Brahmamudi December 24th Episode: అప్పూ కెరీర్‌పై కొట్టిన ధాన్యలక్ష్మీ.. రాజ్- కావ్యలపై రాహుల్ కుట్ర

Photo Courtesy: JioHotstar

అప్పూ తన స్టాఫ్‌తో మాట్లాడుతుండగా ఒక మహిళ పరిగెత్తుకుంటూ వస్తుంది. తనను దొంగలు వెంటాడుతున్నారని కాపాడమని అంటుంది. దాంతో మీకేం భయం లేదని నేనే మీ ఇంటి దగ్గర దించుతానని చెబుతుంది. తనకు లిఫ్ట్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చిన అప్పూని ఆ మహిళ కాఫీ తాగడానికి పిలుస్తుంది. అప్పూ ఆమె ఇంట్లోకి వెళ్లగా.. అక్కడ రేణుక భర్త ఈమెతో ఉన్న ఫోటో కనిపించడంతో అప్పూ షాక్ అవుతుంది. అతను ఎవరు అని అప్పూ అడగ్గా.. నా భర్త అని, ఈ మధ్యే పెళ్లి అయ్యిందని చెబుతుంది. నా భర్త కొన్నాళ్ల క్రితం చనిపోతే.. అశోక్ సోషల్ మీడియాలో పరిచయమై నన్ను, నా కూతురికి అండగా నిలవడంతో పెళ్లి చేసుకున్నామని చెబుతుంది. దాంతో అప్పూకి అశోక్ నిజస్వరూపం బయటపడుతుంది. వెంటనే అతనిని పోలీస్ స్టేషన్‌కి ఈడ్చుకొస్తుంది.

తన బిడ్డను రక్షించిన అప్పూకి రేణుక థ్యాంక్స్ చెబుతుంది. రాజ్ తీసిన యాడ్‌ని దుగ్గిరాల ఫ్యామిలీ చూసి మెచ్చుకుంటుంది. ఈ యాడ్ మార్కెట్‌లోకి వెళితే.. గోల్డ్ మార్కెట్ షేక్ అవుతుందని మెచ్చుకుంటుంది. ఆ మాటలతో రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. నేను చిన్నపిల్లల ఆర్గాన్స్ దొంగిలించే ముఠాకి పిల్లల్ని అమ్మేస్తున్నానని అశోక్ చెప్పడంతో అప్పూ షాక్ అవుతుంది. వెంటనే అంజలిని రక్షించి రేణుకకు అప్పగిస్తుంది. ఈ కిడ్నాప్ గ్యాంగ్‌ని పట్టుకున్నట్లు మీడియాకు చెబుతుంది అప్పూ. ఇదంతా టీవీలలో చూసిన రుద్రాణి వెంటనే దుగ్గిరాల ఫ్యామిలీని పిలిచి అందరికీ చూపించగా కోడలిని పోలీస్ డ్రెస్‌లో చూసి ధాన్యం రగిలిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 24వ తేదీ ఎపిసోడ్ 912లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 24th 2025 Episode 912 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

అప్పూ ఏం చేసినా నీకు చెప్పే చేయాలని అనుకుందని, కానీ మేమే వద్దు అన్నామని అంటాడు రాజ్. మీ అందరి డ్రామా అద్భుతంగా ఉంది.. ఈ విషయం అందరికీ తెలుసన్న మాట, నా కోడలి గురించి నాకంటే, మిగతా వాళ్లందరికీ తెలుసు. అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు అంటు ధాన్యలక్ష్మీ రగిలిపోతుంది. ఈ విషయం మాకు, కళ్యాణ్‌కు తప్పించి ఎవరికీ తెలియదు. నా చెల్లెలు మాటకు కట్టుబడేదే తప్ప నీ చేత కన్నీరు పెట్టించేది కాదని అంటుంది కావ్య. మీరంతా గొప్పవాళ్లు, నేను రాక్షసిని కదా.. దయాదాక్షిణ్యాలు లేనిదానిని అని బాధపడుతుంది ధాన్యం. తన కడుపులో వున్న బిడ్డకి చిన్న ఇబ్బంది కూడా కలగకూడదనే కదా నా కోడలిని ఇంట్లో ఉండమన్నాను అని అంటుంది ధాన్యం. పనిలో పడి దాని ఆరోగ్యం ఎక్కడ పాడు చేసుకుంటుందోననే కదా ఉద్యోగం వద్దు అని చెప్పిందని గుర్తుచేస్తుంది. అవేవీ మీకు కనిపించడం లేదా? నేను దాని కలను, కోరికను తొక్కేసినట్లు నా కళ్లు కప్పారని ఆవేదన వ్యక్తం చేస్తుంది ధాన్యలక్ష్మీ.

పోలీస్ డ్యూటీ ఎంత కష్టం.. ఆ పనిలో దానికి జరగరానిది జరిగి ఉంటే? కడపులో ఉన్న బిడ్డకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని నిలదీస్తుంది ధాన్యం. నేను చేసింది తప్పే, మీ కోపంలో అర్ధముంది, కానీ ఆ తల్లి తన బిడ్డను కాపాడమని తన బిడ్డను తన ఒడికి చేర్చమని అడుగుతుంటే కాదనలేకపోయానని అప్పూ ఏడుస్తుంది. కడుపుతో ఉన్న నేను ఒక తల్లి బాధ చూడలేక ఇదంతా చేశాను నన్ను క్షమించాలని అంటుంది అప్పూ. ప్రతిక్షణం నీ గురించే ఆలోచించాను, నువ్వు కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నాను.. కానీ నువ్వు మాత్రం నన్ను మోసం చేశావని మండిపడుతుంది. ఈసారి నీ కోడలిని క్షమించాలని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ధాన్యలక్ష్మీకి చెబుతుంది.

నా కోడలు నా బాధను, నా భయాన్ని లెక్కచేయలేదు.. చేసిన తప్పుకి దీనికి శిక్ష పడాల్సిందేనని అంటుంది ధాన్యం. ఇక జీవితంలో అది పోలీస్ ఉద్యోగం చేయటానికి వీల్లేదు, ఇప్పటిదాకా బిడ్డ పుట్టే వరకు జాబ్‌కి వెళ్లొద్దు అన్నాను, కానీ ఇలా జరిగిన తర్వాత దీనిని ఇంకా క్షమించను, అప్పూ శాశ్వతంగా జాబ్ మానేయాలని అంటుంది ధాన్యలక్ష్మీ. మళ్లీ ఖాకీ బట్టలు వేసుకోకూడదు.. జాబ్‌కి రిజైన్ చేయాలి.. నేను ముఖ్యమో, జాబ్ ముఖ్యమో తేల్చుకోమని చెప్పడంతో అప్పూ బాధపడుతుంది. దాంతో అప్పూని రాజ్, కావ్యలు ఓదారుస్తారు. ఇలా జరుగుతుందని అనుకోలేదు.. ఒకరకంగా నీ బాధకు మేం కూడా కారణమే అంటాడు రాజ్. ఒక తల్లి తన కూతురు బతికుందో లేదో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటే చూసి తట్టుకోలేకపోయాను. కాపాడే అవకాశం ఉండి కూడా ఏం చేయలేకపోతే ఇక పోలీస్ జాబ్ ఎందుకు అనిపించింది అని అంటుంది అప్పూ.

ఆ రోజు నువ్వు ఆ కేసు తీసుకోకపోయుంటే ఈరోజు ఆ పాప ప్రాణాలతో ఉండేది కాదు. నీ నిర్ణయం విలువ పాప ప్రాణాలు అని అంటాడు రాజ్. ఈ విషయంలో నువ్వు గర్వపడాలి కానీ ఇలా బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ తప్పూ చేయలేదని అంటుంది కావ్య. కానీ అత్తయ్య మోసం చేశానని అంటోంది కదా అని బాధపడుతుంది అప్పూ. నీకు, నీ కడుపులోని బిడ్డకు ఏమైనా అవుతుందోమోనని భయంతోనే అత్తయ్య ఇలా అందని అంటుంది కావ్య. కారణం ఏదైనా ఇక నేను ఎప్పటికీ పోలీస్ డ్రెస్ వేసుకోలేనని ఏడుస్తుంది అప్పూ. అక్కడి వరకు వస్తే చూస్తూ మేమంతా ఎందుకు ఊరుకుంటాం, నీ కలను నీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు అని అంటారు రాజ్, కావ్య. ఒకప్పుడు నేను ఎవరినైనా ఎదిరించే దానిని.. కానీ ఈరోజు ఈ ఫ్యామిలీ నా ఫ్యామిలీ. వీళ్లంతా నా వాళ్లు అన్నప్పుడు వాళ్లకి ఇష్టం లేని పనిని నేను ఎలా చేయగలను అని అడుగుతుంది అప్పూ. పిన్ని తన నోటితోనే నిన్ను పోలీస్ జాబ్ చేసుకోమని చెబితే నీకు ఓకేనా అని రాజ్ అడుగుతాడు. మా వల్ల తప్పు జరిగింది కాబట్టి మేమే సరిదిద్దుకుంటామని అంటుంది కావ్య.

పేపర్‌లో రాజ్ ఇచ్చిన యాడ్ బాగుండటంతో దుగ్గిరాల ఫ్యామిలీ మెచ్చుకుంటుంది. మనం ఎప్పుడూ పబ్లిసిటీకి ఇంత ఖర్చు పెట్టలేదు కదా అని సీతారామయ్య అడగ్గా.. మేం కేరళ వెళ్లడం వల్ల బిజినెస్ పడిపోయిందని కొత్త డిజైన్స్ మార్కెట్‌లోకి పంపడానికి ఇలా చేశామని కావ్య చెబుతుంది. ఇంత ఖర్చు పెట్టే బదులు కొంత పర్సంటేజ్ క్లయింట్స్‌కి డిస్కౌంట్ ఇవ్వొచ్చు కదా అని స్వప్న చెప్పడంతో అలా కుదరదని రాజ్ అంటాడు. రాహుల్ ఐడియా సక్సెస్ అయ్యింది, అవార్డ్ వచ్చింది.. ఇప్పుడు రాహుల్ ఐడియా తీసుకుంటే నా కొడుకుని ఫాలో అయినట్లుగా ఉంటుందని ఎద్దేవా చేస్తుంది రుద్రాణి. స్వరాజ్ కంపెనీ అంటే ఒక బ్రాండ్.. ఇక్కడ క్వాలిటీ బాగుంటుందని నమ్మి జనం మన దగ్గర కొంటున్నారు. ఇప్పుడు అనవసరమైన ఆఫర్లు ఇస్తే ప్రజల్లో అనుమానం వస్తుందని అంటాడు రాజ్. ఇలాంటివి కొత్తవాళ్లు ఇస్తారని.. స్వరాజ్ కంపెనీకి అవసరం లేదని కావ్య మండిపడుతుంది.

నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తూనే డిస్కౌంట్ ఇచ్చానని రాహుల్ చెప్పగా.. ఈరోజు ఓకే రేపు ఏం చేస్తావు? ప్రతిసారి అలాగే డిస్కౌంట్ ఇవ్వగలవా? అని రాజ్ ప్రశ్నించగా రాహుల్ సైలెంట్ అయిపోతాడు. నీ బుర్రే బుర్ర.. నేను నీలాగా పెద్ద బిజినెస్‌మెన్ అవ్వాలంటే ఎన్నేళ్లు పడుతుందోనని రాహుల్ అనగా.. అలాంటిది జరగదని నువ్వు ఎక్కువగా ఊహించుకోవద్దని సుభాష్ సెటైర్లు వేయడంతో స్వప్న బాధపడుతుంది. మరోవైపు.. టిఫిన్ చేసి, టాబ్లెట్స్ వేసుకోమని అప్పూకి చెబుతూ నానామాటలు అంటుంది ధాన్యలక్ష్మీ. ఇకనైనా నా మాటలు వింటే నీకే మంచిందని చీవాట్లు పెడుతుంది. ఆరోజు నీకు జ్వరం వచ్చింది కదా? ఎప్పుడు లేచావు? ఎప్పుడు బయటికి వెళ్లావని అడుగుతుంది. ఆ రోజు బెడ్‌పై దుప్పటి కప్పుకుని పడుకున్నది మావయ్య గారు అని అప్పూ చెప్పడంతో ధాన్యం షాక్ అవుతుంది.

ఈ మాటలన్నీ కావ్య, రాజ్, ఇందిరలు వింటారు. పిన్ని మనసు మార్చడానికి మేం ఒక ప్లాన్ వేశామని రాజ్, కావ్యలు చెబుతారు. చిన్నత్తయ్య ప్రతినెలా గుడిలో అన్నదానం జరిపిస్తూ ఉంటారు కదా దీని గురించి మాట్లాడటానికి పంతులుగారు వస్తున్నారని కావ్య చెబుతుంది. దానిని నువ్వు ఆపాలని ఇందిరతో చెబుతారు కావ్య, రాజ్. ఇంతలో పంతులుగారు రావడంతో ఆయనకి అన్నదానం నిమిత్తం ధాన్యం డబ్బులు ఇస్తుండగా ఇందిర ఆపుతుంది. దాంతో ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. ఇలా నీ ఇష్టానుసారంగా ప్రతినెలా ఇంతింత డబ్బులు వృథా చేయడానికి, అన్నదానాలు చేయడానికి ఇదేమీ సత్రం కాదని అంటుంది ఇందిర. ఇది ఎప్పుడూ చేసేదే కదా? మన కుటుంబం బాగుండాలనే ఇలా చేస్తున్నానని చెబుతుంది ధాన్యం. మరి అదే శివాలయంలో దుగ్గిరాల కుటుంబం కోసం ప్రతియేటా 5 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నామని అంటుంది ఇందిర.

ఇంట్లో నేను ఒక దానిని ఉన్నాను.. కుటుంబంతో చెప్పకుండా ఇలా చేయొద్దని ఆర్డర్ వేస్తుంది. ధాన్యం చేసిన దాంట్లో తప్పేం ఉందని అడుగుతాడు సుభాష్. ఒకరికి నచ్చినది ఇంకొకరికి నచ్చాలనే రూల్ ఉందా? అని ప్రశ్నిస్తుంది ఇందిర. అత్తగా నాకు నచ్చలేదు అని అంటుంది. అవతలి వాళ్లకు మనం ఎంత మంచి చేశామన్నదే చూడాలి కానీ, అత్త మాటతో పనిలేదని అంటుంది ధాన్యం. మరి ఈ బుద్ధి, ఈ మంచి నీ కోడలు అప్పూ విషయంలో ఏమైందని నిలదీస్తుంది ఇందిర. నీ కోడలు ఒక కేసు విషయంలో నీకు చెప్పకుండా ఉద్యోగానికి వెళ్లింది.. ఓ బిడ్డను తల్లి దగ్గరికి చేర్చి కన్నీళ్లను తుడిచింది. నీ కోడలు నీ మాట వినాలి.. అలాగే నా కోడలు కూడా నా మాట వినాలి కదా అని అంటుంది ఇందిర. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X