Brahmamudi December 10th Episode: పాప కేసులో అప్పూకి తిరుగులేని క్లూ... రాహుల్‌తో స్వప్న రొమాన్స్

Photo Courtesy: JioHotstar

కావ్యని తీసుకుని రెస్టారెంట్‌కి వచ్చిన రాజ్‌ ఆమెతో గొడవపడతాడు. అది చూసిన జనం మీరు భార్యాభర్తల్లా లేరు.. ప్రేమికుల లాగా ఉన్నారని చెప్పడంతో రాజ్- కావ్యలు సంతోషిస్తారు. ఇంతలో చోటు మోటులు వెయిటర్స్‌లా వేషం మార్చి రెస్టారెంట్‌కి వస్తారు. కావ్య, రాజ్‌లు ఉంటున్న హోటల్ రూమ్‌లో అంతా గాలిస్తారు. కానీ వాళ్లకి పెన్‌డ్రైవ్ దొరకదు. కావ్య, రాజ్‌లు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని ఎంతగా ట్రై చేసినా కుదరదు.

దీంతో మోటు గడ్డం పెట్టుకుని.. కావ్య, రాజ్‌లు ఉన్న టేబుల్ దగ్గర తన ఫోన్ పెడతాడు. ఈ విషయాన్ని గమనించిన రాజ్.. ఆ పెన్‌డ్రైవ్‌ని శృతికి ఇచ్చావా అని కావ్యని అడుగుతాడు. శృతికి పెన్‌డ్రైవ్ ఇచ్చినట్లు చెప్పడంతో అదే నిజం అనుకుని సంబరపడిపోతారు చోటు, మోటు. వెంటనే ఆ ఫోన్ విసిరి కొడతాడు రాజ్. కావ్య వేసిన డిజైన్‌లు తనవని నిరూపించుకోవడానికి స్వప్నని ట్రాప్ చేస్తాడు రాహుల్. ఆమె మెడలో హారం వేసి ఇంప్రెస్ చేయడంతో పాటు డిజైన్లు సెలెక్ట్ చేయించడంతో స్వప్న పొంగిపోతుంది. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఎమోషనల్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 10వ తేదీ ఎపిసోడ్ 900లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 10th 2025 Episode 900 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్, కావ్యలు పెన్‌డ్రైవ్‌ని శృతికి ఇచ్చానని చెప్పడంతో చోటు, మోటులు శృతిని వెతుక్కుంటూ బయటకు వస్తుండగా ఇద్దరు సంగీత విధ్వంసలు సాధన చేస్తూ శృతి పలకడం లేదని అంటారు. దాంతో చోటు, మోటులు వాళ్ల దగ్గరికి వెళ్లి శృతి కావాలని అడుగుతారు. అయితే వారిద్దరూ సంగీతం వినిపించడంతో మాకు కావాల్సింది ఇది కాదు శృతి అని అంటాడు చోటు, మోటు. ఇలాంటివి వాయిస్తే వచ్చేది శృతేనని వారిద్దరూ చెప్పడంతో చోటు, మోటులు షాక్ అవుతారు.

ఎమ్మెల్యే మేనల్లుడి ఇంట్లో బంగారం పోయిన కేసును చూడమని సీఐ ఇచ్చిన ఫైల్‌ని చూస్తూ కోపంతో విసిరికొడుతుంది అప్పూ. అది చూసిన కళ్యాణ్.. ఏం జరిగిందని అడుగుతాడు. పాప కేసు ముందుకు వెళ్లదు, ఇక వదిలేయడమేనని బాధపడుతుంది. ఈ కేసును వదిలేసి మరో కేసుని తీసుకోమని సీఐ గారు ఆర్డర్ వేశారని చెబుతుంది అప్పూ. ఈ కేసు గురించి ఆలోచిస్తూ రోజు రోజుకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నావని అంటాడు కళ్యాణ్. నా హెల్త్ కూడా పక్కనపెట్టి.. ఈ కేసుని ఓ కొలిక్కి తీసుకురావాలని అనుకున్నానని చెబుతుంది అప్పూ. ఓ తల్లికి ఏదోలా మన:శాంతిని ఇవ్వాలని అనుకున్నా, ఏది కుదరడం లేదని అంటుంది. గెలుపంటే అటక మీదున్న గిన్నెలాంటిది కాదని, చెట్టు మీదున్న పండులాంటిదని చెబుతాడు కళ్యాణ్. ఇలా డీలా పడిపోవద్దని భార్యకి ధైర్యం నూరిపోస్తాడు కళ్యాణ్.

నాకు ఏ ఒక్క క్లూ దొరికినా నేనేంటో నిరూపించుకునే దానిని, రేణుక గారు చెప్పిన మాటలకు ఏ ఆధారం కనిపించడం లేదు, అందుకే ఇక సీఐ గారు చెప్పినట్లు ఈ కేసు క్లోజ్ చేయడం తప్పించి ఇంకో మార్గం లేదని బాధపడుతుంది అప్పూ. ఇంతలో అప్పూకి రేణుక సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు ఫోన్ వస్తుంది. ఆ మాటలతో అప్పూ షాకై ఈ విషయాన్ని కళ్యాణ్‌కి చెబుతుంది. ఆ హైదరాబాద్ వాళ్ల దగ్గరే మన పెన్‌డ్రైవ్ ఉందని చోటుతో అంటాడు మోటు. పెన్‌డ్రైవ్ వాళ్ల దగ్గర లేదని అనిపిస్తోందని చెబుతాడు చోటు. ఈరాత్రికి మనం వాళ్లతో ఆడుకోవాలి, రూమ్‌లోకి వెళ్లి వాళ్లని బయపెట్టి పెన్‌డ్రైవ్‌ని సంపాదించి దానిని మన బాస్‌కి గిఫ్ట్‌గా ఇస్తున్నామని అంటాడు మోటు. ఇదంతా విన్న రాజ్, కావ్యలు మనల్ని భయపెట్టేంత ఛాన్స్ ఎందుకు ఇస్తామని అనుకుంటారు. మనమే వాళ్లని భయపెడదామని రాజ్‌తో చెబుతుంది కావ్య.

రేణుక ఆత్మహత్యాయత్నం చేసిందని తెలియగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది అప్పూ. అక్కడే పక్కింటి మనిషి ఉండటంతో జరిగింది మొత్తం చెబుతుంది. రేణుక చేయి కోసుకుని పడిపోయిందని, అందుకే వెంటనే మీకు ఫోన్ చేశానని అంటుంది. వాళ్ల హజ్బెండ్ వేరే ఊరిలో ఉన్నాడని వస్తున్నాడని చెబుతుంది. ఎందుకు చావాలని అనుకున్నారు అని రేణుకని నిలదీస్తుంది అప్పూ. ఏడాదిగా నా కూతురు కనిపించడం లేదని గుండెలు పగిలేలా చెబుతున్నా, చుట్టూ ఉన్నవాళ్ల మాటలు నమ్ముతున్నారు కానీ ఈ కన్నతల్లి మాట నమ్మడం లేదని బాధపడుతుంది రేణుక. తల్లిగా నేను బతికుండి కూడా కనుక్కోలేకపోతున్నాను.. అలాంటప్పుడు బతికుండి ప్రయోజనం ఏముందని ప్రశ్నిస్తుంది.

ఇన్ని రోజులు ఓపిగ్గా ఎదురుచూశారు.. నేను మీ కోసం ప్రయత్నిస్తుంటే మీరెందుకు నమ్మకం కోల్పోతున్నారని అడుగుతుంది అప్పూ. మీరు కూడా మీ కూతురు బతికుంటే అంటున్నారని.. మీరు కూడా నా మాటలు నమ్మడం లేదని బాధపడుతుంది రేణుక. నా బిడ్డను వెతికి తీసుకొస్తేనే నా బాధ దూరం అవుతుందని అంటుంది. ఆ మాటలతో బాధపడుతూ బయటికి వచ్చేస్తుంది అప్పూ. ప్రతిదానిని ఇలా పర్సనల్‌గా తీసుకుంటే డ్యూటీ చేయలేమని అప్పూకి చెబుతాడు కానిస్టేబుల్ శేషు. ప్రతి కేసుని పర్సనల్‌గానే తీసుకోవాలి, పబ్లిక్‌కి కష్టం వస్తే అది మన కష్టమని ఫీలైతేనే వాళ్లకు కూడా మనపై నమ్మకం వస్తుందని అంటుంది అప్పూ. డబ్బు కోసం నేను ఈ డిపార్ట్‌మెంట్‌లోకి రాలేదని, ఈ కేసు టేకప్ చేసి మూడు రోజులు అవుతోంది, ఒక్క క్లూ కూడా దొరకడం లేదని బాధపడుతుంది అప్పూ.

ఇంతలో ఓ చిన్నారి వచ్చి మీరు వెతుకుతున్న అంజలి నా ఫ్రెండ్ అని చెబుతుంది. అంజలి చనిపోయిందని అందరూ అంటున్నారు.. కానీ అది నిజం కాదు, నిన్న నేను అంజలిని చూశానని చెబుతుంది పాప. నిన్న గేటు ముందు నిలబడి మమ్మీ మమ్మీ అని పిలవడం నేను చూశానని... ఆ తర్వాత రేణుక ఆంటీ బయట ఏడుస్తూ కనిపించారని అంటుంది. ఈ విషయం మమ్మీ డాడీకి చెబితే పోలీసులు మనింటికి వస్తారు, నువ్వు ఎవరికీ చెప్పొద్దని అరిచారని అంటుంది. మీరే నా ఫ్రెండ్‌ని వెతికి తీసుకురమ్మని చెబుతుంది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్‌ని వెతికి తీసుకొస్తానని మాటిస్తుంది అప్పూ.

రాజ్, కావ్యల గదిలోకి చోటు, మోటులు వెళ్లి లైట్స్ ఆఫ్ చేస్తారు. వాళ్లు వచ్చిన విషయం గమనించిన రాజ్, కావ్యలు చీకటిలో వాళ్లిద్దరినీ చితకబాదుతారు. కొట్టడం దేనికి వాళ్లిద్దరినీ రివాల్వర్‌తో కాల్చేయమని రాజ్‌తో చెబుతుంది కావ్య. ఆ మాటలు విన్న చోటు, మోటులు భయపడి పారిపోతారు. ఈసారి ఇలా కాదు.. వాళ్లిద్దరినీ కిడ్నాప్ చేద్దామని ప్లాన్ చేస్తారు రౌడీలు. గదిలో స్వప్న ముందు వర్క్ చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తాడు రాహుల్. అది చూసిన స్వప్న మురిసిపోతుంది. అందంగా ముస్తాబై గదికి లాక్ చేసి వస్తుంది. మనం బాధ్యతగా ఉన్నట్లు నటిస్తుండటంతో ఇది కూడా భార్యగా నడుచుకోవాలని ఫిక్స్ అయ్యిందా అని అనుకుంటాడు రాహుల్. నిన్ను పొగడటానికి నా నోట్లో మాటలు కూడా రావడం లేదని అంటాడు రాహుల్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X