Brahmamudi August 5th episode: పెళ్లి మండపంలో అప్పు మాయం.. రాజ్‌కు కావ్య సవాల్
తన భార్య జోలికి రావద్దని ధాన్యలక్ష్మి కి వార్నింగ్ ఇస్తాడు రాజ్. పెళ్లి పిలుపులకు వచ్చిన కనకం ఇంట్లో అందరినీ పిలిచి కళ్యాణ్ ని మాత్రం పెళ్ళికి రావద్దు అని చెప్తుంది. అప్పు ఇంకా కళ్యాణ్ ని ప్రేమిస్తుందని తెలుసుకున్న స్వప్న కళ్యాణ్ ని పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఎవరికోసం త్యాగం చేస్తున్నావంటూ చివాట్లు పెడుతుంది. కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకొని అప్పుని ఎలాగైనా ఒప్పించి తనతో తీసుకురావడానికి బయలుదేరుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 5వ తేదీ ఎపిసోడ్ 480లో ఏం జరిగిందంటే..
పందిట్లో పెళ్లి అవుతుంటే ఇంత అర్జెంటుగా నువ్వు బయటికి వెళ్లవలసిన అవసరం ఏమిటి అంటాడు ప్రకాష్. జీలకర్ర బెల్లం లో జీలకర్ర మరిచిపోయారంట తీసుకురావడానికి వెళ్తున్నాను అంటూ ప్రకాష్ కి మాయమాటలు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్. దారిలో కారు డ్రైవ్ చేస్తున్న రాజ్ అప్పుతో మాట్లాడుతున్నాను అనుకొని కావ్య తో మాట్లాడుతూ ధైర్యం చేసి ముందు అడుగు వేసావు, మంచి పని చేశావు నీకు గుడిలో పెళ్లి చేసేస్తాను, అక్కడ ఇప్పటికే నా ఫ్రెండ్స్ అన్ని సిద్ధం చేసి రెడీగా ఉంచారు అని చెప్తాడు.

పెళ్లి అయిపోయిన వాళ్లకి మళ్ళీ పెళ్లి ఏంటి బావ అంటుంది కావ్య. పెళ్లి అయిపోవడం ఏమిటి అని షాక్ అవుతాడు రాజ్. అవును నీకు నాకు ఎప్పుడో అయిపోయింది కదా అంటుంది కావ్య. వెనక్కి తిరిగి చూసేసరికి కావ్య కనిపిస్తుంది. షాకైన రాజ్ నువ్వు ఎప్పుడు కార్లోకి వచ్చావు అంటాడు. జరిగిందంతా చెప్పిన కావ్య చెప్పాను కదా నేను మిమ్మల్ని ఆపుతానని అంటుంది. భార్యకి నాలుగు చివాట్లు పెట్టి ఇప్పుడు ఏం చేయటం అనుకుంటాడు రాజ్.
పదండి వెళ్లి అప్పు పెళ్లి చూద్దాం అంటుంది కావ్య. వేరే దారి లేక మళ్ళీ మండపానికి బయలుదేరుతాడు రాజ్. కావ్య, రాజ్ బయటి నుంచి రావడం గమనిస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. ఈ పెళ్లి అయిపోతే చాలు ప్రశాంతంగా ఉంటుంది అంటుంది ధాన్యలక్ష్మి. నాకెందుకో కుడి కన్ను అదురుతుంది అంటుంది రుద్రాణి. ఆ మాటలకి రుద్రాణిపై కోప్పడుతుంది ధాన్యలక్ష్మి. మరోవైపు పెళ్లి పీటల మీదకి పెళ్లికూతురుని తీసుకురమ్మని చెప్తారు పంతులుగారు.

అంతలోనే స్వప్న అప్పు కనిపించడం లేదు అనుకుంటూ మండపంలోకి వస్తుంది. అందరూ ఒక్కసారిగా కంగారు పడతారు. అంతా నేననుకున్నట్లే జరుగుతుంది ఇంక అప్పు నీ కోడలు అయిపోయినట్లే అని ధాన్యలక్ష్మి ని కంగారు పెడుతుంది రుద్రాణి. కావ్య కంగారుగా రాజ్ దగ్గరికి వస్తుంది. నేను నీ ఎదురుగుండానే ఉన్నాను కదా అలా చూస్తావ్ ఏంటి అంటాడు రాజ్. అప్పుడే రుద్రాణి కళ్యాణ్ కూడా ఇంట్లో లేడని సెక్యూరిటీ ద్వారా తెలుసుకొని ధాన్య లక్ష్మికి చెప్తుంది.
అప్పు ని వెతకడం కోసం అందరూ బయలుదేరుతుంటే ధాన్యలక్ష్మి ఆపి మీరిద్దరే అప్పుని మండపం దాటించారు, లేదంటే ఈ సమయంలో బయటికి వెళ్లవలసిన అవసరం ఏమిటి, అక్కడ కళ్యాణ్ కూడా కనిపించడం లేదంట ఇంకేముంది ఇద్దరూ కలిసి వెళ్ళిపోయి ఉంటారు అంటుంది. మొత్తానికి మూడో కూతుర్ని కూడా మా ఇంటి కోడల్ని చేసేస్తే లెక్క సరిపోతుంది అన్న కనకం ప్లాన్ వర్క్ అవుట్ అయింది అని వెటకారంగా మాట్లాడుతుంది రుద్రాణి. ధాన్యలక్ష్మి, రుద్రాణి కావ్య గురించి తప్పుగా మాట్లాడుతుంటే వాళ్ళని మందలిస్తాడు రాజ్.

నా కూతురు అలాంటిది కాదు, ఇంటి పరువు తీసే పని తను ఎప్పటికీ చేయదు ఎక్కడో ఏదో జరిగింది అంటాడు కృష్ణమూర్తి. అప్పు ని వెతకటం కోసం బయలుదేరుతారు రాజ్, కావ్య. మరోవైపు అప్పు కిడ్నాప్ కి గురవుతుంది, నన్ను ఎవరు ఇలా కట్టేశారు అని అడుగుతుంది అప్పు. అనామిక మాట్లాడుతూ నేనే ఆ పని చేశాను, నన్ను అందరి ముందు దోషిని చేసి నిలబెట్టారు అలా చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను, నా మెయిన్ టార్గెట్ నువ్వే అంటుంది.
నన్ను కిడ్నాప్ చేసావని తెలిస్తే మళ్లీ జైలుకు వెళ్తావు అంటుంది అప్పు. నేను అనుకున్న పని జరిగిన తర్వాత జీవితాంతం జైల్లో ఉన్న నాకు పరవాలేదు అంటుంది అనామిక. నన్ను కిడ్నాప్ చేయడం వల్ల నీకు వచ్చిన లాభం ఏమిటి అంటుంది అప్పు, నీ పెళ్లి ఆగిపోయింది అది నా మొదటి విజయం, ఇక మండపం లో ఉన్న వాళ్ళందరూ నువ్వు,కళ్యాణ్ లేచి వెళ్లిపోయారని అనుకుంటారు, మీ గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటారు అంటుంది అనామిక.
తరువాయి భాగంలో మండపం లో ఏడుస్తూ కూర్చున్న కనకాన్ని నానా మాటలు అంటుంది రుద్రాణి. అప్పుడే ఆమెని మందలిస్తూ ఒక వాయిస్ వినిపిస్తుంది. అందరూ షాకై అటువైపు చూస్తారు.


Click it and Unblock the Notifications











