Brahmamudi December 12th Episode: కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న రాజ్- కావ్య.. రాహుల్ కుట్ర బయటపెట్టిన సుభాష్

Photo Courtesy: JioHotstar

స్వప్న అందానికి రాహుల్ ఫిదా అవుతాడు. ఆమెతో సరసాలు ఆడుతూ ముద్దు పెట్టబోతూ ఆగిపోతాడు. ఏం జరిగిందని స్వప్న అడగ్గా.. ఎంతో కష్టపడి డిజైన్లు చేయించాను కానీ నా డిజైన్స్ పబ్లిసిటీ చేయడానికి నా దగ్గర డబ్బు లేదని చెబుతాడు రాహుల్. సెలబ్రిటీలతో బ్రాండ్ అండార్సింగ్ చేయించాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంటాడు. నువ్వు ఒకప్పుడు మోడల్‌వి కాబట్టి నా కోసం, మన పాప కోసం మన కంపెనీకి మోడల్‌గా మారమని అడుగుతాడు రాహుల్. భర్త కోసం స్వప్న ఒప్పుకుంటుంది.

రాజ్‌కి తెలిసిన పోలీస్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి కేరళకు ఏదో పనిమీద వచ్చి రాజ్‌ని పలకరిస్తాడు. రాజ్ - కావ్యలకి పెన్‌డ్రైవ్‌ని ఇవ్వమని రూమ్ బాయ్ తన మనిషిని పంపించగా.. అతను పొరపాటున పోలీస్ ఆఫీసర్‌కి ఇస్తాడు. రాజ్- కావ్యలను చోటు, మోటులు కిడ్నాప్ప చేయడాన్ని ఆ పోలీస్ చూసి అలర్ట్ అవుతాడు. రాహుల్ చెప్పినట్లే స్వప్న కొత్త డిజైన్స్‌కి మోడలింగ్ చేస్తుంది. అతని అందానికి ఫోటోగ్రాఫర్ ఫిదా అవుతాడు. ఇంట్లో వాళ్లు మోడలింగ్ చేస్తే ఏమనుకుంటారోనని స్వప్న టెన్షన్ పడుతుంది. స్వరాజ్ కంపెనీకి చెందిన క్లయింట్స్‌ని రాహుల్ మాయ చేసి తనవైపుకు తిప్పుకుంటాడు. రాజ్, కావ్యలను కిడ్నాప్ చేసిన చోటు, మోటులు తమ డెన్‌కి తీసుకొస్తారు. సూసైడ్ అటెంప్ట్ చేసిన రేణుకని అప్పూ స్టేషన్‌కి పిలిపించి పాప ప్రాణాలతోనే ఉందని ఎంత కష్టమైనా సరే నేను వెతికి పట్టుకుంటానని మాట ఇస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 12వ తేదీ ఎపిసోడ్ 902లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 12th 2025 Episode 902 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రేణుక భర్తని పోలీస్ స్టేషన్‌కి పిలిపిస్తుంది అప్పూ. మీకు గుడ్‌న్యూస్ మీ పాప బతికే ఉందని అప్పూ చెప్పడంతో అతను టెన్షన్ పడతాడు. మీ పోలీసులే నా పాప చనిపోయిందని చెప్పారు, మళ్లీ మీరే పాప చనిపోయిందని చెబితే షాక్ అయ్యానని అంటాడు. ఇంకా పూర్తి చేయలేను కానీ ఒక చిన్న డౌట్ అని చెబుతుంది అప్పూ. నిన్న మీ వైఫ్ ఆత్మహత్యా ప్రయత్నం చేసినా మీరు తాపీగా ఉదయం వచ్చారని అడుగుతుంది అప్పూ. నాకు బస్ ఎక్కి రావడానికి టైం పట్టిందని, వర్క్ టెన్షన్ వల్ల ఇలా ఉన్నానని అంటాడు రేణుక భర్త. చనిపోయిన పాప బాడీని నేను మళ్లీ రీ పోస్ట్‌మార్టం చేయిస్తున్నానని చెబుతుంది. ఆ మాటలతో అతను మళ్లీ షాక్ అవుతాడు. డీఎన్ఏ టెస్ట్ చేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పడంతో రేణుక భర్తకు ముచ్చెమటలు పడతాయి.

కిడ్నాపర్ల చెరలో ఉన్న రాజ్, కావ్యలు అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటారు. ఇంతలో బీర్ సీసా కనిపించడంతో దానిని పగులగొట్టి కట్లు కోసేస్తాడు రాజ్. ఇంతలో మురుగన్ మనుషులు వచ్చి మీకిచ్చిన టైం అయిపోయింది, పెన్‌డ్రైవ్ ఎక్కడ అని అడుగుతారు. అది నా ప్యాంట్ జేబులో ఉందని రాజ్ చెప్పడంతో ఆ రౌడీ రాజ్ దగ్గరికి వస్తాడు. ఆ వెంటనే రాజ్ అతనిని పట్టుకుని చితక్కొడతాడు. ఇద్దరు రౌడీలతో ఫైట్ చేసి కావ్యని తీసుకుని తప్పించుకుని పారిపోతుండగా మురుగన్ గన్ తీసుకుని వస్తాడు. పెన్‌డ్రైవ్ ఎక్కడ? అని నిలదీస్తాడు. మా దగ్గర ఏ పెన్‌డ్రైవ్ లేదని, నేను వెంటనే నా భార్యని ట్రీట్‌మెంట్‌కి తీసుకెళ్లాలని చెబుతాడు రాజ్. పెన్‌డ్రైవ్ ఇస్తావా? లేక నా చేతుల్లో చస్తావా? అని బెదిరిస్తాడు మురుగన్.

నా భార్య ప్రాణాలు కాపాడుకోవడం కోసం మేం ఇంత దూరం వచ్చాం.. నాకు ఆ చనిపోయినవాడికి ఏ సంబంధం లేదు, మేం వెళ్లాలని అంటాడు రాజ్. ఈరోజు ట్రీట్‌మెంట్‌కి ఆఖరు రోజు మమ్మల్ని వెళ్లనివ్వండి అని అడుగుతాడు. పెన్‌డ్రైవ్ ఇవ్వకపోతే కాల్చి చంపేస్తానని మురుగన్ బెదిరిస్తాడు. ఇంతలో రాజ్‌కి తెలిసిన పోలీస్ ఆఫీసర్ వచ్చి మురుగన్ తలకి గన్ పెడతాడు. పెన్‌డ్రైవ్ నా దగ్గర ఉందని చెబుతాడు. పెన్‌డ్రైవ్ పోలీసుల దగ్గర ఉందా? అనవసరంగా ఇన్నిరోజులు వీళ్ల వెంట పడ్డామని అనుకుంటాడు మోటు. ఆ పెన్‌డ్రైవ్ ఇస్తే మేమే వెళ్లిపోతామని మురుగన్ అడగ్గా.. మేమే నీతో చిప్పకూడు తినిపిస్తానని చెబుతాడు పోలీస్ ఆఫీసర్. ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్నది ఆల్రెడీ వైరల్ అవుతోందని ఆఫీసర్ చెబుతాడు. వీళ్లని కేరళ పోలీసులకు అప్పగించి మేం హైదరాబాద్‌లో కలుస్తామని రాజ్‌తో చెబుతాడు పోలీస్ ఆఫీసర్.

స్వరాజ్ కంపెనీ వెనుక ఉన్న క్లయింట్స్ అంతా మనతో డీల్ క్యాన్సిల్ చేసుకున్నారని సుభాష్‌కి శృతి ఫోన్ చేసి చెప్పడంతో అతను షాక్ అవుతాడు. గత 20 ఏళ్లుగా వాళ్లు మనతోనే బిజినెస్ చేస్తున్నారు, కారణం లేకుండా ఎలా క్యాన్సిల్ చేసుకుంటారని అడుగుతాడు. రాహుల్ గారు మన క్లయింట్స్ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టారట. రాహుల్ గారు చూపించిన డిజైన్స్ వాళ్లకు నచ్చడంతో ఈసారి బిజినెస్ మొత్తం రాహుల్ గారి కంపెనీకి ఇచ్చాడట అని చెబుతుంది శృతి. ఆ మాటలతో షాకైన సుభాష్.. ఇదంతా ఎప్పుడు జరిగింది అని ప్రశ్నిస్తాడు. మన క్లయింట్స్ అంతా రాహుల్ గారికి బిజినెస్ ఇచ్చిన మాట నిజం. అలాగే రాహుల్ గారి దగ్గరున్న డిజైన్స్ అన్నీ కావ్య మేడం వేసిన డిజైన్సే అని శృతి చెప్పడంతో సుభాష్ ఉలిక్కిపడతాడు. రాహుల్ మనకంత వెన్నుపోటు పోడుస్తాడా? వాడికంత ధైర్యం లేదు.. రాహుల్ సార్ చూపించిన డిజైన్స్.. కావ్య వేసిన డిజైన్స్ మీకు పంపిస్తున్నానని చెబుతుంది శృతి. ఫోటోలు చూసిన సుభాష్ రగిలిపోతాడు.

గురువుగారి దగ్గర ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్న కావ్య.. ఏ ప్రాబ్లమ్ లేదు కదా? అంతా ఓకేనా? అని అడుగుతుంది. కానీ గురువుగారు మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. మరోవైపు.. కావ్య నుంచి కొట్టేసిన డిజైన్లను ఇంట్లో అందరికీ చూపిస్తాడు రాహుల్. నువ్వు హీరోయిన్‌లా చాలా అందంగా ఉన్నావని స్వప్నని మెచ్చుకుంటుంది ఇందిర. ఏడు వారాల నగలు వేసుకుంటే స్వప్న కంటే నేను ఇంకా అందంగా కనిపిస్తానని చెబుతుంది ధాన్యలక్ష్మీ. నాతో ఫోటోషూట్ చేయిస్తే అప్పుడు చెబుతానని అంటుంది. మొదటి బాలే సిక్స్ కొట్టేశావ్.. మరి పార్టీ ఏం లేదా? అని ప్రకాశం అడుగుతాడు. ఫైవ్ స్టార్ హోటల్‌లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పార్టీ ఇవ్వబోతున్నానని చెబుతాడు రాహుల్. ఇంతలో సుభాష్ సీరియస్‌గా వచ్చి రాహుల్‌ని లాగిపెట్టి కొడతాడు. దాంతో ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు.

రాహుల్ నమ్మకద్రోహం చేశాడని చెబుతాడు సుభాష్. కావ్య వేసిన డిజైన్స్‌ని దొంగిలించి వాడి కంపెనీలో క్లయింట్స్ ముందు చూపించుకున్నాడని అంటాడు. కావ్య వేసిన డిజైన్స్‌ని నేనెందుకు దొంగిలిస్తానని ప్రశ్నిస్తాడు రాహుల్. దాంతో సుభాష్ ఆ ఫోటోలు అందరికీ చూపిస్తాడు. వాటిని చూసిన స్వప్న.. ఈ డిజైన్లు రాహుల్ నా ముందే వేశాడు కదా అని అనుకుంటుంది. కావ్య వేసిన డిజైన్స్ గురించి నాకు తెలియదు.. నాలుగు రోజులు కష్టపడి డిజైనర్స్‌తో దగ్గరుండి నేనే వేయించానని చెబుతాడు రాహుల్. స్వప్న కూడా రాహుల్ ఆ డిజైన్స్ వేస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను, మూడు రోజులు నిద్రపోకుండా ఈ డిజైన్స్ వేశాడని చెబుతుంది. కావ్య వేసిన డిజైన్స్ లాగే, రాహుల్ డిజైన్స్ కూడా ఎలా ఉన్నాయని ప్రశ్నిస్తాడు సుభాష్. మనుషుల్ని పోలిన మనుషులు ఉన్నట్లు ఇద్దరు వ్యక్తులకు ఒకేలాంటి ఆలోచన రాకూడదా అని రుద్రాణి అడుగుతుంది. నా మీద, రాహుల్ మీద నమ్మకం లేకపోయినా స్వప్న మాటల్ని నమ్ముతారు కదా అని అంటుంది రుద్రాణి.

గతంలో నా కొడుకు తప్పు చేశాడు కాబట్టి.. ఇప్పుడు కూడా అలాగే చేసుంటాడని మీరంతా అనుకుంటున్నారని మండిపడుతుంది రుద్రాణి. గతంలో రాహుల్ ఎన్నో తప్పులు చేసినప్పుడు నా కొడుకే క్షమించాడు, నా కొడుకే తిరిగి అవకాశం కూడా ఇచ్చాడని అంటుంది ఇందిర. అవకాశం ఇచ్చారు కదా అని ప్రతిసారి అవమానిస్తారా? అని మండిపడుతుంది రుద్రాణి. మావయ్య ఎక్కడో అపార్ధం చేసుకున్నారు, తండ్రి స్థానంలో ఉండి చిన్న దెబ్బ కొట్టారని అంటాడు రాహుల్. మీ కంపెనీ డిజైన్స్, నా కంపెనీ డిజైన్స్ ఒకేలా ఎందుకు ఉన్నాయో నాకు అర్ధం కావడం లేదని సుభాష్‌తో అంటాడు రాహుల్. నేను ఒకప్పటి రాహుల్‌ను కాదు.. కష్టపడి ఈ డిజైన్స్ వేయించాను, లేదు నేనే తప్పు చేశానని మీరు అనుకుంటే ఏ శిక్ష వేసినా భరిస్తానని చెబుతాడు రాహుల్. కొడుకు ప్లానింగ్‌కి రుద్రాణి సంబరపడిపోతుంది. మరోవైపు.. తాను చేస్తున్న వైద్యానికి 99 శాతం ఫలితం వచ్చినట్లేనని చెబుతాడు గురువుగారు. ఆ మాటలతో రాజ్, కావ్యలు సంబరపడిపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X