Brahmamudi December 16th Episode: రాహుల్ మోసంతో రాజ్ ఆవేదన... దుగ్గిరాల ఫ్యామిలీకి బీటలు

Photo Courtesy: JioHotstar

కావ్యకు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని బిడ్డల్ని కనొచ్చని రాజ్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. కానీ మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్లిపోదామని అనుకున్నావంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇంతలో రాజ్‌కు ఓ ఫోన్ వస్తుంది. రాహుల్ బిజినెస్ బాగా చేసినందుకు అతనికి అవార్డ్ ఫంక్షన్ ఏర్పాటు చేశామని ఖచ్చితంగా రావాలని వారు అడుగుతారు. దాంతో రాజ్, కావ్యలు సంతోషిస్తారు. మాకు ఇంత మంచి విజయం ఎందుకు చెప్పలేదని రాహుల్‌ని అడుగుతారు. ఆ మాటలతో సుభాష్, అపర్ణలు రగిలిపోతుంటారు.

అప్పూని దొంగచాటుగా ఇంటి వెనుక నుంచి పంపిస్తూ ప్రకాశానికి దొరికిపోతాడు కళ్యాణ్. అప్పూ బయటకి వెళ్లిపోయినా బెడ్‌రూంలోనే ఉందని ధాన్యానికి అబద్ధం చెబుతాడు. అవార్డ్ ఫంక్షన్‌కి వచ్చిన రాజ్, కావ్యలు.. ఇంత తక్కువ టైంలో బాగా బిజినెస్ చేశావని రాహుల్‌ని మెచ్చుకుంటారు. రాహుల్ ఎంతో కష్టపడ్డాడని, నిద్ర కూడా పోలేదని తన భర్త గురించి గొప్పగా చెబుతుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 16వ తేదీ ఎపిసోడ్ 905లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 16th 2025 Episode 905 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రేణుక పాపకి సంబంధించిన డీఎన్ఏ రిపోర్ట్ రావడంతో అది చూసి అప్పూ షాక్ అవుతుంది. ఇంతలో సీఐ వచ్చి ఎమ్మెల్యే గారి మేనల్లుడి కేసు టేకప్ చేయమని మండిపడతాడు. నీకెన్నిసార్లు చెప్పినా నా మాట పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతాడు. దాంతో ఆమె సీఐకి కొత్త రిపోర్ట్స్ చూపించడంతో అతను షాక్ అవుతాడు. విషయం లేదనుకున్న కేసును బాగా ముందుకు తీసుకెళ్లావు.. నువ్వు పాపను వెతికే పనిలోనే ఉండమని అభినందిస్తాడు. రేణుక భర్తని స్టేషన్‌కి పిలిపించమని కానిస్టేబుల్స్‌కి ఆర్డర్స్ వేస్తుంది.

రాహుల్ అవార్డ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరుగుతుంది. అతి తక్కువ సమయంలోనే కంపెనీని టాప్ రేంజ్‌కి తీసుకెళ్లిన వారికి బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఇవ్వడం మన ఆనవాయితీ. కంపెనీ పెట్టిన నెలరోజుల్లోనే తన వ్యాపారాన్ని విస్తరించి, తన కంపెనీని జనంలోకి తీసుకెళ్లడమే కాకుండా జ్యూవెలరీని కొంటే ఆర్ కంపెనీలోనే కొనాలి అన్నంతగా మార్కెట్‌లోకి కొత్త డిజైన్స్‌ని రాహుల్ తీసుకొచ్చాడని ప్రశంసిస్తారు. ఈ ఏడాది రాహుల్‌కి బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ ఇవ్వడం మా అందరికీ సంతోషంగా ఉందని అంటారు. ఆ రాహుల్ ఎవరో కాదు.. రాజ్ గారికి సొంత బంధువు అని చెబుతాడు. రాహుల్‌ని తర్వాత వేదిక మీదకి పిలుస్తారు.

రాహుల్ వేసిన కొత్త డిజైన్స్‌ని మనమంతా ఒకసారి చూద్దామని వాళ్లు అడగటంతో.. వాటిని స్క్రీన్‌ మీద ప్రజెంటేషన్ చేస్తారు. మోడల్‌గా స్వప్న వేసుకున్న నగల తాలూకా డిజైన్స్ అన్ని తను వేసినట్లుగా ఉండటంతో కావ్య షాక్ అవుతుంది. ఆ వెంటనే రాజ్‌కి కోపం తన్నుకొస్తుంది. స్టేజ్ మీదకి వెళ్లబోతుండగా కావ్య ఆపుతుంది. అవార్డ్ తీసుకున్న అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. నేను మీ అందరి చేతా చప్పట్లు కొట్టించుకుంటూ అభినందనలు అందుకుంటున్నాను అంటే దానికి కారణం రాజ్, కావ్యలే. వాళ్లిద్దరూ నన్ను నమ్మి ఆర్ కంపెనీని నాకు అప్పగించడం వల్లే కంపెనీకి ఛైర్మన్ అయ్యాను. అహర్నిశలు కష్టపడ్డాను, అవార్డ్ అందుకుంటున్నానని చెబుతాడు రాహుల్.

నన్ను నమ్మినా, నమ్మకపోయినా నా తరపున నిలబడి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది నా భార్య స్వప్న అంటాడు. ఈ అవార్డ్‌ని నా భార్య స్వప్నకే అంకితం ఇస్తున్నాను అని చెబుతాడు. నా సక్సెస్‌కి కారణమైన రాజ్ చేతుల మీదుగా అవార్డ్ అందుకోవాలని అనుకుంటున్నానని అంటాడు రాహుల్. దాంతో రాజ్‌ని వేదిక మీదకి పిలుస్తారు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న రాజ్ వెళ్లకపోవడంతో కావ్య బలవంతం మీద అక్కడికి వెళ్లి రాహుల్‌కి అవార్డ్ ఇస్తాడు. ఆ వెంటనే రాజ్, కావ్యలు అక్కడి నుంచి వచ్చేస్తారు.

అప్పూకి భోజనం ఇచ్చేందుకు ధాన్యలక్ష్మీ వెళ్తుండగా కళ్యాణ్ ఆపుతాడు. కళ్యాణ్ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ధాన్యం లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ ప్రకాశం పడుకుని ఉంటాడు. ఎంత లేపుతున్నా ప్రకాశం లేవకపోవడంతో నువ్వే తినిపించమని ప్లేట్ ఇచ్చి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. అమ్మ వెళ్లిపోయింది నువ్వు లే, నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్లాక అమ్మని మేనేజ్ చేయలేక ఎంత కష్టపడ్డానో అంటాడు. ఆ వెంటనే దుప్పట్లో ఉన్నది ప్రకాశం అని చూసి కళ్యాణ్ షాక్ అవుతాడు.

నన్నెందుకు అక్కడి నుంచి లాక్కొచ్చావని కావ్యపై మండిపడతాడు రాజ్. మన డిజైన్స్ దొంగిలించి వాడు వేసినట్లు బిల్డప్ ఇస్తున్నాడు.. నలుగురిలో వాడి పరువు తీసేవాడిని అంటాడు. మీరు ఇలా ఆవేశపడతారనే ఇక్కడికి తీసుకొచ్చానని చెబుతుంది కావ్య. మన ఉప్పు తిని మనకే వెన్నుపోటు పొడిచాడు.. మనల్ని నమ్మించి నిలువునా మోసం చేశాడు. అలాంటివాడిని వదిలేయాలా? వాడు అంతు తేలుస్తానని అంటాడు. అలా చేస్తే పోయేది రాహుల్ పరువే కాదు.. మన కుటుంబం పరువు కూడా పోతుందని హెచ్చరిస్తుంది. రాహుల్ అంటే సీతారామయ్య గారి మనవడని చెబుతుంది. రాహుల్ గాడు మన డిజైన్స్‌ని దొంగిలించడం మాత్రమే కాదు.. మన కంపెనీకి ద్రోహం చేశాడని అంటాడు రాజ్. బయటివాళ్లు చేశారంటే అనుకోవచ్చు.. కానీ మనింట్లో మనిషే. నమ్మ వాడిని నిలబెట్టాలని చూస్తే.. మనల్ని పడగొట్టాలని చూశాడని రగిలిపోతాడు.

ఇప్పుడు ఆవేశపడితే ఇంట్లో సమస్యలు వస్తాయని.. వాడు మారేవాడు కాదని ముందు నుంచి చెబుతూనే ఉన్నాను, నువ్వే వినలేదని రాజ్ మండిపడతాడు. స్వప్న బాధను చూసి ఒక్క అవకాశం ఇవ్వమన్నావు. నీ కోసం, స్వప్న కోసం ఒక్క అవకాశం ఇస్తే.. వాడు మాత్రం నమ్మకాన్ని కాల్చేశాడని అంటాడు. మన ఐడియాల్ని దొంగిలించి ఓ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌లా చెలామణి అవుతున్నాడని రగిలిపోతాడు రాజ్. వాడు చేసిన దానికి ఇప్పుడే శిక్షపడాలని ఆవేశపడతాడు. కావ్య ఎంత ఆపుతున్నా వినిపించుకోకుండా వెళ్తుండగా రాజ్‌కి స్వప్న ఎదురుపడుతుంది. మీరిద్దరి రుణం తీర్చుకోలేను, కావ్య నా చెల్లెలు కాబట్టి నా కోసం ఏమైనా చేస్తుంది. కానీ నువ్వు నా కోసం ఇంత చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది స్వప్న.

నువ్వు నాకు మరిదివి కావొచ్చు.. కానీ రాహుల్ నీకు అన్నకాదు, తమ్ముడు కాదు. కేవలం దుగ్గిరాల కుటుంబంతో ఉన్న చిన్న బంధం తనది. అయినా రాహుల్‌ని నమ్మి ఇంత గొప్ప అవకాశం ఇచ్చావు. రాహుల్ ఈరోజున ఇంత మర్యాద పొందుతున్నాడంటే దానికి కారణం నువ్వు అంటుంది. రాహుల్‌కి ఈ మర్యాద దక్కాలనే నేను కలలు కన్నానని అంటాడు. ఒకప్పుడు రాహుల్‌ని ఇంట్లో వాళ్లే నమ్మలేదు.. కానీ నువ్వు నమ్మావు ఇప్పుడు ఇంతటి సంతోషం నీవల్లేనని పొంగిపోతుంది. ఒకప్పుడు ఇలాంటి మనిషినా నేను పెళ్లి చేసుకుందని బాధపడేదానిని. ఈరోజు స్వర్గంలో అడుగుపెట్టినట్లుగా ఉందని అంటుంది స్వప్న. నీ దయ వల్ల తను మారాడు.. ఇంకా ఎదుగుతాడని, మరే తప్పు చేయనివ్వనని దండం పెడుతుంది. ఆ మాటలతో రాజ్ మనసు కరిగిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X