Brahmamudi August 2nd Episode: కావ్య కడుపులో దుగ్గిరాల వారసుడు.. కళావతి గుండెల్లోనే రహస్యం

Photo Courtesy: JioHotstar

కావ్య చెప్పినట్లుగానే అపర్ణ దగ్గర పడుకుంటాడు స్వరాజ్. పిల్లాడికి కథలు చెబుతూ మురిసిపోతుంది అపర్ణ. బుడ్డోడి దగ్గరి నుంచి ఎలాగైనా వివరాలు కనుక్కోవాలని వాడికి చాక్లెట్ ఇస్తుంది రుద్రాణి. నువ్వు నాకు నచ్చలేదు.. నా గురించి చెప్పను అంటూ ఆమెపై నీళ్లు పోస్తాడు స్వరాజ్. రాజ్ ప్రపోజ్ చేయడానికి వస్తుండటంతో అతని కోసం అందంగా రెడీ అవుతుంది కావ్య. ఇది చూసిన అపర్ణ, ఇందిరలు చాలా సంతోషించి ఇన్నాళ్లకు మా కల నెరవేరబోతోందని చెబుతారు.

స్వరాజ్.. రేవతి అక్క కొడుకని తెలుసుకున్న కళ్యాణ్ మంచంపై పడిపోతాడు. అపర్ణ అత్తయ్యని, రేవతి గారిని కలిపేందుకు అక్కాబావా ఇలా ప్లాన్ చేశారని చెబుతుంది అప్పూ. ఈ విషయం పెద్దమ్మకి తెలిస్తే మనల్ని కూడా ఇంట్లో నుంచి గెంటేస్తుందని భయపడతాడు కళ్యాణ్. డైనింగ్ టేబుల్ దగ్గర నా సీటు నాకు ఇవ్వాలని పిల్లాడు మారం చేసి కళ్యాణ్‌ను లేస్తాడు. అది చూసి అందరూ మెచ్చుకుంటూ ఉండగా.. బాబు ఈ ఇంటి పిల్లాడేనని ఇందిర చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 2వ తేదీ ఎపిసోడ్ 790లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial August 2nd 2025 Episode 790 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

పిల్లాడికి టిఫిన్ పెడుతూ మురిసిపోతుంది అపర్ణ. నువ్వు బాబుకి టిఫిన్ పెడుతుంటే చాలా సంతోషంగా ఉందని ఇందిర అంటుంది. కానీ నాకు మాత్రం చాలా జాలి వేస్తుందని చెబుతుంది రుద్రాణి. ఇంట్లో కోడల్ని పెట్టుకుని ఇలా బయటి పిల్లలపై ప్రేమ చూపిస్తే జాలి వేయదా అని నానామాటలు అంటుంది రుద్రాణి. కన్నకూతురు ఎలాగూ ఇంటికి రాదు.. కనీసం కొడుకు, కోడలైనా సరిగా ఉన్నారా అంటే అది లేదని చెబుతుంది రుద్రాణి. తాళికట్టిన రాజ్‌కు కావ్య ఎవరో తెలియదు.. తాళి కట్టించుకున్న కావ్యకి నేనే భార్యనని చెప్పించుకునే ఛాన్స్ లేదని అంటుంది రుద్రాణి. వాళ్లిద్దరూ ఒక్కటయ్యేది ఎప్పుడు? వాళ్లకి పిల్లలు పుట్టేది ఎప్పుడు? అని అడుగుతుంది.

ఆ మాటలతో ఇందిర మండిపడుతుంది. ఒక మాట అనే ముందు అది అవతలి వాళ్లను ఎంత బాధపెడుతుందో ఆలోచించవా? అని ప్రశ్నిస్తుంది. రాజ్- కావ్యలు తొందరలోనే ఒక్కటి అవుతారని.. ఈ ఇంటికి వారసుడిని ఇస్తారని అంటాడు ప్రకాశం. రుద్రాణి మాటలతో అపర్ణ కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాబుని రేవతి ఇంటికి పంపించాలని ప్లాన్ చేసిన అప్పూ.. స్టేషన్ నుంచి ఫోన్ వచ్చినట్లుగా డ్రామా ఆడుతుంది. స్వరాజ్ ఫోటో చూపించి బాబు తప్పిపోయినట్లుగా ఫిర్యాదు చేశారని అప్పూ ఇంట్లో వాళ్లకి చెబుతుంది. మిస్సింగ్ కంప్లయంట్‌లో బాబు డిటెయిల్స్ ఉంటాయి కదా అని అడుగుతుంది రుద్రాణి. ఆ వివరాలు తెలియకుండా కన్ఫర్మ్ చేయమని చెబుతుంది అప్పూ. బాబు పేరెంట్స్ ఎవరు? వాళ్ల పేర్లు ఏంటీ? అని రుద్రాణి అడుగుతుంది.

మేమే పేరెంట్స్ అని వస్తే వాళ్లకి ఇచ్చేస్తామా? రేపు ఏదైనా ప్రాబ్లమ్ జరిగితే ఎలా? అని నిలదీస్తుంది రుద్రాణి. వాళ్ల పేర్లు, డిటెయిల్స్ తెలిస్తే రేపు ఎలాంటి ఇబ్బందులు రావని చెబుతుంది. పోలీసులు వచ్చి బాబు పేరెంట్స్ పేర్లు చెబితే స్వరాజ్ ఎవరనే సంగతి బయటపడుతుందని కావ్య టెన్షన్ పడుతుంది. పేరు చెప్పడానికి అంతగా ఆలోచిస్తున్నావేంటీ? వీడు నిజంగానే బయటి వాడు కాదా? నిలదీస్తుంది రుద్రాణి. ధాన్యలక్ష్మీ కూడా ఇదే మాట అడుగుతుంది. బాబు వాళ్ల పేరెంట్స్ పేర్లు లక్ష్మీ, రాకేష్అని చెబుతుంది అప్పూ. ఈ పొట్టిది కావాలనే నకిలి పేర్లు చెబుతుందని రుద్రాణికి అనుమానం వస్తుంది.

నేను వెళ్లేటప్పుడు బాబుని నాతో పాటు స్టేషన్‌కి తీసుకెళ్తానని అంటుంది అప్పూ. మనం అక్కడికి వెళ్లడం దేనకి వాళ్లనే ఇంటికి రమ్మను అని చెబుతుంది రుద్రాణి. ఇప్పుడు బాబుని తీసుకెళ్లి స్టేషన్‌లో అప్పగిస్తే నీకొచ్చిన నష్టం ఏంటీ అని అడుగుతుంది ఇందిర. పిల్లాడు గుడిలో తప్పిపోయిన దగ్గరి నుంచి సొంత మనవడి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుందని, బాబు పేరెంట్స్ ఇక్కడికి వస్తే వాడిని అప్పగించడంతో పాటు జాగ్రత్తలు కూడా చెబుతుందని అంటుంది రుద్రాణి. వదిన కాబట్టి వాడిని తీసుకొచ్చి క్షేమంగా చూసుకుందని, అదే వీడు ఏ దొంగల ముఠాకో దొరికితే వీడి పరిస్ధితి ఏంటీ అని నిలదీస్తుంది రుద్రాణి.

రుద్రాణి చెప్పింది నిజమేనని, వీడిని ఎవరైనా ఎత్తుకుపోయుంటే ఎంత ప్రమాదం జరిగేదని అడుగుతుంది అపర్ణ. వాళ్లని మన ఇంటికి తీసుకొస్తే నేనే మాట్లాడతానని, పిల్లాడిని ఎందుకింత నిర్లక్ష్యంగా వదిలేశారని నిలదీస్తానని అంటుంది. చట్టం దృష్టిలో బాబు తప్పిపోయాడని పిల్లాడిని మనింట్లో చూస్తే, వీడిని మనమే కిడ్నాప్ చేశామని అనుకుంటారని చెబుతారు కావ్య, అప్పూ. పోలీసులు ఈపాటికే వెతుకుతూ ఉంటారని, తర్వాత మనం నిజం చెప్పినా నమ్మరని ఇద్దరూ భయపెడతారు. బాబుని చట్టానికి అప్పగించడానికి కూడా ఓ ప్రోసిజర్ ఉంటుందని చెబుతుంది అప్పూ. స్వరాజ్‌ని మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ నీతో పంపించనని, వాళ్ల అమ్మతో మాట్లాడాల్సిందే, లేదంటే నేను కూడా స్టేషన్‌కు వస్తానని చెబుతుంది అపర్ణ. ఆ మాటలతో కావ్య, అప్పూలు షాక్ అవుతారు.

వెంటనే రేవతికి అప్పూ ఫోన్ చేసి ఇస్తుంది. అపర్ణ గొంతు వినగానే రేవతి షాక్ అవుతుంది. పిల్లల్ని కనగానే కాదు.. తల్లిగా బాధ్యత ఉండాలని రేవతిని నానామాటలు అంటుంది అపర్ణ. కొబ్బరి కాయల కోసం వెళ్లిన నాకు సడెన్‌గా కళ్లు తిరగడంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయానని చెబుతుంది రేవతి. కళ్లు తెరిచి చూసేసరికి బాబు తప్పిపోయాడని అంటుంది. బాబును నిర్లక్ష్యంగా వదిలేశారన్న కోపంతో మిమ్మల్ని నానామాటలు అన్నానని క్షమించమని అడుగుతుంది అపర్ణ. మీ బాబు నా దగ్గర క్షేమంగా ఉన్నాడని, వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా అయ్యాడని చెబుతుంది. వాడిని నా సొంత మనవడిలా కంటికి రెప్పలా చూసుకుంటున్నానని అంటుంది అపర్ణ. ఈ మాటలను జగదీష్‌కి వినిపిస్తుంది రేవతి,

అప్పూ- కావ్యల మాటలతో రుద్రాణికి డౌట్ వస్తుంది.. అప్పూని ఫాలో అయి ఎవరో ఏంటో తెలుసుకోమని రాహుల్‌కు చెబుతుంది. రాజ్ ప్రపోజ్ చేయడానికి ఇంటికి వస్తుండటంతో కావ్య చాలా సంతోషిస్తుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా మా ప్రయాణం సాగిపోవాలని దేవుడికి దండం పెట్టుకుంటుంది కావ్య. ఆయన ప్రేమను నేను అంగీకరించబోతున్నానని, మేం ఇద్దరం మళ్లీ ఒక్కటి అయ్యేలా చూడమని కోరుకుంటుంది. ఇంతలో కావ్యకు బాగా వాంతులు కావడంతో బాత్‌రూంలో చెక్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని తేలుతుంది. రాజ్ తనకు ప్రపోజ్ చేస్తుండటంతో తాను తల్లిని కాబోతున్నానని తెలిస్తే ఎలా అని బాధపడుతుంది కావ్య. వెంటనే అప్పూని హత్తుకుని ఏడుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X