Brahmamudi August 9th episode: రుద్రాణిపై ఇందిరా దేవి ఫైర్.. కావ్య కుటుంబాన్ని సపోర్ట్ చేసిన అపర్ణ!
అప్పుని అనామిక కిడ్నాప్ చేస్తుంది. అది చూసిన బంటి విషయం కళ్యాణ్ కి చెప్తాడు. అప్పుడే ఆమె కుటుంబాన్ని నానా మాటలు అని అక్కడినుంచి వెళ్ళిపోతారు పెళ్ళికొడుకు అతని బంధువులు, అప్పుని కాపాడి తీసుకొచ్చిన కళ్యాణ్ ఆమె మెడలో తాళి కడతాడు. కళ్యాణ మండపంలో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అప్పు ని తీసుకుని కళ్యాణ్ అందర్నీ వదిలి వెళ్ళిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 9వ తేదీ ఎపిసోడ్ 484లో ఏం జరిగిందంటే..
మనం మగ పిల్లలు అందర్నీ కనకం వాళ్ళ ఆడపిల్లల కోసమే కన్నట్లు ఉన్నాము. మనం ఎన్ని అనుకున్నా పెళ్లి మాత్రం కనకం ఇంటి ఆడపిల్లలతోనే జరుగుతుంది అని ధాన్యలక్ష్మి ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది రుద్రాణి. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. వాడు నా కడుపులో చిచ్చుపెట్టి పెళ్లి చేసుకుని అందరినీ వదిలి వెళ్ళిపోయాడు అని ఏడుస్తుంది. ఏడవటం ఎందుకు నీ ఇష్టాలని వాడి మీద రుద్దాలని చూసావు కానీ ఎప్పుడూ వాడి ఇష్టాలను తెలుసుకోలేదు.

నీవల్ల, ఆ అనామిక వల్ల వాడు ఇన్నాళ్ళు నరకం చూశాడు. కచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు అప్పుతో వాడు చాలా ఆనందంగా బ్రతుకుతాడు అని చెప్తాడు ప్రకాష్. ఏముందని బ్రతుకుతాడు ఎలా బ్రతుకుతాడు, అప్పు వల్ల వాడి బ్రతుకు రోడ్డున పడింది అంటుంది ధాన్యలక్ష్మి. ఎవరు ఊహించని విధంగా ఈ పెళ్లి జరిగిన మాట నిజమే కానీ అంతమాత్రాన వాడు ఇంటి వారసుడు కాకుండా పోడు, ఈ పంతాలు పట్టింపులు ఎన్నో రోజులు ఉండవు, వాడు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు అదే చాలు అంటాడు సుభాష్.
కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు ఏం సుఖపడతాడు అంటుంది ధాన్యలక్ష్మి. దీనంతటికి కారణం కనకం, ఆమె కూతుర్లే అంటుంది రుద్రాణి. మా పెళ్లిళ్లు ఎలా జరిగాయో ఇక్కడున్న అందరికీ తెలుసు,మా మూడు జంటల్లోనూ న్యాయం జరిగింది ఆ జంటకు మాత్రమే, ఒకరిని ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎప్పటికీ ఆనందంగా ఉంటారు అంటుంది స్వప్న. స్వప్నని మందలిస్తుంది రుద్రాణి. రుద్రాణి పై కోప్పడుతుంది అపర్ణ.

అక్కడ అప్పు ని పెళ్లి చేసుకోమని కళ్యాణ్ ని ఆ కుటుంబ సభ్యులు ఎవరు అడగలేదు, నా కొడుకు మాత్రమే తమ్ముడు ప్రేమ అర్థం చేసుకొని తాళికట్టమన్నాడు దానికోసం వాళ్ళని ఎందుకు అంటున్నావు అయినా బాధపడుతున్న అన్న వదినని ఓదార్చడం మానేసి అగ్నిలో ఆజ్యంపోస్తున్నావు, నువ్వు ఇంటి ఆడపడుచు అయితే కదా పరాయి దానివి కాబట్టి ఇలా చేస్తున్నావు అంటుంది. వదిన నన్ను ఎంతమాట అన్నదో చూశారా అని తల్లిదండ్రులకు కంప్లైంట్ చేస్తుంది రుద్రాణి.
ఇందిరా దేవి రుద్రాణిపై ఫైర్ అవుతూ ఎవరు అమ్మ, ఎవరు నాన్న, మొగుడ్ని వదిలేసిన నిన్ను నా కొడుకులు కోడళ్ళు జాలితో చేరదీశారు అలాంటిది వాళ్ళ మధ్య చిచ్చు పెడితే నువ్వు ఎవరో, నేనెవరో అంటుంది. కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతారు రాహుల్, రుద్రాణి. మరోవైపు వెళ్లిపోయిన కూతురు అల్లుడు కోసం బాధపడుతూ ఉంటారు కృష్ణమూర్తి దంపతులు. మన అమ్మాయి అంటే కష్టానికి అలవాటు పడింది కానీ ఆ అబ్బాయి సుకుమారంగా పెరిగాడు ఎలా అడ్జస్ట్ అవుతాడో ఏంటో అంటాడు కృష్ణమూర్తి.

అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో ? తిన్నారో,లేదో అని బాధపడుతుంది కనకం. మరోవైపు అప్పు కల్యాణ్ ని తీసుకుని తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. అప్పు ని చీరకట్టులో చూసి నవ్వుతారు ఆమె ఫ్రెండ్స్. వాళ్లపై చిన్నగా కోప్పడుతుంది అప్పు. ఆ తర్వాత రూమ్ లోకి తీసుకువెళ్లిన ఫ్రెండ్స్ మీరు ఈ రూమ్ లో అడ్జస్ట్ అవ్వగలరా బావగారు అని కళ్యాణ్ అడుగుతారు. పెళ్లి చేసుకొని బయటికి వచ్చేసాము మా అదృష్టం కొద్ది ఈ షెల్టర్ దొరికింది అంటాడు కళ్యాణ్.

తరువాయి భాగంలో మీ తమ్ముడు చేతిలో తాళి పెట్టి అప్పు మెడలో కట్టమన్నది మీరు, మీ పిన్నికి భయపడి వెళ్ళిపోయింది కవిగారు అంటుంది కావ్య.కానీ కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు అందరూ బాధపడుతున్నారు అంటాడు రాజ్. అందుకు నేనేం చేసేది అంటుంది కావ్య. నువ్వే వెళ్లి కళ్యాణ్ ని తీసుకురావాలి అంటాడు రాజ్. మీరు చెప్పిన పని నేను చేయలేను అంటుంది కావ్య. అప్పుడు నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి అంటాడు రాజ్.


Click it and Unblock the Notifications











