Brahmamudi August 8th Episode: రాజ్ ముందు కావ్యని ఇరికించిన యామిని.. కళావతి నిర్ణయం ఏంటీ?

Photo Courtesy: JioHotstar

రాజ్ ప్రేమను నిరాకరించడంతో కావ్యపై సీతారామయ్య మండిపడతాడు. బంగారం లాంటి అవకాశాన్ని కాదనుకున్నావని, నువ్వు ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా ఇది మాత్రం తప్పేనని అంటాడు. రాజ్ కనిపించకపోవడంతో దుగ్గిరాల వారింటికి వచ్చి హంగామా సృష్టిస్తుంది యామిని. దాంతో రగిలిపోయిన అపర్ణ.. నా కొడుకుని మాకు కాకుండా చేశావని, నిన్ను జైలుకు పంపడం నాకు నిమిషం పని అని వార్నింగ్ ఇస్తుంది.

అసలే రాజ్‌కు కోపం ఎక్కువని.. కావ్య తన ప్రేమను రిజెక్ట్ చేసిందన్న బాధతో ఏమైనా చేసుకున్నాడా అని రుద్రాణి అనడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. తన గదిలో రాజ్ ఫోటోను చూస్తూ బాధపడుతున్న కావ్యని అపర్ణ, ఇందిర ఓదారుస్తారు. ఇంతలో రాజ్ గురించి భయపడొద్దని, నా దగ్గర క్షేమంగా ఉన్నాడని ఫోన్ చేసి చెబుతుంది రేవతి. భర్త క్షేమంగా తిరిగి రావడంతో అతని కోసం రేవతి ఇంటికి హడావుడిగా పరుగులు తీస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 8వ తేదీ ఎపిసోడ్ 795లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial August 8th 2025 Episode 795 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్య కంగారుగా ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో రాజ్‌కు ఏదైనా జరిగిందా అంటూ రుద్రాణి అంటుంది. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆమెపై విరుచుకుపడుతుంది. నా మనవరాలు కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లింది.. అక్కడ జరగరానిది జరిగిందని కాదు, నా మనవడు దొరికాడని అంటుంది ఇందిర. ఆ మాటలతో రుద్రాణి షాక్ అవ్వగా.. సుభాష్ చాలా సంతోషిస్తాడు. రాజ్ క్షేమంగానే ఉన్నాడని కావ్య ఫ్రెండ్ ఎవరో ఫోన్ చేసి చెబితే అది ఆగమేఘాల మీద వెళ్లిందని అపర్ణ అంటుంది. కావ్యకి ఫోన్ చేసి అడ్రస్ పెడితే మనం కూడా వెళ్దామని అంటాడు సుభాష్. దాంతో భయపడిన ఇందిర అడ్డుకుంటుంది.

నా మనవడు మనసు విరిగిపోయి కుమిళిపోతున్నాడని.. వాళ్లిద్దరినీ కాసేపు ఒంటరిగా వదిలేద్దామని చెబుతుంది ఇందిర. ఫ్యామిలీ మొత్తం ఆమె మాటలకు సరేనని అంటుంది. ఇక ఈ ప్రాబ్లమ్‌ని తెగేవరకు లాగడం సరికాదని, రాజ్‌కి నిజం చెప్పేద్దామని సుభాష్ చెప్పడంతో అంతా ఉలిక్కిపడతారు. కావ్య వాడి ప్రేమను యాక్సెప్ట్ చేయనందుకే రాజ్ అలా వెళ్లిపోయాడని, అలాంటిది మనమే వాడి నిజమైన పేరెంట్స్ అని తెలిస్తే తట్టుకోగలడా? అని ప్రశ్నిస్తాడు సుభాష్. ఆ మాటలతో టెన్షన్ పడ్డ రుద్రాణి.. వెంటనే ఈ విషయాన్ని యామికి చెప్పాలని అనుకుని మెల్లగా జారుకుంటుంది. రాజ్‌కి వాళ్లు నిజం చెబితే నీ జీవితం నాశనమేనని యామినిని హెచ్చరిస్తుంది రుద్రాణి. అక్కడి వరకు రాణిస్తే నేను యామినిని ఎందుకు అవుతాను.. ఏం చేయాలో? ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అని అంటుంది యామిని.

రేవతి ఇంటికి వచ్చిన కావ్య.. ఆయన ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అని అడుగుతుంది. రాజ్ మీ ఇంటికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడట కదా అని ప్రశ్నిస్తుంది రేవతి. నువ్వు తనతో పెళ్లి ఇష్టం లేదని కఠినంగా మాట్లాడావా? అని అడగ్గా అవును అని సమాధానం ఇస్తుంది కావ్య. నా తమ్ముడు గతం మరిచిపోయాడు.. తిరిగి ఇంటికి తీసుకురావాలని నాతో చెప్పావు కదా మళ్లీ ఇదంతా ఎందుకు చేశావ్? అని నిలదీస్తుంది రేవతి. నువ్వు అన్న మాటలనే తలచుకుంటూ రోడ్డు మీద వెళ్తుండగా రాజ్‌కి యాక్సిడెంట్ అయ్యిందని చిన్నగాయమే అయ్యిందని టెన్షన్ పడొద్దని అంటుంది రేవతి.

రాత్రి నేను, మా ఆయన కారులో వెళ్తుండగా ఓ కారు రాజ్‌ని గుద్దేసిందని మేమే కాపాడామని.. గాయాలేవీ కాకపోవడంతో తలకి చిన్న కట్టు కట్టి పంపించేశారని జరిగినది గుర్తుచేసుకుంటుంది. గాయపడిన రాజ్ మందులు వేసుకుంటూ ఉండగా.. ఇలా చేశావేంటీ తమ్ముడు? నీకు ఏమైనా అయితే నిన్ను నమ్ముకున్నవాళ్లు ఏమవుతారని రాజ్‌ని అడుగుతుంది రేవతి. ఓ కుటుంబం దూరమైతే ఎంత నరకం అనుభవించాలో మేం ప్రత్యక్షంగా చూస్తున్నాం.. దేవుడు మీకు మిమ్మల్ని ప్రేమించే ఫ్యామిలీని ఇచ్చాడు. ఇలాంటివన్నీ వదిలేసి వెళ్లిపోవాలని ఎందుకు అనిపించిందని జగదీష్ అడుగుతాడు.

మీరంతా అనుకున్నట్లు నేను ప్రాణాలు తీసుకోవాలని అనుకోలేదని.. కళావతి పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి తట్టుకోలేకపోయానని చెబుతాడు రాజ్. ఆ బాధలో వెళ్తుంటే అనుకోకుండా అలా జరిగిపోయిందని అంటాడు. వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెబుదామని రేవతి అడగ్గా.. రాజ్ వద్దంటాడు. కనీసం నువ్వు ఎక్కడున్నావన్న విషయం కళావతికి చెబితే.. తను సంతోషిస్తుందని చెబుతుంది. నేనే వద్దు అనుకున్నప్పుడు నన్ను తను పట్టించుకోదని రాజ్ బాధపడతాడు. కళావతికి నువ్వుంటే ఎంతో ఇష్టమని రేవతి అంటుంది. అదంతా నిజం కాదని తను కేవలం నన్ను స్నేహితుడిగానే చూసిందని బాధపడతాడు రాజ్.

మీకు కూడా నేను ఉండటం ఇబ్బంది అయితే ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోతానని రాజ్ చెప్పడంతో.. రేవతి మండిపడుతుంది. నువ్వు నా తమ్ముడివి, జీవితాంతం నాతోనే ఉన్నా నాకేం అభ్యంతరం లేదని రేవతి అంటుంది. రాజ్ నా దగ్గరే ఉన్న విషయాన్ని నీకు చెప్పొద్దని తమ్ముడు చెప్పడంతోనే నీకు ఫోన్ చేయలేదని కావ్యకి చెబుతుంది రేవతి. రాజ్ దగ్గరికి వెళ్లి కావ్య అరుస్తుంది. కళావతికి చెప్పొద్దని చెప్పాను కదా .. నీకు ఈ తమ్ముడి కంటే తనే ఎక్కువైందా? అని రేవతిపై రాజ్ మండిపడతాడు. మీరేమైనా సినిమాలలో హీరో అనుకుంటున్నారా? లవ్ ఫెయిల్ అయ్యిందని యాక్సిడెంట్ చేసుకోవడానికి అంటూ ఫైర్ అవుతుంది కావ్య.

మీరు రాత్రి నుంచి ఇంటికి రాలేదని యామిని చెప్పడంతో నేను చాలా టెన్షన్ పడ్డానని అంటుంది కావ్య. మీ మనసులో నా మీద ఇంత ప్రేముంటే ఎందుకలా మాట్లాడారు అని రాజ్ అడుగుతాడు. మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టే అందుకే ఇక్కడిదాకా వచ్చారని అంటాడు రాజ్. నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు.. మీరు ఎక్కడుంటే నాకెందుకు? మీ దారి మీది.. నా దారి నాది అని కావ్య బయటికి వెళ్లబోతూ ఆగిపోతుంది. నేను మీతోనే ఇంటికి వెళ్తానని కావ్య తేల్చి చెబుతుంది. మా అత్తయ్య, అమ్మమ్మల కోసం నేను తీసుకెళ్తానని అంటుంది కావ్య. రాజ్ రాను అంటున్నా కావ్య బలవంతంగా లాక్కెళ్లిపోతుంది.

కావ్య - రాజ్‌ల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతుంది. రాజ్ తలకి గాయం ఉండటంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. రాత్రంతా ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తున్నావని అందరూ అడుగుతారు. కావ్య వల్లే ఇదంతా జరిగిందని రుద్రాణి అనడంతో .. ఇంట్లో వాళ్లంతా నన్ను నిందించాలనే ఇలాంటి పని చేశారా అని రాజ్‌పై మండిపడుతుంది కావ్య. నీకు ఏమైనా జరిగితే మేం తట్టుకోలేమని దుగ్గిరాల ఫ్యామిలీ అంటుంది. మీరంతా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు.. కానీ నేను ప్రేమించిన మనిషి మాత్రం నా నుంచి దూరంగా వెళ్లిపోతోందని బాధపడతాడు రాజ్.

మీ అందరితో కలిసి ఇక్కడే ఉండిపోవాలని ఉందని, దానికి బంధం కావాలని .. దానిని కళావతి గారు మాత్రమే ఇవ్వగలరని అంటాడు రాజ్. ఆవిడ కాదు అనేసరికి తట్టుకోలేకపోయానని చెబుతాడు. తనెందుకు నో చెబుతుందో అర్ధం కాలేదని అంటుండగా ఇంతలో యామిని ఎంట్రీ ఇస్తుంది. నిన్ను కాదనుకున్న మనిషి కోసం నిన్ను ప్రేమిస్తున్న మనిషిని వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నావా అని నిలదీస్తుంది. నువ్వే ప్రపంచమని నమ్మానని.. నీతో జీవితాంతం కలిసుండాలని కలలు కన్నానని అంటుంది యామిని. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నానని.. కానీ ఇలా ప్రాణం మీదకి తెచ్చుకుంటానంటే మాత్రం ఊరుకునే దానిని కాదని చెబుతుంది. దానికి కారణమైన వాళ్లని కూడా వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది యామిని. మా బావని ఎందుకు వద్దు అనుకున్నావని కావ్యని నిలదీస్తుంది యామిని. అది ఎంత పెద్దదైనా సరే నేను సాల్వ్ చేస్తానని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X