Brahmamudi August 3rd episode: చస్తానని బెదిరిస్తున్న అప్పు.. పెళ్లిని ఆపే ప్రయత్నంలో రాజ్!

రాజ్ కళ్యాణ్ ని తీసుకొని అప్పు దగ్గరికి వెళ్లాడని భ్రమపడిన ధాన్యలక్ష్మి కావ్య పై విరుచుకుపడుతుంది. తన భార్య జోలికి రావద్దని వార్నింగ్ ఇస్తాడు రాజ్. పెళ్లి పిలుపులకు వచ్చిన కనకం ఇంట్లో అందరినీ పిలిచి కళ్యాణ్ ని మాత్రం పెళ్ళికి రావద్దు అని చెప్తుంది. అప్పు ఇంకా కళ్యాణ్ ని ప్రేమిస్తుందని తెలుసుకున్న స్వప్న కళ్యాణ్ ని పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఎవరికోసం త్యాగం చేస్తున్నావంటూ చివాట్లు పెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 3వ తేదీ ఎపిసోడ్ 479లో ఏం జరిగిందంటే..

కళ్యాణ్ ని మనసులో పెట్టుకొని ఇంకొకడితో పెళ్లికి ఎలా సిద్ధపడుతున్నావు, అసలు ఈ విషయం నాకు ముందే చెప్పాల్సింది ఇప్పటికైనా మించి పోయింది లేదు మండపం లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకో అని సలహా ఇస్తుంది స్వప్న. నాకు అమ్మానాన్నలు సంతోషమే ముఖ్యం, నేను ఈ పెళ్లి చేసుకోవాలి, అత్తారింటికి వెళ్లిపోవాలి అంతే అంటుంది అప్పు. అయితే ఈ విషయం నేను ఇప్పుడే మండపంలో అందరికీ చెప్తాను అంటుంది స్వప్న.

Brahmamudi serial August 3rd 2024

అలా చేస్తే నేను ఛస్తాను అని వార్నింగ్ ఇస్తుంది అప్పు. చేసేదిలేక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. మరోవైపు పెళ్లి వాళ్ళు మండపానికి వస్తారు. వాళ్ళని స్వప్న, కావ్య హారతి ఇచ్చి సాదరంగా ఆహ్వానిస్తారు. ఆనందంగా ఉన్న ధాన్యలక్ష్మిని పక్కకి తీసుకువచ్చి ఈ పెళ్లి జరుగుతున్నందుకు నువ్వు ఆనంద పడుతున్నావు కానీ ఈ పెళ్లి జరగడం రాజ్ కి ఇష్టం లేదు అంటుంది రుద్రాణి. రాజ్ పెళ్లి చెడగొట్టడు అని నమ్మకంగా చెప్తుంది ధాన్యలక్ష్మి.

నా కుడి కన్ను ఎందుకో అదురుతుంది ఈ పెళ్లి జరగదేమో అనిపిస్తుంది అంటుంది రుద్రాణి. నువ్వు ఏదేదో చెప్పి నన్ను భయపెడుతున్నావు అంటుంది ధాన్యలక్ష్మి. మరోవైపు స్వప్న కళ్యాణ్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. మీ ఇద్దరు కుటుంబం కోసం త్యాగం చేస్తున్నామనుకుంటున్నారు కానీ రేపటి రోజున ఒంటరివారైపోయేది మీరిద్దరే, నన్ను అందరూ సెల్ఫిష్ అంటారు కానీ మన జీవితం దగ్గరికి వచ్చేసరికి సెల్ఫిష్ గా ఉంటేనే సుఖపడతాము.

అప్పు సంతోషంగా ఉండటమే ముఖ్యం అంటావు కదా ఇలాగే నా సంతోషంగా ఉంచటం తను నీ జ్ఞాపకాలను చెరిపేస్తూ ఏడుస్తూ కూర్చుంది అని జరిగిందంతా చెప్తుంది. ఈ మాటలు అన్ని రాజ్ వింటాడు ఇక అప్పు ని కళ్యాణ్ ని నమ్ముకుని లాభం లేదు నేనే ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దర్నీ కలపాలి అనుకుంటాడు. అక్కడ కళ్యాణ్ కూడా మనసు మార్చుకుని ఏదైతే అదే అయింది అప్పుని ఒప్పించి తీసుకువచ్చేయాలి అని మండపానికి బయలుదేరాలి అనుకుంటే బయట నుంచి తాళం వేసి ఉంటుంది.

అదే సమయంలో ధాన్యలక్ష్మి రుద్రాణిని ఇంటికి తాళం వేసావు కదా అని అడుగుతుంది. వేశాను తాళం చెవులు నా దగ్గరే పెట్టుకున్నాను అంటుంది రుద్రాణి. మంచి పని చేసాం అనుకుంటారు రుద్రాణి,ధాన్యలక్ష్మి. మరోవైపు రాజ్ పెళ్లి కొడుకుతో అసలు విషయం చెప్పి వెళ్లి చెడగొట్టాలి అనుకుంటాడు కానీ పెళ్ళికొడుకు నేను ఇప్పుడే అప్పుని కలిసాను తను ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన కావ్య భర్తని మందలిస్తుంది. నేను ఈ పెళ్లి ఎలాగైనా ఆపుతాను అంటాడు రాజ్.

నేను మిమ్మల్ని అడుగుతాను అంటుంది కావ్య. కళ్యాణ్ ఇందిరా దేవికి ఫోన్ చేసి ఇంటికి ఉన్న రెండో తాళం ఎక్కడ ఉందో కనుక్కొని దాని ద్వారా ఇంటి నుంచి బయటపడతాడు. మరోవైపు రాజ్ కి పెళ్లి ఎలాగైనా ఆపాలి అనే ఉద్దేశంతో అప్పు గది దగ్గరికి వెళ్లి గదిలో ఎవరున్నారో చూడకుండా మనసులో కళ్యాణ్ ని పెట్టుకుని ఇంకొకరితో ఎలా తాళి కట్టించుకుంటావు, ఇది నీ జీవితం నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యు, ఎవరికోసమో త్యాగం చేయవలసిన అవసరం లేదు, నీకు ఇదే చివరి అవకాశం నా మాట మీద నమ్మకం ఉంటే ధైర్యం చెయ్యు.

బయట కారు ఆపుకొని రెడీగా ఉంటాను నువ్వు వస్తే కళ్యాణ్ దగ్గరికి తీసుకు వెళ్తాను, వస్తావా అంటాడు రాజ్. అనుకోకుండా ఆ రూంలో కావ్య ఉండటం, ఆ మాటలు వినడం జరుగుతుంది. వస్తాను అన్నట్లు ఊ కొడుతుంది. సరే బయట ఉంటాను అంటూ కారు లో కూర్చుంటాడు రాజ్. ముసుగేసుకొని వచ్చి కావ్య కూడా కారులో కూర్చుంటుంది. అక్కడినుంచి వెళ్ళిపోబోతుంటే ప్రకాష్ అడ్డుపడి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. కంగారు పడతాడు రాజ్.

తరువాయి భాగంలో పెళ్లి మండపంలో అప్పు కనిపించకపోవడంతో కలకలం ప్రారంభమవుతుంది, ఇక్కడే కూర్చోవడం ఎందుకు వెతుకుదాం పదండి అంటుంది అపర్ణ. ఎక్కడని వెతుకుతారు ఇక్కడ అప్పు కనిపించడం లేదు, అక్కడ కళ్యాణ్ కనిపించడం లేదు ఇద్దరూ కలిసి కచ్చితంగా వెళ్ళిపోయారు అని కోపంగా ఉంటుంది ధాన్యలక్ష్మి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X