Brahmamudi August 6th Episode: నేను తల్లిని కాబోతున్నా.. నా కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు? కావ్య షాకింగ్‌గా
Photo Courtesy: JioHotstar
తన ప్రేమను కావ్య రిజెక్ట్ చేయడంతో రాజ్ తట్టుకోలేకపోతాడు. నేను మిమ్మల్ని ఇష్టపడలేదని.. ఓ ఫ్రెండ్‌గా సాయం అడిగానని, మీరే ఏదో ఊహించేసుకున్నారని కావ్య చెబుతుంది. ఆ మాటలతో అపర్ణ కోపంతో రగిలిపోతూ కావ్యను కొట్టబోతుండగా రాజ్ అడ్డుకుంటాడు. తనను బలవంతం చేయొద్దని, నేనే వెళ్లిపోతానని చెబుతాడు రాజ్. రాజ్ ప్రపోజ్ చేస్తే కావ్య రిజెక్ట్ చేసిన విషయాన్ని యామినికి చెబుతుంది రుద్రాణి. ఆ సర్‌ప్రైజ్‌తో యామిని సంబరాలు చేసుకుంటూ తన తల్లిదండ్రులను పెళ్లికి ఏర్పాట్లు చేయమంటుంది.
రేవతికి స్వరాజ్‌ను అప్పగించి వెళ్లిపోతుంది అప్పూ. నాకు మా ఫ్రెండ్ వాళ్ల ఇల్లు బాగా నచ్చిందని, అక్కడే ఉండిపోవాలని అనిపించిందని చెబుతాడు పిల్లాడు. నాకు అమ్మమ్మ లేదా? అని స్వరాజ్ అడగటంతో రేవతి కన్నీటి పర్యంతమవుతుంది. తన ప్లాన్ ఫెయిల్ కావడంతో రాహుల్ బాధగా ఇంటికి రావడంతో రుద్రాణి ఏం జరిగిందని అడుగుతుంది. రాహుల్ జరిగినదంతా చెప్పడంతో రుద్రాణి లైట్ తీసుకుని కావ్య - రాజ్‌ల విషయాన్ని కొడుక్కి చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 6వ తేదీ ఎపిసోడ్ 793లో ఏం జరిగిందంటే?

ఈ రోజు అడగ్గానే ఒప్పుకొంటుందని అందరం ఆశపడ్డాం. మీరిద్దరూ కలిసిపోతారని అందరం అనుకొన్నాం అని అపర్ణ అంటే.. చివరకు మీరు కూడా నాలానే మోసం పోయారు కదా.. అది మోసం ఎలా అవుతుంది? తన ఎవరితో కలిసి ఉండాలి. తను ఎవరితో బతకాలి అనే తన ఇష్టం. తనేదో సాయం అడిగితే అదే ప్రేమ అనుకొన్నాను. నాలుగు మాటలు నవ్వుతూ మాట్లాడుతుంటే.. ప్రేమ అని పిచ్చిగా నమ్మేశాను. ముందు నుంచి ఆమె క్లారిటీతోనే ఉంది. నేనే కలల్లో బతికేశాను. ఈ రోజు అందరి కలలకు బాధ్యుడినయ్యాను. అందుకే దేవుడు యాక్సిడెంట్ రూపంలో ప్రేమను చెరిపేసి.. తను నాకు దక్కేలా చేశాడు. నేను చూపించే ప్రేమ కళావతికి కనిపించడం లేదు అని
దానితో మేము అందరం మాట్లాడుతాం.. ఇలా ఎందుకు చేసిందో కనుక్కొంటాం మనవడా అంటూ అమ్మమ్మ అంటే..నాలుగు తగిలిచ్చి పెళ్లికి ఒప్పిస్తాం అని అంటే.. రికమండేషన్ చేస్తే ఆఫీస్‌లో స్థానం దొరకుతుందో.. కానీ.. మనసులో స్థానం దొరకదు. మనం ఇష్టం లేకుంటే షర్ట్ వేసుకోం. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండలేం. అలా తనను బాధపెట్టలేం అమ్మ.. ఇప్పటి వరకు గతమే లేదనుకొన్నాను. భవిష్యత్ లేదని ఇప్పడే తెలిసింది అని రాజ్ బాధగా అంటూ తల్లిని
తనకు ఇష్టం లేదని చెప్పిన తర్వాత తనను ఇంకా బాధపెట్టలేదు. అది నాకు ఇష్టం లేదు అని రామ్ అంటే.. ఇందుకు కారణం కావ్య.. దానిని నిలదీద్దాం అంటూ రామ్ తల్లి, అమ్మమ్మ్ వెళ్లారు. కావ్య ఏడుస్తుంటే.. చేసిందంతా చేసి.. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావా? అంటూ అపర్ణ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు నీ గురించి ఏమనుకొంటున్నావు? నీవు ఏం చేసినా భరిస్తున్నామని అనుకొంటున్నావా? అని అమ్మమ్మ గట్టిగా మందలించింది. ఏమైందే నీకు.. వాడి ప్రేమ కోసం ఇన్నాళ్లు తపించావు. చివరకు వాడు నీ వద్దకు వచ్చేసరికి వాడిని అవమానించావు అని రామ్ తల్లి అంటే.. వాడికి గతం గుర్తుకు చేస్తే ప్రాణాలకు ప్రమాదం. నీకు వచ్చిన సమస్య ఏంటి? నీవు ఇలా ఎందుకు చేశావు అని అమ్మమ్మ మందలించింది.
నా కారణాలు నాకు ఉన్నాయి అమ్మమ్మ అంటే.. అవి ఏంటి? అంటే.. మా దగ్గర దాచేంత విషయాలు ఏమున్నాయి? అంటే.. చెప్పలేని విషయమే కాబట్టే అక్కడ చెప్పలేదు. అందుకే ఆ రహస్యం అయింది. ఇంతకంటే నన్ను ఎక్కువ అడగండి కావ్య అంటే.. అసలు నీవు ఏం చేస్తున్నావో నీకు తెలుసా? నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకొంటున్నావు. నీవు మాట్లాడిన మాటలకు వాడి మనసు విరిగిపోయింది. వాడు ఎంత బాధపడుతూ వెళ్లిపోయాడో తెలుసా? వాడు నీ ప్రేమను ఒప్పుకొనేలా చేసి.. అందర్ని నటింపజేసేలా చేశాడు. ఇంతవరకు తీసుకొస్తే.. నీవు ఇలా చేస్తావా? నీవు నోరు తెరిచి నిజం చెప్పే వరకు నిన్ను వదలిపెట్టం అంటూ కావ్యను రాజ్ తల్లి, అమ్మమ్మ క్లాస్ పీకారు. వాడిని అంతలా అవమానించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ప్రశ్నించారు.
ఆ విషయం నేను చెప్పలేను అమ్మమ్మ.. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టలేను అంటూ కావ్య చేతులు జోడించింది. ఇప్పటివరకు ఆడిన డ్రామాలు చాలూ.. వాడే దూరం అవుతున్నాడని తెలిసిన తర్వాత నిజాలు దాచిపెట్టడంలో అర్ధం లేదు అంటూ రాజ్ తల్లి వార్నింగ్ ఇచ్చింది. ఏం జరిగితే అది జరిగింది. ఇప్పుడే వెళ్లి వాడికి నిజం చెప్పి.. వాడు మరిచిపోయిన గతాన్ని గుర్తు చేసి.. వాడిని తిరిగి ఇంటికి తీసుకొస్తాను. వాడికి ప్రాణం పోసిన తల్లిని. నిజంగా వాడికి ఏదైనా జరిగితే.. నేను తట్టుకోలేను. నా ప్రాణం పెట్టైనా వాడిని కాపాడుకొంటాను అంటూ రాజ్ తల్లి అంటే.. దానికి కావ్య నోరు విప్పింది. నేను తల్లిని కాబోతున్నాను అత్తయ్య అంటూ అసలు విషయం బయపెట్టింది. దాంతో అందరూ షాక్ అయ్యారు.
ఏమంటున్నావే నీవు అని అత్త అడిగితే..అవును నేను తల్లిని కాబోతున్నాను అంటే.. ఓసి పిచ్చిదానా.. ఇలాంటి శుభవార్తను ఇలా చెబుతారా? అంటూ అమ్మమ్మ ప్రశ్నించింది. అసలు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టావు. ముందే చెబితే.. అందరికి చెప్పి పండగలా సెలబ్రేట్ చేసే వాళ్లం అని అంటే.. నేను కడుపుతో ఉన్న విషయాన్ని అతడితో ఎలా చెబుతాం అత్తయ్య అంటూ కావ్య కంటతడి పెడుతూ అడిగింది. దానికి కారణం ఎవరంటే ఎవర్ని చూపిస్తారు. కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం వాడే అని తెలియకపోయినా.. నీకు తెలుసు కదా.. అంటే.. అది కాదు అమ్మమ్మ.. ఆయన దృష్టిలో నేను పెళ్లికాని అమ్మాయిని.. ఒకవేళ ఈ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసినా.. రేపు బిడ్డ పుట్టిన తర్వాత ఆయనకు నిజం తెలియదా? నా కడుపులో పుట్టిన బిడ్డకు తండ్రి కాదని తెలుస్తుంది. అప్పుడు ఆ బిడ్డకు తల్లి ఎవరని అనుమానిస్తారు. కొడుకుపై ప్రేమతో క్షణికావేశంలో నిజం చెబితే..ఆయనకు ఏమైనా జరిగితే.. మీరు తట్టుకోగలరా? నిజం తెలిసిన తర్వాత మీరు అతడికి చెప్పగలరా? ఆయన ప్రేమను ఎలా అంగీకరించాలి? ఆయనను ఎలా పెళ్లి చేసుకోవాలి అని కావ్య ప్రశ్నల వర్షం కురిపించింది.
కడుపును ఎలా దాచిపెడుతావు. నెలలు పెరిగే కొద్ది కడుపు వచ్చిన విషయం తెలియదా? అని అపర్ణ అంటే.. ఇప్పుడు ఏం చెప్పినా అబద్దం అనిపిస్తుంది. నా కడుపులో బిడ్డకు తండ్రి అని చెబితే.. ఆయన ప్రాణాలకు ముప్పు. అందుకే ఆ విషయాన్ని దాచిపెట్టాను అని కావ్య అంటే.. అసలు ఎందుకు ఈ పరీక్షలు అంటూ అమ్మమ్మ బాధపడింది. అయితే వాడిని అలా వదిలేయొద్దు.. దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది అని అపర్ణ అంటే.. దీనికి ఒకటే పరిష్కారం.. నేను శాశ్వతంగా దూరంగా ఉండటమే అత్తయ్య అని కావ్య షాకింగ్ కామెంట్స్ చేయడంతో అపర్ణ, అమ్మమ్మ దిగ్బ్రాంతికి గురయ్యారు. ఇంటి కోడలిగా ఈ కుటుంబానికి వారసుడిని ఇవ్వడం నా బాధ్యత. ఈ విషయాన్ని ఆయనకు ఎప్పటికే చెప్పను. ఆయనకు ఎదురుపడను అంటూ కావ్య చెప్పింది.
గర్బవతిగా ఉన్న సమయంలో ఎవరికైనా భర్త ప్రేమ అవసరం. కానీ వాడి ప్రాణాలు కాపాడటానికి నీవు చాలా త్యాగం చేస్తున్నావు. నీ త్యాగం, పెద్ద మనసు ముందు.. మేము చాలా చిన్నవాళ్లం అయిపోయాం అంటు అమ్మమ్మ కావ్యతో అంటూ బాధపడింది. ఆ తర్వాత రాజ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ కావ్య బాధపడింది. గత అనుభవాలను గుర్తు చేసుకొంటూ ఆవేదన చెందింది. ఇదిలా ఉండగా రాజ్‌ను కారు గుద్దేసి వెళ్లిపోయింది. దాంతో రోడ్డుపై రాజ్ పడిపోయాడు.
బావ రామ్ రాకపోవడంతో అతడిని వెతకడానికి వెళ్తుంటే బేబీని ఆమె తల్లి ఆపింది. బావకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అంటూ అంటే.. బేబీ నీవు కంగారు పడకు. ఇంత రాత్రి బయటకు వద్దు. కామ్‌గా వెళ్లి పడుకో అంటూ తల్లి చెప్పడంతో బావకు ఏదైనా జరిగితే.. కావ్య పని చెబుతాను అంటూ బేబీ కామెంట్ చేసింది.
కావ్య అబద్దం ఆడటంపై ఇంటి సభ్యులు ఆగ్రహం చెందారు. ఇచ్చిన మాటను తుంగలో తొక్కడం మాకు తెలియదు. కాఫీ ఇచ్చి మేనేజ్ చేద్దామనుకొంటున్నావా? గతం మరిచిపోయిన రాజ్ నీకు దగ్గరై నీ ప్రేమను పొందాలనుకొన్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాడు. కానీ అతడి ప్రేమను నిరాకరిస్తావా? అంటూ అందరూ కావ్యను నిందించారు. అయితే రుద్రాణికి ఈ విషయం ఆనందాన్ని ఇచ్చింది. వాళ్లకు అవసరం లేదేమో.. కానీ నాకు కాఫీ ఇష్టమే అని చెప్పింది. కానీ నీకు ఇష్టమైన రాజ్‌తో అలా ఎందుకు చేశావు అంటే.. సమయం వచ్చినప్పుడు మీకు ఇష్టం లేకున్నా నేను చెబుతాను అంటూ కావ్య అక్కడి నుంచి వెళ్లిపోయింది. కావ్య అనుభవిస్తున్న పరిస్థితులను చూసి అమ్మమ్మ జాలి పడింది. ఇలాంటి పరిస్థితికి ఎవరికి రావొద్దని జాలి పడింది.
Photo Courtesy: JioHotstar


Click it and Unblock the Notifications










