Brahmamudi December 19th Episode: రాహుల్ ప్లాన్ తిప్పికొట్టిన రాజ్... పాప కేసులో అప్పూకి చిక్కులు
Photo Courtesy: JioHotstar
కంపెనీకి వెన్నుపోటు పొడిచిన ఉద్యోగిని కావ్య, రాజ్‌లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారు. పాప కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా రేణుక భర్త అశోక్‌ని పోలీస్ స్టేషన్‌కి పిలిపిస్తుంది అప్పూ. చనిపోయింది మీ పాప కాదని, మీ కూతురు బతికే ఉందని అప్పూ చెప్పడంతో అతను షాక్ అవుతాడు. త్వరలోనే పాప ఆచూకీ కనుక్కుంటామని అప్పూ చెప్పడంతో రేణుక భర్తకు ముచ్చెమటలు పడతాయి. దాంతో అతనిపై ఓ కన్నేసి ఉంచమని పోలీసులకు చెబుతుంది అప్పూ.
కంపెనీ కోసం కొత్త డిజైన్లు తయారు చేస్తుంది కావ్య. దీనిని మోడల్ ద్వారా యాడ్ షూట్ చేయించి పబ్లిసిటీ చేస్తానని చెబుతాడు రాజ్. ఇదంతా విన్న రాహుల్.. యాడ్ షూటింగ్‌కి మోడల్‌ను రాకుండా ట్రాప్ చేస్తాడు. ఆమెకు 10 లక్షలు ఇచ్చి సైడ్ చేస్తాడు. చివరి నిమిషంలో మోడల్ లేకపోవడంతో రాజ్ కంపెనీకి యాడ్ షూటింగ్ ఆగిపోతుంది. దాంతో రాజ్‌కి ఏం చేయాలో అర్ధం కాక కోపంలో కావ్యపై అరుస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 19వ తేదీ ఎపిసోడ్ 908లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మోడ్రన్ డ్రెస్‌లో ఉన్న కావ్య ఫోటోను రాజ్ డీపీగా పెట్టుకుని ఏడిపిస్తుండటంతో భర్తతో కళావతి గొడవ పడుతుంది. ఫోన్ లాక్కుని డీపీ మొత్తం మార్చేస్తుంది. అయితే అందులో చాలా అందంగా కనిపించడంతో ఇంట్లోనే అందగత్తెను పెట్టుకుని వేరే మోడల్‌ను వెతకడం దేనికి అనుకుంటాడు రాజ్. కావ్య కిచెన్‌లో వంట చేస్తుండగా కావ్య దగ్గరికి వెళ్లి యాడ్ ఫిల్మ్ షూటింగ్‌కి భార్యని ఒప్పించాలని అనుకుంటాడు. కావ్య చేస్తే నేను ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని చెబుతాడు. నువ్వు ఓకే అంటే నీకు బంపరాఫర్ ఇస్తా, సెలబ్రిటీని చేస్తానని అంటాడు రాజ్. కొంపదీసి నన్ను హీరోయిన్‌గా పెట్టి సినిమా ఏమైనా చేస్తున్నారా అని అడుగుతుంది కావ్య. నిజంగానే సినిమా తీస్తున్నా.. కాకపోతే చిన్న సినిమా అని చెబుతాడు రాజ్.
మన కంపెనీ జ్యూవెలరీ యాడ్ చేయాల్సిన మోడల్ హ్యాండ్ ఇచ్చింది కదా? మన యాడ్ ఫిల్మ్‌లో నువ్వు మోడల్‌గా యాక్ట్ చేస్తే అదిరిపోతుందని అంటాడు రాజ్. కానీ కావ్య ఒప్పుకోకపోవడంతో రాజ్ బతిమలాడతాడు. మీ అక్క చేసింది కదా అని రాజ్ అనగా.. తనకి మోడలింగ్‌లో అనుభవం ఉందని నాకేం తెలుసని మండిపడుతుంది. బయట మోడల్ దొరకడం లేదు, తక్కువ టైంలో ఈ యాడ్ మార్కెట్‌లోకి వెళ్లిపోవాలని చెబుతాడు రాజ్. అతను ఎంత చెప్పినా సరే కావ్య ఒప్పుకోదు.
పాప కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా రేణుక ఆమె భర్త అశోక్‌లని పిలిపిస్తుంది అప్పూ. మా పాప ఎక్కడ? ఏమైనా క్లూ దొరికిందా? అని నిలదీస్తారు. దాంతో మీరిద్దరూ నాకెందుకు అబద్ధం చెప్పారని అప్పూ మండిపడుతుంది. మా పాప ఎలా తప్పిపోయిందో అన్ని చెప్పాం.. మీకు అబద్ధం చెబితే మాకు ఏం వస్తుంది. మా పాప వివరాలు సరిగా చెప్పకపోతే మాకే నష్టమని, మా కూతురు మాకు దొరికితే సంతోషమే కదా అని అంటారు రేణుక, ఆమె భర్త. మీరు నా దగ్గర ఏ విషయం దాచలేదా? కనిపించకుండా పోయిన మీ పాపకు తండ్రి ఎవరు? అని అప్పూ అడగ్గా.. రేణుక షాక్ అవుతుంది. ఆ పాపకి తండ్రిని నేనే అని అశోక్ చెప్పగా.. వాళ్లపై ఫైల్ విసిరికొడుతుంది అప్పూ.
పాప డీఎన్ఏకి, నీ డీఎన్‌ఏకి సంబంధం లేదు.. నువ్వెలా పాపకి తండ్రివి అవుతావని ప్రశ్నిస్తుంది. ఆ పాపకి అసలైన తండ్రి అశోక్ కాదని.. ఇతను నా రెండో భర్త అని చెబుతుంది రేణుక. మొదటి భర్త యాక్సిడెంట్‌లో చనిపోతే ఈయన పరిచయమై నాకు అండగా నిలిచారు. పాపని బాగా చూసుకున్నారు, నా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు అందుకే అశోక్‌ని పెళ్లి చేసుకున్నానని చెబుతుంది. ఈ కేసు టేకప్ చేసే సమయంలో నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదని అప్పూ అడగ్గా.. ఆయన ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దన్నాడని అంటుంది రేణుక. పాప ఎప్పుడు మన పాపే, దీని గురించి సోసైటీ నిన్ను తప్పుడు మాటలు అనకూడదని చెప్పాడని అంటుంది. పాప కనిపించకుండా పోవడానికి, అశోక్ నాకు రెండో భర్త అవ్వడానికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తుంది రేణుక.
అశోక్ నాకు సోషల్ మీడియాలో పరిచయం, అతను అనాథ, వెనుకా ముందు ఎవ్వరూ లేరని చెబుతుంది రేణుక. నా భర్తను అనుమానించి నేరస్తుడిలా చూడటం సరైంది కాదని, ముందు నా పాప ఎక్కడుందో చెప్పమని అడుగుతుంది రేణుక. దాంతో ఏం చేయలేక చిరాకుపడుతుంది అప్పూ. కేసును మళ్లీ స్టడీ చేసి మిస్ అయిన పాయింట్‌ని పట్టుకోవాలని అనుకుంటుంది. భోజనాల దగ్గర రాజ్ డల్‌గా కనిపిస్తుండటంతో వాడిని ఇంకా బాధపెట్టాలని రాహుల్ అనుకుంటాడు. యాడ్ ఫిలిం షూటింగ్ ఎలా జరిగింది? అని ప్రశ్నిస్తాడు రాహుల్. షూటింగ్ జరిగితేనే కదా యాడ్ వచ్చేది? యాడ్ షూటింగ్ చేయాల్సిన మోడల్ లాస్ట్ మినిట్‌లో ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిందని రాజ్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది.
రాహుల్ ఎవ్వరి మీదా ఆధారపడకుండా స్వప్నతో యాడ్ ఫిల్మ్ చేశాడని మెచ్చుకుంటాడు ప్రకాశం. దానినే ముందుచూపు అంటారని రుద్రాణి అంటుంది. మోడల్స్ అంతా చాలా బిజీగా ఉన్నారని, ఇప్పటికప్పుడు ఎవ్వరూ దొరకరని చెబుతాడు రాజ్. అయితే ఈ యాడ్ ఆపేసినట్లేనా? అని రాహుల్ అడగ్గా.. ఈ యాడ్ ఆగిపోవాలని ఆశపడుతున్నావా? అని సుభాష్ మండిపడతాడు. కానీ నా దగ్గర ఒక మోడల్ ఉంది, అయితే ఆమె ఒప్పుకోవడం లేదని రాజ్ చెప్పగా.. ఆ మోడల్ ఎవరు? అని ఫ్యామిలీ అంతా అడుగుతారు. ఇంకెవరు మీ మనవరాలే అని రాజ్ చెప్పగా.. నేను చేయను అంటూ స్వప్న అంటుంది. ఆ మోడల్ నువ్వు కాదు.. కావ్య అని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అయితే సుభాష్ మాత్రం కావ్య చేస్తే చాలా బాగుంటుందని అంటాడు.
యాడ్ అంటే వంట చేయడం కాదు.. స్వప్న వెరీ టాలెంటెడ్, పైగా మోడలింగ్‌లో అనుభవం ఉందని నానామాటలు అంటుంది రుద్రాణి. నా కోడలు అనుకోవాలి గానీ ప్రొఫెషనల్ మోడల్ కంటే బాగా చేస్తుందని చెబుతుంది అపర్ణ. ఆ షూటింగ్, మేకప్ రచ్చ నేను పడలేను.. నా వల్ల కాదని తేల్చేస్తుంది కావ్య. కట్టుకున్న భర్త కోసం చిన్న హెల్ప్ కూడా చేయడం లేదని మండిపడతాడు. అందరూ కావ్యని బలవంతం చేస్తుండగా.. కావ్యని వదిలేయ్ కళ్లముందే గొప్ప మోడల్‌ని పెట్టుకుని గుర్తించవేంటీ? అని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఆ మోడల్‌ని నేను తీసుకొస్తానని లోపలికి వెళ్తుంది ధాన్యలక్ష్మీ. దాంతో ధాన్యం నగలు పెట్టుకుని మోడల్‌గా రెడీ అయి వస్తుంది. ఆమెను చూడగానే అంతా షాక్ అవుతారు. రిహార్సల్స్ కింద చాలా రకాలుగా చేయడంతో దుగ్గిరాల ఫ్యామిలీ నవ్వుకుంటుంది. మరోవైపు... రాజ్ ప్లాన్ నాశనం చేయడానికి రాహుల్ కొత్త స్కెచ్ వేస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










