Brahmamudi August 9th Episode: నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కనివ్వను.. కావ్యకి యామిని వార్నింగ్
Photo Courtesy: JioHotstar
కావ్య కంగారుగా బయటికి వెళ్లడంతో ఏం జరిగిందోనని దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కావ్యకు ఏం కాలేదని, రాజ్ దొరికాడని.. ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడని అపర్ణ చెప్పడంతో అంతా ఆనందిస్తారు. రాజ్‌కి గతాన్ని గుర్తుచేస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సుభాష్ చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఈ విషయాన్ని వెంటనే యామినికి చెప్పి.. నువ్వు తొందరపడకుంటే నీకు రాజ్ ఈ జన్మలో దక్కడని హెచ్చరిస్తుంది.
రాజ్‌ను వెతుక్కుంటూ రేవతి ఇంటికి వస్తుంది కావ్య. రాజ్ రెస్ట్ తీసుకుంటున్నాడని, నిన్ను చూస్తే మళ్లీ టెన్షన్ పడతాడని చెబుతుంది రేవతి. అయినప్పటికీ కావ్య లోపలికి వెళ్లి రాజ్‌ను నానామాటలు అని అతనిని ఇంటికి లాక్కెళ్తుంది. నువ్వు ఏమై పోయావోనని మేమంతా తల్లడిల్లిపోయామని దుగ్గిరాల ఫ్యామిలీ చెప్పడంతో రాజ్ బాధపడతాడు. ఇంతలో యామిని వచ్చి నీ వల్లే నా బావ ఇలా అయిపోయాడని మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 9వ తేదీ ఎపిసోడ్ 796లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నీ కోసం అన్ని వదులకుని వచ్చిన మనిషిని, అతని ప్రేమను రిజెక్ట్ చేయడానికి నీకు మనసెలా వచ్చిందని కావ్యతో గొడవకు దిగుతుంది యామిని. నీ ప్రాబ్లం ఏంటో చెబితే అది ఎంత పెద్దదైనా సరే నేనే దగ్గరుండి మీ ఇద్దరినీ ఒక్కటి చేస్తానని అంటుంది. ఆ దేవుడి దయ వల్ల మా బావ క్షేమంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ.. తనకు ఏమైనా జరిగి ప్రాణాలు పోయుంటే పరిస్ధితి ఏంటని అంటుంది యామిని. ఆ మాటలతో రగిలిపోయిన కావ్య.. ఆమెను లాగిపెట్టి కొడుతుంది.
ఆయన గురించి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి ఆయన కోసం అవసరమైతే నా జీవితాన్ని అయినా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని కావ్య చెబుతుంది. మా బావ ప్రాణాలకు అంత విలువ ఇచ్చే దానివే అయితే తన ప్రేమను ఎందుకు అంగీకరించడం లేదని నిలదీస్తుంది కావ్య. నువ్వంటే ఇష్టం ఉన్నట్లు నటిస్తోంది కానీ.. ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో మాత్రం చెప్పడం లేదని రాజ్‌తో చెబుతుంది యామిని. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దని మనింటికి వెళ్లిపోదామని లాక్కెళ్లిపోతుండగా రాజ్ ఆగిపోతాడు.
నన్ను వద్దు అనడానికి కళావతి దగ్గర ఏం కారణాలు ఉన్నాయో తెలియదు కానీ.. నా మీ ఇంత ప్రేమ చూపిస్తున్న ఈ కుటుంబాన్ని మాత్రం వదులుకోలేనని అంటాడు రాజ్. అమ్మతో కాసేపు మాట్లాడి వస్తానని నువ్వు వెళ్లిపో అని చెబుతాడు. మేం ఇక్కడే ఉంటాం.. రేపు మాట్లాడుకోవచ్చు వెళ్లిపో అని రాజ్‌తో అంటుంది రుద్రాణి. దాంతో ఇందిర కోప్పడి.. మీ బావను రాత్రికి ఇంటికి పంపిస్తామని చెబుతుంది. యామిని కారెక్కబోతుండగా కావ్య ఆపుతుంది.
అవకాశం దొరికింది కదా అని వాడుకోవాలని అనుకుంటున్నావా? ఇంకా ఆయన నీ సొంతం అవుతారని కలలు కంటున్నావా? అని మండిపడుతుంది కావ్య. మనిషి, మనసు మారడానికి ఒక్క క్షణం చాలని నువ్వే చెప్పావ్ కదా? బావకి నీమీదున్న ప్రేమ నా మీదకి షిఫ్ట్ కావడానికి ఒక్క క్షణం చాలని అంటుంది యామిని. ఆయనను సొంతం చేసుకోవాలని యాక్సిడెంట్ చేయించావ్.. మరదలిని అని స్టోరీలు చెప్పావ్, అప్పటికీ ఆయన నా వెంట తిరిగేసరికి తట్టుకోలేకపోయావని మండిపడుతుంది కావ్య. ఆయనను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లికి ఒప్పించావ్.. కానీ పీటల మీద పెళ్లిని ఆపేసి నా ప్రేమ కోసం వచ్చాడని అంటుంది. మా ఇద్దరి మధ్య ఉన్నది బ్రహ్మముడి దానిని ఎవ్వరూ విడదీయలేరని వార్నింగ్ ఇస్తుంది.
నువ్వు కంపెనీ విషయంలో వేలు పెట్టావ్ భరించాను, నా చెల్లెలి జీవితంతో ఆడుకోవాలని ప్లాన్ చేశావ్ సహించను, కానీ ఇంకా ఇంకా అలాంటి ప్లాన్లు వేస్తే సహించనని వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఏదో ఒకరోజు ఆయనకు నిజం చెప్పే టైం వస్తుందని, అప్పుడు నీ ప్రశ్నలన్నింటికీ తప్పకుండా సమాధానం చెబుతానని అంటుంది. నువ్వు చెప్పినదంతా వింటూ, చేసేది చూస్తూ ఉంటానని అనుకున్నావా? బావ ఎప్పటికైనా నా వాడు, తను నాకు మాత్రమే సొంతమని చెబుతుంది యామిని. ఒకవేళ తను నాకు సొంతం కాలేదంటే మాత్రం ఇంకెవ్వరికీ సొంతం కానివ్వనని తేల్చేస్తుంది.
రాజ్‌కి యాక్సిడెంట్ కాగానే వాడికి నేను గుర్తొచ్చానని రేవతి సంతోషిస్తుంది. ఏదో ఒకరోజు నేను నా కుటుంబానికి దగ్గర అవుతానని జగదీష్‌తో అంటుంది కావ్య. అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుందని, కాస్త ఓపిక పట్టు మళ్లీ నీవాళ్లు నీకు దగ్గర అవుతారని అంటాడు జగదీష్. మరోవైపు.. రాజ్‌ని ఎక్కడికి వెళ్లిపోయావని నిలదీస్తారు ఇందిర, అపర్ణ. నువ్వు చేసిన పనికి నాకు పీకలదాకా ఉందని, పిచ్చకొట్టుడు కొడతానని మండిపడుతుంది అపర్ణ. కావ్య ప్రేమను దక్కించుకోవడానికి నువ్వు ఎన్ని ప్లాన్లు వేశావ్.. ఎన్ని కష్టాలు పడ్డావో అప్పుడే మరిచిపోయావా? అని అడుగుతుంది అపర్ణ. మనకి కావాల్సినది దక్కనప్పుడు దక్కించుకోవడానికి ప్రయత్నించాలని.. ఇన్ని రోజులు నీతో ప్రేమ లేకుండానే నా మనవరాలు తిరిగిందా? అని ప్రశ్నిస్తుంది ఇందిర.
జీవితంలో జరిగేవన్నీ మన మంచికేనని అంటాడు రాజ్. నాకు ఇలా జరిగినందు వల్లే కదా కళావతికి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిందని చెబుతాడు. నా వల్ల మీరు బాధపడ్డారు.. క్షమించండి అని అడుగుతాడు రాజ్. ఇంటికి బయల్దేరుతుండగా కావ్య రావడంతో ఆగిపోతాడు. మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు.. నా ప్రేమను రిజెక్ట్ చేశారంటే దాని వెనుక ఏదో కారణం ఉందని అంటాడు రాజ్. అది ఎంత పెద్దదైనా నేను కనుక్కుంటానని చెబుతాడు. మనమెంటే ఒకరికి ఇష్టం ఉందని తెలిస్తే ఎలా వదులుకుంటామని అంటాడు.
ఇంటికొచ్చాక ఎందుకలా ఉన్నావని యామినిని అడుగుతాడు రాజ్. ఆ కళావతి నిన్ను, నీ ప్రేమను పట్టించుకోవడం లేదని.. ఆమె నిన్ను చాలా చీప్‌గా చూస్తోందని మండిపడుతుంది. అసలు ఆ కళావతికి నువ్వంటే ఇష్టం లేదు.. ఆమెకు నీమీద ప్రేమే లేదని అంటుంది యామిని. ఆ మాటలతో రాజ్ రగిలిపోతాడు. కళావతికి నా మీద సముద్రమంత ప్రేమ ఉందని చెబుతాడు. మరి నీ ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది? ఆ టూ లవ్యూ అని ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తుంది యామిని. నువ్వు నా గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడితేనే కళావతి తట్టుకోలేకపోయిందని, అలాంటిది ఆవిడకి నా మీద ప్రేమ లేదంటే ఎలా నమ్మమంటావ్ అని నిలదీస్తాడు రాజ్. కళావతికి నా మీదున్న ప్రేమను తన మాటల్లో చూశానని అంటాడు రాజ్.
నా ప్రేమను కళావతి రిజెక్ట్ చేయడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని చెబుతాడు రాజ్. కళావతికి నా మీదున్న ప్రేమను ఏదో ఆపుతుందని, ఆ అడ్డు తొలగిపోతే అదేంటో బయటపడుతుందని అంటాడు. నా మీద తనకు ఆకాశమంత ప్రేమ ఉన్నప్పుడు కళావతిని ఎలా వదులుకుంటానని చెబుతాడు. రాజ్ మాటలతో యామిని పిచ్చిపట్టినట్లు ఊగిపోతుంది. ఉదయాన్నే బయటికి వెళ్తున్న కావ్యని ఎక్కడికని అడుగుతుంది అపర్ణ. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందని, ఒకసారి డాక్టర్ దగ్గర కూడా కన్ఫర్మ్ చేసుకుంటే మంచిదని వెళ్తున్నానని చెబుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










