Brahmamudi December 22nd Episode: రాహుల్‌ ప్లాన్ తిప్పికొట్టిన కావ్య.. డైరెక్టర్‌గా మారిన రాజ్

Photo Courtesy: JioHotstar

కావ్యతో రాజ్ తీయబోయే యాడ్ ఫిల్మ్‌ని చెడగొట్టాలని అనుకుంటాడు రాహుల్. పరోటాలు చేసుకునే వాడికి డబ్బులు ఎరగా వేసి వాడిని యాడ్ ఫిల్మ్ డైరెక్టర్‌గా తన ఇంటికి రమ్మని చెబుతాడు. అలాగే డైరెక్టర్స్‌‌ని తీసుకొచ్చే బ్రోకర్‌ని కూడా డబ్బులతో కొనేస్తాడు. ఇంట్లో చాలా మంది యాడ్ ఫిల్మ్ చేయగలరని చెప్పి ఇందిర- సీతారామయ్య, అపర్ణ - సుభాష్‌లు తమ కాన్సెప్ట్‌లు చెప్పి రాజ్‌ను విసిగిస్తారు. ఇదంతా చూసిన కావ్య నవ్వుకుంటూ యాడ్‌లో నటించడానికి ఒప్పుకుంటుంది.

ఇంతలో పరోటాలు వేసుకునే వాడొచ్చి డైరెక్టర్‌గా తిక్కతిక్కగా మాట్లాడతాడు. దాంతో అసలు నువ్వు డైరెక్టర్‌వేనా అని దుగ్గిరాల ఫ్యామిలీకి అనుమానం వస్తుంది. తమ ప్లాన్ వర్కవుట్ కావడంతో రాహుల్, రుద్రాణిలు సంతోషిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 22వ తేదీ ఎపిసోడ్ 910లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 22nd 2025 Episode 910 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

దుగ్గిరాల ఫ్యామిలీతో యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేస్తూ రకరకాలుగా టైం వేస్ట్ చేస్తాడు పరోటా వాడు. ఇంతలో పనిమనిషి పరోటాలు సరిగా కాల్చలేదని తెలుసుకున్న వాసన పసిగడుతూ వంట గదిలోకి వెళ్తాడు. పరోటాలు సరిగా చేయడం లేదని పనిమనిషి మీద కోప్పడి నేను చేసి చూపిస్తానని అంటాడు. ఇదంతా చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రాజ్ వచ్చి షూటింగ్ జరగడం లేదని చిరాకు పడతాడు. డైరెక్టర్ ఎక్కడ అని అడగ్గా.. వంటగదిలో పరోటాలు చేస్తూ కనిపిస్తాడు. ఇతను నిజంగానే డైరెక్టరేనా? అని కావ్య అడుగుతుంది. కాదు.. పరోటా మాస్టర్ అని ప్రకాశం అని అంటాడు. అతను డైరెక్టరేనని ధాన్యం అనడంతో .. ఇప్పుడే ప్రూవ్ చేస్తానని ప్రకాశం చెబుతాడు. ప్లేట్ పరోట ఎంత అని అడుగుతాడు. విత్ కర్రీ అయితే 50 రూపాయలు, కర్రీ లేకుండా అయితే 30 రూపాయలు అంటాడు. పార్శిల్ కావాలా? ఇక్కడే తింటావా అని అంటాడు పరోటా వాడు. ఆ మాటలు విని దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.

నేను చెప్పానా? వీడు పరోటా మాస్టర్ అని అంటూ అతనిని చొక్కాపట్టుకుని ఈడ్చుకోస్తాడు ప్రకాశం. నువ్వు డైరెక్టర్ కానప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు పంపించారు అని రాజ్ అడుగటంతో తన కుట్ర ఎక్కడ బయటపడుతుందోనని రాహుల్, రుద్రాణిలు వణికిపోతారు. మీ కో ఆర్డినేటర్.. డైరెక్టర్ కోసం వెతుకుతుంటే డబ్బు కోసం కక్కుర్తిపడి ఆయనను నమ్మించి ఇక్కడి దాకా వచ్చానని అంటాడు పరోటా వాడు. ఆ మాటలతో రాజ్ మండిపడటంతో పరోటవాడు పారిపోతాడు. తన యాడ్ ఫిల్మ్ తీయడానికి ఉన్న టైం వేస్ట్ కావడంతో రాజ్ బాధపడతాడు. ఇక నేను యాడ్ ఎలా పూర్తి చేయను అని అనుకుంటూ బయటికి వెళ్లిపోతాడు.

భర్తని ఓదార్చేందుకు కావ్య వెళ్లగా.. నేనేం తప్పు చేశాను? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను? అని అడుగుతాడు. మీ ఆలోచనల్లోనే తప్పుందని కావ్య అంటుంది. నేనేం తప్పు చేశాను? నువ్వు వేసిన డిజైన్లని రాత్రికి రాత్రి తయారు చేయించాను. డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఆ మోడల్ హ్యాండ్ ఇస్తే నిన్ను పెట్టి తిద్దామని అనుకున్నానని చెబుతాడు రాజ్. మీరు ఎందుకు సక్సెస్ కావడం లేదో ఆలోచించడం లేదని అంటుంది కావ్య. ఇప్పటి వరకు నేను చేసింది సక్సెస్ కావడానికే అంటాడు రాజ్. వచ్చినవాడు ఫ్రాడ్ అని తేలిపోయింది.. ఇప్పటికిప్పుడు ఏ డైరెక్టర్ దొరకడు అని అంటాడు రాజ్. ఏం కావాలో మీకు తెలిసినప్పుడు ఆ పని మీరే ఎందుకు చేయకూడదని చెబుతుంది కావ్య.

పెద్ద పెద్ద డైరెక్టర్ల వాళ్లే కావడం లేదు.. అలాంటిది ఏ ఎక్స్‌పీరియన్స్ లేని నేనేం చేయగలను అని అడుగుతాడు. దాంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన వ్యక్తిని పిలిపించి యాడ్ ఎలా తీయాలో ఇతనికి చెబితే మీకు హెల్ప్ చేస్తాడని అంటుంది కావ్య. నా వల్ల కాదని రాజ్ చెప్పగా.. నేను కొన్ని యాడ్స్‌కి పనిచేశానని, నాకు కొంచెం ఐడియా ఉంది. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నట్లుగా కష్టపడి డైరెక్షన్ చేస్తాను, కానీ మనసు పెట్టి చేస్తానని ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతాడు ఆ వ్యక్తి. దాంతో రాజ్ సరేనంటాడు.

ఈ యాడ్ షూట్ జరుగుతుందా? లేదా? అని దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతుండగా.. కావ్య వచ్చి ఈ యాడ్‌ని మా ఆయనే షూట్ చేయబోతున్నారని అంటుంది కావ్య. నాకు మీ భాషలో చెప్పడం తెలియదు.. నాకు ఏం కావాలో చెబుతాను అలా చేసి పెట్టమని కెమెరామెన్‌ని అడుగుతాడు రాజ్. మీరేం బాధపడొద్దు.. మీరు చేయండి మీ వెనుక మేం ఉన్నామని అంటాడు కెమెరామెన్. ఆ వెంటనే యాడ్ ఫిల్మ్ కాన్సెప్ట్ చెబుతాడు రాజ్. బిజినెస్‌లో రాజ్ ఎంత తోపైనా యాడ్ ఫిల్మ్ అంటే అంత ఈజీ కాదని రుద్రాణితో అంటాడు రాహుల్. దుగ్గిరాల ఫ్యామిలీ అందరినీ జంటలుగా రమ్మన్న రాజ్.. తనని మాత్రం ఒంటరిగా రమ్మని చెప్పడంతో కావ్య హర్ట్ అవుతుంది. నేను కంపెనీ ఎండీని.. నేను యాడ్‌లో కనిపిస్తే బాగోదని అంటాడు రాజ్. ఇప్పుడు ఎవరి కంపెనీలకు వాళ్లే ప్రమోషన్స్ చేసుకుంటున్నారని దుగ్గిరాల ఫ్యామిలీ చెప్పగా.. రాజ్ సరేనని అంటాడు.

అందరి సహకారంతో రాజ్ యాడ్ ఫిల్మ్‌ని షూట్ చేయడంతో రుద్రాణి టెన్షన్ పడుతుంది. టెన్షన్ పడొద్దని.. యాడ్ ఫిల్మ్ మేకింగ్ అంటే బఠానీలు తినడం అనుకున్నావా? పెద్ద పెద్ద డైరెక్టర్లే అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేక తలలు పట్టుకుంటారు. అలాంటిది రాజ్ డైరెక్షన్ చేసి యాడ్ ఫిల్మ్ షూట్ చేశాడంటే అది ఎలా వస్తుందో అర్ధం కావడం లేదా? యాడ్ ఏదైనా సరే అది సరిగా రాకపోతే.. అది జనాల్లోకి పంపలేక, రీ షూట్ చేయలేక చేతులెత్తేస్తారు. అలాంటిది రాజ్ చేసిన యాడ్ జనాల్లోకి ఎలా వెళ్తుంది? రాజ్‌కి అనుభవం ఉంటేనే కదా? ఆ యాడ్ సక్సెస్ కావడానికి అని చెబుతాడు. పుణ్యకాలం మొత్తం పూర్తయ్యేలోపు.. నా కంపెనీ డిజైన్స్ అన్నింటిని మార్కెట్‌లోకి రిలీజ్ చేసేస్తానని అంటాడు రాహుల్. లాభాలు నాకు, నష్టాలు రాజ్‌కి. ఆ రాజ్ రోజురోజుకి దిగజారిపోతుంటే నేను గంట గంటకి అందలం ఎక్కుతూ ఉంటాను. స్వరాజ్ కంపెనీ దివాళా తీస్తుంటే.. తాతయ్య అది చూసి తట్టుకోలేక ఇక నువ్వే కంపెనీని చూసుకోమని ఆయన నోటితోనే చెప్పేలా చేస్తానని అంటాడు.

యాడ్ ఎలా వచ్చిందోనని రాజ్ టెన్షన్ పడుతుండగా కావ్య వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. యాడ్ ఫిల్మ్ సరిగా రాకపోతే.. డబ్బు, టైం అన్ని వేస్ట్ అని చెబుతాడు రాజ్. అనుకున్న టైంకి డిజైన్స్ మార్కెట్‌లోకి రిలీజ్ చేయాలని అంటాడు. మీ ప్రయత్నం మీరు చేశారు.. ఫలితం దేవుడు చూసుకుంటాడని చెబుతుంది కావ్య. యాడ్ బాగుండకపోతే.. కొత్త యాడ్‌ని బాగా తీసే అనుభవం వచ్చినట్లేనని అంటుంది. అప్పూ తన స్టాఫ్‌తో మాట్లాడుతుండగా ఒక మహిళ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X