Brahmamudi August 31th episode : భార్యకు రాజ్ స్ట్రాంగ్ వార్నింగ్.. శృతిని లైన్లో పెట్టిన కావ్య!
తనకిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు అప్పు కి థాంక్స్ చెప్తాడు కళ్యాణ్. అప్పు వాళ్ళు ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్న రాహుల్ కి రుద్రాణి కి చుక్కలు చూపిస్తుంది స్వప్న. రాజ్ ముందు కావ్యని ఫూల్ చేయడానికి స్వప్నని ట్రాప్ చేస్తారు రాహుల్, రుద్రాణి. విషయం తెలియని స్వప్న జరిగింది నిజమేమో అనుకుని కావ్యకి చెప్తుంది. అందరి ముందు రాహుల్ బండారం బయటపెట్టాలనుకుంటారు స్వప్న, కావ్య కానీ వాళ్లే ఫూల్స్ అయిపోతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 31వ తేదీ ఎపిసోడ్ 503లో ఏం జరిగిందంటే..
వాళ్లని అనుమానించినా, అవమానించినా ఉమ్మడి కుటుంబంలో తుఫాను పుడుతుంది అంటాడు రాజ్. కుటుంబంలో తుఫాను పుట్టించడానికి మీ రుద్రాణి అత్త తో పాటు మీ పిన్ని కూడా రెడీగా ఉంటారు అంతేకానీ నేను కాదు, నా వ్యక్తిత్వం అది కాదు అంటుంది కావ్య. అయినా అన్ని విషయాలలోని ఎందుకు నువ్వు కలుగ చేసుకుంటావు, కొన్ని విషయాలు చూసి చూడనట్లుగా వదిలేయాలి అంటాడు రాజ్.

మీరందరూ వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు అంటుంది కావ్య. నువ్వు రాకముందు కూడా వాళ్ళని నమ్మాం అయితే ఏం జరిగింది అంటాడు రాజ్. ఏం జరిగిందో మీకు తెలియదా అక్క ని మీరు చేసుకోవాల్సింది ఆ రాహుల్ చేసుకున్నాడు, ఒకరంటే ఒకరికి పడని మనకి ముసుగు వేసి మరి పెళ్లి చేశారు అంటూ వాళ్ళు చేసిన అరాచకాలు అన్ని చెప్తుంది కావ్య. అవన్నీ అప్పుడు కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.
ఇప్పుడు ఇంట్లో ఎవరి ఆరోగ్యం బాగోలేదు, ఎవరు ఎన్ని తప్పులు చేసినా ఉమ్మడి కుటుంబం కలిసి ఉండాలనుకునే వ్యక్తి మా తాతయ్య, ఇంతకుముందు సంగతి వదిలే ఇప్పుడు నీ వలన ఇంట్లో ఎవరికి ఎలాంటి సమస్య రాకూడదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రాజ్. బాధగా తన గదిలోకి వెళ్లి కూర్చుంటుంది కావ్య. అప్పుడే స్వప్న వచ్చి తను చేసిన తప్పుకి క్షమాపణ చెప్తుంది. నువ్వు తప్పు చేయలేదు వాళ్లే మనల్ని ట్రాప్ చేశారు, నన్ను మా ఆయన ముందు పిచ్చి దాన్ని చేశారు ఇదంతా కావాలనే చేశారు అంటుంది కావ్య.
తర్వాత హాస్పిటల్ కి వెళ్ళాలనుకున్నాం కదా రెడీ అవ్వు వెళ్దాం అని కావ్య అనడంతో స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత ఆఫీసులో స్టాఫ్ అయిన శృతికి ఫోన్ చేసి రాహుల్ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పి ఏం చేయాలో చెప్తుంది. తర్వాత స్వప్న రావడంతో ఇద్దరూ కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. మరోవైపు ఆఫీసులో రాహుల్ దొంగ బంగారం గురించి ఒక వ్యక్తితో డీలింగ్ మాట్లాడుకుంటూ ఉంటాడు. శృతిని ఫైల్ తీసుకు రమ్మనడంతో తీసుకువస్తుంది.
అక్కడినుంచి వెళ్లకుండా వాళ్ళనే అబ్జర్వ్ చేస్తున్న శృతిని నన్ను వదిలి వెళ్లాలని పెంచడం లేదా అని వెటకారంగా మాట్లాడుతాడు రాహుల్. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి తర్వాత ఎదుటి వ్యక్తి మాట్లాడుతూ మనం చేసేదే దొంగ బంగారం వ్యాపారం దానికి డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు ఏంటి అని అడుగుతాడు. నేను నీ పేరు మీద ఫేక్ కంపెనీ క్రియేట్ చేసి దాని ద్వారా బిజినెస్ చేస్తాను, దానివలన మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు కంపెనీకి పర్మినెంట్ ఎండి రాజ్ కాబట్టి సమస్యలలో ఇరుక్కునేది వాడే అంటాడు రాహుల్.
లాభాలు మాత్రం మనం తీసుకుంటాం అంతే కదా అంటాడు అవతల వ్యక్తి. అవును దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా ఈ కంపెనీ ఎన్ని రోజులు నా చేతిలో ఉంటుందో తెలియదు అందుకే కోట్లు కూడపెట్టి దాచుకోవాలి అంటాడు రాహుల్. మరోవైపు స్వప్న, కావ్య హాస్పిటల్ నుంచి రిటర్న్ అవుతారు, దారిలో నువ్వు మీ అత్త మీద భర్త మీద ఆవేశంతో కేకలు వేయకు అక్క, బీపీ చూసావా ఎంత ఎక్కువగా ఉందో ఇలా అయితే రేపు పుట్టబోయే బిడ్డకు కూడా ప్రమాదమే అంటుంది కావ్య.
ఏం చేయమంటావు వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి అంటుంది స్వప్న. వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తుండగా కారు ఆకస్మాత్తుగా ఆగిపోతుంది.ఏం జరిగిందో చూడమని డ్రైవర్ కి చెప్తుంది కావ్య. కారు చూసిన డ్రైవర్ కి సమస్య అర్థం కాకపోవటంతో అదే విషయం కావ్యకి చెప్తాడు. సరే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం అంటుంది కావ్య. అంతవరకు నేను ఆగలేను నాకు కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్నాయి, దొరికిన ఆటోలో వెళ్లి పోదాం అంటుంది కావ్య.
అప్పుడే కళ్యాణ్ ఆటో కి దండం పెట్టుకుంటూ మొదటిసారిగా జీవితం లో సంపాదన ప్రారంభించబోతున్నాను తొలి బోణి మంచి చేత్తో జరిగేలాగా చూడమని దండం పెట్టుకుంటాడు. అప్పుడే కావ్య వాళ్ళు ఆటో దగ్గరికి వస్తూ ఉంటారు, ఆటో వెనుక ఉన్న రేపటి కోసం అనే స్లోగన్ చూసి వీడెవడో మన కవి గారికి దగ్గర వాడి లాగా ఉన్నాడు అంటుంది స్వప్న. ఈరోజు కష్టపడేది రేపటి మంచి భవిష్యత్తు కోసమే కదా అక్క అంటుంది కావ్య.
వాళ్ళిద్దరూ ఆటో దగ్గరికి రావడానికి మిర్రర్ ద్వారా చూసిన కళ్యాణ్ అలెర్ట్ అవుతాడు, మొహం కనిపించకుండా కర్చీఫ్ కట్టుకొని, క్యాప్ పెట్టుకుంటాడు. కావ్య వాళ్ళు ఆటోలో కూర్చున్న తర్వాత స్వప్న అసలు దీని అందరికి కారణం కళ్యాణ్, తనే ఇంట్లో ఉండి ఉంటే అసలు రాహుల్ కంపెనీకి వెళ్లే పని ఉండేది కాదు ఇప్పుడు చూడు కంపెనీని ముంచేస్తున్నాడు అంటుంది స్వప్న. అప్పు ఆ ఇంట్లో ఎలాంటి బాధలు పడకూడదని కవిగారు ఇక్కడికి రావడం లేదు అంటుంది కావ్య. అంత ఆస్తి ని వదిలేసి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఏంటో అంటుంది స్వప్న.
తర్వాత కళ్యాణ్ తీసుకువచ్చి ఇంటి ముందు ఆటో ఆపుతాడు నేను నాకు ఆకలిగా ఉంది నేను వెళ్తాను నువ్వు డబ్బులు ఇచ్చేసి వచ్చాయి అని స్వప్న చెప్పటంతో కావ్య కళ్యాణ్ కి డబ్బులు ఇస్తూ మేము ఎక్కడికి వెళ్లాలో చెప్పకుండానే ఇక్కడికి తీసుకువచ్చారు అంటూ అతని కవిత ఒకటి చదువుతుంది. వదినా అంటూ ముసుగు తీసి ఆమె ముందు నించుంటాడు కళ్యాణ్. మీరు బ్రతుకు ప్రయాణం మొదలుపెట్టారు కరెక్టే కానీ నచ్చినట్లుగా బ్రతకడం కూడా అవసరమే, నడిచిపోతుంది కదా అని ఇక్కడే ఆగిపోకండి అంటూ కళ్యాణ్ ని మోటివేట్ చేస్తుంది కావ్య.
తరువాయి భాగంలో రాజ్ ఇంటికి పోలీసులు వస్తారు, అందరూ షాక్ అయి వాళ్ళని చూస్తూ ఉంటే ఎర్లీ మార్నింగ్ పెట్రోలింగ్ చేస్తుంటే ఒక ట్రాలీ ఆటోను పట్టుకున్నారు మా వాళ్ళు, అందులో దొంగ బంగారం సప్లై అవుతుంది. ఎవరిదా అని ఎంక్వయిరీ చేస్తే అది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కి సప్లై అవుతుందని తెలిసింది. దీనికి పూర్తి బాధ్యత ఆ కంపెనీ చైర్మన్ అయిన స్వరాజ్ దే కాబట్టి ఆయనని అరెస్టు చేస్తున్నాం అంటారు పోలీసులు.


Click it and Unblock the Notifications











