Brahmamudi Aug2nd episode:రుద్రాణికి వార్నింగ్ ఇచ్చిన ఇందిరాదేవి..పెళ్లి పందిట్లో అత్త తిక్క కుదిర్చిన స్వప్న!
కళ్యాణ్ మనసులో అప్పు ఉందని అందరి ముందు చెప్తాడు రాజ్. అప్పు మనసులోకి ఏముందో తెలుసుకోవడానికి ఆమె ఇంటికి కూడా వెళతాడు రాజ్. కానీ అక్కడ అతనికి చేదు అనుభవం ఎదురవుతుంది. రాజ్ కళ్యాణ్ ని తీసుకొని అప్పు దగ్గరికి వెళ్లాడని భ్రమపడిన ధాన్యలక్ష్మి కావ్య పై విరుచుకుపడుతుంది. తన భార్య జోలికి రావద్దని వార్నింగ్ ఇస్తాడు రాజ్. పెళ్లి పిలుపులకు వచ్చిన కనకం ఇంట్లో అందరినీ పిలిచి కళ్యాణ్ ని మాత్రం పెళ్ళికి రావద్దు అని చెప్తుంది ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 2వ తేదీ ఎపిసోడ్ 478లో ఏం జరిగిందంటే..
కొద్ది రోజులు బెంగుళూరు వెళ్ళు అంతా సర్దుకుంటుంది అని కొడుకుతో చెప్తుంది ధాన్యలక్ష్మి. నువ్వు నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావో నాకు అర్థమైంది, నువ్వు భయపడుతున్నట్లు నేను కళ్యాణ మండపానికి రాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. కనీసం కల్యాణ మండపానికి అయినా రానున్నాడు అని ఆనందపడుతుంది రుద్రాణి. మరోవైపు పెళ్లి పనులు త్వరగా అవ్వటం లేదని హడావిడి పడుతూ ఉంటుంది కనకం. భర్త ని కూడా కంగారుపెడుతుంది. తాళిబొట్టు తీసుకువచ్చారా అని భర్తని అడుగుతుంది.

నేను తీసుకు వచ్చాను అంటూ కావ్య లోపలికి వస్తుంది. అప్పు రెడీ అయిందా అని అడుగుతుంది కనకం. అక్క రెడీ చేస్తుంది అంటుంది కావ్య. దానికి రెడీ అవ్వడానికే టైం చాలదు ఇంకా అది అప్పు నేం తయారుచేస్తుంది అని కంగారుపడుతూ అప్పు దగ్గరికి వెళుతుంది కనకం. కృష్ణమూర్తి నవ్వుతూ మీ అమ్మ చేస్తున్న హడావిడి అంబానీ కొడుకు పెళ్లి లో అంబానీ కూడా చేసి ఉండడు అని కావ్య తో అంటాడు. కన్నతల్లి కదా ఆ మాత్రం కంగారు ఉంటుంది అంటుంది కావ్య. అప్పు దగ్గరికి వచ్చిన కనకం కూతురు పూలజడ వేసుకోలేదని చివాట్లు పెడుతుంది.
నేను ఇలాగే ఉంటాను పూలజడ వేసుకోను అంటుంది అప్పు. ఏదో ఒకటి చేయండి అంటూ చెల్లెల్ని త్వరగా రెడీ చేయమని స్వప్నకి చెప్పి వెళ్ళిపోతుంది కనకం. మరోవైపు రాజ్ ఇంటిలో అందరూ అప్పు పెళ్లికి రెడీ అవుతారు. ఈ పెళ్లి ఎలాంటి ఆటంకము జరగకుండా అయిపోవాలి అని అనుకుంటారు ధాన్యలక్ష్మి, రుద్రాణి. ధాన్యలక్ష్మి చెవులు కొరికింది చాలు ఇక పదండి బయలుదేరుదాం అంటుంది అపర్ణ.

అప్పుడే రాజ్ తో పాటు కళ్యాణ్ కూడా కిందికి దిగడం చూసిన రుద్రాణి కంగారుపడుతుంది నీ కొడుకు రానన్నాడు అన్నావు అంటుంది. నాకు కూడా అదే కంగారుగా ఉంది అంటుంది ధాన్యలక్ష్మి. అదే కంగారుతో కళ్యాణ్ నువ్వు పెళ్లికి వస్తున్నావా అని అడుగుతుంది. భయపడకు నేను రానులే అని చెప్తాడు కళ్యాణ్. అప్పుడు ఇందిరా దేవి మాట్లాడుతూ మనం వియ్యంకులుగా అక్కడికి వెళ్ళామా, ఆశీర్వదించి వచ్చామా అన్నట్లు ఉండాలి అంతకుమించి అక్కడ ఏం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదు అంటుంది ఇందిరాదేవి. తల్లివై ఉండి అలా అంటావేంటి అంటుంది రుద్రాణి.
తల్లిని కాబట్టే,నీ సంగతి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అక్కడ ఎలాంటి దెప్పి పొడుపు మాటలు మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి. తరువాత అందరూ బయలుదేరుతారు. రాజ్ మాత్రం తమ్ముడు తో నువ్వు అక్కడికి వచ్చి ఈ పెళ్లి ఆపేస్తామని ఎదురు చూస్తాను, అప్పుడు నీ సొంతం చేసుకోవడానికి కొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది తర్వాత నువ్వు ఏం చేసినా లాభం ఉండదు అంటాడు. మరోవైపు కళ్యాణ మండపానికి వచ్చిన దుగ్గిరాల కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానిస్తారు కృష్ణమూర్తి దంపతులు.

మొత్తానికి నీ స్తోమత కి తగ్గట్టు పెళ్లి గుడిలో చేస్తున్నావన్నమాట అని వెటకారంగా అంటుంది రుద్రాణి. మాకు ఆమాత్రం అయినా ఉంది, నీకు నీ కొడుక్కి ఆ స్థామత లేకే కదా తాతయ్య ఇంట్లో ఉన్నారు అని అత్తకి సరైన సమాధానం చెప్పి ఆమె నోరు మూయిస్తుంది స్వప్న. సుమిత్ర రుద్రాణి తో మాట్లాడుతూ నీకు కరెక్ట్ మొగుడు స్వప్నే అంటూ స్వప్నతో నా సపోర్టు నీకే అంటుంది. ఆ తర్వాత కావ్య మాట్లాడుతూ పెళ్లి ఎక్కడ జరిగినా ఒకటే.
ఒక పేద ఇంటి పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే సర్దుకోవాలి తప్పితే విమర్శించకూడదు అంటుంది. ఇన్ని తెలిసిన నువ్వు అప్పుకి ఈ పెళ్లి ఇష్టము లేదో కనుక్కున్నావా అంటాడు రాజ్. మన పెళ్లి మాత్రం మన ఇష్ట ప్రకారం జరిగిందా పెళ్లి జరిగితే అన్ని అవే సర్దుకుంటాయి అంటుంది కావ్య. కోడల్ని సపోర్ట్ చేస్తుంది సుమిత్ర. మరోవైపు కళ్యాణ్ ఫోటోలని అప్పు డిలీట్ చేయడం చూస్తుంది స్వప్న.

కళ్యాణ్ నీకు ఫ్రెండ్ మాత్రమే కదా, ఎందుకు అతను ఫోటోలు డిలీట్ చేస్తున్నావ్, నిజం చెప్పు ఇప్పటికీ నువ్వు కళ్యాణ్ ని ప్రేమిస్తున్నావు కదా అంటుంది. లేదు అంటుంది అప్పు. అలాంటప్పుడు ఎందుకు కన్నీళ్లు దాచుకోవడం, నాకు ముందే చెప్పాల్సింది నేను ఈ పెళ్లిని ఇక్కడ వరకు తీసుకువచ్చేదాన్ని కాదు, ఇప్పటికీ మించి పోయింది లేదు నాలాగా ఈ మండపం నుంచి పారిపోయి కళ్యాణ్ ని పెళ్లి చేసుకో, మన ఆనందం కంటే ఏది ఎక్కువ కాదు అంటుంది స్వప్న.
తరువాయి భాగంలో పెళ్లి మండపానికి వచ్చి పెళ్లి ఆపేయాలి అనే నిర్ణయానికి వస్తాడు కళ్యాణ్. అప్పు పెళ్లి ఆపేస్తాను అంటాడు రాజ్ నేను మిమ్మల్ని ఆపుతాను అంటుంది కావ్య. సరే చూద్దాం అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్.


Click it and Unblock the Notifications











