Brahmamudi December 23rd Episode: రాజ్ యాడ్‌కి సూపర్ రెస్పాన్స్... అప్పూని ఇరికించిన రుద్రాణి

Photo Courtesy: JioHotstar

యాడ్ ఫిల్మ్ షూటింగ్‌ స్టార్ట్ చేసిన వెంటనే దుగ్గిరాల ఫ్యామిలీతో టైం వేస్ట్ చేయిస్తాడు పరోటా వాడు. ఇంతలో పనిమనిషి పరోటాలు వేస్తున్న వాసన రావడంతో వంట గదిలోకి పరిగెత్తి పరోటాలు సరిగా చేయడం లేదని ఆమెపై మండిపడతాడు. పరోటాలు ఎలా వేయాలో చేసి చూపిస్తాడు. ఇదంతా చూసిన దుగ్గిరాల ఫ్యామిలీకి అనుమానం వస్తుంది. వాడు యాడ్ డైరెక్టర్ కాదని, పరోటాలు వేసుకునే వాడని ప్రకాశం నిరూపిస్తాడు. డబ్బు కోసం ఇదంతా చేశానని ఆ పరోటాల వాడు అంటాడు.

అనుకున్న టైంకి తన డిజైన్స్ మార్కెట్‌లోకి రిలీజ్ చేయలేకపోతున్నానని రాజ్ బాధపడతాడు. అది చూసిన కావ్య భర్తని ఓదార్చి.. వాళ్లు వీళ్లు కాదు మీరే డైరెక్షన్ చేయండి అని చెబుతుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. పరోటా వాడితో వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్‌ని పిలిచి సాయం చేయమని అడుగుతుంది కావ్య. అతను, కెమెరామెన్ కూడా అందుకు ఒప్పుకుంటారు. అందరి సహకారంతో రాజ్ స్వయంగా యాడ్ డైరెక్ట్ చేస్తాడు. రాజ్ షూట్ చేసిన యాడ్ గురించి రుద్రాణి కంగారు పడుతుండగా రాహుల్ వచ్చి.. ఆ యాడ్ సరిగా రాదని చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ 911లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 23rd2025 Episode 911 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

అప్పూ తన సిబ్బందితో మాట్లాడుతుండగా ఓ మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడమని అడుగుతుంది. ఏం జరిగిందని అప్పూ అడగ్గా.. నేను మార్కెట్‌లో నుంచి వస్తుండగా వాళ్లు నా చైన్ కొట్టేయాలని అనుకున్నారని వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోతూ ఇటు వచ్చానని అంటుంది ఆ మహిళ. ఈ ఏరియాలో చైన్ స్నాచింగ్ జరుగుతుంటే మీరేం చేస్తున్నారని స్టాఫ్‌పై అప్పూ సీరియస్ అవుతుంది. ఆమె తనింటికి వెళ్లడానికి భయపడుతుండటంతో అప్పూ స్వయంగా లిఫ్ట్ ఇస్తుంది. దాంతో ఆమె అప్పూని కాఫీ తాగడానికి రమ్మని చెబుతుంది. ఆ ఇల్లు చూసి అప్పూ షాక్ అవుతుంది. ఇంతలో ఆ ఇంట్లోని ఫోటో చూసి అప్పూ అవాక్కు అవుతుంది. ఆ ఫోటోలలో సదరు మహిళతో రేణుక భర్త అశోక్ ఉండటంతో ఆమె షాక్ అవుతుంది. అతను నా భర్త అశోక్, మా ఇద్దరికీ పెళ్లయి ఆరు నెలలు అవుతుందని అంటుంది.

అశోక్ ఎలా పరిచయం అయ్యాడని అప్పూ అడగ్గా.. నా ఫస్ట్ హాజ్బెండ్ చనిపోయాడని ఆ సమయంలో ఆన్‌లైన్‌లో అశోక్ పరిచయమయ్యాడని చెబుతుంది ఆ మహిళ. నన్ను, నా పాపని చాలా బాగా చూసుకుంటున్నాడని.. అందుకే ఒకరినొకరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని చెబుతుంది. దాంతో భర్త పోయిన ఆడవాళ్లని అశోక్ టార్గెట్ చేసి ట్రాప్ చేస్తున్నాడని అప్పూకి అర్ధమవుతుంది. ఆ వెంటనే అప్పూ సీరియస్‌గా బయటకు వచ్చి అశోక్ ఎక్కడున్నా స్టేషన్‌కి ఈడ్చుకురమ్మని చెబుతుంది. తప్పిపోయిన అంజలిని కిడ్నాప్ చేసింది వాడేనని అంటుంది.

మనం చేసిన యాడ్ ఫిల్మ్ రెడీ అయ్యిందని దుగ్గిరాల కుటుంబానికి ప్లే చేసి చూపిస్తాడు రాజ్. కానీ వాళ్లంతా షాక్ తిన్నట్లుగా ఉండిపోతారు. మా యాడ్ బాలేదా? అని రాజ్ అడగ్గా.. అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొడతారు. యాడ్ సూపర్‌గా ఉందని, ఈ డిజైన్స్ అన్ని నేనే కొనేసేదాన్ని అంటుంది ధాన్యలక్ష్మీ. అనుభవం ఉన్న డైరెక్టర్‌లా చాలా బాగా తీశావని మెచ్చుకుంటాడు కళ్యాణ్. ఈ యాడ్ జనాల్లోకి వెళితే గోల్డ్ మార్కెట్‌ను షేక్ చేస్తుందని అంటాడు సుభాష్.

అంతంత మాత్రంగా ఉన్న అమ్మాయిలతోనే అంత బాగా తీసుంటే .. ఇక యాడ్ మొత్తం నాతో ఇంకెంత బాగా తీసేవాడివో అని ప్రశ్నిస్తుంది ఇందిర. దాంతో అందరూ నవ్వేస్తారు. అసలు నా కొడుకులో డైరెక్టర్ ఉన్నాడని గుర్తించి.. వాడిని కావ్య మోటివేట్ చేయబట్టే యాడ్ అంత బాగా వచ్చిందని చెబుతుంది అపర్ణ. యాడ్ బాగా రావడంతో రుద్రాణి, రాహుల్‌లు కుళ్లుకుంటారు. యాడ్ ఎంత బాగా తీసినా? జనాల్లోకి వెళ్లినా? డిజైన్స్‌ని రిలీజ్ చేయలేరని డీలర్స్ అంతా ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నారని చెబుతాడు రాహుల్. రాజ్ డిజైన్ల వైపు వాళ్లు కన్నెత్తి కూడా చూడకుండా నేను చేస్తానని అంటాడు.

అశోక్‌ని పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ కోటింగ్ ఇస్తుంది అప్పూ. నీకు పెళ్లయి భర్త పోయిన ఆడవాళ్లని ఆదుకోవడం అలవాటా? వాళ్ల పిల్లల్ని కిడ్నాప్ చేయడం నీ వృత్తా అని అప్పూ అడగటంతో అశోక్ షాక్ అవుతాడు. రేణుక, రేణుక కూతురు.. ఈరోజు లలిత, లలిత కూతురు అని అంటుంది అప్పూ. రేణుక కూతురు ఎక్కడుందని లాగి పెట్టి కొడుతుంది. దాంతో నేను ఒక దొంగనని, ఆ సమయంలో పిల్లల ఆర్గాన్స్ దొంగిలించే ముఠా ఒకటి పరిచయం అయ్యిందని కావాల్సినంత డబ్బులు ఇస్తామని వాళ్లు ట్రాప్ చేశారు. కానీ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్లకి అప్పగించాలని అన్నారు. డైరెక్ట్‌గా పిల్లల్ని కిడ్నాప్ చేస్తే రిస్క్ అని.. భర్త పోయి పిల్లలున్న ఆడవాళ్లని టార్గెట్ చేసి పిల్లల్ని కిడ్నాప్ చేసి ఆ ముఠాకి అమ్మేస్తున్నానని చెబుతాడు.

రేణుకని కూడా పెళ్లి చేసుకుని అంజలిని కిడ్నాప్ చేశాను, అంజలి చచ్చిపోయిందని అందరినీ నమ్మించాను.. కానీ రేణుక మాత్రం నమ్మలేదని అంటాడు అశోక్. ఇప్పుడు రేణుక కూతురు నా దగ్గరే ఉందని .. పిల్లల ఆర్గాన్స్ దొంగతనం చేయాలంటే వాళ్లకి ఆపరేషన్ చేయాలి, అప్పటిదాకా ఆమెను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని ఆ గ్యాంగ్ చెప్పిందని అంటాడు. ఇంకా చాలా మంది పిల్లల్ని కిడ్నాప్ చేయాలని చెప్పారని అంటాడు. ఆ మాటలతో అప్పూ రగిలిపోతుంది. డబ్బు కోసం పిల్లల ప్రాణాలు తీస్తావా? అని మండిపడుతుంది. ప్రెస్‌మీట్‌లో అశోక్ బాగోతం బయటపెడుతుండగా రేణుక వచ్చి తన కూతురిని చూసుకుని మురిసిపోతుంది.

దీనికి సంబంధించిన ప్రెస్‌మీట్‌ని రుద్రాణి టీవీలో చూస్తుండగా అపూర్వ మేడం వల్లే నేను నా బిడ్డని తిరిగి చూడగలిగానని రేణుక అంటుంది. ఈ మాటలు విన్న రుద్రాణి వెంటనే అందరినీ పిలిచి టీవీ చూడమని అంటుంది. అందులో అప్పూ కనిపించడంతో ధాన్యలక్ష్మీ కోపంతో ఊగిపోతుంది. నీ కోడలికి నీ మాటంటే ఎంత గౌరవం, ఈ కుటుంబం అంటే ఎంత మర్యాద అని మరింత రెచ్చగొడుతుంది రుద్రాణి. ఇంతలో కళ్యాణ్, అప్పూలు ఇంటికి వచ్చి.. అందరూ సీరియస్‌గా ఉండటం చూసి కంగారు పడతారు. ఎక్కడికి వెళ్లొస్తున్నారు అని ధాన్యం అడగ్గా.. అప్పూ, కళ్యాణ్‌లు వణికిపోతారు. అప్పూని తీసుకుని ఎక్కడికి వెళ్లొస్తున్నావని ప్రశ్నించగా.. అలా బయటికి వెళ్లొచ్చామని అంటాడు కళ్యాణ్. ఇంకా ఎన్ని అబద్ధాలు చెబుతావు.. నాకిచ్చిన మాటని తుంగలో తొక్కి, నన్ను మోసం చేస్తారా అని నిలదీస్తుంది ధాన్యం.

నీ భార్య బయటికి వెళ్లి జాబ్ చేస్తుంటే బెడ్‌రూంలో ఉందని నన్ను మాయ చేస్తావా.. కడుపుతో ఉన్న పెళ్లాం కేసుల చుట్టూ తిరుగుతుంటే దానికి సపోర్ట్ చేస్తావా అని మండిపడుతుంది ధాన్యం. నాకు నచ్చినట్లుగా ఉంటానని మాటిచ్చి.. ఇదేనా నన్ను గౌరవించడం అంటే అని అప్పూని నిలదీస్తుంది. మీ అత్తయ్యని అయినవాళ్ల ముందు, కానీవాళ్ల ముందు తలదించుకునేలా చేయడమేనా నీ పుట్టింటి సంస్కారం అంటుంది ధాన్యం. ఇదేనా నీ కన్నవాళ్లు నేర్పిన మర్యాద అని మండిపడుతుంది. విషయం తెలియకుండా నోరు జారొద్దని కళ్యాణ్ చెప్పబోతుండగా కొడుకుపైనా మండిపడుతుంది ధాన్యం.

అప్పూ తనకు తాను ఈ నిర్ణయం తీసుకోలేదు.. నీకిచ్చిన మాట అస్సలు తప్పలేదు, నేను బలవంతం చేయడం వల్లే అప్పూ ఇలా చేసింది. ఒక తల్లి కన్నీళ్లు మాత్రం అప్పూ బయటికి వెళ్లడానికి కారణమైందని, అందుకే కాలు బయటపెట్టి ఆ కేసు టేకప్ చేయాల్సి వచ్చిందని కళ్యాణ్ చెబుతాడు. నీకు చెబితే నువ్వు ఒప్పుకోవని నేనే పర్మిషన్ ఇచ్చానని అన్నదని అంటాడు. ఈ ఒక్క కేసు తర్వాత ఇంట్లోనే ఉండాలని కండీషన్ పెట్టానని చెబుతాడు. అప్పూ ఎప్పుడు నిన్ను మోసం చేయాలని అనుకోలేదని రాజ్ కూడా చెబుతాడు. మీ అందరి డ్రామా అద్భుతంగా ఉందని మండిపడుతుంది ధాన్యం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X