Brahmamudi December 27th Episode: రాహుల్ కొత్త పన్నాగం.. దుగ్గిరాల ఫ్యామిలీకీ పెను ప్రమాదం
Photo Courtesy: JioHotstar
దుగ్గిరాల ఫ్యామిలీ అప్పూని ఓదారుస్తుండగా ధాన్యలక్ష్మీ వచ్చి నీ నిజాయితీతో ఆ తల్లిని బిడ్డని ఒక్కటి చేశావని మెచ్చుకుంటుంది. నీకు ఎంతో ఇష్టమైన ఉద్యోగాన్ని మాన్పించి నేనేం చేస్తాను.. నా మనసు మార్చుకుంటున్నానను నువ్వు ఖాకీ డ్రెస్‌కి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని ధాన్యం చెబుతుంది. కాకపోతే డెలివరీ అయి, నా చేతుల్లో బిడ్డను పుట్టే వరకు మాత్రం ఉద్యోగం చేయొద్దని అంటుంది. ధాన్యలక్ష్మీ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది.
రాజ్, కావ్యలు రాత్రింబవళ్లు కష్టపడి స్వరాజ్ కంపెనీ సేల్స్ భారీగా పెంచుతారు. రాష్ట్రంలోనే స్వరాజ్ కంపెనీ నెంబర్ వన్‌గా మారిందని, పోయిన పాత క్లయింట్స్, కస్టమర్లు తిరిగి వెనక్కి వచ్చారని కావ్య చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. రాజ్‌లాగా నిజాయితీతో, విలువలతో బిజినెస్ చేస్తే నీకు వ్యాపారంలో తిరుగుండదని రాహుల్‌కు సుభాష్ క్లాస్ పీకుతారు. అంటే రాహుల్ ఎవరినో మోసం చేసి ఇలా ఎదిగాడా? అని స్వప్న మండిపడుతుంది. రాజ్, కావ్యలను బిజినెస్‌లో డైరెక్ట్‌గా గెలవలేవని దొంగదెబ్బ కొట్టాలని రాహుల్‌కి చెబుతుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 27వ తేదీ ఎపిసోడ్ 915లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దుగ్గిరాల నిలయం మంటల్లో కాలిపోతున్నట్లుగా పీడకల రావడంతో కావ్య ఉలిక్కిపడి లేస్తుంది. దాంతో ఏం జరిగిందని రాజ్ అడుగుతాడు. మన ఇల్లు కాలిపోతున్నట్లుగా కనిపించిందని, అది కలలా అనిపించలేదని, నిజంగా జరిగినట్లుగానే ఉందని చెబుతుంది కావ్య. నాకు చాలా సార్లు పీడకలలు వస్తాయి.. నేను దేనికి ఇలా భయపడలేదు, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోందని చెబుతుంది కావ్య. ఇల్లు కాలిపోతున్నట్లుగా కల రావడం మామూలు విషయం కాదని అంటుంది. నువ్వు పడుకునే ముందు కొత్త ఇంటికి డిజైన్ చేశావు.... నీ ఆలోచనలు మొత్తం ఇంటి గురించే ఉన్నాయి.. అందుకే నీకు అలాంటి కల వచ్చిందని చెబుతాడు రాజ్. అదే నిజమైతే నేను గీసిన డిజైన్‌లలో ఉన్న ఇల్లు కాలిపోతున్నట్లు కల రావాలి కానీ, మన ఇల్లు కాలిపోతున్నట్లు ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తుంది కావ్య. భార్య ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా రాజ్ పడుకుంటాడు.
పదిరోజుల్లో నా బిజినెస్‌ని తారాస్థాయికి తీసుకెళ్లిన వాడిని, ఇంతలోనే ఇంత డల్ అయిపోతుందని అనుకోలేదని రాహుల్ రగిలిపోతాడు. ఇంతలో రుద్రాణి వచ్చి ఏం ఆలోచిస్తున్నావని ప్రశ్నిస్తుంది. మళ్లీ ఈ ఫ్యామిలీ మోచేతి నీళ్లు ఎలా తాగాలా అని ఆలోచిస్తున్నావా? మళ్లీ వీళ్లందరి కాళ్ల దగ్గర బానిసలా పడి ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నావా? అని రుద్రాణి అడగటంతో రాహుల్ రగిలిపోతాడు. ఇప్పుడు కానీ మళ్లీ నువ్వు బిజినెస్‌లో పుంజుకోకపోతే నీకు మిగిలేది చిప్పేనని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. పదిరోజుల్లోనే నీ కన్నింగ్ మైండ్‌తో ఆ రాజ్, కావ్యలు షాక్ అయ్యేలా ఎదిగి చూపించావు.. వాళ్లు నెల రోజుల్లోనే వాళ్ల బిజినెస్‌ను పెంచుకోవడమే కాక, నీకు బిజినెస్ లేకుండా చేశారని అంటుంది రుద్రాణి. వాళ్లను ఎలా ఎదుర్కొంటావు? వాళ్లకి సమంగా ఎప్పుడు ఎదుగుతావని ప్రశ్నిస్తుంది.
టైం ఎప్పుడూ మనది కాదు.. నువ్వు వాళ్లని మార్కెట్‌లో కొట్టలేవు కాబట్టి.. ఇంట్లో నుంచి నరుక్కొద్దామని అంటుంది రుద్రాణి. రాజ్, కావ్యల మీద పడే దెబ్బ.. ఇంట్లో నుంచే మొదలవ్వాలని అంటుంది. నువ్వు అలాంటి ప్లాన్లు వేయొద్దని చెబుతాడు రాహుల్. నువ్వు రోజురోజుకు ఇలా కృంగిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. నేను మార్కెట్‌లో ఎలా నిలబడాలో తెలిసిందని చెబుతాడు. వాళ్ల ముందు నువ్వు నిలబడలేవని అంటుంది. మనం ఎదగాలంటే టాలెంట్ కావాలి? తెలివి కావాలి? కానీ అవతలి వాళ్లని తొక్కేయాలంటే ఇవేవీ అవసరం లేదని అంటాడు రాహుల్. దొంగ బంగారం ద్వారా కావ్య, రాజ్‌లకు బుద్ధి చెబుతానని అంటాడు. దొంగ బంగారం గురించి బయటకొస్తే దొరికిపోతావని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి.
అది నా వైపు రాదని.. రాజ్ వైపుకు వెళ్తుందని చెబుతాడు రాహుల్. బంగారం నేను కొంటాను, పేరు మాత్రం రాజ్‌దే ఉంటుంది అలా ప్లాన్ చేశానని అంటాడు. ఈ దెబ్బతో ఆ రాజ్ కావ్యల లైఫే ఫినిష్ అయిపోతుందని చెబుతాడు. వెంటనే ఒకతనికి కాల్ చేసి.. నువ్వు సప్లయ్ చేసే దొంగ బంగారం నేనే కొంటానని చెబుతాడు. నువ్వెళ్లి రాజ్‌ని కలిసి హాయిగా ఒక కాఫీ తాగి రా చాలు అని చెబుతాడు రాహుల్. అతని డీల్‌కు అవతలి వ్యక్తి కూడా సరేనని అంటాడు. తనకు పీడకల రావడంతో ఏం జరగబోతుందోనని కావ్య భయపడుతుంది. ఉదయాన్నే దేవుడికి పూజ చేసి తన కుటుంబానికి ఏం కాకూడదని కోరుకుంటుంది. రాజ్ హారతి తీసుకుంటూఉండగా కర్పూరం ఆరిపోవడంతో అపర్ణ, ఇందిర, కావ్యలు భయపడతారు. తలుపు తీసుంది గాలికి ఆరిపోయిందని అంటాడు రాజ్. ఇలా హారతి ఆరిపోకూడదని అంటుంది ఇందిర. రాత్రి కళావతి కూడా ఇలాగే చేసిందని రాజ్ చెప్పడంతో ఇందిర, అపర్ణలు భయపడతారు. కళావతికి ఏదో పీడకల వచ్చిందని అంటాడు.
ఏం కల వచ్చిందని అపర్ణ, ఇందిరలు కావ్యని అడగ్గా మన ఇల్లు తగలబడిపోయినట్లు కల వచ్చిందని చెబుతుంది. నిన్న ఇల్లు కాలిపోయినట్లు కల వచ్చింది.. ఇప్పుడు హారతి ఆరిపోయింది ఇది ఏమాత్రం మంచిది కాదని అంటుంది ఇందిర. ఆ మాటలతో రాజ్ మండిపడతాడు. నువ్వు వెంటనే కావ్యని తీసుకుని గుడికి వెళ్తే పంతులుగారు ఏదైనా నివారణ మార్గం చెబుతాడని అంటుంది ఇందిర. దాంతో రాజ్ ససేమిరా అంటూ కావ్యని తీసుకుని మీరు గుడికి వెళ్లమని చెబుతాడు. వెంటనే కావ్యని తీసుకుని ఇందిర, అపర్ణలు గుడికి బయల్దేరతారు. అప్పూ అటు ఇటూ నడవలేక చిరాకు పడుతుంది. నాకు బోర్ కొడుతుందని అప్పూ అనగా... ధాన్యం పుస్తకాలు తీసుకుని వస్తుంది. ఎంతకాలం ఎస్ఐగా ఉంటావు.. సివిల్స్‌కి ప్రిపేరై ఏ ఐఏఎస్సో, ఐపీఎస్సో అవ్వమని చెబుతుంది ధాన్యం. ఆ మాటలతో కళ్యాణ్, ప్రకాశంలు షాక్ అవుతారు.
నువ్వు ఎదగడానికి, నీ కలలు పండించుకోవడానికి నేను సపోర్ట్ చేస్తా. నా కోడలు ఎస్ఐగా ఆగిపోవడానికి వీల్లేదు. ఈ బుక్స్ చదివితే నా కోడలు ఇంకా పెద్ద యూనిఫాం వేసుకుంటుందని అంటుంది. దాంతో కళ్యాణ్ ఆ పుస్తకాలు లాక్కుని నీ ఆలోచన బాగానే ఉంది కానీ ఫిజిక్స్, కెమెస్ట్రీ పుస్తకాలు అక్కర్లేదని చెబుతాడు. ఐఏఎస్, ఐపీఎస్ ఏదైనా పర్లేదు.. దానికి సంబంధించిన పుస్తకాలు తెచ్చిస్తే నా కోడలు చదువుకుంటుందని చెబుతుంది ధాన్యలక్ష్మీ. నీకు సాధ్యం కానిది ఏది లేదు.. నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు, ఇది నా ఆర్డర్ అని ధాన్యం అనడంతో అప్పూ తన అత్తగారిని హత్తుకుంటుంది. నా ఇష్టమే నా ఇష్టం.. నీకు ఏం కావాలో నన్ను అడుగు అని చెబుతుంది ధాన్యం.
రాహుల్ ప్లాన్‌లో భాగంగా దొంగ బంగారం అమ్మే వ్యక్తి.. రాజ్ ఆఫీసుకు వస్తాడు. నా పేరు శాండీ అని చెబుతాడు. నేను దుబాయ్ నుంచి గోల్డ్ దిగుమతి చేస్తుంటాను, దానిని మీ లాంటి పేరున్న కంపెనీలకు చాలా తక్కువ రేటుకి అమ్ముతానని చెబుతాడు. బయటి దేశాల నుంచి గోల్డ్ దిగుమతి చేయాలంటే కంపెనీ ఉండాలి, చాలా లెక్కలు ఉన్నాయని అంటాడు రాజ్. అంతా ఒక ఫోన్ డీలింగ్స్‌తోనే అయిపోతుంది, షిప్‌లో వచ్చేస్తుంది, రిస్క్ నాది, బెనిఫిట్ మీది అని చెబుతాడు. నేను అక్రమంగా తీసుకొచ్చే గోల్డ్‌తో బిజినెస్ చేస్తే దాని రిజల్ట్ మీరు ఊహించలేరని అంటాడు. ఆ మాటలు వినగానే రాజ్ మండిపడతాడు. నువ్వు తెచ్చే దొంగ బంగారంతో జనంలో ఉన్న నమ్మకాన్ని పొగొట్టుకోలేమని చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










