Brahmamudi December 20th Episode: రాజ్- కావ్యపై రాహుల్ మరో కుట్ర.. ప్రమాదంలో దుగ్గిరాల ఫ్యామిలీ
Photo Courtesy: JioHotstar
క్లాసిక్ లుక్‌లో కావ్య బాగుండటంతో ఇంట్లో ఇంత అందమైన భార్య ఉండగా బయటి వాళ్ల కాళ్లను ఎందుకు పట్టుకోవాలి కళావతితోనే మోడలింగ్ చూపించాలని అనుకుంటాడు రాజ్. వెంటనే ఈ విషయాన్ని కావ్యతో చెప్పగా ఆమె నో చెబుతుంది. పాప మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా రేణుకని, ఆమె భర్తని పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తుంది అప్పూ. పాపకు అసలు తండ్రి ఎవరు అని అప్పూ నిలదీయగా.. అశోక్ నాకు రెండో భర్త అని నిజం చెబుతుంది. నా దగ్గర అబద్ధం ఎందుకు ఆడారని అప్పూ వాళ్లపై మండిపడుతుంది.
భోజనాల దగ్గర రాజ్ ఉండగా.. యాడ్ షూటింగ్ ఎలా జరిగిందని రాహుల్ అడుగుతాడు. మోడల్ లాస్ట్ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చిందని రాజ్ చెప్పడంతో మరేం చేస్తావని ప్రశ్నిస్తాడు రాహుల్. ఇంట్లోనే మోడల్ ఉంది కానీ, ఒప్పుకోవడం లేదని రాజ్ చెప్పగా ఆ మోడల్ ఎవరని అంతా అడుగుతారు. ఆ మోడల్ ఎవరో కాదు.. కళావతే అని చెబుతాడు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. అయితే కావ్యని మోడలింగ్ చేయమని ఫ్యామిలీ అంతా ఒత్తిడి చేస్తారు. ఇంతలో ధాన్యలక్ష్మీ అందంగా రెడీ అయి మోడలింగ్ చేస్తానని చెప్పడంతో అంతా ఉలిక్కిపడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 20వ తేదీ ఎపిసోడ్ 909లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాహుల్ ఓ పరోటాలు వేసుకునే వ్యక్తి దగ్గరికి వచ్చి ఇంకా పరోటాలు వేసుకుంటున్నావా? సినిమాల్లో ట్రై చేస్తున్నావా? అని అడుగుతాడు. యాక్టింగ్ అంటే నాకు ప్రాణం.. చాలా ట్రై చేశాను, ఎవ్వరూ అవకాశం ఇవ్వకపోవడంతో పరోటాలు వేసుకుంటున్నాను అని చెబుతాడు ఆ వ్యక్తి. నీకు నేను అవకాశం ఇస్తాను? చేస్తావా? అని అడుగుతాడు రాహుల్. నాకు అవకాశం ఇస్తే నా రక్తాన్ని ధారపోసైనా నటిస్తాను, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెబుతాడు. అయితే ఓ ఫ్యామిలీలో యాడ్ ఫిల్మ్ డైరెక్టర్‌లా నటించాలని చెబుతాడు రాహుల్. దొరికితే నన్ను చంపేస్తారని ఆ వ్యక్తి భయపడగా.. నేను చూసుకుంటానని అంటాడు రాహుల్.
దానికి ఆ వ్యక్తి సరేనని చెప్పగా.. అతనితో బేరం కుదుర్చుకుంటాడు రాహుల్. ఇక నేను చూసుకుంటాను. ఎక్కడికి రావాలి? ఎప్పుడు రావాలి? అని అడుగుతాడు ఆ వ్యక్తి. రేపే యాడ్ ఫిల్మ్ షూటింగ్ అని చెబుతాడు రాహుల్. ఆ వెంటనే మరో వ్యక్తికి ఫోన్ చేసి రేపు రాజ్.. నీకు ఫోన్ చేసి యాడ్ ఫిల్మ్ చేసే డైరెక్టర్ కావాలని అడుగుతాడు. నేను చెప్పిన వాడిని డైరెక్టర్‌గా రాజ్ దగ్గరికి తీసుకెళ్లాలి అని అంటాడు రాహుల్. ప్రాబ్లమ్ అవుతుందని అవతలి వ్యక్తి చెప్పగా.. పరోటాలు వేసుకునేవాడిని డైరెక్టర్ అని చెబితే పాతికవేలు ఇస్తానని ఎర వేస్తాడు రాహుల్. దాంతో ఆ వ్యక్తి సరేనని చెబుతాడు. పరోటాగాడితో నువ్వు యాడ్ ఫిల్మ్ షూట్ చేయాలి.. మొత్తం సర్వ నాశనం కావాలని మనసులో అనుకుంటాడు రాహుల్.
ఉదయాన్నే కావ్య దగ్గరికి వెళ్లి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావని అడుగుతాడు. నాకు ఇష్టం లేదని నిన్ననే చెప్పాను.. మళ్లి ఎందుకు అడుగుతున్నారని కావ్య మండిపడుతుంది. ఒక్కరోజే టైం ఉంది, నాకు చాలా పనులు ఉన్నాయి.. నువ్వే ఒప్పుకోవాలని అంటాడు రాజ్. దాంతో నా వల్ల కాదని కావ్య తప్పించుకుంటుంది. నువ్వు కొంచెం కోపరేట్ చేస్తే నా షూటింగ్ అయిపోతుంది. జీవితంలో ఏం అడగను అని అంటాడు రాజ్. బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్లు నటించు నటించు అని ఎందుకు దానిని బతిమలాడుతున్నావు అని మండిపడుతుంది ఇందిర. నాకు వేరే ఆప్షన్ లేదని రాజ్ చెప్పగా.. జ్యూవెలరీ యాడ్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తానని సీతారామయ్యతో కలిసి ఓ యాడ్ చేసినట్లుగా చేస్తుంది ఇందిర.
మీ కాన్సెప్ట్ వాడికి నచ్చదు.. చాలా ఓల్డ్‌గా ఉంది. మమ్మల్ని చూడండి కొత్త కాన్సెప్ట్‌తో ఎలా రెచ్చిపోతామో అని అంటుంది అపర్ణ. ఆ మాటలు విన్న రాజ్ షాక్ అవుతాడు. అపర్ణ అంటే ఏంటో చూపిస్తామని సుభాష్‌తో కలిసి తను ఓ యాడ్‌లా చేస్తుంది. అది చూసి రాజ్ విసుక్కుంటాడు. ఇంతలో ప్రకాశం వచ్చి.. వీళ్లంతా నిన్ను దివాళా తీయించడానికే ఉన్నారు, ఒక్కసారి నా కాన్సెప్ట్ వింటావా అని అంటాడు. నువ్వు కూడా మొదలుపెట్టావా అని అడుగుతాడు రాజ్. మన కంటెంట్ అదిరిపోతుందని చెప్పిన ప్రకాశం అంతా మరిచిపోతాడు.
వీళ్లందరి టార్చర్ నేను భరించలేకపోతున్నాను.. నువ్వు యాడ్ ఫిల్మ్‌లో యాక్ట్ చేస్తావా? లేదా? అని అడుగుతాడు రాజ్. ఆ దెబ్బకు యాడ్ ఫిల్మ్‌లో నటించేందుకు ఓకే చెబుతుంది.. కానీ మన ఫ్యామిలీ అంతా కలిసి నటిస్తేనే చేస్తానని అంటుంది. దాంతో అపర్ణ, ఇందిరలు సెటైర్లు వేస్తారు. మాది ఓల్డ్ కాన్సెప్ట్, మాకు యాక్టింగ్ ఏం వచ్చంటూ చురకలు వేస్తారు. మీరంతా చాలా బాగా నటించారు.. మీరంతా నా కంపెనీని నిలబెట్టమని రాజ్ అడగ్గా.. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అంటుంది. ఇంతకీ డైరెక్టర్ ఎక్కడ? అని ప్రకాశం అడుగుతాడు. ఇంతలో రాహుల్ సెట్ చేసిన మణివర్మ అక్కడికి వస్తాడు.
ఇంటిని అతను అలాగే చూస్తుండటంతో ఇలాంటి రీచ్ హౌస్‌ను చూడలేదేమో అని ప్రకాశం అనగా.. పరోటావాడు డబ్బా కొడతాడు. ఇలాంటి చీప్ లోకేషన్స్‌లో యాడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని అంటాడు. అతని నటన చూసిన రుద్రాణి.. పరోటాలు వేసుకునేవాడిని తీసుకొస్తానని చెప్పావు, వీడు ఇన్ని కబుర్లు చెబుతున్నాడు అని అడుగుతుంది. వాడు స్టేజ్ ఆర్టిస్ట్ అందుకే ఓవర్ చేస్తున్నాడని చెబుతాడు రాహుల్. వాడెలా పోతే మనకెందుకు.. యాడ్ పూర్తి కాకుండా టైమ్ వేస్ట్ చేస్తే చాలని అంటుంది రుద్రాణి. ఇంతలో కాన్సెప్ట్ గురించి చెప్పమని రాజ్ అడగ్గా.. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలని అనుకుంటాడు పరోటా వాడు. దాంతో సినిమా కథలన్నీ చెబుతాడు.
మధ్య తరగతి వాళ్లకి బంగారం అనేది ఒక ఎమోషన్.. ఒక తండ్రి తండ్రి తన కూతురికి బహుమతికి ఇస్తాడు, ఒక అత్తయ్య తన కోడలికి బాధ్యతగా ఇస్తుంది. ఆడపడుచులు వాళ్ల ఆనందానికి గుర్తుగా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. అలాంటి వాటి గురించి చెప్పేటప్పుడు కుటుంబ విలువల గురించి చెప్పాలి. అమ్ముకోండి, తాకట్టు పెట్టుకోండి అని అలా చెప్పొద్దని కావ్య చీవాట్లు పెడుతుంది. దాంతో సీతారామయ్య ఆమెను మెచ్చుకుంటాడు. మనం చేసే యాడ్స్ కూడా మన కంపెనీ విలువల్ని పెంచేలాగే ఉండాలని అంటాడు. నువ్వు చెబుతుంటే వినడానికి చాలా బాగుంది.. ఆ కాన్సెప్ట్ కూడా నువ్వే ఆలోచించు అంటుంది ఇందిర. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూడా ఇదే మాట అంటుంది. దాంతో వాళ్ల మాట కాదనలేక కావ్య ఓ కాన్సెప్ట్ చెబుతుంది.
అది అందరికీ నచ్చుతుంది. పరోటాలు వేసుకునేవాడికి కూడా నచ్చుతుంది.. కానీ నచ్చలేదని చెబుతాడు. మీ యాడ్ మీ ఇష్టం కాబట్టి అదే షూట్ చేస్తానని, కానీ మోడల్ ఎక్కడ అని అడుగుతాడు. దాంతో రాజ్.. కావ్యని చూపిస్తుండగా ఆమె కిందకి వంగడంతో పనిమనిషి వైపు చేయి చూపిస్తాడు. అది చూసిన పరోటాల వాడు.. పనిమనిషే మోడల్ అనుకుంటాడు. మీరు నిజంగా డైరెక్టరేనా? అని ప్రకాశం అడుగుతాడు. నేను ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎందరినో చూశాను.. నా కాళ్లకు మోడల్‌లా కనిపించిందని అంటాడు పరోటావాడు. డబ్బులు మీరు పెడుతున్నారు కాబట్టి.. మీ వైఫ్‌తోనే తిద్దామని చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










