Brahmamudi August 4th Episode: ప్రమాదంలో రాజ్ ప్రాణాలు .. ప్రేమను చంపేసుకున్న కావ్య, రుద్రాణికి షాకిచ్చిన అప్ప

Photo Courtesy: JioHotstar

బాబు ఈ ఇంటి వారసుడేనని ఇందిర నోరు జారడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఆమె మాటల్ని కవర్ చేసి సరిదిద్దుతుంది కావ్య. నీ కూతురు ఎవడితోనో లేచిపోయిందని, నీ కొడుకు కోడలు సరిగ్గా ఉంటే నీక్కూడా మనవడో, మనవరాలో ఉండేవాళ్లని సూటిపోటి మాటలతో అపర్ణ మనసు ముక్కలు చేస్తుంది రుద్రాణి. బాబును ఎలాగైనా ఇంట్లో నుంచి పంచించేయాలని అనుకున్న అప్పూ.. స్వరాజ్ తల్లిదండ్రుల అడ్రస్ దొరికిందని పిల్లాడిని స్టేషన్‌కు తీసుకెళ్లాలని అపర్ణతో చెబుతుంది.

దీని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానించిన రుద్రాణి.. బాబుని ఎలా పంపిస్తాం వాడి తల్లిదండ్రులనే ఇంటికి రమ్మని చెబుతుంది. అపర్ణ కూడా అదే మాట చెప్పడంతో అప్పూ, కావ్యలు ఉలిక్కిపడతారు. దాంతో రేవతికి ఫోన్ చేసి అపర్ణ చేత మాట్లాడిస్తుంది అప్పూ. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవాలని ఎక్కడ పడితే అక్కడ వదిలేయొద్దని రేవతికి గడ్డిపెడుతుంది అపర్ణ. రుద్రాణికి అనుమానం మరింత బలపడటంతో అప్పూని ఫాలో అవ్వమని రాహుల్‌కు చెబుతుంది. కావ్యకి ఉన్నట్లుండి వాంతులు రావడంతో ఆమె చెక్ చేసుకోగా ప్రెగ్నెంట్ అని తేలుతుంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాలని అనుకుని తర్వాత తన నిర్ణయం మార్చుకుంటుంది. అప్పుడే అప్పూ రావడంతో ఆమెను హత్తుకుని ఏడుస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 4వ తేదీ ఎపిసోడ్ 791లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial August 4th 2025 Episode 791 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పాలా? వద్దా అని కావ్య ఆలోచిస్తుండగా.. అప్పూ రావడంతో ఆమెను హత్తుకుని కంటతడి పెడుతుంది. ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావని చేతిలో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ చూస్తుంది అప్పూ. అది చూసి చాలా సంతోషిస్తుంది. నేను తల్లిని కాబోతున్నానని కావ్య చెప్పడంతో అప్పూ కంగ్రాట్స్ చెబుతుంది. కానీ ఇదంతా ఎప్పుడు జరిగింది? బావ నువ్వు ఎప్పుడు కలిశారు? అని అప్పూ అడుగుతుంది. రెండు నెలల ముందు మీ బావకి యాక్సిడెంట్ జరగడానికి ముందు ఒక బూత్ బంగ్లాలో కలిశామని చెబుతుంది కావ్య. ఇంత గుడ్‌న్యూస్ చెప్పకుండా ఎందుకు బాధపడుతున్నావని ప్రశ్నిస్తుంది అప్పూ.

ఈ న్యూస్ ఇంట్లో అందరికీ చెప్పి స్వీట్స్ పంచాల్సిందేనని అప్పూ వెళ్తుండగా కావ్య అడ్డుకుంటుంది. ఒక ఆడపిల్లకు ఇంతకన్నా సంతోషకరమైన రోజు ఉండదని అప్పూ చెబుతుంది. ఈరోజు ఆయన నాకు ప్రపోజ్ చేయడానికి వస్తున్నారని అంటుంది. ఇలాంటి టైంలో నేను తల్లిని కాబోతున్న విషయం ఆయనకు తెలిస్తే దీనికి కారణం ఎవరు? అని అడుగుతారని చెబుతుంది. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తుంది. ఆయనకి నిజం తెలియాలంటే గతం గుర్తు రావాలని, గతం గుర్తు చేస్తే ప్రాబ్లం అవుతుందని డాక్టర్లు చెప్పారని అంటుంది కావ్య. మరి ఇప్పుడెలా అని అప్పూ కూడా కంగారు పడుతుంది.

ఆయన్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదని అలా అని నిజం చెప్పే సాహసం కూడా చేయలేనని అంటుంది కావ్య. దీని గురించి నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను కానీ, ముందు నువ్వు రేవతి గారి అబ్బాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోమ్మని అప్పూకి చెబుతుంది కావ్య. నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దని అప్పూ దగ్గర మాట తీసుకుంటుంది కావ్య. స్వరాజ్‌ను తీసుకుని అప్పూ కారులో వెళ్తుండగా.. కారు ఎద్దుల బండిలా వెళ్తుందని, ఇలా అయితే వచ్చే సంవత్సరం మా ఇంటికి చేరుకుంటామని అంటాడు పిల్లాడు. ఆ మాటలతో అప్పూ నవ్వుకుంటుంది. తన కారును రాహుల్ వెనుక నుంచి ఫాలో అవ్వడాన్ని గమనించిన అప్పూ.. ఇదంతా రుద్రాణి ప్లాన్ అని ఊహిస్తుంది. వెంటనే కానిస్టేబుల్ శేషుకి ఫోన్ చేసి రాహుల్ కారుని చెక్ చేయించి లేట్ అయ్యేలా చేస్తుంది.

రాజ్ కోసం దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎదురుచూస్తుంటుంది. రాజ్ లేట్‌గా రావడంతో అపర్ణ టెన్షన్ పడుతుంది. ఈసారి కావ్య- రాజ్‌లను కలవకుండా ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదని అపర్ణతో అంటుంది ఇందిర. మరోవైపు.. నేను తల్లిని కాబోతున్న విషయాన్ని ఎలా దాచి పెట్టగలనని కావ్య బాధపడుతుంది. రాజ్- కావ్యలను ఆపడానికి యామిని కూడా లేదని, ఇప్పుడేం చేయాలా అని రుద్రాణి ఫీలవుతుంది. వీళ్లిద్దరూ కలిసిపోతారు.. మళ్లీ మేం బానిసల్లా బతకాల్సిందేనని అనుకుంటుంది. ఇంతలో రాజ్ ఇంటికి వస్తాడు.. ఇంకాస్త ఆలస్యంగా వచ్చుంటే మీ అమ్మ నీ చెంప చెళ్లుమనిపించేదని ఇందిర అంటుంది.

ఈరోజుతో అన్నింటికి తెరదించేస్తా.. కథలో ఈ రాజకుమారుడు, రాకుమారిని సొంతం చేసుకునే క్షణాలు వచ్చేశాయని అంటాడు రాజ్. నువ్వొస్తావని కళావతి సిగ్గుతో లోపల దాక్కుందని, ఎన్నిసార్లు పిలిచినా బయటికి రావడం లేదని అంటుంది ధాన్యలక్ష్మీ. అందరూ ఇంత సంతోషంగా ఉంటే మీరెంటీ అలా మాడిపోయిన మసాలా దోశలా ఉన్నారని రుద్రాణిపై సెటైర్లు వేస్తాడు రాజ్. ఆ వెంటనే కావ్యని పిలుస్తాడు రాజ్. ఆమె కళ్లు తుడుచుకుని కిందకి వస్తుంది. దాంతో రాజ్ తన మనసులోని మాటను కావ్యకి చెబుతాడు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని కావ్యను అడుగుతాడు రాజ్. ఆ మాటలతో కావ్య కంటతడి పెట్టడంతో అంతా కంగారు పడతారు.

ఇవి కన్నీళ్లు కావని, నువ్వు ఎప్పుడెప్పుడు ఈ మాటలు చెబుతావా? అని ఎదురుచూసి చూసి అవి నిజం కావడంతో తనలో దాచుకున్న బాధ మొత్తం బయటికి వచ్చేసిందని అంటుంది ఇందిర. వెంటనే పంతులుగారిని పిలిచి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తామని చెబుతుంది అపర్ణ. పెళ్లయ్యాక కావ్యని తీసుకెళ్లవు కదా? ఇక్కడే మాతో పాటే ఉంటావుగా అని అడుగుతాడు ప్రకాశం. ఇలాంటి మూడ్‌లో సైలెంట్‌గా ఎందుకు ఉన్నావని కావ్యని అడుగుతుంది ఇందిర. నేను అప్పూ చేసుకున్నట్లు సైలెంట్‌గా పెళ్లి జరగడానికి వీల్లేదని గ్రాండ్‌గా జరగాలని అంటాడు కళ్యాణ్. కళావతి గారికి ఎలా ఇష్టమో అలాగే జరిపించండి అని చెబుతాడు రాజ్.

ఇంట్లో వాళ్లంతా సంతోషంగా ఉండటంతో ఇక మీ మాటలు ఆపుతారా అని కావ్య చీదరించుకుంటుంది. ఆయన మనసులోని మాటను చెప్పగానే.. అందరూ పెళ్లి ఎలా చేయాలా అనే వరకు వెళ్లిపోయారని మండిపడుతుంది. నన్ను అడగారా? నా నిర్ణయంతో మీకు పని లేదా? అని ప్రశ్నిస్తుంది కావ్య. ఆయనంటే ఇష్టమని మీ అందరికీ నేను చెప్పానా? అసలు నేను పెళ్లికి ఒప్పుకున్నానా? అని నిలదీస్తుంది. ఆయన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదని కావ్య తేల్చిచెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. ఆట పట్టించడానికి ఇది సమయం కాదని ధాన్యలక్ష్మీ అంటుంది. నా జీవితం మీద నేనే ఎందుకు జోక్స్ వేసుకుంటాను.. నేను సీరియస్‌గానే చెబుతున్నా.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని కరాకండీగా చెబుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X