Brahmamudi August 7th Episode: కావ్యకి యామిని డైడ్‌లైన్.. దేనికైనా సిద్ధమంటూ అపర్ణ సై
Photo Courtesy: JioHotstar
తన ప్రేమను కావ్య నిరాకరించడంతో అపర్ణ, ఇందిరలు రాజ్‌ను ఓదారుస్తారు. మేమంతా కలిసి నీకు అండగా ఉంటామని చెబుతారు. తనే జీవితమని అనుకున్నానని, కానీ ఇలా చేస్తుందని అనుకోలేదని రాజ్ బాధపడతాడు. మేం కావ్యతో మాట్లాడి నీ ప్రేమను గెలిపిస్తామని ఇందిర, అపర్ణలు చెబుతారు. భర్త ప్రేమను నిరాకరించి గదిలో ఒంటరిగా బాధపడుతున్న కావ్యపై దుగ్గిరాల ఫ్యామిలీ రగిలిపోతుంది. అందరూ నానామాటలు అనడంతో తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని కావ్య బయటపెడుతుంది.
దాంతో ఫ్యామిలీ మొత్తం సంతోషిస్తుంది. ఈ విషయాన్ని అప్పుడే చెబితే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేవాళ్లం కదా అని అంటారు. ఆయన దృష్టిలో నేను పెళ్లి కానీ అమ్మాయినని, నేను తల్లిని కాబోతున్నట్లు తెలిస్తే నా కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు? అని ఆయనకు చెప్పాల్సి వస్తుందని అంటుంది కావ్య. అది ఆయన ప్రాణాలకు ప్రమాదమని భయపడుతుంది. నేను జీవితంలో ఆయనకు ఎదురుపడనని తేల్చిచెబుతుంది కావ్య. తన ప్రేమను కావ్య రిజెక్ట్ చేయడంతో బాధపడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రాజ్‌ని కారు ఢీకొట్టడంతో అతను కిందపడిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 7వ తేదీ ఎపిసోడ్ 794లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సీతారామయ్యకి కాఫీ ఇవ్వడానికి కావ్య వచ్చి వెళ్లిపోతుంది. ఈ ఇంట్లో అందరి కన్నా ఎక్కువగా నేను నిన్నే నమ్ముతానని, అయినా ఇలాంటి పనిచేస్తావా? అని సీరియస్ అవుతాడు. ఇందుకు కారణం కూడా నిన్ను అడగనని.. ఎందుకంటే అది పూర్తిగా నీ సొంత నిర్ణయమని చెబుతాడు సీతారామయ్య. నీ జీవితానికి సంబంధించిన విషయంలో మేం జోక్యం చేసేకోమని అంటాడు. మన జీవితం గాజు బొమ్మలాంటిది దానిని ఎంత బాగా కాపాడుకుంటే అంత బాగుంటుంది.. ఒక్కసారి చేజారిందంటే ముక్కలైపోతుందని అంటాడు సీతారామయ్య. నువ్వే ఏ ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నా నువ్వు చేసింది మాత్రం ఖచ్చితంగా తప్పేనని చెబుతాడు.
బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నావ్.. ఓ పక్క ఆ యామిని రాజ్‌ను ఎప్పుడెప్పుడు సొంతం చేసుకుందామా అని ఎదురుచూస్తోందని భయపడతాడు. నీ నిర్ణయంతో యామినికి మరో అవకాశాన్ని ఇచ్చావని.. ఎందుకిలా చేశావని నిలదీస్తాడు సీతారామయ్య. నా కడుపులో పెరుగుతున్న ఈ ఇంటి వారసుడి వల్లే నేను ఆయనకి నిజం చెప్పలేకపోయానని మనసులో అనుకుంటుంది కావ్య. నా దగ్గర దానికి కరెక్ట్ సమాధానం లేదని చెబుతుంది.
ఉదయాన్నే దుగ్గిరాల వారింటికి యామిని వచ్చి కావ్యను పిలుస్తూ నానా హంగామా చేస్తుంది. నువ్వు మా కుటుంబానికి చేసిన అన్యాయం చాలదా? మళ్లీ ఏం చేయడానికి వచ్చావ్? అని ఇందిర నిలదీస్తుంది. ఈ ఇంటికి కోడలిగా రావాల్సింది నేను.. అన్యాయం జరిగింది నాకు అని చెబుతుంది యామిని. రాత లేదని తెలిసి కూడా సిగ్గు లేకుండా నా కొడుకుని సొంతం చేసుకోవాలని అనుకుంటున్న నువ్వు నీతుల గురించి మాట్లాడతావా? అని మండిపడుతుంది అపర్ణ. ఇంతలో కావ్య వచ్చి ఎందుకొచ్చావ్ అని ఫైర్ అవుతుంది.
నేనేమీ ఇక్కడ కాపురం చేయడానికి రాలేదని, రాజ్ ఎక్కడ అని నిలదీస్తుంది యామిని. రాజ్ మా దగ్గర ఉండటం ఏంటీ? నిన్నే నీ దగ్గరికే బయల్దేరాడు కదా అని అంటుంది అపర్ణ. వస్తే నేను మీ ఇంటికి ఎందుకు వస్తానని మండిపడుతుంది యామిని. ఈ కావ్యకి తన మనసులో మాటను చెప్పి పెళ్లికి ఒప్పిస్తానని వచ్చినవాడు.. ఇంత వరకు ఇంటికి రాలేదని అడుగుతుంది. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కావ్య అన్న మాటలకు రాజ్ ఎటో వెళ్లిపోయినట్లుగా ఉన్నాడని అంటుంది రుద్రాణి.
అసలే రాజ్‌కి ఆవేశం ఎక్కువ.. తను అనుకున్నది జరగలేదని ఏం చేసుకున్నాడో? ఏంటో అని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. నిన్ను నమ్మి నీ దగ్గరికి పంపిస్తే.. నువ్వు చేసేది ఇదేనా అని ప్రశ్నిస్తుంది యామిని. మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు.. నా మీద కోపంతో రాజ్‌ను ఇలా చేస్తావా? అని ఫైర్ అవుతుంది. నాకు రాజ్ అంటే ప్రాణం.. ఆ ప్రాణానికి ఏమైనా అయ్యిందంటే నిన్ను, నీ ఫ్యామిలీని ఎవ్వరినీ వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది యామిని. 24 గంటల్లో రాజ్‌ను నాకు అప్పగించకపోతే నీ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తానని యామిని డెడ్‌లైన్ పెట్టడంతో అపర్ణ రగిలిపోతుంది.
రాజ్ నా కొడుకు, నా బిడ్డ.. ఎవరిని ఎవరికి అప్పగించాలని మండిపడుతుంది. నిజంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సింది? కంప్లయంట్ ఇవ్వాల్సింది మేం? నిన్ను జైల్లోకి పంపించి చిప్పకూడు తినిపించడానికి నాకు క్షణం కూడా పట్టదని ఫైర్ అవుతుంది అపర్ణ. నా బిడ్డకు ఏమైనా జరిగితే నువ్వు ప్రాణాలతో ఉండవని వార్నింగ్ ఇస్తుంది. యామినిని ఎందుకు రెచ్చగొట్టావ్ అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. రేపు రాజ్ రాగానే జరిగింది మొత్తం దానికి అతనికి తెలియజేస్తే ఏమవుతుంది? అని నిలదీస్తుంది. ఇప్పటి వరకు రాజ్ ప్రాణాల కోసం మనమంతా వెయిట్ చేశామని చెబుతుంది. నోరు జారి యామిని ఏదైనా మాట్లాడితే ఏంటి పరిస్ధితి అని ప్రశ్నిస్తుంది.
రాజ్ లవర్ బాయ్‌లా ఫీలై.. ఏమైనా చేసుకున్నాడా ఏమో అని రుద్రాణి చెప్పడంతో కావ్య కంగారుపడుతుంది. దీంతో రాజ్‌ను ఎంక్వైరీ చేయించమని సుభాష్‌కు చెబుతుంది ఇందిర. మీరేం కంగారు పడొద్దని నేను మా వాళ్లతో వెతికిస్తానని అప్పూ అంటుంది. అసలు కావ్య వల్లే ఇలా జరిగిందని.. తనెందుకు అలా మాట్లాడింది? ఒకసారి కనుక్కోమని అపర్ణతో సుభాష్ అంటాడు. కావ్య తల్లి కాబోతుందని ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పులేక రాజ్ మనసును గాయపరిచిందని బాధపడుతుంది అపర్ణ. ఇప్పుడు కావ్య సంగతి పక్కనపెట్టి ముందు రాజ్ ఎక్కడున్నాడో వెతికించండి అని చెబుతుంది ఇందిర.
రాజ్ ఫోటోని చూసుకుంటూ బాధపడుతున్న కావ్యని ఇందిర, అపర్ణలు ఓదారుస్తారు. వాడిని ప్రేమిస్తున్న విషయం చెప్పమని నెత్తి నోరు పెట్టుకుని మొత్తుకున్నానని అంటుంది అపర్ణ. నువ్వు తల్లివి కాబోతున్నందుకు ఆనందపడాలో? వాడి ప్రేమను రిజెక్ట్ చేసి ఎక్కడికో వెళ్లిపోవడానికి కారణమైనందుకు బాధపడాలో అర్ధం కావడం లేదని చెబుతుంది అపర్ణ. రాజ్ మనసు ఎంత గాయపడిందో ఏంటో? ఎక్కడికి వెళ్లిపోయాడో ఏంటో? అని అపర్ణ బాధపడుతుంది. దీనంతటికి కారణం నువ్వేనని అపర్ణ చెప్పడంతో కావ్య అత్తగారిని హత్తుకుంటుంది. ఇక్కడి వరకు వస్తుందని తెలిస్తే అసలు ప్రపోజ్ చేయించే దానిని కాదని తనను క్షమించమని అడుగుతుంది కావ్య.
ఆయన నెంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని.. ఆయన ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదని బాధపడుతుంది కావ్య. ఇంతలో కావ్యకి రేవతి ఫోన్ చేస్తుంది. రాజ్ నా దగ్గరే క్షేమంగా ఉన్నాడని చెప్పడంతో కావ్య సంతోషిస్తుంది. రాజ్ దొరికాడని వాళ్ల అక్క దగ్గరే ఉన్నాడని కావ్య చెప్పబోతుండగా రేణునా అని ఇందిర డైవర్ట్ చేస్తుంది. ముందు నేను వెళ్లి ఆయనను తీసుకొస్తానని పరుగు పరుగున వెళ్తుంది. దాంతో ఇంట్లో వాళ్లందరికీ డౌట్ వస్తుంది. ఓసారి ఇలాగే కన్నీళ్లతో వెళ్లి రాజ్‌కి యాక్సిడెంట్ జరిగిందని ఓ చేదువార్త తీసుకొచ్చిందని.. మళ్లీ ఇప్పుడు ఏ వార్త తీసుకొస్తుందోనని రుద్రాణి అనడంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. దాంతో ఇందిర వచ్చి రుద్రాణిని లాగి కొడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










