Brahmamudi August 27th episode : కావ్య ని గెలవనివ్వనంటున్న ధాన్యలక్ష్మి.. తల్లి కొడుకుల తిక్క కుదిర్చిన స్వప్న

ఇంటికి వచ్చిన అప్పుని అవమానించి పంపిస్తాను అని రుద్రాణి తో అంటుంది ధాన్యలక్ష్మి. అన్నట్టు గానే ఇంటికి వచ్చిన అప్పుని గుమ్మంలోనే అవమానిస్తుంది ధాన్యలక్ష్మి. ఇంట్లోకి వచ్చాక కూడా అప్పు ని ఘోరంగా అవమానిస్తుంది ధాన్యలక్ష్మి. అయినా మౌనంగా భరించి పూజ తర్వాత ఇల్లు విడిచి వెళ్ళిపోతారు కళ్యాణ్ దంపతులు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 27వ తేదీ ఎపిసోడ్ 499లో ఏం జరిగిందంటే..

కళ్యాణ్ వాళ్ళకి ఇంట్లో జరిగిన అవమానం తలుచుకొని బాధపడతాడు రాజ్. నిజంగానే కళ్యాణ్ అన్నట్లు అప్పు ఇక్కడ ఉంటే రోజు అవమానాలే ఎదుర్కోవలసి వచ్చేది. జరిగిన అవమానానికి ఎంత బాధపడుతున్నారో అనుకుంటాడు. మరోవైపు ఇంటికి వచ్చిన కళ్యాణ్ ఆటో దిగి డబ్బులు ఇస్తుంటే అదే సమయంలో ఒక వ్యక్తి రాష్ గా డ్రైవ్ చేస్తూ కళ్యాణ్ కి డాష్ ఇవ్వబోతాడు. అతనితో గొడవపడి కళ్యాణ్ కి సారీ చెప్పిస్తుంది అప్పు.

Brahmamudi August 27th 2024 Episode 499 story

అప్పుడు కళ్యాణ్ అప్పువైపు కృతజ్ఞతగా చూస్తూ ఒక్క మాట కూడా పడని నువ్వు అక్కడ అన్ని మాటలు అంటున్నా కూడా నాకోసం భరించావు అంటూ థాంక్స్ చెప్తాడు, ఇంట్లో జరిగిన అవమానానికి సారీ చెప్తాడు. మరేం చేస్తాం, అక్కడ నేను ఏమైనా మాట్లాడితే నువ్వు బాధ పడతావు, ఆ బాధ ఏదో నేనే పడాలి అనుకున్నాను.

అయినా మన తప్పులకి మనమే సారీ చెప్పుకొని పక్కవాళ్ళ తప్పులకు కూడా మనమే సారీ చెప్పుకోవడం ఏమిటి, అయినా ఆ గొడవ అంతా ఆ బంగాళాలోనే వదిలేసి వచ్చేసాను మళ్ళీ గుర్తు చేసి బుర్ర ఖరాబ్ చేయొద్దు అంటుంది అప్పు. అప్పుడే కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి ఇంట్లో జరిగిన గొడవకి సారీ చెప్తాడు. నవ్వుతూ అప్పు చెప్పిన డైలాగ్ చెప్తాడు కళ్యాణ్. మరి ఇప్పుడు ఏం చేయటం రా అంటాడు రాజ్. ఏమి చెయ్యొద్దు అన్నయ్య నేను జీవితంలో నిలదొక్కుకొని అప్పు ని పెళ్లి చేసుకొని తప్పు చేయలేదు అని నిరూపించాకే అక్కడికి వస్తాను, ఈ విషయంలో కావ్య వదినని లాగొద్దు ఆమెను నిందించొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కళ్యాణ్.

Brahmamudi serial August 27th 2024 Episode of 499 Here is full story

రాజ్ ఫోన్ పెట్టేసి గుమ్మంలోకి చూసేసరికి అక్కడ కావ్య ఉంటుంది. రాజ్ తనని తాను తిట్టుకొని ఇవన్నీ నువ్వు నన్ను అనాలనుకున్నావు కదా అందుకే నీకు అవకాశం ఇవ్వకుండా నన్ను నేనే తిట్టుకుంటున్నాను అంటాడు. మీ బుర్ర సరిగ్గా పనిచేయడం లేదని ఇప్పటికైనా అర్థమైందా అంటుంది కావ్య. నన్ను నేను ఇన్ని తిట్టుకున్నా వెయ్యటానికి ఇంకా ఇన్ని సెటైర్లు ఉన్నాయా అంటాడు రాజ్. దటీజ్ కళావతి డాటర్ ఆఫ్ కనకం అని కామెడీ చేస్తుంది కావ్య.

తర్వాత రాజ్ మాట్లాడుతూ కళ్యాణ్ వాళ్ళని ఇక్కడ ఉండిపోవటానికి రమ్మన్నాను కానీ వీళ్ళతో వాడు ఎక్కడ వేగుతాడు, అయినా తప్పు వాడిలో లేదు ఇంట్లో ఉంది, వాడు జీవితంలో గెలుస్తాను అంటూ జీవితం పోరాడుతాడేమో అని భయంగా ఉంది అంటాడు. కొన్ని సమస్యలు కాలానికే వదిలేయాలి అంటుంది కావ్య అప్పటివరకు నేనేం చేయాలి అంటాడు రాజ్. మిమ్మల్ని నమ్ముకొని ఒక ప్రాణం ఉంది దానిని అశ్రద్ధ చేయకుండా పట్టించుకోండి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య.

Brahmamudi serial August 27th 2024 Episode of 499 Here is full story

మరోవైపు రుద్రాణి, రాహుల్ కళ్యాణ్ వాళ్ళు ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు ఆనందంగా డ్రింక్ పార్టీ చేసుకుంటూ ఉంటారు, కంపెనీ వ్యవహారాలు పూర్తిగా తమ హస్తగతం కావాలంటే కావ్య ఇంట్లో ఉండకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా దూరం నుంచి చూసిన స్వప్న నా చెల్లెల్ని అవమానించి ఇంట్లోంచి పంపించినందుకు సెలబ్రేట్ చేసుకుంటారు కదా, మీ పని చెప్తాను అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఒంటరిగా కూర్చుని బాధపడుతున్న ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చిన అపర్ణ నేను చేసిన తప్పే నువ్వు చెయ్యొద్దు, కొడుకుని దూరం చేసుకోవద్దు.

అప్పుని కోడలుగా ఒప్పుకో లేదంటే నీకు ఆఖరికి ఒంటరితనమే మిగులుతుంది అంటుంది. రాజకీయ నాయకురాలు లాగా బాగానే చెప్పావు, ఆ కావ్య నిన్ను గుప్పెట్లో పెట్టుకొని బాగానే మాట్లాడిస్తుంది, ముగ్గురు అక్కచెల్లెళ్లు కలిసి ఈ ఇంట్లో తిష్ట వేయాలనుకున్నారు అందులో సగం గెలిచారు కానీ నేను కావ్య ని పూర్తిగా గెలవనివ్వను, అప్పుని ఎప్పటికీ కోడలుగా ఒప్పుకోను అంటుంది ధాన్యలక్ష్మి. అందుకు తోడికోడలిపై కోపగించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ.

Brahmamudi serial August 27th 2024 Episode of 499 Here is full story

మరోవైపు స్వప్న బెలూన్స్ నిండా లాఫింగ్ గ్యాస్ ఫిల్ చేసి రుద్రాణి రూంలో ఉంచుతుంది. ఇందులో ఏ ఒక్కటి పేలినా వాళ్ళిద్దరూ రాత్రంతా నవ్వుకోవాల్సిందే అనుకుంటూ వాళ్లు వచ్చేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రూమ్ లోకి వచ్చిన తల్లి కొడుకులిద్దరూ గదినిండా బెలూన్స్ ఉండటం చూసి ఆశ్చర్యపోతారు, మత్తులో ఉన్న రాహుల్ తల్లికి హ్యాపీ బర్త్డే అనుకొని విషెస్ చెప్తూ ఒక బెలూన్ పేలుస్తాడు. ఇక అంతే తల్లి కొడుకులిద్దరూ ఒకటే నవ్వులు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X