Brahmamudi December 18th Episode: కావ్య- రాజ్‌లను మరో దెబ్బకొట్టిన రాహుల్... పాప వేటలో అప్పూ

Photo Courtesy: JioHotstar

పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వస్తూ ప్రకాశంకు దొరికిపోతుంది అప్పూ. తప్పించుకోవడానికి మామగారికి ఏదో ఒకటి చెబుతుండగా కళ్యాణ్ వచ్చి నాన్నకి మొత్తం తెలిసిపోయిందని అంటాడు. ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే మీ ఇద్దరినీ కైమా చేస్తుందని వార్నింగ్ ఇస్తాడు ప్రకాశం. ఏం జరిగినా కాపాడటానికి నువ్వు ఉన్నావు కదా అని అప్పూని తీసుకుని వెళ్లిపోతాడు కళ్యాణ్. అవార్డ్స్ ఫంక్షన్‌లో రాహుల్ తనను మోసం చేసిన విషయం బయటపడిందని దుగ్గిరాల ఫ్యామిలీకి చెబుతాడు రాజ్. ఆ రాహుల్‌ని క్షమించడానికి కారణం స్వప్న అని.. తను లేకపోతే వాడి అంతుచూసే వాడినని చెబుతాడు రాజ్.

వాడు మమ్మల్ని మోసం చేశాడు.. కానీ నేనంటే ఏంటో రాహుల్‌కి బుద్ధి చెబుతానని అంటాడు రాజ్. తను గెలిచిన అవార్డ్‌ని తీసుకొచ్చి తల్లికి చూపించగా రాహుల్‌ని రుద్రాణి మెచ్చుకుంటుంది. త్వరలో నేను కొట్టబోయే దెబ్బకు రాజ్- కావ్యలకు చుక్కలు కనిపిస్తాయని అంటాడు రాహుల్. ఆఫీసులో డిజైన్స్ దొంగిలించిన వాడిని పట్టుకోవడానికి కావ్య ప్లాన్ వేయగా ఆ ఉద్యోగి దొరికిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 18వ తేదీ ఎపిసోడ్ 907లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 18th 2025 Episode 907 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాహుల్‌కి అమ్ముడుపోయిన ఉద్యోగిని రాజ్, కావ్యలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. ఇలాంటి వాళ్లను కొట్టి ప్రయోజనం లేదని పోలీసులకు అప్పగించాలని రాజ్‌తో అంటుంది కావ్య. తప్పు చేసిన వారిని పట్టుకోవడంలో నన్ను మించిపోయావని కావ్యని మెచ్చుకుంటాడు రాజ్. ఎంతైనా మీ శ్రీమతిని ఆ మాత్రం ఉంటుందని అంటుంది కావ్య. పాప మిస్సింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా రేణుక భర్తను పోలీస్ స్టేషన్‌కి పిలిపిస్తుంది అప్పూ. మీకు గుడ్ న్యూస్ అని అప్పూ చెప్పగా.. ఈ కేసుని క్లోజ్ చేస్తున్నారా? అని అడుగుతాడు ఆ వ్యక్తి. కేసు క్లోజ్ చేస్తే గుడ్‌న్యూస్ ఎలా అవుతుంది? అని ప్రశ్నిస్తుంది అప్పూ.

మీ పాప చనిపోలేదు.. బతికే ఉంది అని అప్పూ అనడంతో రేణుక భర్త షాక్ అవుతాడు. మీ డిపార్ట్‌మెంట్ వాళ్లే పాప చనిపోయిందని చెప్పారు.. ఇప్పుడు మీరు పాప బతికే ఉందని చెప్పడంతో షాకింగ్‌గా ఉందని అంటాడు. చనిపోయిన పాప మీ పాప కాదని .. మీ పాప ఎక్కడో బతికే ఉందని త్వరలోనే తెలుసుకుంటామని చెబుతుంది అప్పూ. తప్పు చేసిన వాళ్లు ఎంతటి వాళ్లయినా, ఎలాంటి వాళ్లయినా సరే మా నుంచి తప్పించుకోలేడని అంటుంది అప్పూ. నేను చెప్పిన విషయం మీ వైఫ్‌కి కూడా చెప్పమని రేణుక భర్తను పంపించేస్తుంది. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో వాడి గురించి పూర్తి వివరాలు నాకు కావాలని కానిస్టేబుల్‌కి ఆర్డర్స్ వేస్తుంది అప్పూ.

కావ్య కష్టపడి కొత్త డిజైన్స్ వేయడంతో రాజ్ కాఫీ తీసుకొచ్చి భార్యకి ఇస్తాడు. కానీ కావ్య వేసిన డిజైన్స్ అతనికి నచ్చకపోవడంతో బాలేదని చెబుతాడు. దాంతో కావ్య అలిగి వెళ్లిపోతుంది. నా నోటి దూల గురించి నీకు తెలిసిందే కదా ఏదో ఒకటి వాగేస్తానని చెబుతాడు. ఏదో ఒకలా బుజ్జగించడంతో కావ్య కరిగిపోతుంది. కానీ కావ్యకి ఫోన్ చేసి నీ డిజైన్స్ చాలా చండాలంగా ఉన్నాయి.. నీ కంటే నా భార్యే బాగా వేసిందని చెబితేనే కొత్త డిజైన్స్ వేస్తానని కండీషన్ పెడుతుంది కావ్య. దాంతో చేసేదేం లేక దానికి సరేనని అంటాడు రాజ్. ఈరోజు నువ్వు డిజైన్స్ వేస్తావు.. రాత్రికి రాత్రే డెమో పీసెస్ రెడీ చేసేస్తావనే నమ్మకంతో రేపు మోడల్‌ని పిలిపించి షూటింగ్‌ చేయిద్దామని అనుకున్నానని అంటాడు రాజ్. ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని కావ్య అడగ్గా.. తర్వాత చెబుదామని అనుకున్నాని అంటాడు రాజ్.

రాజ్- కావ్యలు మాట్లాడిన మాటలను దొంగచాటుగా విన్న రాహుల్.. ఈ రోజు డిజైన్స్ వేసి, రేపు మోడల్‌తో షూట్ చేసి, ఎల్లుండి పబ్లిసిటీ చేసేద్దామని అనుకున్నావా? ఈ రెండు రోజులు నిన్ను అడ్డుకుంటే చాలు.. రెండో విజయం కూడా నాకే సొంతం అవుతుందని అనుకుంటాడు రాహుల్. కావ్య వేసిన డిజైన్స్ చూసి మెచ్చుకుంటాడు రాజ్. దీనిని యాడ్‌లో మోడల్‌ చేత షూట్ చేపించి ఎలా పబ్లిసిటీ చేస్తానో చూడు అని చెబుతాడు. ఉదయాన్నే యాడ్ షూటింగ్ కోసం రాజ్ హడావుడి చేస్తాడు. నా డిజైన్స్ చూసి మార్కెట్‌లో ఎవరైనా సరే నా నగలే కొనుక్కోవాలని డైరెక్టర్‌కు చెబుతాడు. మేం చూసుకుంటాం కానీ ఇంతకీ మోడల్ ఎక్కడ అని డైరెక్టర్ అడుగుతాడు. దాంతో మోడల్ లాస్య ఎక్కడ? అని శృతిపై కోప్పడతాడు రాజ్. అయితే మోడల్ నెంబర్‌కు శృతి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె షాక్ అవుతుంది.

దాంతో మేనేజర్‌కు ఫోన్ చేయగా.. లాస్య మేడం కనిపించడం లేదని శృతికి అతను చెబుతాడు. వెంటనే రాజ్ దగ్గరికి వెళ్లి మోడల్ లాస్య కనిపించడం లేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందని చెబుతుంది. దాంతో రాజ్ కంగారుపడతాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు.. షూటింగ్ ఆగడానికి వీల్లేదని అంటాడు. మరోవైపు.. రాహుల్ ఆఫీసులో మోడల్ లాస్య ప్రత్యక్షమవుతుంది. నువ్వు చెప్పినట్లే చేశానని, కానీ నువ్వు ఇస్తానన్న డబ్బులు రాలేదని అంటుంది. వెంటనే ఆమెకు పది లక్షల రూపాయలు ఇవ్వడంతో లాస్య షాక్ అవుతుంది. ఈ యాడ్ ఎలా కంప్లీట్ చేస్తావో నేను కూడా చూస్తానని అనుకుంటాడు రాహుల్. కొత్త మోడల్ కోసం రాజ్, శృతిలు ఎంతమందికి ఫోన్ చేసినా ఎవ్వరూ అందుబాటులో ఉండరు. రేపు ఎవరో ఒకరిని ఫైనల్ చేస్తాను, యాడ్ షూటింగ్ రేపు పెట్టుకుందామని చెబుతాడు రాజ్. అయితే రేపు నాకు వేరే పని ఉందని ఆ డైరెక్టర్ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. దాంతో ఏం చేయాలో తెలియక రాజ్ టెన్షన్ పడతాడు.

రేణుక పాప మిస్సింగ్ కేసును ఎంక్వైరీ చేస్తుండగా అప్పూకి ఎలాంటి ఆధారం దొరకదు. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి రిపోర్ట్స్ మరోసారి పరిశీలించమని చెబుతాడు. అవి చూడగానే రేణుక- అశోక్‌లు మోసం చేసినట్లు తేలుతుంది. దాంతో కోపంతో ఊగిపోయిన అప్పూ.. వాళ్లిద్దిరినీ నా ముందు పెట్టమని ఆర్డర్స్ వేస్తుంది. యాడ్ షూటింగ్ కోసం తనకు తెలిసినవాళ్లందరికీ రాజ్ ఫోన్ చేస్తాడు. కానీ ఎవ్వరూ అతనికి దొరకరు. రాజ్ టెన్షన్‌లో ఉండగా.. అప్పూ వచ్చి నైట్ డిన్నర్‌లోకి ఏం చేయమంటారు అని అడుగుతుంది. మోడల్ హ్యాండ్ ఇచ్చింది, షూటింగ్ ఆగిపోయింది ఏదో ఒకటి వండు అని రాజ్ మండిపడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X