Brahmamudi December 13th Episode: రాజ్- కావ్యలను ఇరికించిన రుద్రాణి.. రాహుల్ గుట్టు విప్పే పనిలో సుభాష్

Photo Courtesy: JioHotstar

రేణుక భర్తను స్టేషన్‌కి పిలిపించి ఎంక్వైరీ చేస్తుంది అప్పూ. మీ పాప బతికే ఉందని.. చనిపోయిన పాప ఎవరో తేల్చుకోవడానికి రీ పోస్ట్‌మార్టం చేస్తున్నామని అప్పూ చెప్పడంతో అతనికి చెమటలు పడతాయి. దాంతో అప్పూకి రేణుక భర్తపై అనుమానం మొదలవుతుంది. రౌడీల చెర నుంచి రాజ్- కావ్యలు తప్పించుకుని పారిపోతుండగా మురుగన్ గన్‌తో బెదిరిస్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి రాజ్- కావ్యలను రక్షిస్తారు. స్వరాజ్ కంపెనీకి రాహుల్ చేసిన నమ్మక ద్రోహం గురించి.. కావ్య డిజైన్లను దొంగిలించిన విషయం గురించి సుభాష్‌కి చెబుతుంది శృతి. ఆ మాటలు వినగానే సుభాష్ షాక్ అవుతాడు.

ఇంటి దగ్గర రాహుల్ డిజైన్స్‌ని అందరూ మెచ్చుకుంటూ ఉండగా సుభాష్ వచ్చి రాహుల్‌ని లాగిపెట్టి కొడతాడు. కావ్య వేసిన డిజైన్స్‌ని ఎందుకు దొంగిలించావని సుభాష్ అడగ్గా.. అవన్నీ నా డిజైన్సేనని నేనే నిద్రాహారాలు మాని వేశానని చెబుతాడు. దానికి స్వప్న కూడా సాక్ష్యం చెప్పడంతో సుభాష్ సైలెంట్ అయిపోతాడు. కావ్యకి ట్రీట్‌మెంట్ చేసిన గురువుగారు... ఆమెకు 99 శాతం నయమైపోయిందని చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 13వ తేదీ ఎపిసోడ్ 903లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 13th 2025 Episode 903 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ట్రీట్‌మెంట్‌కి ఈరోజుతో ఆఖరి రోజు అని చెప్పారు.. నా భార్యకి ఎలా ఉంది? అని గురువు గారిని రాజ్ అడుగుతాడు. వారం రోజులుగా జరుగుతున్న వైద్యానికి 99 శాతం ఫలితం వచ్చినట్లేనని గురువుగారు చెప్పడంతో రాజ్, కావ్యలు సంతోషిస్తారు. నేను అందించాల్సిన వైద్యం అందించాను, కానీ మీరు ఇంటికి వెళ్లాక మరో నెలరోజులు కషాయాలు, గుళికలు వాడుతూ, లేపనంతో మర్ధన చేయాలని చెబుతాడు. క్రమం తప్పకుండా ఇవన్నీ చేస్తే పూర్తి ఫలితాన్ని చూడొచ్చు, ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని చెబుతాడు. కలలో కూడా నిర్లక్ష్యం చేయను.. ఇన్నిరోజులు నా భార్య పరిస్ధితి ఏంటీ తెలియక, ఎలా ట్రీట్‌మెంట్ ఇప్పించాలో తెలియక నా భార్యను ఎలా కాపాడుకోవాలో అర్ధం కాక సతమతం అయిపోయానని అంటాడు రాజ్. మీ దగ్గరికి వచ్చాక నా భార్యకు ఇక ఏం కాదని ధీమా కలిగిందని అంటాడు. మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేమని చెబుతాడు. వైద్యుడిగా ప్రాణాలు నిలబెట్టడం నా బాధ్యత. ఆ అమ్మవారు మీ వైపున ఉంది.. అందుకే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందని అంటాడు గురువుగారు.

రాహుల్ చేసిన మోసం గురించి సుభాష్ ఆలోచిస్తుండగా అపర్ణ వచ్చి భర్తను ఓదారుస్తుంది. మీరెప్పుడూ ఇంతలా ఆవేశపడలేదు.. నిజానిజాలు తెలుసుకునే మాట్లాడతారు కదా. ఈరోజు రాహుల్ మీద చేయి చేసుకునేంత కోపం మీకెందుకు వచ్చిందని ప్రశ్నిస్తుంది. ఎప్పుడూ లేని విధంగా మన కంపెనీకి 10 కోట్ల రూపాయల నష్టం వచ్చింది.. అది కూడా రాజ్ లేని టైంలో నేను కంపెనీ బాధ్యతలు తీసుకున్నప్పుడు జరిగిన మిస్టేక్ అని అంటాడు సుభాష్. రాహుల్ మీద మనకి నమ్మకం లేకపోయినా స్వప్న చెప్పిన మాటలు నమ్మేలాగే ఉన్నాయని అంటుంది అపర్ణ.

వాడు తప్పు చేయకపోతే.. మన కంపెనీ క్లయింట్స్‌తో ఎందుకు మాట్లాడాడు? వాడి దగ్గర డిజైన్స్ ఉన్నాయని ఎందుకు చెప్పాలి? అని నిలదీస్తాడు సుభాష్. కొత్త క్లయింట్స్‌ని వెతుక్కోవచ్చు కదా.. మన బిజినెస్‌నే ఎందుకు దెబ్బతీయాలని ఆవేశపడతాడు. ఆ డిజైన్స్ కావ్య దగ్గరి నుంచి నేను దొంగిలించలేదని రాహుల్ అంటున్నాడు, పైగా దానికి సాక్ష్యంగా స్వప్న నిలబడిందని అంటాడు సుభాష్. జీవితంలో మొదటిసారి ఓడిపోయాను, అది కూడా నా ప్రమేయం లేకుండా. అస్సలు వదిలిపెట్టను.. దీని వెనుక ఏం జరిగింది? ఎవరున్నారు? అనేది తెలుసుకుంటానని చెబుతాడు. రాజ్, కావ్యలను డిస్ట్రబ్ చేయడం నాకు ఇష్టం లేదని ఏం జరిగిందో నేనే తెలుసుకుంటానని అంటాడు.

పాప మిస్సింగ్ కేసు గురించి బాధపడుతున్న అప్పూకి కాఫీ ఇచ్చి ఏం జరిగిందని అడుగుతాడు కళ్యాణ్. ఒక్కోసారి ఆ తల్లి మాటలే నిజమని అనిపిస్తున్నాయి.. మరోసారి సాక్ష్యాలే నిజమని అనిపిస్తున్నాయని బాధపడుతుంది అప్పూ. కేసుని సాల్వ్ చేయడం వరకే నీ బాధ్యత.. లేని మనుషుల్ని నువ్వు తీసుకురాలేవని చెబుతాడు. ఈరోజు నేను స్టేషన్‌కి వెళ్లాలని అడుగుతుంది అప్పూ. నేను చూసుకుంటానని కళ్యాణ్ చెబుతాడు. పనిమనిషి ఇల్లంతా క్లీన్ చేస్తుండగా రాజ్ బెడ్‌రూమ్‌లో కావ్యకి హెల్త్ రిపోర్ట్స్ కనిపిస్తాయి. వాటిని రుద్రాణి చూసి అందరి ముందు బయటపెడుతుంది. అందరూ కళ్లు తెరిచి ఆ కాగితాలు చూస్తే నేను ఏమంటున్నానో మీకే అర్ధమవుతుందని అంటుంది. అది చూసిన సుభాష్ షాక్ అవుతాడు. కావ్య సమస్య తీరిపోయిందని డాక్టర్ చెప్పారు కదా... కానీ సమస్య తీరిపోలేదని చెబుతాడు సుభాష్. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.

కావ్య సంతోషంగా బిడ్డను కనొచ్చు, బిడ్డకు తల్లికి ఏ ప్రమాదం లేదు అన్నమాట అబద్ధం. అలా అబద్ధం చెప్పి రాజ్, కావ్య ఇంట్లో మనందరినీ నమ్మించారు. డాక్టర్ చేత కూడా అబద్ధం చెప్పించారు. అసలు నిజం ఏంటంటే? కావ్య బిడ్డని కనకూడదు, ఒకవేళ కంటే బిడ్డ మాత్రమే బతుకుతుంది, కావ్య బ్రతకదు. తనకి ఇంకా ప్రాబ్లమ్ అలాగే ఉందని అంటుంది రుద్రాణి. కావ్య అంత ప్రమాదంలో ఉంటే వాళ్లు ఇలాంటి విషయాన్ని మన దగ్గర ఎందుకు దాచారని బాధపడుతుంది అపర్ణ. రాజ్, కావ్యలు ఏది ఊరికే చేయరు.. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అంటుంది రుద్రాణి. ఇంతలో కేరళ నుంచి రాజ్, కావ్యలు ఇంటికి తిరిగొస్తారు. మా అందరినీ ఎందుకు మోసం చేశారు? మాకు అబద్ధం చెప్పారు? అని రిపోర్ట్స్ ముందుపెట్టి నిలదీస్తుంది అపర్ణ.

తెలిసిన నిజాన్ని ఎలా కవర్ చేయాలా? అని ఆలోచిస్తున్నారా? అని రుద్రాణి నానామాటలు అనడంతో ఇందిర ఆమె నోరుమూయిస్తుంది. నిజాలు ఎందుకు దాచారు? ఎందుకు ఈ విషయాన్ని అంత రహస్యంగా ఉంచారు? అని ఇందిర నిలదీస్తుంది. ఏదో చిన్న అబద్ధం చెప్పి మేనేజ్ చేయడానికి ఇది వ్యాపారం కాదు.. ఈ ఇంటి కోడలి జీవితం. ఆ జీవితంతోనే మన సంతోషం, ఆనందం, మంచి చెడు అన్ని ఉన్నాయని అంటుంది అపర్ణ. నిజం చెప్పే ధైర్యం లేదని, కానీ తప్పలేదు. ఎప్పుడైతే కళావతికి అలాంటి సమస్య ఉందని తెలిసినప్పటి నుంచి ఈ ఇంట్లో ఎవరి ఇంట్లోనూ సంతోషం లేదని చెబుతాడు రాజ్. మాకు బిడ్డ అవసరం లేదు, నువ్వు ప్రాణాలతో ఉంటే చాలని మీరంతా అంటుంటే కావ్య తట్టుకోలేకపోయింది. అందుకే తన ప్రాణాల కోసం బిడ్డ ఊపిరి తీయకూడదని నిర్ణయించుకుంది. ఎలాగైనా తన బిడ్డను కాపాడమని ప్రాధేయపడింది. ఇద్దరినీ కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను.. కానీ ఒక్కరిని మాత్రమే కాపాడగలమని డాక్టర్స్ చెప్పారు అని వివరణ ఇస్తాడు రాజ్.

అబార్షన్స్ చేయించుకోమని నేను, డాక్టర్స్ ఎంత బ్రతిమలాడినా ఆమె వినిపించుకోలేదు... అబార్షన్ చేయడం కుదరదని చెప్పారు. నా బాధని, మీ అందరీ కన్నీళ్లను కళావతి చూడలేకపోయింది. తాను ప్రాణాలతో బతికి ఉన్నన్ని రోజులు మీరంతా సంతోషంగా ఉండాలని.. ఆనందంగా గడపాలని అనుకుందని చెబుతాడు రాజ్. డాక్టర్‌‌తో కూడా అబద్ధం చెప్పించి.. ఇదంతా మీకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుందని అంటాడు. అన్నీ తెలిసినా ఏం చేయలేక, మీతో సంతోషంగా గడపలేక నరకం అనుభవించానని చెబుతాడు. అదే నిజమైతే ఎక్కడికైనా వెళ్లే వాళ్లం, ఎవరికైనా చూపించేవాళ్లం... మా ఆనందం కోసం ఎందుకు ఇలా నటించారని నిలదీస్తుంది అపర్ణ. ఇండియాలోనో లేదంటే మరో దేశానికో తీసుకెళ్లి కావ్యని కాపాడుకునే వాళ్లమని అంటాడు సుభాష్.

ఇప్పుడు ఆ అవసరం లేదని... మనందరికీ పరీక్ష పెట్టిన దేవుడే కళావతి సమస్యకు పరిష్కారం చూపించాడని చెబుతాడు రాజ్. అనుకోకుండా గుడిలో పంతులుగారు కేరళలో వరసిద్ధి ఆచార్యుల వారిని కలవమని సలహా ఇచ్చారు. ఆయన వైద్యంతో కళావతి సమస్య తీరుతుందని చెప్పడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మీ అందరికీ టూర్ వెళ్తున్నామని చెప్పి కళావతిని కేరళ తీసుకెళ్లాను. ఆచార్యుల వారు చేసిన వైద్యం ఫలించిందని రాజ్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X