Brahmamudi August 6th episode: కిడ్నాప్ చేసావని తెలిస్తే మళ్లీ జైలుకు.. రుద్రాణికి అప్పు వార్నింగ్

అప్పు ఇంకా కళ్యాణ్ ని ప్రేమిస్తుందని తెలుసుకున్న స్వప్న కళ్యాణ్ ని పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఎవరికోసం త్యాగం చేస్తున్నావంటూ చివాట్లు పెడుతుంది. కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకొని అప్పుని ఎలాగైనా ఒప్పించి తనతో తీసుకురావడానికి బయలుదేరుతాడు. ఇంతలో అప్పు పెళ్లి మండపంలో కనిపించకపోవడంతో కళ్యాణ్ తో లేచిపోయిందని గొడవ చేస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 6వ తేదీ ఎపిసోడ్ 481లో ఏం జరిగిందంటే..

తనని ని కిడ్నాప్ చేసిన అనామిక తో నన్ను కిడ్నాప్ చేసి దొరికిపోతే పోలీసులు ఊరికే వదలరు, నన్ను కిడ్నాప్ చేయడం వలన నీకు వచ్చే లాభం ఏమిటి అంటుంది అప్పు. నాకు ఏమీ లాభం లేకపోవచ్చు కానీ నీ గురించి అందరూ తప్పుగా మాట్లాడుకుంటారు, ఈ పెళ్లి ఆగిపోతే నువ్వు లేచిపోయావు అంటూ నీ క్యారెక్టర్ మీద మచ్చపడుతుంది నాకు అది చాలు, ఇలాంటి క్యారెక్టర్ లేని దాన్ని దుగ్గిరాల వాళ్ళు ఇంట్లోకి కూడా రానివ్వరు, అప్పుడు కళ్యాణ్ జీవితాంతం ఒంటరిగా ఉంటాడు నాకది చాలు అంటుంది అనామిక. మరోవైపు అప్పు ని వెతుకుతున్న రాజ్ దంపతులకు అప్పు కనిపించకపోవడంతో కంగారు పడతారు.

Brahmamudi serial August 6th 2024 Episode of 481 Here is full story

రాజ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఎక్కడ ఉన్నా నేను వెళ్లి అప్పుని తీసుకు వస్తాను అంటుంది కావ్య. ఇంత మహాపట్టణంలో ఎక్కడని వెతుకుతావు, కొంచెం సమయం ఇవ్వు పోలీసులే వెతుకు తీసుకు వస్తారు అంటాడు రాజ్. కానీ అంత సమయం కూడా మీ పిన్ని వాళ్ళు నా కుటుంబానికి ఇవ్వడం లేదు ఇప్పటికే మా అమ్మ నాన్న తలవంచుకొని కూర్చున్నారు ఇలా జరుగుతుందని తెలిసే మిమ్మల్ని పెళ్లి ఆపకుండా చేశాను అంటుంది కావ్య. సరే జరిగిపోయిందాని గురించి ఇప్పుడు ఎందుకు కొంచెం సమయం ఇవ్వు అప్పు ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి అందరి నోర్లు మూయిస్తాను అంటాడు రాజ్.

మరోవైపు కారులో కళ్యాణ మండపానికి వస్తున్న కళ్యాణ్ కి దారిలో స్పృహ కోల్పోయి ఉన్న బంటీ కనిపిస్తాడు. అతని దగ్గరికి వెళ్లి అతడికి స్పృహ వచ్చేలాగా చేసి ఏం జరిగింది అని అడుగుతాడు. అనామిక అప్పు ని కిడ్నాప్ చేసిందని ఎలాగైనా రక్షించమని అడుగుతాడు బంటి. మరోవైపు మండపంలోకి వచ్చిన రాజ్ దంపతులని అప్పు ఏది అని అడుగుతారు ధాన్యలక్ష్మి, రుద్రాణి. అప్పు ని దాచిపెట్టి వచ్చారా లేదంటే పెళ్లి జరిపించేసి వచ్చారా అని కోపంగా అడుగుతుంది ధాన్యలక్ష్మి.

అలా మాట్లాడుతున్నందుకు ఆమెకి అందరూ చివాట్లు పెడతారు. జరుగుతున్నదంతా చూస్తూ కన్నీరు పెట్టుకుంటుంది కనకం. నువ్వు ఎందుకు ఏడుస్తావు,నీ కూతురు బానే ఉంటుంది నా ఖర్మ కాలితే నా ఇంటి కోడలై తిరిగివస్తుంది అంటుంది ధాన్యలక్ష్మి. అప్పు కళ్యాణ్ ఇద్దరు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు ఒకేసారి మాయమైపోయారు అంటే లేచిపోయారనే కదా అంటుంది రుద్రాణి. ఈ మాటలు అన్నీ వింటున్న పెళ్ళికొడుకు కోపంతో రగిలిపోతాడు.

ఎంతసేపూ మీ గొడవేగాని నా గురించి ఎవరు ఆలోచించరా, ఎంతమంది ఎన్ని చెప్తున్నా నమ్మకుండా ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను, ఈ పెళ్లి ఆగిపోవడమే మంచిది అంటూ అప్పు గురించి తప్పుగా మాట్లాడి అక్కడినుంచి వెళ్ళిపోతారు పెళ్ళికొడుకు కుటుంబ సభ్యులు. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఇందిరా దేవి మాట్లాడుతూ ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా, మీరు ఆడవాళ్లేనా అని ధాన్యలక్ష్మికి, రుద్రాణి కి చివాట్లు పెడుతుంది.

మాట్లాడితే ముసుగేసుకుని పెళ్లి చేసుకుందని కావ్య ని అంటున్నావు ఆ పెళ్లి చేసింది నీ పక్కనే ఉన్న రుద్రాణి అని నీకు తెలియదా అని ధాన్యలక్ష్మిని తిడుతుంది, సప్న గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు పెళ్లి పీటల మీద నుంచి తనని మాయమాటలతో లేపికెళ్ళిపోయిన నీ కొడుకు తప్పులు గురించి నన్ను మాట్లాడమంటావా, ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు నీలాగా ఆ గుట్టంతా బయట పెట్టమంటావా అని అడుగుతుంది.

తరువాయి భాగంలో రుద్రాణి ధాన్యలక్ష్మితో మాట్లాడుతూ ఈపాటికి అప్పు పెళ్లి నీ కొడుకుతో జరిగిపోయే ఉంటుంది అంటుంది. మరోవైపు అనామిక పెళ్లి పందిట్లో జరిగిందంతా తెలుసుకుని పెళ్లి కొడుకు వాళ్ళు ఈ పెళ్లి వద్దు అని వెళ్ళిపోయారంట అని అప్పుతో ఆనందంగా చెప్తుంది. మూడో దాన్ని కూడా ఇంటి కోడల్ని చూస్తే లెక్క సరిపోతుందని ఎత్తు వేశావు అని కనకాన్ని దెప్పుతుంది రుద్రాణి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X