Brahmamudi August 8th episode: నన్ను మోసం చేశారా? నా చెల్లెల్ని మోసం చేశారా? కళ్యాణ్‌ను నిలదీసిన కావ్య.!
అప్పు పెళ్లి మండపంలో కనిపించకపోవడంతో కళ్యాణ్ తో లేచిపోయిందని గొడవ చేస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. అయితే అప్పు ని అనామిక కిడ్నాప్ చేస్తుంది. అది చూసిన బంటి విషయం కళ్యాణ్ కి చెప్తాడు. అప్పుడే ఆమె కుటుంబాన్ని నానా మాటలు అని అక్కడినుంచి వెళ్ళిపోతారు పెళ్ళికొడుకు అతని బంధువులు, అప్పుని కాపాడి తీసుకొచ్చిన కళ్యాణ్ ఆమె మెడలో తాళి కడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 8వ తేదీ ఎపిసోడ్ 483లో ఏం జరిగిందంటే..
తనకి ఇష్టం లేకుండా అప్పు మెడలో తాళి కట్టినందుకు కొడుకు మీద కేకలు వేస్తుంది ధాన్యలక్ష్మి, అప్పు ని నేను ఎప్పటికీ కోడలుగా ఒప్పుకోను, అసలు ఈ పెళ్లి చెల్లదు, ఇది అసలు వెళ్లే కాదు అంటూ అప్పు మెడలో తాళి తెంచేయబోతోంది ధాన్యలక్ష్మి. ఆమె చెంప పగలగొడతాడు ప్రకాష్. ఈ చెంప దెబ్బ అప్పు మీద నిందలు వేసినప్పుడే కొట్టి ఉంటే ఈరోజు ఈ కుటుంబం అందరి ముందు తలవంచేది కాదు నా కొడుకు కోర్టు మెట్లు ఎక్కేవాడు కాదు అని భార్యపై కోప్పడతాడు. అదేంటి తల్లికి కొడుకు మీద ఆ మాత్రం హక్కు ఉండదా అంటుంది రుద్రాణి.

నువ్వు నోరు విప్పావంటే ఊరుకోను,ఇంటి ఆడపడుచు హోదా ఇస్తే ఇంట్లోనే చిచ్చు పెడతావా నీవల్లే ధాన్యలక్ష్మి చెడిపోయింది ఎక్కువ మాట్లాడావంటే నిన్ను, నీ కొడుకుని ఇద్దరినీ ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను అంటాడు సుభాష్. కావ్య మాట్లాడుతూ ఏంటి కవి గారు ఇది నేను అడిగినప్పుడు పెళ్లి ఇష్టం లేదు అన్నారు ఇప్పుడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారు, మీరు చేసింది ఏమి బాగోలేదు అంటుంది కావ్య. ప్రతి విషయంలోనే నన్ను సపోర్ట్ చేసే మీరు ఈరోజు నేను చేసిన పనిని తప్పుపడుతున్నారా అంటాడు కళ్యాణ్.
ఇప్పుడు మీరు ఈ పెళ్లి చేసుకోవడం వలన లోకం ఇన్నాళ్లు వేసిన నిందలు నిజమవుతాయి, అప్పుని పెళ్లి చేసుకోవడం కోసమే మీరు అనామిక కి విడాకులు ఇచ్చారు అనుకుంటారు, ఇష్టం లేని కోడల్ని మీ అమ్మగారు బ్రతకనిస్తుందా డబ్బు కోసమే మా తల్లిదండ్రులు మా చెల్లెలు మీ ఇంటి కోడలు చేశారు అని అందరూ అంటారు. మేము పడుతున్న మాటలు చాలు, అప్పు కూడా మాటలు పడాలా అంటుంది కావ్య. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నా భార్యని తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటాడు కళ్యాణ్.

అలా అంటావేంటి అది మన ఉమ్మడి ఆస్తి నీకు మన ఇంట్లో ఉండే హక్కు ఉంది. నీకు పెళ్లి చేసింది నీ ప్రేమను గెలిపించాలని కానీ నిన్ను ఇంటి నుంచి దూరం చేసుకోవాలని కాదు అంటాడు రాజ్. అపర్ణ కూడా కళ్యాణ్ ని ఎక్కడికి వెళ్లదు అని చెప్తుంది. ఇష్టం లేని కోడలు ఇంట్లో అడుగుపెడితే ఎలా ఉంటుందో కావ్య వదినని చూసి తెలుసుకున్నాను ఆ బాధ అప్పు పడకూడదు అంటాడు కళ్యాణ్. నిన్ను అపురూపంగా పెంచుకున్నాము ఇప్పుడు నువ్వు బయటికి వెళ్లి ఎలా బ్రతుకుతావు అంటాడు ప్రకాష్.
కృష్ణమూర్తి దంపతులు మీరు ఉన్నంత స్వచ్ఛంగా లోకం లేదు మీరు బయటకు వెళ్లి ఎలా బ్రతుకుతారు మా ఇంట్లోనే ఉండిపోండి అంటారు. ఒక ఇంటికి దూరమయి మరో ఇంటికి దగ్గరైతే సమస్యలు మరింత పెద్దవి అవుతాయి అంతేకాదు ఇల్లరికం ఉండడం మా ఇంటికి గౌరవం కాదు, నా భార్య ని పోషించుకోలేనంత ఆ సమర్ధుడిని కాదు అంటూ భార్యను తీసుకొని బయటికి వెళ్లిపోతాడు కళ్యాణ్. రాజ్ కావ్య తో మాట్లాడుతూ వాడు వెళ్ళిపోతున్నాడు నువ్వు చెప్తే వింటాడు ఆపు అంటాడు.

ఈ విషయంలో నాకు సంబంధం లేదు, నేను ఆపను అంటుంది కావ్య. బయటికి వచ్చిన కళ్యాణ్, అప్పు ఇద్దరు జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఒకటి తెలిస్తే దేవుడు మరొకటి తలిచాడు అనుకుంటారు ఇద్దరు. సరే చీకటి పడుతుంది మనం ఎక్కడ ఉంటాం అంటుంది అప్పు. కళ్యాణ్ తన ఫ్రెండ్ కి షెల్టర్ కోసం ఫోన్ చేస్తాడు, కానీ అతను అనుకున్న పని అవ్వదు. సరే ఒక దారి ఉంది పదా అని తనతో పాటు కళ్యాణ్ ని తీసుకు వెళుతుంది అప్పు.
మరోవైపు ఇంట్లో అందరూ విచారంగా ఉండటం చూసి ఇది కదా నాకు కావాల్సింది, ఇప్పుడు ఒక ఇంటి వారసుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇంట్లో వాళ్లకి రాజ్ వాళ్ళ మీద కోపం తెప్పించాలి అనుకుంటూ ఎందుకు ఇంట్లో అందరూ అలా ఉన్నారు నేను, ధాన్యలక్ష్మి ఏదైతే అనుకున్నామో అదే జరిగింది, మన ఇంట్లో మగ పిల్లలందరినీ ఆ కనకం ఇంట్లో కట్ట పెట్టడానికే కన్నట్టు ఉన్నాము అని నిష్టూరంగా మాట్లాడుతుంది రుద్రాణి.
తరువాయి భాగంలో ఇష్టం లేదు, ఇష్టం లేదు అంటూనే చెల్లెల్ని తీసుకొచ్చిన నా కొడుక్కి అంటగట్టావు, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అని కావ్య మీద కేకలు వేస్తుంది ధాన్యలక్ష్మి. మరోవైపు రాజ్ భార్యతో మాట్లాడుతూ కళ్యాణ్ నువ్వు చెప్తే వింటాడు వాడిని ఒప్పించి ఇంటికి తీసుకు రా అంటాడు. ఈ విషయంలో మీ మాట వినలేను అంటుంది కావ్య. అప్పుడు నేను కూడా నీ మాట వినను అంటాడు రాజ్.


Click it and Unblock the Notifications











