Brahmamudi December 15th Episode: బయటపడ్డ రాహుల్ కుట్ర... షాక్‌లో రాజ్- కావ్య
Photo Courtesy: JioHotstar
నీ భార్యకు 99 శాతం నయమైపోయిందని గురువుగారు చెప్పడంతో రాజ్, కావ్యలు సంతోషిస్తారు. ఇంటికి వెళ్లాక కూడా నేను ఇచ్చిన కషాయాలు, గుళికలు, లేపనాలు వాడితే ఆమె సమస్య పూర్తిగా తీరిపోతుందని స్వామిజి చెబుతాడు. మీ మేలు ఎప్పటికీ మరిచిపోలేనని, నా జీవితంలో కొత్త ఆశలు తీసుకొచ్చారని అంటాడు రాజ్. పనిమనిషి ఇంటిని క్లీన్ చేస్తుండగా కావ్య ట్రీట్‌మెంట్ ఫైల్ బయటపడుతుంది. అది రుద్రాణి కంటపడటంతో.. కావ్యకు ఇంకా నయం కాలేదని గుర్తించి అందరి ముందు బయటపెడుతుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.
రాజ్, కావ్యలు కేరళ ట్రిప్ ముగించుకుని ఇంటికి రాగా మమ్మల్ని ఎందుకు మోసం చేశావంటూ అపర్ణ, ఇందిరలు నిలదీస్తారు. నేను ఎంత చెప్పినా కావ్య అబార్షన్ చేయించుకోనని చెప్పింది, అప్పటికే అబార్షన్ చేయించే టైం కూడా ముగిసిపోయింది. తన ప్రాణాలు పణంగా పెట్టి బిడ్డకు ఊపిరి పోయాలని కావ్య అనుకుంది. కానీ మీ అందరిలో సంతోషం చూడాలని, ఆనందంగా చనిపోవాలని కళావతి చెప్పడంతో నిజాన్ని దాచామని రాజ్ చెబుతాడు. అయినా కావ్యకి ఇప్పుడు ఏ ఇబ్బంది లేదని కేరళలో ఆయుర్వేద వైద్యం చేయించుకున్నామని... కావ్య ఆనందంగా పిల్లల్ని కనొచ్చని రాజ్ చెప్పగా దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. రాహుల్ చేసిన మోసాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తానని అపర్ణతో చెబుతాడు సుభాష్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 15వ తేదీ ఎపిసోడ్ 904లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కావ్య హెల్త్ విషయంలో ఇప్పటికైనా నిజం చెబుతున్నారా? మాకు అబద్ధం చెబుతున్నారా? అని అడుగుతుంది రుద్రాణి. ఇంట్లో ఎవరు నమ్మినా నువ్వు నమ్మవని మాకు తెలుసని వెంటనే కేరళలో గురువుగారు ఇచ్చిన రిపోర్ట్స్ చూపిస్తాడు రాజ్. నువ్వు నీ భార్య కోసం నటిస్తావు.. అదేమో ఈ ఇంటికి వారసుడిని ఇవ్వడానికి ఆనందంగా ప్రాణ త్యాగం చేస్తుంది.. మేమంతా మూర్ఖులమా అని మండిపడుతుంది అపర్ణ. మాకు సంతోషాన్ని పంచి మీరు బాధను ఎలా దిగమింగారని ప్రశ్నిస్తుంది ఇందిర. కేరళ వెళ్లేముందు మళ్లీ తిరిగిరాను అంటూ అంత బాధగా ఆశీర్వాదం తీసుకున్నావు? నిన్ను నేను కోడలిగా కాకుండా కూతురిగా చూసుకున్నాను.. అలాంటిది నీ బాధను నేను పంచుకోనా అని ప్రశ్నిస్తుంది అపర్ణ.
మా చేతుల్లో బిడ్డను పెట్టి నువ్వు వెళ్లిపోవాలని అనుకున్నావా? అని సుభాష్ కూడా బాధపడతాడు. వారసుడిని ఇచ్చానన్న ఆనందంతో నువ్వు వెళ్లిపోతే నీ బిడ్డను చూస్తూ, నీ జ్ఞాపకాలతో ఎలా బతుకుతామని అనుకున్నావని అడుగుతాడు సీతారామయ్య. ఇన్నాళ్లు గుండెల్లో అంత బాధపెట్టుకుని అందరినీ నవ్విస్తూ ఎలా ఉండగలిగావని అడగుతుంది అపర్ణ. ఆ దేవుడే కరుణించిన నా మనవరాలిని కాపాడాడు, ఆమె సమస్య తీరిపోయింది కదా అని అంటుంది ఇందిర. నేను అబద్థాలు చెప్పినా, చాటుగా ఏడ్చినా అంతా మన కుటుంబం కోసమే, ఇకపై ఆ అవసరం రాదని బాధపడుతుంది కావ్య. మీ ఇంటికి వారసుడిని ఇవ్వాలనుకున్న మీ అందరి ఆశను నేను తీర్చబోతున్నానని చెబుతుంది.
నువ్వు ఈ ఇంటి పెద్ద కొడుకువి, అందరి బాధ్యత నువ్వే తీసుకోవాలి.. ఎవరి కంట్లోనూ నీళ్లు రానివ్వకుండా చూసుకోవాలని చెప్పినప్పటి నుంచి నీ బాధ్యతల్ని గొప్పగా నిర్వర్తిస్తున్నావని రాజ్‌ని మెచ్చుకుంటాడు సీతారామయ్య. మీరు చెప్పిన మాట ఎప్పుడూ మరిచిపోను, ఈ ఇంట్లో అందరి సంతోషమే నా సంతోషమని చెబుతాడు రాజ్. ఇంతలో రాజ్‌కి రమాకాంత్ అనే అతను ఫోన్ చేస్తాడు. సాయంత్రం అవార్డ్ ఫంక్షన్ ఉందని 10 గంట వరకు వచ్చేయమని చెబుతాడు. కానీ ఆ అవార్డ్ ఎందుకు? ఏమిటీ అనేది మీకు తెలుసు కదా అని చెబుతూ ఆ వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు. రాజ్‌కి ఏం అర్ధం కాక సుభాష్‌ని ఏం జరిగిందని అడుగుతాడు.
దానికి ఆన్సర్ నేను చెబుతానని స్వప్న అంటుంది. కావ్య, నువ్వు పెట్టిన కంపెనీని షార్ట్ టైంలోనే రాహుల్ మార్కెట్‌లోకి తీసుకెళ్లగలిగాడని చెబుతుంది స్వప్న. మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఆర్ కంపెనీ డిజైన్సే, తక్కువ టైంలో ఎక్కువ మార్కెటింగ్ చేసిన కంపెనీగా ఆర్ కంపెనీ గుర్తించబడి అసోసియేషన్ వాళ్లు రాహుల్‌కి అవార్డ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారని స్వప్న చెబుతుంది. దాంతో రాజ్, కావ్య ఎంతో సంతోషిస్తారు. ఇదంతా మీ చలవేనని రాహుల్ అంటాడు. నేను ఇదంతా వద్దని చెప్పినా అసోసియేషన్ వాళ్లు వినలేదని చెబుతాడు రాహుల్. ఇలాంటి కష్టానికి గుర్తింపు ఉండాలని అంటాడు రాజ్. మీరు కూడా ఫంక్షన్‌కి వస్తారా అని రాహుల్ అడగ్గా.. ఖచ్చితంగా వస్తామని చెబుతుంది కావ్య. ఈ మాటలు విన్న అపర్ణ, సుభాష్‌లు రగిలిపోతారు.
పోలీస్ స్టేషన్‌కి వెళ్లడానికి అత్తయ్యకి రోజుకొక అబద్ధం చెబుతున్నామని కళ్యాణ్ దగ్గర అప్పూ బాధపడుతుంది. ఎవరికీ చెప్పొద్దు.. నువ్వు ఒక్కదానివే బయటికి వెళ్తే నేను ఇంట్లోనే ఉండి ఏదోలా మేనేజ్ చేస్తానని చెబుతాడు కళ్యాణ్. ఆ మాటలతో అప్పూ షాక్ అవుతుంది. నువ్వు ఇంటి వెనకాల నుంచి వెళ్లిపో నేను చూసుకుంటానని అప్పూ చెబుతున్నా వినిపించుకోకుండా ఆమెను వెనుక నుంచి పంపిస్తాడు. ఇంతలో ప్రకాశం ఇదంతా చూస్తాడు. మరోవైపు.. ధాన్యం జ్యూస్ తీసుకుని వెళ్తుండగా ఆమెను కళ్యాణ్ ఆపుతాడు. నేను తీసుకెళ్లి ఇస్తానని రకరకాల అబద్ధాలు చెబుతాడు. ఇదంతా వింటున్న ప్రకాశం షాక్ అవుతాడు. దీనిపై ప్రకాశం నిలదీయగా... కళ్యాణ్ రకరకాలుగా కన్‌ఫ్యూజ్ చేసి తండ్రిని డైవర్ట్ చేస్తాడు.
రాహుల్ అవార్డ్ ఫంక్షన్‌కి కావ్య, రాజ్‌లు వస్తారు. తక్కువ టైంలోనే బాగా డెవలప్ చేశావని రాహుల్‌ని మెచ్చుకుంటాడు రాజ్. అంతేకాకుండా కాస్ట్‌లీ వాచ్‌ని గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇలాంటిది పెట్టుకునే అర్హత నాకు లేదు.. నీ అంత గొప్ప బిజినెస్‌మెన్ కాదని చెబుతాడు రాహుల్. నువ్వు ఇలాగే కష్టపడితే నాతో ఈక్వల్‌గా మార్కెట్‌లో నిలబడతావని అంటాడు రాజ్. నీతో ఈక్వల్ కావడం కాదు.. నిన్నే దాటుకుని వెళ్లిపోతానని మనసులో అనుకుంటాడు రాహుల్. ఇంత తక్కువ టైంలో బిజినెస్‌లో గ్రోత్ తీసుకురావడం అంటే మాటలా అని రాహుల్‌ని మెచ్చుకుంటుంది కావ్య. రాహుల్ మనం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడని చెబుతాడు రాహుల్.
ఇంత షార్ట్ టైంలో క్లయింట్స్‌ని ఎలా పట్టుకున్నావ్? వారిని ఒప్పించి ఇంత బిజినెస్ చేయగలిగావ్? కావ్య ప్రశ్నిస్తుంది. నువ్వు ఎంతో కష్టపడ్డావు.. రాహుల్‌కి పనిలో పడి పగలేదో, రాత్రి ఏదో తెలియలేదని మెచ్చుకుంటుంది స్వప్న. రాత్రిపగలు మేలుకుని కంపెనీ గురించే ఆలోచించేవాడు, సరిగా తిండి కూడా తినేవాడు కాదని చెబుతుంది. రాజ్, కావ్య పడిన కష్టం ముందు మనదెంత? మనవాళ్ల ముందే మన గురించి చెప్పుకోవడం ఏంటీ? అని అంటాడు రాహుల్. నువ్వు మారావు, పనిని దైవంలా భావించావని చెబుతాడు రాజ్. కాసేపట్లో నీ పెళ్లాం వేసిన డిజైన్స్.. నా డిజైన్స్ అని అందరూ పొగుడుతుంటే నీకు అప్పుడు ఉంటుందని మనసులో అనుకుంటాడు రాహుల్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











