Brahmamudi December 26th Episode: ధాన్యలక్ష్మీ మనసు మార్చిన కావ్య... సుభాష్ మాటలతో స్వప్న మనసు ముక్కలు
Photo Courtesy: JioHotstar
మా అత్తగారి మాటను అప్పుడు జవదాటలేదు.. ఇప్పుడు కూడా జవదాటను అని అన్నదానానికి విరాళం ఇవ్వకుండా ఆగిపోతుంది ధాన్యలక్ష్మీ. తన ప్లాన్ రివర్స్ కావడంతో ఇందిర షాక్ అవుతుంది. వెంటనే పంతులు గారిని కలిసిన రాజ్.. మా పిన్ని కోరుకున్నట్లుగానే ఇకపైనా అన్నదానం జరిపించమని చెబుతాడు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఉండగా.. రేణుక, తన కూతురిని తీసుకుని వస్తుంది. ఇలాంటి కోడలు ఉన్నందుకు నిజంగా మీరు అదృష్టవంతురాలిని మెచ్చుకుంటుంది. నేను పెద్దయ్యాక మీలాగే అవుతానని.. మీరు ఎప్పటికీ పోలీస్ యూనిఫాంలోనే ఉండాలని పాప చెప్పడంతో అప్పూ బాధపడుతుంది.
రేణుక అన్న మాటలతో ధాన్యం ఆలోచనలో పడుతుంది. ఇంతలో ప్రకాశం వచ్చి.. నీ కోడలి వల్ల ఓ తల్లికి బిడ్డ దక్కిందని చెబుతాడు. అయినప్పటికీ ధాన్యం పట్టించుకోదు. కావ్య వేసిన కొత్త డిజైన్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు శృతి చెప్పడంతో రాజ్ సంతోషిస్తాడు. అయితే అప్పుడే బుకింగ్స్ వద్దని నేను క్లయింట్స్‌తో మాట్లాడిన తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని శృతికి ఆర్డర్ వేస్తుంది కావ్య. మరోవైపు.. రాహుల్ డిజైన్స్‌ని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో అతను చిరాకు పడతాడు. ఇది గమనించిన రుద్రాణి.. నువ్వు రాజ్‌తో డైరెక్ట్‌గా పోటీపడలేవు కాబట్టి ఎమోషనల్‌గా దెబ్బ కొట్టాలని చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 26వ తేదీ ఎపిసోడ్ 914లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం అప్పూని ఓదారుస్తుండగా ధాన్యలక్ష్మీ వచ్చి నేను నా కోడలితో ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. ఇంకా నువ్వు చెప్పడానికి ఏం మిగిలింది? కోడలిని ఉద్యోగం చేయొద్దు, ఇంట్లోనే ఉండమన్నావు? నీ మాట నెగ్గించుకున్నావ్ అది సరిపోదా? అని ప్రకాశం మండిపడతాడు. దాంతో అప్పూ వెళ్లి ధాన్యలక్ష్మీకి క్షమాపణలు చెబుతుంది. నీ మనసు నాకు తెలుసు.. కానీ వాటితో పాటు నువ్వు నమ్మిన వృత్తి, నువ్వు ఇష్టపడే ఉద్యోగం కూడా నాకు అర్ధమైంది.. నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను, నీకిష్టమైన ఉద్యోగాన్ని మాన్పించి నేనేం సాధిస్తాను అని అంటుంది ధాన్యలక్ష్మీ. ఎంత పట్టుదల లేకపోతే అలాంటి కేసును ఛేదిస్తావు.. ఎంతటి నిజాయితీ లేకపోతే ఆ బిడ్డ తన తల్లిని చేరుతుంది అని చెబుతుంది.
ఆ తల్లి వచ్చి నీ గొప్పతనం గురించి చెబుతుంటే నీకే కాదు, నువ్వు నా కోడలివి అయినందుకు నేను కూడా గర్వపడ్డానని అంటుంది ధాన్యలక్ష్మీ. వృత్తిపట్ల అంతటి బాధ్యత ఉన్న నీ కాళ్లకి నేనెందుకు సంకెళ్లు వేయాలని అంటుంది. నేనెందుకు నీ గౌరవాన్ని తగ్గించాలి.. అందుకే నువ్వు ఉద్యోగం మానేయొద్దని చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. నువ్వు అనుకున్నది చేయ్.. కానీ నా కోడలు డెలివరి అయ్యే వరకు ఇల్లు కదలకుండా ఉంటే చాలని అంటుంది ధాన్యలక్ష్మీ. మీరు చెప్పినట్లుగానే డెలివరీ అయి బిడ్డను మీ చేతుల్లో పెట్టే వరకు నేను ఎక్కడికి వెళ్లను అని మాటిస్తుంది అప్పూ. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఆనందిస్తుంది.
ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది కాబట్టి నేను, కళావతి ఇక మార్కెంటింగ్ పనిమీదే ఉంటాం.. ఒక నెలలో ఊహించని విధంగా సేల్స్‌ని పెంచుతామని అంటాడు రాజ్. ఆ మాటలతో రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. చెప్పినట్లుగానే కావ్య, రాజ్‌లు బిజినెస్‌లో బిజీగా ఉంటారు. మరోవైపు.. స్వరాజ్ కంపెనీ కంటే ముందే మన డిజైన్లు మార్కెట్‌లో ఉండాలని మేనేజర్‌కి చెబుతాడు రాహుల్. నీకు తెలిసిన డిజైనర్స్ అందరినీ పిలువు.. ఎంత శాలరీ కావాలన్నా ఇద్దాం, కానీ బెస్ట్ డిజైన్స్ నాకు కావాలని చెబుతాడు రాహుల్. మరోవైపు.. కావ్య, అప్పూలకు నెలలు నిండటంతో వాళ్లిద్దరినీ రాజ్, కళ్యాణ్‌లు బాగా చూసుకుంటారు. కావ్యని, అప్పూని చెక్ చేసిన డాక్టర్ గారు వారిద్దరి హెల్త్, బేబీ హెల్త్ కూడా బాగున్నాయని చెప్పడంతో అంతా సంతోషిస్తారు.
రాజ్, కావ్యలు బిజినెస్ వర్క్‌లో ఉండగా శృతి వచ్చి మన ఓల్డ్ క్లయింట్స్ ఒకసారి మిమ్మల్ని కలవాలని అంటున్నారని చెబుతుంది. ఆ మాటలతో వారిద్దరూ సంతోషించి వెంటనే మీటింగ్ ఏర్పాటు చేయమని చెబుతారు. మరోవైపు.. మన క్లయింట్స్ ఒక్కొక్కరిగా ఆ స్వరాజ్ కంపెనీకి వెళ్లిపోతున్నారని మేనేజర్ చెప్పడంతో రాహుల్ రగిలిపోతాడు. అటు ధాన్యలక్ష్మీ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లిందని అపర్ణని అడుగుతుంది ఇందిర. ఇక్కడ లేదంటే అప్పూకి ధాన్యలక్ష్మీ ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటుందని అంటుంది అపర్ణ. ఇంతలో అప్పూని తీసుకొస్తుంది ధాన్యం. మరోవైపు.. కావ్య, రాజ్‌లు అందరినీ ఇంట్లోనే ఉండమని ఫోన్ చేశారని సుభాష్ చాలా సంతోషంగా చెబుతాడు. వాళ్లిద్దరూ ఏమైనా ఫారిన్ నుంచి వచ్చారా? ఆఫీస్ నుంచే కదా? అని అంటుంది రుద్రాణి.
రాజ్, కావ్యలు స్వీట్స్ తీసుకుని వచ్చి అందరికీ పంచుతారు. విషయం చెప్పకుండా ఏంటిది అని అంతా అయోమయంలో ఉంటారు. నెల క్రితం సేల్స్ పడిపోయిన స్వరాజ్ గ్రూప్‌ని మళ్లీ ఈ స్టేట్‌లోనే నెంబర్‌వన్‌గా నిలబెట్టామని కావ్య చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుండగా రుద్రాణి మాత్రం రగిలిపోతుంది. స్టేట్‌లో ఉన్న అన్ని జ్యూవెలరీ కంపెనీస్ కన్నా మన సేల్స్ ఊహించనంతగా పెరిగాయి. ఓల్డ్ క్లయింట్స్ అంతా మళ్లీ మన కంపెనీతో టయ్యప్ అయ్యారని కావ్య, రాజ్‌లు చెబుతారు. దీనంతటికీ మీ ఇద్దరి కష్టమే కారణమని సుభాష్ మెచ్చుకుంటాడు. నా మనవడు పడిలేచే కెరటం లాంటివాడు, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మళ్లీ బలంగా నిలబడతాడని అంటాడు సీతారామయ్య.
నిలబడటం గొప్పకాదని, ఎన్నిరోజులు నిలబడతారు అన్నదే ముఖ్యమని రుద్రాణి అనడంతో ఇందిర చీవాట్లు పెడుతుంది. ఇంతలో రాహుల్ బోకే తీసుకొచ్చి రాజ్‌కి ఇచ్చి కంగ్రాట్స్ చెబుతాడు. ఒక నెలలో ఇంత గ్రోత్ చూపిస్తారని అస్సలు అనుకోలేదని అంటాడు. ఊహకి అందితే వాడు నా కొడుకెందుకు అవుతాడని చెబుతాడు సుభాష్. బిజినెస్‌లో సక్సెస్ కావడం అంటే గాల్లో మేడలు కట్టడం కాదు.. కష్టపడి ఎదగాలి, విలువలు పాటించాలని చూసి నేర్చుకోమని క్లాస్ పీకుతాడు సుభాష్. ఆ మాటలతో స్వప్న సీరియస్ అవుతుంది. రాహుల్ ఏదో అడ్డదారిలో పైకి వచ్చినట్లు, ఎవరినో ముంచి పైకొచ్చినట్లు చెబుతున్నారు, రాహుల్ కూడా రాజ్ లాగే నిజాయితీగానే బిజినెస్ చేశాడు కదా? ఇప్పుడు అదే చేస్తున్నాడు కదా అని అంటుంది స్వప్న.
రాహుల్ ఎవరినో వెనక్కినెట్టి షర్ట్ నలగకుండా బిజినెస్ చేస్తున్నట్లు చెబుతున్నారని రుద్రాణి కూడా మండిపడుతుంది. రాహుల్ శ్రమించలేదని మేం అనడం లేదు.. అవార్డ్స్ కంటే నిజాయితీయే ముఖ్యమని రాజ్‌ని ఫాలో అవ్వమని పెద్దవాళ్ల అభిప్రాయమని అంటుంది స్వప్న. ఎంత ఫాలో అయినా రాజ్ ఇంటెలిజెన్స్‌ని రీచ్ కాలేం.. రాజ్ స్థాయి వేరు, నా ప్రయత్నం నేను చేస్తానని అంటాడు రాహుల్. కావ్య ఏదో గీసుకుంటూ ఉండటంతో ఏం చేస్తున్నావని రాజ్ అడుగుతాడు. మన ఫ్యూచర్ డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలో గీస్తున్నానని అంటుంది కావ్య. ఈ ఇల్లు బాగానే ఉంది కదా? దీనినెందుకు మార్చడం అని అడుగుతాడు రాజ్. కాలంతో పాటు మనం కూడా మారాలని అంటుంది కావ్య. మనకి, అప్పూకి ఒక బాబు పుడతాడు, ఆల్రెడీ స్వప్న అక్కకి ఒక పాప ఉంది కదా? వాళ్ల ముగ్గురు పెద్దవాళ్లు అయితే వాళ్లు చదువుకోవడానికి, పడుకోవడానికి సెపరేట్‌గా రూమ్స్ కావాలి కదా అని చెబుతుంది కావ్య. నేను మీ ఇంట్లో అడుగుపెట్టగానే నన్ను స్టోర్ రూమ్‌లో పడేశారని గుర్తుచేస్తుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











