Brahmamudi August 30th episode: అందరి ముందు ఫూల్స్ అయిన స్వప్న, కావ్య..భార్యని సమస్యగా తయారయ్యావంటున్న రాజ్!
కళ్యాణ్, అప్పు ఇంటికి రాకపోవడమే మంచిది అని భార్య తో అంటాడు రాజ్. తనకిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు అప్పు కి థాంక్స్ చెప్తాడు కళ్యాణ్. అప్పు వాళ్ళు ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్న రాహుల్ కి రుద్రాణి కి చుక్కలు చూపిస్తుంది స్వప్న. రాజ్ ముందు కావ్యని ఫూల్ చేయడానికి స్వప్నని ట్రాప్ చేస్తారు రాహుల్, రుద్రాణి. విషయం తెలియని స్వప్న జరిగింది నిజమేమో అనుకుని కావ్యకి చెప్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 30వ తేదీ ఎపిసోడ్ 502లో ఏం జరిగిందంటే..
జరిగిందంతా చెప్తే రాహుల్ అందరి ముందు దోషి లా నిలబడవలసి వస్తుంది, నీకు పరవాలేదా అని అడుగుతుంది కావ్య. నేను గొప్పగా బ్రతకాలి అంతేకానీ రాహుల్ ఆస్తులు పోగొడతాను అంటే నేనెందుకు ఊరుకుంటాను అంటుంది స్వప్న. భర్త కన్నా ఆస్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు చూడు నువ్వు గ్రేట్ అంటుంది కావ్య. నన్ను పొగిడావా, తిట్టావా అంటుంది స్వప్న. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు అంటుంది కావ్య.

మరోవైపు కళ్యాణ్ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ఆలోచిస్తూ ఉంటాడు, నెలంతా పనిచేసే ఆఖరిలో జీతం తీసుకుంటే అప్పటివరకు ఇల్లు గడవడం కష్టం అనుకుంటాడు. అంతలో ఎదురుగా ఆటో క్లీన్ చేస్తున్న వ్యక్తిని చూసి ఏదో ఆలోచన వచ్చిన వాడిలాగా అతని దగ్గరికి వెళ్తాడు. ఆ ఆటో వాడిని ఆటో నడిపితే ఎంత వస్తుంది అంటూ ఆరా తీస్తాడు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అంటాడు ఆటో వాడు. నేను కూడా ఆటోను నడపాలనుకుంటున్నాను అంటాడు కళ్యాణ్.

నువ్వు ఆటో కొనేవాడిలాగా కనిపిస్తున్నావు కానీ ఆటో నడిపే వాడిలాగా కనిపించడం లేదు ఇంతకీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతాడు ఆటో అతను. తన ఇల్లు చూపిస్తాడు కళ్యాణ్. బంటి ఇంట్లో దిగిన కొత్తజంట మీరేనా, అర్థమైంది అంటూ నాకు తెలిసిన సేటు నెంబర్ ఇస్తాను అతని దగ్గరికి వెళ్లి నేను చెప్పానని చెప్పండి అద్దెకి ఆటో ఇస్తాడు అంటూ నెంబర్ ఇస్తాడు ఆటో అతను. అతనికి థాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్. మరోవైపు ఆఫీసుకు వెళ్తున్న రాహుల్ ని ఆగమని చెప్పి రాహుల్ ఆఫీస్ కి వెళ్లడానికి వీల్లేదు అని చెప్తుంది కావ్య.
ఎందుకు వీలు లేదు నీ భర్తని కాదని రాహుల్ ని ఆ సీట్లో కూర్చోబెడితే భరించలేకపోతున్నావా అంటుంది రుద్రాణి. రాజ్ కూడా ఎందుకు వాడు ఆఫీస్ కి వెళ్ళకూడదు అని అడుగుతాడు. అపర్ణ మాట్లాడుతూ ఎందుకు అంత కంగారు తనని చెప్పనివ్వండి అంటూ కోడల్ని వెనకేసుకొస్తుంది. అప్పుడు కావ్య రాహుల్ చేయబోయే దొంగ బంగారం గురించి చెప్తుంది. ఇంట్లో వాళ్ళందరూ రాహుల్ ని బుద్ధి పోనిచ్చుకున్నావు కాదంటూ చివాట్లు పెడతారు, రుద్రాణి పెంపకాన్ని తప్పు పడతారు.

అప్పుడు రాహుల్ మాట్లాడుతూ అందరూ అన్ని మాటలు అంటున్నారు అసలు నేను తప్పు చేశాను అనటానికి సాక్ష్యం ఏమిటి అని అడుగుతాడు. సాక్ష్యం నీ చేతిలోనే ఉంది అంటూ అతని చేతిలో ఉన్న ఆఫీస్ బ్యాగ్ తీసుకొని ఫైల్ రాజ్ చేతిలో పెడుతుంది స్వప్న. అది చదివిన రాజ్ ఈ ఫైల్ లో తప్పేముంది ఇది ఎప్పుడూ మనం బంగారం కొనే వ్యక్తి దగ్గర కొత్తగా చేసుకున్న అగ్రిమెంటు, ఇందులో ఇల్లీగల్ బంగారం గురించి ప్రస్తావన లేదు అంటాడు. ఒక్కసారిగా షాక్ అవుతారు కావ్య, స్వప్న. ఒకసారి ఆ ఫైల్ తీసుకొని పూర్తిగా మళ్ళీ చెక్ చేస్తారు అక్క చెల్లెలు ఇద్దరూ.
రాహుల్ మోసం చేశాడు ఫైల్ మార్చేసాడు, నా కళ్ళతో నేను చూశాను, వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను అంటుంది స్వప్న. మీకు కావాలంటే రాజ్ కి కంపెనీ బాధ్యతలు అప్పగించండి అంతేగాని నా కొడుకుని ఇలాంటి మాటలు అంటుంటే నేను భరించలేను అంటుంది రుద్రాణి. ఏమో నిజంగానే రాహుల్ ఫైల్ మార్చేసాడేమో అంటుంది అపర్ణ. ఇక అందరూ ఆపండి స్వప్న ఏదో కన్ఫ్యూజ్ అయి ఉంటుంది, ఆ మాటలు నమ్మి కావ్య కూడా అపార్థం చేసుకుంది అంటాడు రాజ్.
కావ్య ఎదో మాట్లాడబోతుంటే ఆమెని బలవంతంగా అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు రాజ్ . పక్కకి తీసుకు వెళ్లిన తరువాత ఎందుకు నువ్వు ప్రతి విషయంలోని దూరిపోతావు, ఇంటికి నువ్వు ఒక సమస్యగా తయారయ్యావు అని భార్యపై కోప్పడతాడు రాజ్. వాళ్లని మీరు వెనకేసుకు రాకండి, రాహుల్ అలా చేస్తే కంపెనీ పరువు ప్రతిష్టలు పోతాయి అంటుంది కావ్య. అయితే నీకేంటి వాళ్ళు ఈ ఇంట్లో కుటుంబ సభ్యులు నీకోసం ఇంట్లో వాళ్ళు ఎవరినీ వదులుకోలేను అంటాడు రాజ్ . ఆ మాటలకి షాక్ అవుతుంది కావ్య.
తరువాయి భాగంలో ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన కళ్యాణ్ ఆటో కి దండం పెట్టుకుంటూ మొదటిసారిగా ఆటో తీస్తున్నాను బేరం మంచిగా అయ్యేలాగా చూడాలని ఆటో కి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే వెనకనుంచి స్వప్న, కావ్య వస్తూ ఆటో మీద రేపటి కోసం అని రాసి ఉండటం చూసి ఇది ఎవరో మన కవిగారి లాంటి వాడే అయి ఉంటాడు అనుకుంటూ ఆటో ఎక్కడానికి వస్తూ ఉంటారు. వాళ్లు అలా రావడం ఆటో మిర్రర్ లోంచి చూసిన కళ్యాణ్ కంగారు పడతాడు.


Click it and Unblock the Notifications











