Brahmamudi December 1st Episode: కావ్య డిజైన్లు కొట్టేసేలా రాహుల్ కుట్ర... ధాన్యానికి మస్కా కొట్టిన కళ్యాణ్

Photo Courtesy: JioHotstar

ధాన్యలక్ష్మీ కంటపడకుండా అప్పూని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాలని కళ్యాణ్ ప్లాన్ చేస్తాడు. అప్పూ యూనిఫాంలోని బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్తుండగా... బ్యాగ్ ఎత్తుగా ఉంది? అందులో ఏమున్నాయో చూపించమని ధాన్యం చెప్పడంతో కళ్యాణ్, అప్పూలకి చెమటలు పోస్తాయి. రెండ్రోజుల నుంచి పాట రాస్తున్నా.. సరిగా రావడం లేదు, అందుకే నా రైటింగ్ పేపర్స్ దేవుడి దగ్గర పెడితే పాట బాగా వస్తుందని తీసుకెళ్తున్నానని అంటాడు. పేపర్స్ అంత ఎత్తుగా ఉండవని ధాన్యలక్ష్మీ అడగ్గా.. దేవుడికి పట్టుబట్టలు పెడతానని అప్పూ మొక్కుకుందని వాటిని తీసుకెళ్తున్నామని చెబుతాడు కళ్యాణ్.

రాజ్, కావ్యలు తిరిగి ఆఫీసుకు రావడంతో స్టాఫ్ అంతా సంతోషిస్తారు. అయితే మేనేజర్ సతీష్ కనిపించకపోవడంతో అతను లీవ్‌లో ఉన్నాడా అని అడుగుతాడని రాజ్. మేనేజర్ గారు... ఆర్ కంపెనీలో చేరాడని శృతి చెప్పడంతో రాజ్, కావ్యలు ఉలిక్కిపడతారు. పాపను వెతకడం కోసం తిరిగి డ్యూటీలో చేరిన అప్పూ.. నేరుగా రేణుక ఇంటికి వెళ్లి ఎంక్వయిరీ మొదలు పెడుతుంది. మార్కెట్‌లో రాజ్ కంపెనీ డిజైన్లకు డిమాండ్ తగ్గుతుండటంతో దానిని మార్చాలని అనుకుంటారు రాజ్, కావ్య. నా లైఫ్ సెటిల్ చేస్తానంటే మీ దగ్గర చేరానని రాహుల్‌తో మేనేజర్‌ సతీష్‌ చెబుతాడు. స్వరాజ్ కంపెనీ ఎవరెవరితో డీల్ చేస్తుందో ఆ క్లయింట్స్‌తో మీటింగ్ ఏర్పాటు చేయమని సతీష్‌కు చెబుతాడు రాహుల్. భోజనాల దగ్గర రాజ్‌కి సతీష్ విషయం చెబుతాడు రాహుల్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ 892లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 1st 2025 Episode 892 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

మేనేజర్ సతీష్‌ని నా దగ్గర చేర్చుకున్నానని రాహుల్ చెప్పడంతో సుభాష్, ప్రకాశంలు సీరియస్ అవుతారు. రాజ్‌కి ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నావని ప్రశ్నిస్తారు. అయితే రాజ్ మాత్రం రాహుల్‌కి అలాంటి వాళ్లు ఉండాలని అప్పుడే వాడు బిజినెస్‌లో సెట్ అవుతాడని చెబుతాడు. నీ కొడుకు తప్పు చేశాడని ఈ పద్ధతి మంచిది కాదని రుద్రాణికి క్లాస్ పీకుతాడు సుభాష్. నువ్వు ఇలా ప్రతిదానిని లైట్ తీసుకోవడం వల్ల మనకంటే వెనుకాల ఉన్నవారు.. ఇప్పుడు మనకి పోటీ ఇచ్చే స్థాయికి వచ్చేశారని కొడుకుపై మండిపడతాడు సుభాష్. కాస్తయితే నెంబర్ వన్ ప్లేస్‌ని కోల్పోయేవాళ్లమని చెబుతాడు.

ఈసారి అలా జరగనివ్వనని.. నేను కళావతి దాని గురించే ఆలోచిస్తున్నామని, ఓల్డ్ స్టాక్ మొత్తం మార్చేసి కొత్త డిజైన్లు వేస్తున్నామని కావ్య, రాజ్‌లు చెబుతారు. న్యూఇయర్‌కి 100 కొత్త డిజైన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తామని రాజ్ చెప్పడంతో రాహుల్ షాక్ అవుతాడు. ఇంత తక్కువ టైంలో అన్ని డిజైన్లు తీసుకురావడం కష్టమని చెబుతాడు రాహుల్. బిజినెస్ అంటే మన ప్రత్యర్ధి ఆలోచించే లోపు మనం ఆచరించాలని అంటాడు రాజ్. ఇక నుంచి నేను నిన్నే ఫాలో అవుతానని చెబుతాడు రాహుల్. ఇంటికొచ్చాక కూడా ఈ బిజినెస్ గురించి మాటలేంటీ? అని మండిపడుతుంది అపర్ణ. నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? అని అపర్ణ అడగ్గా.. మీ అబ్బాయి గుర్తుచేసి మరి నాకు ఇచ్చారని కావ్య చెప్పగా అంతా షాక్ అవుతారు. నా మీద ప్రేమ లేదని ఫోన్‌లో అలారం పెట్టుకున్నారని చెప్పడంతో అంతా నవ్వుకుంటారు.

కొత్త మోడల్స్, డిజైన్ల గురించి రాజ్, కావ్యలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రాహుల్ వచ్చి ఇద్దరినీ మెచ్చుకుంటాడు. టెన్షన్‌కి నాకు నిద్రపట్టడం లేదని మీరేం చేస్తున్నారో తెలుసుకుని మిమ్మల్ని ఫాలో అవుదామని వచ్చానని చెబుతాడు రాహుల్. సలహా ఇస్తాను కానీ కంపెనీ సీక్రెట్ మాత్రం చెప్పను అంటాడు రాజ్. స్వరాజ్ గ్రూప్ ఓ మహాసముద్రం అయితే అందులో ఆర్ కంపెనీ ఓ నీటి బిందువని అంటాడు రాహుల్. ఒకప్పుడు స్వరాజ్ కంపెనీ కూడా ఓ నీటి బిందువేనని, తాతయ్య గారు కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారని చెబుతాడు రాజ్. నీ కంపెనీ కూడా ఆ స్థాయికి వెళ్తుందేమో ఎవరికి తెలుసు అని అంటాడు రాజ్. మీరు వేసే ప్రతి డిజైన్‌ని కొట్టేస్తానని మనసులో అనుకుంటాడు రాహుల్.

రేణుక కేసులో పాప తండ్రి అశోక్‌ని స్టేషన్‌కు తీసుకొస్తాడు కానిస్టేబుల్ శేషు. ఈ విషయాన్ని అప్పూకి ఫోన్ చేసి చెప్పగా.. తాను వచ్చే వరకు చూసుకోమని చెబుతుంది అప్పూ. పోలీస్ స్టేషన్‌కి వెళ్లడానికి హెల్ప్ కావాలని కళ్యాణ్‌ని అడుగుతుంది. చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్దామని ఐడియా ఇస్తాడు కళ్యాణ్. ఆఫీస్‌కి వెళ్తున్న రాహుల్‌పై సెటర్లు వేస్తుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో రాజ్, కావ్యలు డిజైన్లు వేసుకుని రాగా.. వాటిని ఎలా కొట్టేయాలా అని రాహుల్ ఆలోచిస్తాడు. రేయింబవళ్లు డిజైన్లు వేయొద్దని కావ్యకి దుగ్గిరాల ఫ్యామిలీ క్లాస్ పీకుతుంది. 24 గంటల్లో 100 డిజైన్లు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టి రాత్రంతా నా పక్కనే కూర్చొని డిజైన్లు వేయించారని చెబుతుంది కావ్య.

వాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా కంపెనీ కోసమే చేస్తాడని చెబుతారు ప్రకాశం, సుభాష్. కొత్త డిజైన్లను తీసుకుని గుడికి వెళ్తామని కావ్య చెబుతారు. ఇంతలో అప్పూ, కళ్యాణ్‌లు బ్యాగ్ తగిలించుకుని కిందకు రావడంతో ధాన్యం షాక్ అవుతుంది. నిన్న గుడి అన్నారు, ఈరోజు బడి అంటారా? అని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. ఆసుపత్రికి వెళ్తున్నామని కళ్యాణ్ చెప్పడంతో ధాన్యం కంగారుపడి అప్పూకి ఏమైందోనని అడుగుతుంది. జనరల్ చెకప్ కోసం వెళ్తున్నామని 10 గంటల కల్లా అక్కడే ఉండాలని కళ్యాణ్ చెప్పగా.. ఇప్పుడు టైం 10.30 అవుతుందని చెబుతుంది ధాన్యలక్ష్మీ. దాంతో కళ్యాణ్ నాలుక కరచుకుంటాడు. హాస్పటల్‌కి వెళ్లేటప్పుడు పాత రిపోర్ట్స్ ఉండాలి కదా అని ధాన్యం అడుగుతుంది. వాటిని కారులో పెట్టానని కళ్యాణ్ చెప్పడంతో సరేనని అంటుంది ధాన్యం.

గుడికి వచ్చిన కావ్య, రాజ్‌లను పంతులుగారు పలకరిస్తారు. అయితే తనను కాకుండా కావ్యని మాత్రమే పలకరించడంతో రాజ్ హర్ట్ అవుతాడు. మీరు అమావాస్యకో, పౌర్ణమికో గుడికి వస్తారు. నేను ప్రతి శుక్రవారం గుడికి వచ్చి అర్చన చేయించుకుని, పూజలు చేస్తానని మరి నన్ను గుర్తుపడతారా? మిమ్మల్ని గుర్తుపడతారా? అని అడుగుతుంది కావ్య. అయితే మాత్రం నేను కూడా వస్తాను కదా అని మండిపడతాడు రాజ్. పంతులు గారికి తాను వేసిన కొత్త డిజైన్లను చూపించి వీటిని స్వామివారి పాదాల దగ్గర పూజ చేయించమని చెబుతుంది కళావతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X