Brahmamudi August 5th Episode: కావ్య నిర్ణయంతో షాక్ లో దుగ్గిరాల ఫ్యామిలీ.. పిచ్చోడిలా రాజ్
Photo Courtesy: JioHotstar
ప్రెగ్నెంట్ అని తెలియడంతో ఆ శుభవార్తను ఇంట్లో వాళ్లకి ఎలా చెప్పాలో తెలియక తల్లడిల్లిపోతుంది కావ్య. ఇంతలో అప్పూ రావడంతో ఆమెను గట్టిగా హత్తుకుని తాను గర్భవతినని చెప్పి ఏడుస్తుంది. అందరికీ చెప్పాల్సిన విషయమే కదా ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది అప్పూ. ఆయన నాకు ప్రపోజ్ చేయడానికి వస్తున్నారని.. ఇలాంటి టైంలో నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే దానికి ఎవరు కారణం అని అడుగుతారని అంటుంది కావ్య. అప్పుడు ఆయనకు నిజం చెప్పలేను.. నిజం చెబితే ఆయన ప్రాణాలకే ప్రమాదమని చెబుతుంది.
రేవతి కొడుకుని తీసుకుని స్టేషన్‌కు వెళ్తుండగా రాహుల్ ఫాలో అవుతుండటాన్ని అప్పూ గమనించి అతనికి దొరక్కుండా ప్లాన్ చేస్తుంది. రాజ్ ఇంటికొచ్చి కావ్యకి ప్రపోజ్ చేయగా.. ఆయనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కావ్య తేల్చి చెబుతుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 5వ తేదీ ఎపిసోడ్ 792లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్ ప్రపోజ్ చేశాక కావ్య నో చెప్పడంతో ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. నేనేమో జోక్స్ వేయడం లేదని నిజంగానే నాకు ఈ పెళ్లి ఇష్టం తేల్చిచెబుతుంది కావ్య. ఎందుకు ఇష్టం లేదని ఇందిర, అపర్ణ నిలదీయడంతో అన్నింటికి కారణాలు చెప్పలేనని అంటుంది కావ్య. ఆయన పెళ్లి చేసుకుంటానంటే నేను తలదించుకుని తాళి కట్టించుకోవాలా అని ప్రశ్నిస్తుంది. ఇందిర నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుండగా రాజ్ అడ్డుకుంటాడు. ఇది నాకు, కళావతి గారికి సంబంధించిన విషయమని.. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని అంటాడు రాజ్. అది అలా మాట్లాడుతుంటే చూస్తూ ఎలా ఉండమంటావు రా అని అడుగుతుంది అపర్ణ.
మీరెవ్వరూ కలిసి బలవంతంగా ఒప్పించడం నాకు ఇష్టం లేదని దయచేసి మీరెవ్వరూ మాట్లాడొద్దని అంటాడు రాజ్. ఇది మీ జీవితం, మీ పెళ్లి గురించి డెసిషన్ తీసుకునే హక్కు ఎవరికీ లేదని అంటాడు రాజ్. మీకు ఇష్టం లేకుండా మీ జీవితంలోకి ఎందుకు వస్తానని అంటాడు రాజ్. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ కన్నీరు పెడుతుంది. నేను అడిగే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి అంటాడు. నేను మీ వెంట పడుతుంటే నేనంటే మీకు ఇష్టమేమో అనుకున్నానని చెబుతాడు రాజ్. నేను చేసిన తప్పేంటీ అని రాజ్ నిలదీస్తాడు.
మిమ్మల్ని కేవలం ఫ్రెండ్ అనే అవన్నీ చేశానని అంటుంది కావ్య. ఫ్రెండ్స్‌ని ఎవరూ సాయం అడగరా? మీరూ అందరి లాంటి వారు కాదని క్లోజ్‌గా ఉన్నానని.. కానీ చివరికి మీరు కూడా అందరి లాంటి మగాడేనని అనిపించుకున్నారని చెబుతుంది కావ్య. నా ఇష్టం ఏంటో తెలుసుకోకుండా నా ఫ్యామిలీ ముందు నిలదీసే హక్కు మీకు ఎవరిచ్చారని అంటుంది కావ్య. అసలు మీరు ఇలా మాట్లాడరని, ఏదో జరిగిందని నిజం చెప్పమని రాజ్ అంటాడు. మీ మనసు బాధ పెట్టినందుకు క్షమించండి.. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వేరే దారి లేదని కావ్య మనసులో అనుకుంటుంది. నేను ముందు నుంచి ఇలాగే ఉన్నాను.. మధ్యలో ఏం మారలేదని అంటుంది కావ్య.
నా చుట్టూ తిరిగింది, సాయం చేస్తానని ముందుకు వచ్చింది మీరు మధ్యలో నాకేం సంబంధం లేదని తేల్చేస్తుంది కావ్య. ఆ మాటలతో అపర్ణ రగిలిపోతూ.. కావ్యను లాగి కొట్టబోతుండగా రాజ్ అడ్డుకుంటాడు. బయటివాళ్ల కోసం నా మీద చేయి ఎత్తుతారా? ఆయన్నే నెత్తి మీద పెట్టుకుని ఊరేగండి అంటుంది. మరోసారి ప్రేమ, పెళ్లి అని నా వెంట పడితే నేను ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలతో రాజ్ ఏడుస్తూ వెళ్లిపోతాడు.. రాజ్ వెళ్లిపోగానే కావ్య బెడ్‌రూంలో ఏడుస్తుంది.
రాజ్ ప్రపోజ్ చేస్తే కావ్య రిజెక్ట్ చేసిందన్న విషయాన్ని యామినికి రుద్రాణి చెబుతుంది. ఆ మాటలతో యామిని ఖుషీ అవుతుంది. కావ్యకి రాజ్ జీవితంలో ప్రపోజ్ చేయడని.. ఇక రాజ్ నీ సొంతం అయిపోయినట్లే అంటుంది. కావ్య ఇచ్చిన ట్విస్ట్‌కి నా తల తిరిగిపోయిందని చెబుతుంది రుద్రాణి. అయినా మనం ఆ కావ్యని తేలిగ్గా తీసుకోవద్దని, సడెన్‌గా ఎందుకిలా మారిపోయిందో తెలుసుకోవాలని రుద్రాణికి చెబుతుంది యామిని. ఆ వెంటనే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేస్తుంది యామిని. బావ నాకే సొంతమని, ఇక మీరు నాకు సపోర్ట్ చేయాలని అడగటంతో రఘునాథ్ సరేనని అంటాడు.
అప్పూని ఫాలో అయ్యే ప్లాన్ ఫెయిల్ కావడంతో రాహుల్ బాధపడుతూ ఇంటికి రావడంతో రుద్రాణి ఏం జరిగిందని అడుగుతుంది. నువ్వు ఫాలో అవుతున్న విషయం అప్పూకి తెలిసిపోయి చెకింగ్ పేరుతో నిన్ను డైవర్ట్ చేసిందని అంటుంది రుద్రాణి. నువ్వు అక్కడ ఫెయిల్ అయినా, నేనిక్కడ సక్సెస్ అయ్యానని చెబుతుంది. రాజ్- కావ్యల విషయాన్ని చెబుతుంది రుద్రాణి. ఆ మాటలతో రాహుల్ షాక్ అవుతాడు. ముందు ఆ కావ్య ఎందుకు అలా బిహేవ్ చేసిందో కనుక్కోవాలని చెబుతుంది.
స్వరాజ్‌ను రేవతికి అప్పగించి వెళ్లిపోతుంది అప్పూ. ఆ వెంటనే బాబు.. నేను గుడిలో తప్పిపోయానా? అని రేవతిని అడుగుతాడు. తప్పిపోవడం నాకు బాగా నచ్చిందని, నా ఫ్రెండ్ వాళ్ల ఇంటికి తీసుకెళ్లిందని, వాళ్లంతా బాగా చూసుకున్నారని జరిగినదంతా చెబుతాడు స్వరాజ్. నేను ఎంత అల్లరి చేసినా ఎవ్వరూ ఏమీ అనలేదని, నువ్వు ఫోన్ చేయకపోతే.. నేను అక్కడే ఉండేవాడినని బాబు చెప్పడంతో రేవతి కంటతడి పెడుతుంది. నేను ఆ ఒక్క తప్పు చేయకపోయుంటే.. నువ్వు అక్కడే ఉండేవాడివని అనుకుంటుంది రేవతి. మా ఫ్రెండ్ వాళ్ల ఫ్యామిలీలా మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండేదని అంటుంది రేవతి. నాకు అమ్మమ్మ లేదా? అని బాబు అడగటంతో రేవతి, జగదీష్‌లు కంటతడి పెడతారు.
కావ్య మాటలతో రాజ్ ఏడుస్తాడు. అతనిని ఇందిర, రుద్రాణిలు ఓదారుస్తారు. తనే జీవితమని అనుకున్నానని.. ఇప్పుడు తను నో చెప్పేసరికి తట్టుకోలేకపోయానని అంటాడు రాజ్. యామిని వాళ్లు నన్ను ఎంత బాగా చూసుకున్నా నేను మాత్రం కళావతినే లైఫ్ పార్ట్‌నర్ అనుకున్నానని చెబుతాడు. తన మనసులో అనిపించినట్లే, తనకు ఉంటుందని.. తన వల్ల ఓ ఫ్యామిలీ దొరికిందని సంబరపడిపోయానని అంటాడు రాజ్. మీ ఇద్దరికి ఆ దేవుడు ఎప్పుడో రాసిపెట్టాడని ఇందిర, అపర్ణలు చెబుతారు. నువ్వంటే ఎందుకు ఇష్టం లేదని చెప్పిందో మాక్కూడా అర్ధం కావడం లేదని అంటుంది అపర్ణ. నువ్వెంతగా ఇష్టపడ్డావో తను కూడా అంతే ఇష్టపడిందని చెబుతుంది ఇందిర. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










