Brahmamudi December 25th Episode: ధాన్యలక్ష్మీకి ప్రకాశం క్లాస్.. కావ్య- రాజ్‌లను దెబ్బకొట్టేలా రాహుల్ స్కెచ్

Photo Courtesy: JioHotstar

తనను మోసం చేసి పోలీస్ డ్యూటీ చేసిన అప్పూపై ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. ఇందులో అప్పూ తప్పేం లేదని.. తను నీకు నిజం చెబుదామని అనుకుందని, కానీ మేమే ఆపామని అంటాడు రాజ్. ఒక తల్లి కన్నీళ్లు తుడవటానికి అప్పూ ఈ నిర్ణయం తీసుకుందని కావ్య అంటుంది. అప్పూని క్షమించి వదిలేయాలని దుగ్గిరాల ఫ్యామిలీ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ధాన్యం సీరియస్ అవుతుంది. నన్ను మోసం చేసినందుకు గాను జీవితాంతం అప్పూ పోలీస్ యూనిఫాం వేయడానికి వీల్లేదు, వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయాలని తేల్చేస్తుంది. ఆ మాటలతో అప్పూ కంటతడి పెడుతుంది.

అప్పూని రాజ్, కావ్యలు ఓదార్చి.. తప్పు మా వల్ల జరిగింది కాబట్టి మేమే సరిదిద్దుతామని చెబుతారు. ఆ వెంటనే ఇందిరతో కలిసి అప్పూ, రాజ్‌లు స్కెచ్ వేస్తారు. గుడిలో అన్నదానం చేసేందుకు డబ్బులు ఇస్తున్న ధాన్యలక్ష్మీని అడ్డుకుంటుంది ఇందిర. అత్తగారిగా నాకు ఒక్కమాట కూడా చెప్పవా అని మండిపడుతుంది. చేసేది మంచి పని అయినప్పుడు ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదని అంటుంది ధాన్యం. మరి అప్పూ ఓ తల్లి కన్నీటిని తుడవటం, పసిబిడ్డను కాపాడటం కూడా మంచి పనే కదా అని చెబుతుంది ఇందిర. ఆ మాటలతో ధాన్యలక్ష్మీ ఆలోచనలో పడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 25వ తేదీ ఎపిసోడ్ 913లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 25th 2025 Episode 913 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

నలుగురి ఆకలి తీరిస్తే గొప్ప అని తెలిసిన నీకు.. అదే నలుగురు నీ కోడల్ని పొగడ్తలతో ముంచెత్తారు అది గొప్ప అని తెలియదా ధాన్యలక్ష్మీపై మండిపడుతుంది ఇందిర. నీ కోడలు నీ మాట వినాలి.. నువ్వు గీసిన గీత దాటకూడదు. మరి అలాగే నా కోడలు కూడా నా మాట వినాలి కదా అని అంటుంది. అన్నీ నాకు చెప్పే చేయాలి కదా? అలా జరగనప్పుడు నేను ఎలా ఊరుకుంటానని ప్రశ్నిస్తుంది. నీకు శిక్ష వేయాలి కదా అని అంటుంది. నువ్వు చేసింది రైట్ అయితే అప్పూ చేసింది కూడా రైటే.. లేదంటే ఇద్దరిది తప్పేనని ఇందిర చెబుతుంది. నేను చేసింది తప్పు అని ఒప్పుకోవడం లేదు.. నేను ఈ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఏనాడూ మీ మాట జవదాటలేదు.

మీరూ మావయ్య ఏం చెబితే అదే చేశాను, మీ అనుమతి లేకుండా ఏది చేయలేదని అంటుంది ధాన్యం. నా కోడలు తప్పు చేస్తుందని, మీ కోడలు తప్పు చేస్తుందని అనుకోవద్దు.. ఇకపైనా తప్పు చేయదని తేల్చిచెబుతుంది. మా అత్తగారికి ఇష్టం లేకపోవడం వల్ల అన్నదాన కార్యక్రమం జరగదని పంతులుగారికి చెప్పి వెళ్లిపోతుంది. మనం అనుకున్నది రివర్స్ అయ్యిందని ఇందిర, రాజ్‌లు బాధపడతారు. మా పిన్ని చెప్పినట్లుగానే ప్రతినెలా అన్నదానం చేయండి, ఆ ఖర్చంతా నేను భరిస్తానని పంతులుగారికి చెబుతాడు రాజ్. ప్లాన్ ఏ ఫెయిల్ అయ్యింది.. ప్లాన్ బీ ఉందని రాజ్ అంటాడు.

ఇంతలో రాహుల్‌కి మేనేజర్ ఫోన్ చేసి మన డిజైన్లు బాలేదని కావ్య గారి డిజైన్లు బాగున్నాయని కస్టమర్లు అంటున్నారని చెబుతాడు. ఆ మాటలతో రాహుల్ సీరియస్ అవుతాడు. మన కంపెనీ ఉండగా పక్క కంపెనీకి వెళ్లి ఎవరైనా కొంటారా అని ప్రశ్నిస్తాడు. అమ్ముడుపోని సరుకుకి ఎంత డిస్కౌంట్ ఇచ్చినా ఉపయోగం లేదని అంటున్నారని మేనేజర్ చెబుతాడు. ఇదంతా విన్న రుద్రాణి.. మేనేజర్ నీ మాట వింటున్నాడని క్లయింట్స్ కూడా నీ మాట వింటారని ఎలా అనుకుంటున్నావని ప్రశ్నిస్తుంది. చాలా ఖర్చు పెట్టాను, ఇద్దరు ముగ్గురు డిజైనర్లని పెట్టి కొత్త డిజైన్లు వేయించానని చెబుతాడు రాహుల్. అందుకే రాజ్ పబ్లిసిటీ చేయకుండా ఆపాలని అనుకున్నట్లు చెబుతాడు.

ఇప్పుడున్న పరిస్ధితుల్లో కావ్య కంటే మంచి డిజైన్స్ తయారు చేసేవాళ్లని నువ్వు తీసుకురాలేవు.. మనం వాళ్ల స్థాయికి ఎదగలేనప్పుడు, వాళ్లని మన స్థాయికంటే కిందకి దిగజార్చాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనమే నెంబర్ వన్ అవుతాం అని అంటుంది. రాజ్ మంచి బిజినెస్‌మెన్, కావ్య ఒక టాలెంటెడ్ డిజైనర్. వాళ్లతో బిజినెస్‌లో పోటీపడటం మానేసి పర్సనల్‌గా ఎలా దెబ్బకొట్టాలో ఆలోచించు అని చెబుతుంది రుద్రాణి. వాళ్లిద్దరూ ఎమోషనల్ ఫుల్స్ కాబట్టి.. వాళ్లని ఎమోషనల్‌గానే దెబ్బకొట్టమని సలహా ఇస్తుంది.

ధాన్యాన్ని నా మాటలతో ఇంకా బాధపెట్టానా అని అపర్ణని అడుగుతుంది ఇందిర. ఇంత డోస్ తగిలినా మీ కోడలు హాయిగా నిద్రపోతోందని అంటాడు ప్రకాశం. ఇంతలో రేణుక తన పాపని తీసుకుని ఇంటికి వస్తుంది. అప్పూని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చానని అంటుంది. అప్పూని చూడగానే ఆ పాప థ్యాంక్స్ చెబుతుంది. మీకు, నేను నా పాప దండం పెట్టడం కాదు.. జీవితాంతం మీ పాద సేవ చేసుకున్నా మీ రుణం తీర్చుకోలేమని అంటుంది. ఏడాదిగా మా పాప కోసం ఎదురుచూస్తూ గడిపానని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెబుతుంది రేణుక. అసలు నా బిడ్డ ప్రాణాలతో లేదని చెప్పినవాళ్ల నోరు మూయించారు. నా బిడ్డ నాకు దూరం కావడానికి నా భర్త అని నిరూపించి.. నా బిడ్డను నాకు దగ్గర చేశారని చెబుతుంది రేణుక. మీరు, మీకు పుట్టబోయే బిడ్డ, మీ కుటుంబం అందరూ బాగుండాలని అంటుంది.

నీ కోడలు చేసిన పనికి ఆ తల్లిబిడ్డలు ఎంతో సంతోషిస్తున్నారని ధాన్యంతో అంటుంది ఇందిర. మీ కోడలు గారు లేకపోతే నా కూతురు నాకు దక్కేది కాదు. ఇలాంటి కోడలు రావడం మీ అదృష్టం.. మీ అందరికీ దండం పెట్టి వెళ్దామని వచ్చానని అంటుంది. మిమ్మల్ని పోలీస్ డ్రెస్‌లో చూడాలని ఉంది, మీరెప్పుడూ మా లాంటి వాళ్లని కాపాడుతూ ఉండాలని పాప అంటుంది. నేను పెద్దయ్యాక మీలాగే పోలీస్ అవుతానని అంటుంది చిన్నారి. వాళ్లు చెప్పిన మాటల్ని ధాన్యలక్ష్మీ ఆలోచిస్తూ ఉండగా ప్రకాశం వస్తాడు. అత్తగా అప్పూ ఎదుగులని ఒప్పుకోవడానికి నీ ఇగో అడ్డొస్తుందా అని ప్రశ్నిస్తాడు. నేనేమీ అప్పూని రాచిరంపాన పెట్టడం లేదు.. ప్రేమగానే చూసుకుంటున్నానని చెబుతుంది ధాన్యం. కళ్యాణ్ కంపెనీని చూసుకోను అన్నాడు, రైటర్ అవుతానని అంటే తల్లిగా అర్ధం చేసుకుని స్వేచ్ఛగా బతకమని చెప్పావు కదా అని అంటాడు ప్రకాశం.

మరి నీ కోడలు మాత్రం నీకు నచ్చినట్లుగా జీవితాంతం ఉండమంటే ఎలా ఉంటుంది? కొడుక్కి ఒక న్యాయం? కోడలికి ఒక న్యాయమా? అని ప్రశ్నిస్తాడు. ఈరోజు అప్పూ చేసిన పనివల్ల ఒక పాప ప్రాణం నిలబడింది, ఒక తల్లి ఆవేదన దూరమైందని అంటాడు ప్రకాశం. నాకు అప్పూ ఉద్యోగంతోనే సమస్య.. దాని చుట్టూ ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని చెబుతుంది ధాన్యం. మన చేతుల్లో లేని ప్రమాదాల గురించి ఆలోచిస్తే మన జీవితం అక్కడే ఆగిపోతుందని అంటాడు ప్రకాశం. ఇంత జరిగినా పిన్ని మనసు మాత్రం మారలేదు.. అలాగే సైలెంట్‌గా ఉండిపోయిందని కావ్యతో అంటాడు రాజ్. అంత తొందరగా మారితే ఆవిడ ధాన్యలక్ష్మీ ఎందుకు అవుతుందని చెబుతుంది కావ్య. చిన్నత్తయ్యకి అప్పూ మీద ఉన్నది కోపం కాదు.. కోపం అనే ముసుగులోని ప్రేమ అని అంటుంది. అంత తేలికగా చిన్నత్తయ్యని మార్చలేమని చెబుతుంది కావ్య.

జాబ్ మానేయమని పిన్ని చెప్పగానే అప్పూ తట్టుకోగలుగుతుందా? పిన్ని మనసు మార్చాలని అంటాడు రాజ్. ఇంతలో శృతి ఫోన్ చేసి మన పాత క్లయింట్స్, డీలర్స్, కస్టమర్లు అంతా ఫోన్ చేస్తున్నారు అని చెప్పడంతో రాజ్ సంతోషిస్తాడు. అయితే వాళ్ల ఆర్డర్స్‌కి యాక్సెప్ట్ చేయొద్దు.. నేను వాళ్లతో ఒకసారి మాట్లాడాలని అంటుంది కావ్య. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. వెళ్లిపోయిన వాళ్లు తిరిగొస్తున్నారు కదా? వాళ్ల ఆర్డర్ ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదని అడుగుతాడు. నిన్న డిస్కౌంట్స్ ఇస్తున్నారంటే వెళ్లారు.. ఇప్పుడు మనం కొత్త డిజైన్స్ ఇస్తున్నామని వస్తారు, మళ్లి రేపు ఇంకో కంపెనీకి వెళ్లరని గ్యారంటీ ఏంటీ? అని ప్రశ్నిస్తుంది కావ్య. క్లయింట్స్ ఎప్పుడూ మన నీడలా శాశ్వతంగా ఉండిపోవాలని అంటుంది. అందుకే వాళ్లతో ఒకసారి మాట్లాడాలి? అగ్రిమెంట్ చేసుకోవాలి? అప్పుడే వాళ్లతో బిజినెస్ చేయాలని చెబుతుంది కావ్య. భార్య మాటలతో రాజ్‌కి మైండ్ బ్లాంక్ అవుతుంది. రోజు రోజుకు బిజినెస్‌లో నాకంటే తెలివిగా ఆలోచిస్తున్నావని మెచ్చుకుంటాడు.

ధాన్యం మాటలతో బాధపడుతున్న అప్పూని అపర్ణ, ఇందిర ఓదారుస్తారు. మీ అత్తకి నీ ఉద్యోగం విలువ తెలియదని, ఎంతసేపూ దాని పంతం నెగ్గించుకోవాలనే ఉద్దేశం తప్ప నీ బాధ దానికి తెలియదని అంటుంది ఇందిర. ఇంతలో సుభాష్, ప్రకాశం వచ్చి కోడలి బాధేంటో ఎందుకు ఆ అమ్మాయి ఉద్యోగం చేయాలని తపిస్తుందో తెలిసిందే అయితే ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది? అని అంటాడు ప్రకాశం. అత్తయ్యని ఏమీ అనొద్దని, తప్పు నాదే.. అత్తయ్యకి చెప్పకుండా ఏదో సాధిద్దామని అనుకున్నానని అంటుంది అప్పూ. నువ్వు అనుకున్నది సాధించావని మెచ్చుకుంటాడు కళ్యాణ్. నువ్వేమీ మీ అత్త మాటని పట్టించుకోవద్దని ఇందిర అంటుంది. ఇంతలో రుద్రాణి వచ్చి అలా చెబుతావేంటీ అని మండిపడుతుంది. నీ సంకల్పం గొప్పది, మనం చేసిన మంచి వృథా కాదని చెబుతుంది అపర్ణ. ఇంతలో ధాన్యలక్ష్మీ సీరియస్‌గా వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X