Brahmamudi December 17th Episode: స్వప్న కోసం రాహుల్‌ని క్షమించిన రాజ్... ఇంటి దొంగపై కావ్య నిఘా
Photo Courtesy: JioHotstar
అవార్డ్ ఫంక్షన్‌లో రాహుల్‌ని అందరూ మెచ్చుకుంటూ ఉండగా... రాజ్, కావ్యలు కూడా సంతోషిస్తారు. కంపెనీ పెట్టిన నెలరోజుల్లోనే బిజినెస్‌ను భారీగా విస్తరించి, ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు అతనికి అవార్డ్ కోసం వేదిక మీదకి పిలుస్తారు. ఈ సందర్భంగా రాహుల్ వేయించిన డిజైన్లను అక్కడి స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ చేస్తారు. అది చూసిన రాజ్, కావ్యలు షాక్ అవుతారు. మన డిజైన్లు దొంగిలించి, మనకే వెన్నుపోటు పొడుస్తాడా అంటూ రాజ్ రగిలిపోతుండగా కావ్య ఆపుతుంది. తర్వాత రాజ్ చేతుల మీదుగానే తనకు అవార్డ్ ఇప్పించాల్సిందిగా రాహుల్ అడగటంతో నిర్వాహకులు రాజ్‌ని వేదిక మీదకి పిలిచి అవార్డ్ ఇప్పిస్తారు.
పాప రీ పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ రావడంతో అప్పూ ఉలిక్కిపడుతుంది. అప్పుడే సీఐ రావడంతో జరిగినదంతా చెబుతుంది. దాంతో ఆయన అప్పూని మెచ్చుకుని ఈ కేసును నువ్వు వదిలేయొద్దు, పాప ఆచూకీ కనిపెట్టమని చెబుతాడు. అప్పూకి భోజనం ఇచ్చేందుకు ధాన్యలక్ష్మీ పైకి వస్తుంది. అక్కడ మంచం మీద అప్పూ ప్లేస్‌లో ప్రకాశం పడుకుని ఉంటాడు. దాంతో వచ్చింది అప్పూనే అనుకుంటాడు కళ్యాణ్. ఆ వెంటనే తండ్రిని చూసి ఉలిక్కిపడతాడు. రాహుల్ అంతు తేలుస్తానని ఆవేశంతో వెళ్తున్న రాజ్‌కి స్వప్న ఎదురై నీ మేలు ఈ జన్మకి మరిచిపోలేనని ఏడుస్తూ అతనికి దండం పెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 17వ తేదీ ఎపిసోడ్ 906లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
అవార్డ్ ఫంక్షన్‌లో రాహుల్‌ని నిలదీసేందుకు ఆవేశంగా వెళ్లిన రాజ్‌కి స్వప్న ఎదురై కన్నీళ్లతో టెన్షన్ చెబుతుంది. మా అక్క మీ మీద ఎంత కృతజ్ఞత చూపిస్తుంది? తన భర్త సాధించిన విజయంతో పొంగిపోతుంది. ఇప్పుడు మీరు వెళ్లి రాహుల్‌ని పది మందిలో నిలదీస్తే మా అక్క మనసు ముక్కలవుతుంది. తన భర్త జీవితంలో మారడని ఒక నిర్ణయానికి వచ్చేస్తుందని చెబుతుంది కావ్య. భార్య మాటలతో రాజ్ ఆలోచనలో పడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పోలీస్ స్టేషన్ నుంచి అర్థరాత్రి దొంగతనంగా వచ్చిన అప్పూకి ప్రకాశం ఎదురవ్వడంతో ఆమె షాక్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు అని ప్రకాశం అడగ్గా.. మీ అబ్బాయికి పెన్నులో ఇంక్ అయిపోయిందని చెబితే అది కొనుక్కుని రావడానికి వెళ్లానని అంటుంది అప్పూ. ఇది వర్కవుట్ కాలేదు కానీ ఇంకో ప్లాన్ చెప్పమని అంటాడు. దాంతో చల్లగాలి కోసం బయట తిరుగుతున్నానని అంటుంది అప్పూ. ఇంతలో కళ్యాణ్ వచ్చి ఏం చెప్పొద్దని సైగలు చేస్తాడు. నాన్నకి అంతా తెలిసిపోయిందని అంటాడు.
అసలు మీరెంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుస్తుందా అని నిలదీస్తాడు ప్రకాశం. ఒక కేసు అర్జెంట్‌గా డీల్ చేయాల్సి రావడంతో వెళ్లానని అంటుంది అప్పూ. అసలు మీ అత్తయ్యకి నువ్వు పోలీస్ జాబ్ చేయడమే ఇష్టం లేదు. కానీ అందరూ బలవంతం చేయడంతో ఒప్పుకుంది. కానీ కండీషన్ ఏంటీ? నువ్వు ప్రెగ్నెంట్ అవ్వగానే.. బిడ్డ పుట్టేంత వరకు, నువ్వు కుదుట పడేంత వరకు ఇల్లు దాటి వెళ్లకూడదు. నువ్వు దొంగచాటుగా మీ అత్తయ్య కళ్లు కప్పి జాబ్‌కి వెళ్లడం, దానికి నువ్వు సపోర్ట్ చేయడం.. ఇదంతా మీ అమ్మకి తెలిసిందనుకో ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి అని భయపెడతాడు. కడుపుతో ఉన్నవాళ్లు సంతోషంగా ఉంటే బిడ్డ బాగా పుడుతుంది.. అందుకే అప్పూ సంతోషం కోసం ఇదంతా చేశానని అంటాడు కళ్యాణ్. ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే నిన్ను కైమా చేస్తుందని వార్నింగ్ ఇస్తాడు ప్రకాశం. ఏం జరిగినా నువ్వు ఉన్నావు కదా అని తండ్రిని మాటలతో పడేస్తాడు కళ్యాణ్.
మీ నాన్నని నమ్మించి మోసం చేశాడు, మన కంపెనీకి కోట్ల రూపాయల నష్టం తీసుకొచ్చాడు అలాంటి రాహుల్‌ని ఇంకా క్షమిస్తావా అని రాజ్‌ని అపర్ణ నిలదీస్తుంది. వాడు చేసిన పనికి అక్కడిక్కడే కాలర్ పట్టుకుని కడిగిపారేద్దామని అనుకున్నా. వాడి బాగు కోరి ఓ కంపెనీకి ఓనర్‌ని చేస్తే ఆ కృతజ్ఞత లేకుండా మా డిజైన్సే కొట్టేసి మాకే వెన్నుపోటు పొడిచినవాడిని అందరిలో వాడి నిజస్వరూపం ఏంటో బయటపెట్టి క్లయింట్స్‌తో చీ కొట్టించాలని అనుకున్నాను. కానీ ఎందుకు ఆగానో తెలుసా? కేవలం స్వప్న కోసం అని చెబుతాడు రాజ్. వందమందిలో వాడిని నిలదీద్దాం అనుకున్నాం సమయంలో స్వప్న అడ్డు పడిందని అంటాడు. స్వప్నకి తెలిస్తే ఆమె గడ్డి పెట్టేదని, కానీ రాహుల్‌ని అమాయకంగా నమ్ముతోందని చెబుతాడు రాజ్. చాలా కష్టపడి పైకి వచ్చాడని నమ్ముతోంది, వాడొక గొప్ప క్రియేటర్ అని ఊహించుకుంటోందని అంటాడు.
స్వప్న ఇన్నాళ్లూ రాహుల్ విషయంలో చాలా విసిగిపోయింది, ఇప్పుడు వాడు స్వప్నకి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. రాహుల్ మారాడని, మారి మనిషి అయ్యాడని, వాడు ఎదుగుతున్నాడని, తనకి గౌరవం తెచ్చాడని కలలు కంటోంది. ఇప్పుడు నేను వెళ్లి ఈ డిజైన్స్ రాహుల్‌వి కావు.. ఇదంతా చీటింగ్ అని, ఆ డిజైన్స్ నా కంపెనీ నుంచి దొంగిలించబడినవి అని స్వప్నకి తెలిస్తే స్వప్న తట్టుకోలేదు సరికదా, రాహుల్‌ని కన్నెత్తి కూడా చూడదని చెబుతాడు రాజ్. మేం కూడా స్వప్నని బాధపెట్టాలని అనుకోవడం లేదు.. కానీ రాహుల్ గాడి బుద్ధి ఎలాంటిదో తెలిసిందిగా అని అంటాడు సుభాష్. వాడు ఎదగాలని అనుకోవడంలో తప్పులేదు.. కానీ మన కంపెనీని దెబ్బకొడితే చూస్తూ ఊరుకుంటావా అని మండిపడుతుంది అపర్ణ.
రాహుల్ ఎలాంటి వాడైనా అతను నా అక్క భర్త.. అక్క కోసమే మీ అబ్బాయి ఈరోజు మౌనంగా ఉన్నాడని ఇందుకు నేను మీకు క్షమాపణలు చెబుతున్నానని అంటుంది కావ్య. రాహుల్‌ని ఒక్కడినే అంటున్నారు.. కానీ సిటీలో మనకి చాలా మంది శత్రువులు ఉన్నారు, మన కంపెనీని దెబ్బతీయడానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు అయినా మనం వెనక్కి తగ్గలేదు. వాళ్లని ఎదుర్కొని కొత్త కొత్త డిజైన్స్ చేసి మార్కెట్‌లో నెంబర్‌వన్‌గా నిలబడ్డాం. రాహుల్‌ని ఇంట్లో మనిషి అనుకోకుండా బిజినెస్‌లో పోటీదారుడు అనుకుని కొత్త డిజైన్స్ తయారు చేస్తామని చెబుతుంది కావ్య. భార్య చెప్పిన దానికి రాజ్ కూడా ఏకీభవిస్తాడు. మళ్లీ మళ్లీ ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రాహుల్‌కి బుద్ధి చెబుతామని అంటాడు రాజ్. నష్టాన్ని, క్లయింట్స్‌ని తిరిగి వెనక్కి తీసుకొస్తామని రాజ్ చెబుతాడు.
కొడుకు సాధించి తెచ్చిన అవార్డ్‌ని చూసి రుద్రాణి మురిసిపోతుంది. నువ్వు చేసిన మోసాన్ని ఎలా కవర్ చేశావని రుద్రాణి అడగ్గా.. స్వప్న ఉన్నంత కాలం మనకి ఏ ఇబ్బంది లేదని అంటాడు రాహుల్. అవార్డ్స్ ఫంక్షన్‌లో నిజం తెలిసినా.. స్వప్న అడ్డుపడేసరికి కావ్య, రాజ్‌లు నోరుమూసుకుని వెళ్లిపోయారని చెబుతాడు. త్వరలోనే వాళ్లను కొట్టబోయే దెబ్బ మామూలుగా ఉండదని అంటాడు. కంపెనీలో స్టాఫ్ మొత్తాన్ని పిలిచి రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతాడు రాజ్. మీరంతా నా కుటుంబం అనుకున్నాను.. కానీ నేను వారం రోజులు లేకపోయేసరికి ఒకరికి అమ్ముడు పోయారు, ఈ కంపెనీలో ఉన్న గుంట నక్క ఎవరు? అని నిలదీస్తాడు.
కొత్త డిజైన్స్ వేసి తీసుకొచ్చానని.. ఇవి లీక్ అవ్వడానికి వీల్లేదని చెబుతుంది కావ్య. వాటిని చూసి ఒక ఉద్యోగి.. ఆ డిజైన్లను ఎలాగైనా కొట్టేయాలని అనుకుంటాడు. అయితే నేను నీకు ఏ డిజైన్స్ గురించి చెప్పలేదు, ఏం మాట్లాడలేదు అని కావ్యని అడుగుతాడు రాజ్. అయితే కావ్య కాఫీ తాగాలని రాజ్‌ని బయటికి తీసుకెళ్తుంది. కానీ కాఫీ తాగకుండా ఓ మూలన నిల్చొమని చెబుతుంది. కానీ ఇంతలోనే ఓ ఉద్యోగి దొంగచాటుగా రాజ్ రూమ్‌లో డిజైన్స్ కొట్టేయడానికి ఒక వ్యక్తి రావడాన్ని కావ్య చూస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










