Brahmamudi August 26th episode: పిండకూడు పెడుతున్నావా? భోజనం పెడుతున్నావా? అప్పుపై ఫైర్

కళ్యాణ్ ని ఇంటికి రప్పించడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. పండక్కి ఒక పూట పూజ కోసం నేను పిలుస్తాను వాళ్ళని శాశ్వతంగా ఇంట్లో ఉంచే బాధ్యత నీది అని రాజ్ తో అంటుంది ఇందిరా దేవి. ఇంటికి వచ్చిన అప్పుని అవమానించి పంపిస్తాను అని రుద్రాణి తో అంటుంది ధాన్యలక్ష్మి. ఇంటికి వచ్చిన అప్పుని గుమ్మంలోనే అవమానిస్తుంది ధాన్యలక్ష్మి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 26వ తేదీ ఎపిసోడ్ 498 లో ఏం జరిగిందంటే..

కావ్య మంగళహారతి పాడటంతో పూజ ముగుస్తుంది. తర్వాత అక్క చెల్లెళ్ళు ముగ్గురు వారి భర్తల దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటారు. అపర్ణ వచ్చిన వాళ్ళకి భోజనాలు వడ్డించమనటంతో ఆ కార్యక్రమాలు ప్రారంభిస్తారు కావ్య వాళ్ళు. భోజనాలు వడ్డిస్తున్న అప్పు విస్తట్లో ముందుగా కూర వడ్డించకుండా అన్నం వడ్డిస్తుంది. ఆ మాత్రానికే ఓ ముత్తయిదువ ఇంటికి శుభానికి పిలిచారా, అశుభానికి పిలిచారా.విస్తట్లో ముందుగా ఏది వడ్డించాలో తెలియదా అని కోప్పడుతుంది.

Brahmamudi serial August 26th 2024 Episode of 498 Here is full story

వెంటనే ధాన్యలక్ష్మి అందుకొని ఇంటికి వచ్చిన వాళ్లని ఇలాగే అవమానిస్తావా,ఆ మాత్రం జ్ఞానం లేదా మీ అమ్మానాన్న ఇలాగే పెంచారా అంటూ కోడలిపై కోప్పడుతుంది. చిన్నపిల్ల తెలియక పొరపాటు చేసింది సర్ది చెప్పాల్సింది పోయి అలా కేకలు వేస్తావేంటి అని ధాన్యలక్ష్మిని కోప్పడుతుంది ఇందిరా దేవి. మా చెల్లెలికి చిన్నప్పటి నుంచి తన చదువు ఆట తప్పితే ఇలాంటి విషయాలు పెద్దగా తెలియవు, పెద్ద మనసుతో క్షమించండి అంటుంది కావ్య.

తర్వాత ఆ విస్తరి మార్చి వేరే విస్తరిలో భోజనం వడ్డిస్తుంది. వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా ముందు బొట్టు పెట్టకుండా వాయనం ఇవ్వకూడదు అంటూ మళ్ళీ అప్పుని అవమానించే ప్రయత్నం చేస్తుంది ధాన్యలక్ష్మి. అపర్ణ ఆమెని మందలించి ముగ్గురు అక్క చెల్లెల చేత వచ్చిన వాళ్ళకి వాయినాలు ఇప్పిస్తుంది. వచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ ఎవరు ఏమనుకున్నా నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాను, ఏది ఏమైనా ఆ అమ్మాయి ఈ దుగ్గిరాల కుటుంబానికి కోడలిగా సరిపోదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Brahmamudi serial August 26th 2024 Episode of 498 Here is full story

మిగిలిన వాళ్ళు కూడా వెళ్లిపోయిన తరువాత కళ్యాణ్ వాళ్ళు బట్టలు మార్చుకొని కిందికి వస్తారు. వాళ్లని చూసి ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. నేను వెళ్తాను అన్నయ్య అంటాడు కళ్యాణ్. ఉండిపోవచ్చు కదా అక్కడికి వెళ్లి కష్టపడటం ఎందుకు అంటాడు రాజ్. కష్టమంటే నీ దృష్టిలో ఏమిటన్నయ్య, డబ్బులు లేకపోవడం కష్టం కాదు కానీ ఇలా ఇష్టం లేని వాళ్ళ మధ్యలో ఉండటం కష్టం.

అయినా నేను ఇక్కడికి ఉండిపోవాలని రాలేదు తాతయ్య వాళ్ళ పెద్దరికం నిలబెట్టడం కోసం ఇక్కడికి వచ్చాను నాకు ఇలాంటి అవమానాలు జరుగుతాయని ముందే తెలుసు అంటాడు కళ్యాణ్. అసలు నేను ఏమన్నానని నువ్వు అలా మాట్లాడుతున్నావ్ అంటుంది ధాన్య లక్ష్మి. ఇంకేం అనాలి కొత్త కోడలిని అడుగడుగునా అవమానిస్తూనే ఉన్నావు, వాళ్లకు గా వాళ్ళు ఇక్కడికి రాలేదు, మేము వెళ్లి బ్రతిమాలుకుంటే ఇక్కడికి వచ్చారు అంటుంది ఇందిరా దేవి.

Brahmamudi serial August 26th 2024 Episode of 498 Here is full story

వచ్చిన ఆవిడ కూడా అంది కదా అప్పు ఇంటి కోడలుగా సరిపోదని అంటుంది ధాన్యలక్ష్మి. అసలు ఆ పేరంటాలని ఎవరు పిలిచారు అలా మాట్లాడటానికి ఎంత ఇచ్చారు, అప్పు ని అవమానించడానికి మీరు ఎంత ప్లాన్డ్ గా ఉన్నారు అంటుంది స్వప్న. మనసులో ఇంత కుళ్ళు పెట్టుకొని వాళ్ళు ఇంటికి రావడానికి ఒప్పుకున్నావా అంటుంది అపర్ణ. నన్ను అంటున్నావు కానీ ఒకప్పుడు నువ్వు కూడా నీ కోడల్ని అంగీకరించలేదు, నువ్వు నాకు చెప్తున్నావా అంటుంది ధాన్య లక్ష్మి.

నేను తప్పు చేశాను, చేయలేదు అనటం లేదు కానీ తప్పు చేశాను అని తెలిసిన తర్వాత పడే బాధ గురించి నీకు తెలియదు, అందుకే ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను, నువ్వు కూడా అలాంటి తప్పు చేయకు, ఆ పాపం శాపం లా నిన్ను బాధిస్తుంది అంటుంది అపర్ణ. అయినా వాళ్ళు అన్ని మాటలు అంటూ ఉంటే అలా మౌనంగా ఉన్నావేమి చిన్న విషయానికే బుర్రలు బద్దలు కొడతావు కదా అని చెల్లెలిపై కోప్పడుతుంది స్వప్న.

నాకు ఇక్కడ ఇలా జరుగుతుందని ముందే తెలుసు అదే విషయం అప్పుతో అంటే తన వల్ల ఎలాంటి గొడవ జరగదు అని నాకు మాట ఇచ్చింది, చివరి వరకు తన మాట నిలబెట్టుకుంది అంటాడు కళ్యాణ్. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉండాలి అని ఇందిరా దేవి ధాన్యలక్ష్మితో అంటుంది. ఎందుకు ఉండాలమ్మా, ఇలాంటి అవమానాలు ప్రతిరోజు పడటానికా, అక్కర్లేదు నా కొడుకు భార్యని పోషించుకోలేనంత అసమర్ధుడు కాదు అంటాడు ప్రకాష్.

Brahmamudi serial August 26th 2024 Episode of 498 Here is full story

తర్వాత కొడుకుతో మాట్లాడుతూ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ప్రశాంతంగా బ్రతకండి అంటాడు. అప్పుడు కావ్య అప్పు దగ్గరికి వచ్చి వెళ్ళండి, తల ఎత్తుకొని మళ్లీ ఈ ఇంటికి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అప్పుడు మిమ్మల్ని అన్నవాళ్లు తలదించుకుంటారు అంటుంది. కళ్యాణ్ భార్యను తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X