Brahmamudi August 28th episode : రుద్రాణి చెంప పగలగొట్టిన ధాన్యలక్ష్మి.. కళ్యాణ్ పరువు కాపాడిన అప్పు!
ఇంటికి వచ్చిన అప్పుని గుమ్మంలోనే అవమానిస్తుంది ధాన్యలక్ష్మి. ఇంట్లోకి వచ్చాక కూడా అప్పు ని ఘోరంగా అవమానిస్తుంది ధాన్యలక్ష్మి. అయినా మౌనంగా భరించి పూజ తర్వాత ఇల్లు విడిచి వెళ్ళిపోతారు కళ్యాణ్ దంపతులు. ఇదంతా గమనించిన రాజ్ వాళ్ళు ఇంటికి రాకపోవడమే మంచిది అని భార్య తో అంటాడు. తనకిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు అప్పు కి థాంక్స్ చెప్తాడు కళ్యాణ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 28వ తేదీ ఎపిసోడ్ 500లో ఏం జరిగిందంటే..
తమ గదిలో ఉన్న బెలూన్స్ ని చూసి తల్లికి బర్త్డే అనుకొని తాగిన మత్తు లో తల్లికి హ్యాపీ బర్త్డే చెప్తూ బెలూన్స్ పగలగొడతాడు రాహుల్. లాఫింగ్ గ్యాస్ రిలీజ్ అయి ఇద్దరికీ నవ్వు వస్తుంది. నవ్వుతూనే ఈరోజు నా బర్త్డే కాదు ఎవరిదో బర్త్డే అయితే మన రూమ్ లో బెలూన్స్ పెట్టారు కానీ నవ్వుతూనే మరొక బెలూన్ పేలుస్తుంది రుద్రాణి.

ఒకరిని చూసి ఒకరు ఎందుకు అలా నవ్వుతున్నావు అని అడుగుతారు. తెలియదు కళ్యాణ్ వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆనందమేమో అంటుంది రుద్రాణి, ఇంట్లో ఏదైనా గొడవలు జరిగినా,ఈ బెలూన్స్ పగలగొట్టినా ఎంత ఆనందం వస్తుందో అంటూ బెలూన్స్ పగలగొడతాడు రాహుల్.తర్వాత ఇలా పొట్ట చెకలయ్యేలాగా నవ్వలేకపోతున్నాను అసలు ఏం జరిగింది అంటుంది రుద్రాణి. ఈ రూమ్ లోనే ఏదో ఉంది బయటికి పోదాం అని చెప్పి తల్లిని తీసుకొని నవ్వుతూనే బయటికి వచ్చేస్తాడు రాహుల్. వాళ్ల పరిస్థితిని చూసి నవ్వుకుంటుంది స్వప్న.
రుద్రాణి వాళ్ళు నవ్వుతూ కిందికి వస్తున్న సమయానికి ధాన్య లక్ష్మీ ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. వాళ్ల నవ్వుని చూసి మీకు ఎందుకు అంతలా నవ్వొస్తుంది, నేను బాధపడుతుంటే మీకు నవ్వులాటగా ఉందా అంటుంది. లేదు కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు మేము చాలా బాధపడుతున్నాము అని నవ్వుతూ చెప్తుంది రుద్రాణి.ఆమె పగలగొడుతుంది ధాన్యలక్ష్మి . అయినా కూడా నవ్వుతున్న తల్లి కొడుకుల్ని చూసి మీ సంగతి రేపు పొద్దున్న చెప్తాను అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి.

మనం ఎందుకు ఇంతలా నవ్వుతున్నాం అనుకుంటారు ఇద్దరు. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న నేనే ఆ బెలూన్స్ లో లాఫింగ్ గ్యాస్ ఫిల్ చేశాను లేకపోతే ఇంటికి పిలిచిన నా చెల్లెల్ని అవమానిస్తారా, రాజ్ వాళ్ళని ఇంట్లోంచి పంపించాలని చూస్తారా అందుకే ఇలా లాఫింగ్ రివేంజ్ తీర్చుకున్నాను. రాత్రంతా నవ్వుతూ చావండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. మరోవైపు పొద్దున్నే లేచి వెళ్ళిపోతున్న భార్యని తనతో పాటు ఉండమని రిక్వెస్ట్ చేస్తాడు రాజ్.
తనకి చాలా పని ఉందని చెప్తుంది కావ్య. కానీ నాకు ఏమీ పని లేదు అంటాడు రాజ్. త్యాగం చేశారు కదా అని దెప్పుతుంది కావ్య. త్యాగం చేయలేదు పదవి నుంచి తీసేశారు అంటాడు రాజ్. అప్పుడు మీరేమీ మాట్లాడలేదు కదా అయినా నన్ను నా పనిలోంచి ఎవరు తీయలేదు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతున్న భార్యని దగ్గరికి తీసుకుంటాడు రాజ్. మరోవైపు కళ్యాణ్ కి కాఫీ తాగాలి అనిపిస్తుంది. దానికి ఏమేం కావాలి అంటాడు కళ్యాణ్. అప్పు ఏం కావాలో చెప్తుంది.
కాఫీ తాగాలనిపిస్తుందా అంటుంది అప్పు. లేదు అంటాడు కళ్యాణ్. ఆ వస్తువు లేని మన దగ్గర లేవు అంటుంది అప్పు. ఇప్పుడు ఏం తింటాము అని అప్పు అంటే కవి భాషలో ఏదో చెప్తాడు కళ్యాణ్. ఇద్దరూ నవ్వుకుంటారు. అప్పుడే హౌస్ ఓనర్ వచ్చి నిన్న వరలక్ష్మీ వ్రతం చేశాను వాయనం ఇవ్వటానికి నువ్వు లేవు అందుకే ఈరోజు ఇస్తున్నానని చెప్పి వాయనం ఇచ్చి వెళ్ళిపోతుంది. అందులో ఉన్న శనగలు, అరటి పండ్లు చూసి తినడానికి దొరికినందుకు ఆనందపడతారు దంపతులిద్దరూ.

అంతలోనే కనకం దంపతులిద్దరూ వస్తారు. వారిని చూసి శనగల్ని పక్కనపెట్టి వచ్చేస్తుంది అప్పు. ఇంటికి వచ్చిన వాళ్ళని లోపలికి ఆహ్వానించి కూర్చోవడానికి చాప తప్ప ఏమీ లేదు అంటాడు కళ్యాణ్. పర్వాలేదు బాబు అంటూ కనకం దంపతులిద్దరూ కింద కూర్చుంటారు. వారితో పాటు కళ్యాణ్ దంపతులు కూడా కిందన కూర్చుంటారు. ఇప్పుడు మేము ఇంట్లో ఇద్దరమే ఉంటున్నాము మీరు కూడా మాతో పాటు వచ్చేయవచ్చు కదా అంటాడు కృష్ణమూర్తి. అందుకు అభ్యంతరం చెప్తారు కళ్యాణ్ దంపతులు.
కూర్చోండి ఇప్పుడే టిఫిన్ చేసి తీసుకు వస్తాను అంటుంది అప్పు. ఏం చేస్తావు అని మెల్లగా అడుగుతాడు కళ్యాణ్. చూస్తూ ఉండండి అంటూ శనగలు ఫ్రై చేసి తీసుకువస్తుంది అప్పు. బాగున్నాయి, ఏంటిది అంటాడు కృష్ణమూర్తి. స్ప్రౌట్స్ నాన్న, మేము డైటింగ్ చేస్తున్నాము పొద్దున్న ఇదే మా టిఫిన్ అంటుంది అప్పు. నా పరువు కాపాడింది అనుకుంటాడు కళ్యాణ్.కానీ కనకం జరిగిందంతా గ్రహిస్తుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా చేసావా అంటుంది. అవసరం అన్ని నేర్పిస్తుంది అంటాడు కృష్ణమూర్తి.
తరువాయి భాగంలో దొంగ బంగారం కొనటానికి రాహుల్ ప్లాన్ చేస్తున్నాడని కావ్యకి చెప్తుంది స్వప్న. కావ్య విషయం రాజ్ కి చెప్తుంది. మీరు నా మీద ఇలాంటి ఆరోపణలు చేయడానికి మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది అని కోపంగా అడుగుతాడు రాహుల్. సాక్ష్యం నీ చేతిలోనే ఉంది అంటూ అతని బ్యాగ్ లో ఉన్న ఫైల్ తీసి రాజ్ కి చూపిస్తుంది కావ్య.


Click it and Unblock the Notifications











