Brahmamudi August 7th episode: ఎంత మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకొంటావు? రుద్రాణికి షాక్
కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకొని అప్పుని ఎలాగైనా ఒప్పించి తనతో తీసుకురావడానికి బయలుదేరుతాడు. ఇంతలో అప్పు పెళ్లి మండపంలో కనిపించకపోవడంతో కళ్యాణ్ తో లేచిపోయిందని గొడవ చేస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. అయితే అప్పు ని అనామిక కిడ్నాప్ చేస్తుంది. అది చూసిన బంటి విషయం కళ్యాణ్ కి చెప్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 7వ తేదీ ఎపిసోడ్ 482లో ఏం జరిగిందంటే..
ఇందిరా దేవి రుద్రాణి ని మందలిస్తూ నువ్వు మొగుడు వదిలేసిన ఆడదానివి, నిన్ను పెళ్ళికి పిలవడమే పాపం అంటూ చివాట్లు పెడుతుంది. మీ ఇద్దరు కలిసి ఒక ఆడపిల్ల మీద నిందలు వేసి ఈ పెళ్ళి ఆపేసారు. ఒకవేళ మీరు అనుకున్నట్టు కాకుండా ఆ అమ్మాయి ఏదైనా ప్రమాదం లో పడి తిరిగి ఇంటికి వస్తే అప్పుడు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు, పిల్ల కోసం ఏడుస్తున్న ఆ తల్లి గర్భశోకం మీ ఇద్దరినీ వదిలిపెట్టదు ఇది నేను పెడుతున్న శాపం కాదు గుడిలో దేవుడు అంతా చూస్తున్నాడు అంటూ ధాన్యలక్ష్మిని, రుద్రాణిని తిట్టిపోస్తుంది ఇందిరా దేవి. అపర్ణ కూడా వాళ్ళిద్దరికీ చీవాట్లు పెడుతుంది.

మరోవైపు పెళ్లి ఆగిపోయిందన్న విషయం తెలుసుకున్న అనామిక అప్పుతో ఆ విషయం ఆనందంగా చెప్తుంది. అప్పు అనామిక మీద కోప్పడుతుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి రౌడీలని కొట్టి అప్పుని సేవ్ చేస్తాడు. ఈరోజు తనని రక్షిస్తున్నావు కానీ ప్రతిరోజు తనని రక్షించుకోగలవా, ఎక్కడనుంచి ఏ ప్రమాదం వస్తుందో ఊహించగలవా అని కోపంగా అడుగుతుంది అనామిక. రక్షించుకుంటాను ఒక్కసారి నా మనిషి అన్న ఫీలింగ్ నాకు వస్తే వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి అప్పు ని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతాడు కళ్యాణ్.
మరోవైపు కళ్యాణ మండపంలో రుద్రాణి మాట్లాడుతూ నేను ఇంటికి బయలుదేరుతాను అంటుంది. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా అంటుంది ధాన్యలక్ష్మి. నువ్వు మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తావు ఈపాటికి అప్పుకి కళ్యాణ్ తో పెళ్లి అయిపోయి ఉంటుంది ఇంటికి వస్తే దిష్టి తీయాలి కదా ఆ ఏర్పాట్లు చేసుకుందాం పదా అని వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కళ్యాణ్ రుద్రాణి మీద కోప్పడతాడు, జరిగిందంతా అందరికీ చెప్తాడు.

జైల్లో ఉన్న అనామిక వచ్చి అప్పుని కిడ్నాప్ చేసిందంటే మేము నమ్మాలా అంటుంది రుద్రాణి. ఏం జరిగిందో మీరు చూశారా, నేను చూసాను అనామిక అప్పు అతని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళిపోతుంటే నేను వెంటపడ్డాను అని జరిగిందంతా చెప్తాడు బంటి. ఇప్పుడు మాట్లాడండి ధాన్యలక్ష్మి గారు ఇందాకటి నుంచి మా కుటుంబాన్ని ఎన్నెన్నో మాటలు అన్నారు, మీరు దుగ్గిరాల ఇంటి ఆడవాళ్ళు అయిపోయారు లేదంటే మిమ్మల్ని వదిలి పెట్టేదాన్ని కాదు అని చివాట్లు పెడుతుంది కనకం.
ఇందాకటి నుంచి మా అక్క చెల్లెల్ని, మా కుటుంబాన్ని ఎన్ని మాటలు అన్నారు ఈ ధాన్య లక్ష్మి గారు, మా అత్త. ఇప్పుడు వాళ్ళని ఏం చేయమంటారో చెప్పండి అమ్మమ్మ, తాతయ్య అని అడుగుతుంది స్వప్న. ఇప్పటికే వాళ్లు సిగ్గుతో చచ్చిపోతున్నారు వాళ్ళని వదిలేయ్ అక్క అంటుంది కావ్య. వదిలేయడమేమిటి కావ్య, వాళ్ళిద్దరు మూలంగానే పెళ్లి ఆగిపోయింది వాళ్ళిద్దరూ మూలంగానే పెళ్ళికొడుకు మనల్ని అన్ని మాటలు అని వెళ్ళిపోయాడు.

ఇప్పుడు దానిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని ఏడుస్తూ అడుగుతుంది కనకం. అప్పుడు రాజ్ మాట్లాడుతూ ఎవరి వల్ల నిందలు పడ్డాయో వాడే ఆ నిందలు చెరిపేసి అప్పు మెడలో తాళి కడతాడు అంటూ తాళి తీసుకొచ్చికళ్యాణ్ కి ఇస్తాడు. ఎవరు ఈ పెళ్లి ని ఆపుతారో నేను చూస్తాను అని చెప్పి కళ్యాణ్ కి ధైర్యం ఇస్తాడు. కళ్యాణ్ అప్పు మెడలో తాళి కడుతుంటే ధాన్యలక్ష్మి అడ్డుపడుతుంది. రాజ్ ధాన్యలక్ష్మిని అడ్డుకుంటాడు.
తరువాయి భాగంలో నేను అడిగినప్పుడు అప్పుని ప్రేమించడం లేదని చెప్పారు, ఇప్పుడు అప్పు మెడలో తాళి కట్టారు. మీరు నన్ను మోసం చేశారా, నా చెల్లెల్ని మోసం చేశారా అని కళ్యాణ్ ని అడుగుతుంది కావ్య. నాకు ఇష్టం లేకుండా ఈ అప్పు నా ఇంట్లోకి కోడలు గా ఎలా అడుగుపెడుతుందో నేను చూస్తాను అంటుంది ధాన్యలక్ష్మి. నేను అప్పుని తీసుకొని దూరంగా వెళ్లిపోతాను అంటాడు కళ్యాణ్.


Click it and Unblock the Notifications











