దూరం పెట్టినందుకు కోపంతో నాలుగు మాటలు అన్నా పర్వాలేదు కానీ అర్థం చేసుకొని తన ప్రేమని చూపించింది అంటుంది కావ్య. మరెందుకు ఆ కన్నీరు అంటుంది అపర్ణ. తను కూడా ఇదే ఇంట్లో ఉండి సంసారం చేసుకుంటూ ఉంటే ఎంతో బాగుండేది.

Brahmamudi serial August 24th 2024 Episode of 497 Here is full story

అక్కగా నేను తనని బాగా చూసుకునే దాన్ని కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు అంటుంది కావ్య.బాధపడకు త్వరలోనే వాళ్లు కూడా ఇక్కడికే వచ్చేస్తారు, రాకపోయినా వచ్చేలాగా నువ్వు చేస్తావు, ఎందుకంటే నువ్వు ఎవరిని వదిలి ఉండలేవు కదా అంటుంది అపర్ణ. తర్వాత పంతులుగారు పిలుస్తున్నారు కిందికి వెళ్ళు అని అపర్ణ చెప్పటంతో కిందికి వెళ్ళిపోతుంది కావ్య.

మరోవైపు కళ్యాణ్ కి బంగారం, బట్టలు పిచ్చి ఇవి వేసుకుని పూజలో కూర్చో అంటుంది ఇందిరా దేవి. తీసుకోటానికి సంశయిస్తాడు కళ్యాణ్. ఇవేమీ నేను తీసుకురాలేదు, పిన్ని నా కొడుకు కోసం అంటూ ఈ షాపింగ్ అంతా చేసింది అంటాడు రాజ్. నా బాధ కూడా అదే అన్నయ్య, తన కొడుకు కోసం బట్టలు తెచ్చింది కానీ అప్పుని మర్చిపోయింది అంటాడు కళ్యాణ్.

మీ అమ్మని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తను ఇప్పుడు మారిపోయింది, అప్పు నీ కోడలుగా అంగీకరిస్తుంది అంటుంది ఇందిరా దేవి. మారిపోయినదే అయితే ఒక చీర కోసం అంతగా కోడల్ని అవమానించదు అంటాడు కళ్యాణ్. అవమానం అంటూ పెద్ద పెద్ద మాటలు ఎందుకు, ఒక అత్తగా తను కోడలు సాంప్రదాయంగా ఉండాలని చెప్పింది అందులో తప్పేముంది అని కళ్యాణ్ ని కన్విన్స్ చేసి రెడీ అవ్వమని చెప్పి కిందకి వచ్చేస్తారు రాజ్, ఇందిరా దేవి.

Brahmamudi serial August 24th 2024 Episode of 497 Here is full story

తరువాత రాజ్ ఆ మాటలు అన్ని కావ్య మాటలాగే ఉన్నాయి ఆ కళావతి వీడిని బాగా చెడగొట్టేసింది అని నానమ్మతో అంటాడు. నువ్వు నీ భార్య గురించి ఆలోచించడం మానేసి వాళ్ళు ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవటం గురించి ఆలోచించు అంటుంది ఇందిరా దేవి. తర్వాత చీర కట్టుకొని కిందికి వస్తున్న అప్పు ని చూసి తిట్టుకుంటారు రుద్రాణి, ధాన్యలక్ష్మి.

మొహమాటపడుతున్న అప్పుని నువ్వు కూడా ఈ ఇంటి కోడలివే వెళ్లి మీ అక్క వాళ్ళకి సాయం చెయ్యు అంటుంది అపర్ణ. అప్పు వెళ్లి కావ్య వాళ్ళకి పూజ దగ్గర సాయం చేస్తూ ఉంటుంది. వాళ్లు ముగ్గురు నవ్వుకుంటూ పని చేసుకుంటూ ఉంటే చూసావా వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో అంటాడు రాజ్. అందరూ ఇలా కలిసి పూజ చేస్తూ ఉంటే ఇల్లంతా పండగ లాగా ఉంది అంటుంది ఇందిరా దేవి. అందుకే కళ్యాణ్.. నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అతడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు రాజ్.

తర్వాత కావ్య అప్పుతో మాట్లాడుతూ వంట గదిలో శనగలు ఉన్నాయి తీసుకొనిరా అని చెప్తుంది. నేనా అంటుంది అప్పు. నువ్వే వెళ్లి తీసుకొని రా, అలా భయపడుతూ కూర్చోవద్దు, ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే నాలాగా దుమ్ము దులిపెయ్యమని చెల్లెలికి సలహా ఇస్తుంది స్వప్న. సరే అంటూ వంట గదిలోకి వెళ్ళిన అప్పు వెనకాతలే ధాన్య లక్ష్మీ, రుద్రాణి కూడా వెళతారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి ముందు జ్యూస్ ఇవ్వు అని ఆర్డర్ వేస్తుంది ధాన్యలక్ష్మి. జ్యూస్ తీసుకొని ఇంటికి వచ్చిన పేరంటార్లకి ఇస్తుంది అప్పు.

Brahmamudi serial August 24th 2024 Episode of 497 Here is full story

ఒక ఆవిడ సరిగ్గా గ్లాస్ పట్టుకోకపోవడంతో జ్యూస్ వలిగిపోయి చీర పాడవుతుంది. దానికి ఆమె అప్పు మీద ఫైర్ అవుతుంది. అదే అదనుగా భావించిన ధాన్యలక్ష్మి అప్పు మీద రెచ్చిపోతుంది. కళ్యాణ్ వాదించాలని చూస్తాడు కానీ రాజ్ నచ్చ చెప్పడంతో ఆవేశం అనుచుకుంటాడు. ఇదంతా చూస్తున్న ఇందిరా దేవి అప్పుని వెనకేసుకొస్తూ ధాన్యలక్ష్మికి చివాట్లు పడుతుంది. ఇలాంటి చిన్న చిన్న ప్లాన్లు వేసి ఏం సాధిస్తావు అని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి.

చూస్తూ ఉండు ఆ అప్పు ఈ ఇంటి కోడలుగా పనికిరాదని అందరికీ అర్థమయ్యేలాగా చేస్తాను అంటుంది ధాన్యలక్ష్మి. ఈ ధాన్యలక్ష్మి అనుకున్నది సాధించేలాగా ఉంది నా కన్నా ముదురుగా ఆలోచిస్తుంది అనుకుంటుంది రుద్రాణి. తర్వాత పంతులుగారు ముగ్గురు అక్కచెల్లెళ్లని కూర్చోబెట్టి పూజ చేయిస్తారు, ఎవరి కోడలి వెనకాతల వారి అత్తగారి కూర్చొని తెలియని విషయాలు చెప్పండి అంటారు.

అపర్ణ, రుద్రాణి కూర్చుంటారు కానీ ధాన్యలక్ష్మి కూర్చోదు. ఇందిరా దేవి ధాన్యలక్ష్మిని కూర్చోమంటుంది అయినా వినక పోవడంతో ప్రకాష్ భార్యపై కోప్పడడంతో తప్పక అప్పు వెనుక కూర్చుంటుంది ధాన్యలక్ష్మి. తర్వాత ఎవరి భార్యల పక్కన వారి భర్తలని కూర్చోబెట్టి చేతికి కంకణం కట్టిస్తారు పంతులుగారు, పూజ పూర్తయిన తర్వాత మంగళహారతి పాడమంటారు. కావ్య ని మంగళహారతి పాడమంటుంది అపర్ణ.

Brahmamudi serial August 24th 2024 Episode of 497 Here is full story

తరువాయి భాగంలో భోజనం వడ్డిస్తున్న అప్పుని విస్తరిలో ముందు పప్పు పచ్చడి వడ్డించకుండా అన్నం వడ్డిస్తున్నావేమిటి వచ్చిన వాళ్ళకి భోజనంపెడుతున్నావా లేదంటే పిండాకూడు పెడుతున్నావా, మీ అమ్మ నాన్న ఇలాగే పెంచారా అంటూ కోడల్ని అవమానించేలా మాట్లాడుతుంది ధాన్య లక్ష్మి. తర్వాత ఇందిరా దేవి కోడలితో మాట్లాడుతూ వాడికి నచ్చిన పని చేశాడు అందుకోసం కొడుకుని దూరం పెడతావా ఏంటి, వాళ్లిద్దరూ ఇక్కడే ఉండాలి అని ధాన్యలక్ష్మికి ఆర్డర్ వేస్తుంది ఇందిరాదేవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X