Brahmamudi December 11th Episode: బందీలుగా రాజ్- కావ్య, మోడల్‌గా మారిన స్వప్న... రాజ్‌ని దెబ్బకొట్టిన రాహుల్

Photo Courtesy: JioHotstar

పాప మిస్సింగ్ కేసుని వదిలేసి ఎమ్మెల్యే మేనల్లుడి ఇంట్లో బంగారం చోరీ కేసును డీల్ చేయమని సీఐ చెప్పడంతో అప్పూ అసహనం వ్యక్తం చేస్తుంది. వెంటనే ఫైల్ విసిరికొడుతుంది. ఇది చూసిన కళ్యాణ్ భార్యకి ధైర్యం చెబుతాడు. ఇంతలో రేణుక ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఫోన్ రావడంతో అప్పూ హుటాహుటిన వెళ్తుంది. పాప బతికే ఉందని నా మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఇక తల్లిగా నేను బతికి ప్రయోజనం లేదని బాధపడుతుంది. రేణుకని ఓదార్చి అప్పూ బయటకు వస్తుండగా ఓ పాప వచ్చి నేను అంజలిని చూశానని, ఆమె బతికే ఉందని చెబుతుంది. దాంతో అప్పూ సీరియస్‌గా రంగంలోకి దిగుతుంది.

పెన్‌డ్రైవ్ కొట్టేయడానికి రాజ్, కావ్యల రూమ్‌లోకి వెళ్లాలని చోటు, మోటులు అనుకుంటారు. వారి మాటలు విన్న రాజ్, కావ్యలు వాళ్లకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. చోటు, మోటులు గదిలోకి రాగానే వాళ్లని చితకబాదుతాడు రాజ్. ఆ దెబ్బకి వాళ్లిద్దరూ పారిపోతారు. రాజ్, కావ్యలను కిడ్నాప్ చేసి మన బాస్ ముందు నిలబెడితే ఆయనే చూసుకుంటారని చోటు, మోటులు ప్లాన్ చేస్తారు. డిజైన్స్ చూస్తూ బిజీగా ఉన్న రాహుల్ దగ్గరికి స్వప్న అందంగా రెడీ అయి టెంప్ట్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 11వ తేదీ ఎపిసోడ్ 901లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 11th 2025 Episode 901 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

స్వప్న అందాన్ని పొగుడుతూ ఆమెను బుట్టలో వేసుకుంటాడు రాహుల్. ఈరోజు మన పెళ్లి రోజు కూడా కాదు కదా? మేడం గారు అందంగా రెడీ అయ్యారని అడుగుతాడు. మొగుడు ముందు అందంగా రెడీ అవ్వడానికి కూడా కారణం కావాలా.. మంచి టైం ఉంటే సరిపోదా అని అంటుంది స్వప్న. నువ్వు ఇంతలా సపోర్ట్ చేస్తావని తెలుసుంటే నేను ఎప్పుడో మారిపోయేవాడినని అంటాడు రాహుల్. నేను మారడంలో నీకే థ్యాంక్స్ చెప్పాలి.. మొదట నన్ను నమ్మింది నువ్వే, కావ్యని రాజ్‌ని ఒప్పించి కంపెనీ పెట్టించింది నువ్వేనని అంటాడు రాహుల్. స్వప్నని ముద్దుపెడుతూ రాహుల్ ఆగిపోతాడు. ఏం జరిగిందని స్వప్న అడగ్గా.. నీ చేత సెలెక్ట్ చేయించిన డిజైన్లని మ్యాన్యుఫ్యాక్చరింగ్‌కి పంపించాను కదా? అని అడుగుతాడు. ఆ డిజైన్స్‌కి పబ్లిసిటీ కావాలని చెబుతాడు.

రాజ్ తన కంపెనీలో సెలబ్రిటీలను పెట్టి యాడ్స్, ఫోటోషూట్ తీయించినట్లే నువ్వు కూడా చేయమని సలహా ఇస్తుంది స్వప్న. నా కంపెనీ రాజ్ కంపెనీ అంత పెద్దది కాదని, సెలబ్రిటీస్‌ని పెట్టుకుందామంటే కోట్లు అడుగుతున్నారు. ఇప్పుడు పబ్లిసిటీ కోసం అంత బడ్జెట్ పెట్టానంటే కంపెనీని నడపటం కూడా కష్టం అవుతుందని చెబుతాడు రాహుల్. పబ్లిసిటీ చేయకపోతే పబ్లిక్‌కి ఎలా రీచ్ అవుతుందని అడుగుతుంది స్వప్న. నీకు మోడలింగ్ తెలుసు కదా ఫోటో షూట్‌లో నువ్వే వచ్చి చేయమని అడుగుతాడు రాహుల్. ఆ మాట వినగానే స్వప్న షాక్ అవుతుంది. మన కంపెనీకి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అయితే ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఉండదని అంటాడు. నా కోసం, పాప ఫ్యూచర్ కోసం ఒప్పుకోమని చెబుతాడు రాహుల్. దాంతో ఒప్పుకుంటుంది స్వప్న. ఆ డిజైన్స్ అన్నీ నావేనని అఫీషియల్‌గా నువ్వు ఒప్పుకున్నట్లు.. ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరని అనుకుంటాడు రాహుల్.

చోటు, మోటులకు బాగా బుద్ధి చెప్పామని రాజ్, కావ్యలు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్లిద్దరినీ ఎలా కిడ్నాప్ చేయాలో చోటు, మోటు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంతలో రాజ్‌కి తెలిసిన పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. మరోవైపు.. రూమ్‌లో దొరికిన పెన్‌డ్రైవ్‌ని రాజ్, కావ్యలకి ఇవ్వమని సర్వీస్ బాయ్ తన మనిషిని పంపగా.. అతను నేరుగా పోలీస్ ఆఫీసర్‌కి ఇస్తాడు. అది రాజ్,కావ్యలదని అనుకున్న ఆఫీసర్ వాళ్లకి తిరిగి ఇవ్వడానికి వెళ్తుండగా చోటు, మోటులు వాళ్లిద్దరినీ కిడ్నాప్ చేసి వ్యానులో ఎక్కించుకుని తీసుకెళ్తారు. ఇది చూసిన పోలీస్ ఆఫీసర్ వాళ్లని వెంబడిస్తాడు. రాజ్, కావ్యలను కిడ్నాప్ చేసింది మురుగన్ మనుషులని తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్.. ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు.

స్వప్నతో మోడలింగ్ చేయించడానికి రాహుల్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అందంగా రెడీ అయి స్వప్న రావడంతో ఫోటోగ్రాఫర్ షాక్ అవుతాడు. ఇంత అందమైన, టాలెంటెడ్ భార్య దొరికినప్పుడు ఆ అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను అని అంటాడు రాహుల్. నీకు తెలియకుండానే ఆ రాజ్ సామ్రాజ్యాన్ని కూల్చేయడానికి సమిధగా మారుతున్నావని అనుకుంటాడు రాహుల్. మీరు చాలా అందంగా ఉన్నారని ఫోటోగ్రాఫర్ ఆంటోనీ మెచ్చుకోవడంతో రాహుల్ సీరియస్ అవుతాడు. సిటీ మొత్తం ఈ స్టిల్స్‌ని హోర్డింగ్స్‌తో నిండిపోవాలని ఆర్డర్స్ వేస్తాడు రాహుల్. నువ్వు చెప్పావని యాడ్ షూట్ చేసేశాను.. కానీ ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారోనని టెన్షన్‌గా ఉందని భయపడుతుంది స్వప్న. ఏం జరిగినా నేను చూసుకుంటానని చెబుతాడు రాహుల్.

రాజ్, కావ్యలను కిడ్నాప్ చేసి కట్టేస్తారు చోటు, మోటు. పెన్‌డ్రైవ్ ఇవ్వకుండా మా ఇద్దరినీ చితక్కొట్టారు.. మిమ్మల్ని అంత తేలికగా వదలమని అంటారు. మా దగ్గర ఏ పెన్‌డ్రైవ్ లేదని రాజ్ చెప్పినా వాళ్లు పట్టించుకోరు. పెన్‌డ్రైవ్ శృతి దగ్గర ఉంది అన్నారు కదా? ఆమెను పిలిపించండి అని చెబుతారు. అది వేరే పెన్‌డ్రైవ్ అని ఇది కాదని అంటాడు రాజ్. మా బాస్ వచ్చేలోగా పెన్‌డ్రైవ్ మా చేతుల్లో లేకపోతే మీ ఇద్దరినీ చంపేస్తామని వార్నింగ్ ఇస్తారు చోటు, మోటు. ఈరోజు లాస్ట్ డే ట్రీట్‌మెంట్‌కి వెళ్లాలని కావ్య టెన్షన్ పడుతుంది.

మరోవైపు.. రాజ్ కంపెనీకి చెందిన క్లయింట్స్‌ని మేనేజర్ మూర్తి మరోసారి రాహుల్ కంపెనీ కోసం పిలిపిస్తాడు. దాంతో క్లయింట్స్ అంతా అతనిపై మండిపడతారు. నువ్వు కంపెనీ మారిపోయావని, మేం కూడా మారిపోవాలా? అని ప్రశ్నిస్తారు. మాకు ఇంట్రెస్ట్ లేదని ఆరోజే చెప్పాం కదా? అయినా ఎందుకు పిలుస్తున్నారని అడుగుతారు. ది బెస్ట్ డిజైన్లను ఇస్తున్నవారిని కాదని మీ దగ్గరికి ఎందుకు రావాలని వాళ్లు ప్రశ్నించగా.. సక్సెస్ కోసమని అంటాడు రాహుల్. లాభాల కోసమే బిజినెస్ చేస్తామని చెబుతాడు. మంచి ప్రొడక్ట్స్ రాజ్ కంపెనీలో ఉన్నాయి.. మరి నీ దగ్గర ఏం ఉన్నాయని రాహుల్‌ని అడుగుతారు. వాళ్ల డిజైన్స్‌కి మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉందని అంటారు.

అదంతా గతమని.. లాస్ట్ ఇయర్ స్వరాజ్ గ్రూప్ బిజినెస్ 20 శాతం తగ్గింది.. ఫస్ట్ ర్యాంక్ నుంచి పడిపోవడానికి అడుగు దూరంలో తప్పించుకున్నారు. దీనంతటికీ కారణం ఏంటో ఆలోచించారా?గడిచిన ఏడాదిగా డిజైన్స్ అన్నీ ఔట్‌డేటెడ్ అయిపోయాయి.. మార్కెట్‌లో ఆ కంపెనీ డిజైన్స్‌కి క్రేజ్ తగ్గిపోయింది. వచ్చే వన్ ఇయర్‌లో మరో 12 శాతం మేర రాజ్ కంపెనీ నష్టాలను ఎదుర్కొంటుందని అప్పుడు స్వరాజ్ కంపెనీ నెంబర్‌వన్ ప్లేస్‌లో ఉండదని చెబుతాడు రాహుల్. మార్కెట్‌లో నేను కొత్త కుర్రాడిని, నన్ను నమ్మి నా మీదే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని మీరు అనుకోవచ్చు.. దానికి సమాధానమే ఈ డిజైన్స్ అని కొత్త డిజైన్లు చూపిస్తాడు రాహుల్. నేను చేయించిన కొత్త డిజైన్లకు మార్కెట్‌లో మంచి క్రేజ్ వచ్చిందని ఎప్పుడు రిలీజ్ చేస్తానా అని జనం ఎదురుచూస్తున్నారని చెబుతాడు.

ఆ డిజైన్స్‌ బాగున్నాయని రాహుల్‌ని మెచ్చుకుంటారు క్లయింట్స్. కానీ పాతికేళ్లుగా ఆ కంపెనీతో బిజినెస్ చేస్తూ సడెన్‌గా మారలేమని చెబుతారు. మీకు లాభాలు కావాలనుకుంటే నాతో ఉండండి, రిలేషన్ కావాలనుకుంటే రాజ్‌తోనే ఉండమని చెబుతాడు రాహుల్. ఒక్కసారి వెళ్లిపోతే నా కంపెనీలో మళ్లీ అవకాశం దొరకదని వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాళ్లంతా ఓకే చెబుతారు. అగ్రిమెంట్ రెడీ చేసి పంపిస్తాను అని చెబుతాడు. మరోవైపు.. రేణుకని స్టేషన్‌కి పిలిపించిన అప్పూ.. ఇప్పటి నుంచి ఈ కేసును మరో కోణంలో చూస్తున్నానని అంటుంది. మీ కూతురు బతికే ఉందన్న క్లూ దొరికిందని చెప్పడంతో రేణుక సంతోషిస్తుంది. మీకు, మీ హజ్బెండ్‌కి ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా అని ప్రశ్నిస్తుంది అప్పూ. మా వారిని అనుమానించాల్సిన అవసరం లేదు.. నన్ను, నా పాపని ఎంతో ప్రేమగా చూసుకుంటారని చెబుతుంది రేణుక. ఇంతలో ఆమె భర్త అక్కడికి వస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X