Brahmamudi December 29th Episode: పూజారి మాటలతో కావ్య షాక్.. కళావతి- రాజ్ మధ్యలోకి రుద్రాణి కూతురు
Photo Courtesy: JioHotstar
దుగ్గిరాల నిలయం మంటల్లో కాలిపోతున్నట్లుగా పీడకల రావడంతో కావ్య ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. కావ్యకి ఏం జరిగిందోనని రాజ్ అడగ్గా.. తనకొచ్చిన కల గురించి చెబుతుంది కళావతి. నిద్రపోయే ముందు కొత్త ఇంటి గురించి మాట్లాడుకున్నాం, నువ్వు డిజైన్లు వేశావు కాబట్టి ఆ ఆలోచనల వల్ల అలాంటి కల వచ్చిందని చెప్పి నిద్రపుచ్చుతాడు. రాజ్, కావ్యల బిజినెస్ స్ట్రాటజీలతో నువ్వు పోటీపడలేవు కాబట్టి ఎమోషనల్‌గా వాళ్లని దెబ్బతీయాలని రాహుల్‌కి బ్రెయిన్ వాష్ చేస్తుంది రుద్రాణి.
ఆల్రెడీ ప్లానింగ్ చేసేశానని.. ఈసారి కొట్టబోయే దెబ్బకి రాజ్ కోలుకోవడం కష్టమేనని అంటాడు రాహుల్. దాంతో దొంగ బంగారం సప్లయ్ చేసే వ్యక్తికి రాహుల్ ఫోన్ చేసి రాజ్ ఆఫీస్‌కి వెళ్లి కలిసి వస్తే నీ బంగారం మొత్తం నేనే కొంటానని ఆఫర్ ఇస్తాడు. ఉదయాన్నే దేవుడికి పూజ చేసి తనకొచ్చిన కల గురించి దేవుడికి చెప్పుకుంటుంది కావ్య. రాజ్ హారతి తీసుకుంటుండగా అది ఆరిపోవడంతో అపర్ణ, ఇందిర, కావ్యలు భయపడతారు. ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్లొద్దని వారు ఎంత చెప్పినా వినకుండా రాజ్ వెళ్తాడు. అప్పూని సివిల్స్ ప్రీపేర్ అయి ఇంతకంటే మంచి ఉద్యోగం చేయాలని ధాన్యం బుక్స్ ఇవ్వడంతో అప్పూ ఎమోషనల్ అవుతుంది. రాహుల్ చెప్పినట్లుగానే దొంగ బంగారం అమ్మేవాడు రాజ్‌ని కలిసి తన డీల్ గురించి వివరించగా రాజ్ సీరియస్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 29వ తేదీ ఎపిసోడ్ 916లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాహుల్ పంపించిన మనిషి తన డీల్ గురించి చెప్పడంతో రాజ్ మండిపడతాడు. స్వరాజ్ కంపెనీ అంటే ఒక బ్రాండ్.. అలాంటిది నువ్వు పంపించిన దొంగ బంగారం కొని, ఆ నమ్మకాన్ని పొగొట్టుకోమంటావా? అని ఫైర్ అవుతాడు రాజ్. లాభాల కోసం మేం బిజినెస్ చేయలేదు.. జనం కంపెనీ మీద పెంచుకున్న అభిమానాన్ని నిలబెట్టుకోవడానికే బిజినెస్ చేశాం. అలాంటిది స్మగుల్డ్ గోల్డ్ కొనమని చెబుతావా? మళ్లీ నా దగ్గరికి వస్తే నెక్ట్స్ మినిట్ జైళ్లో ఉంటావని వార్నింగ్ ఇస్తాడు రాజ్. రాహుల్ రెడీ అవుతుండగా.. పాపని చూసుకోమని ఇస్తుంది స్వప్న. మంచివాడిలా నటిస్తున్నందుకు నాకు ఇలాంటి షాక్‌లు ఇస్తావా? అని ఫైర్ అవుతాడు స్వప్న. ఇంతలో రాహుల్‌కి దొంగ బంగారం అమ్మే వ్యక్తి ఫోన్ చేస్తాడు. నువ్వు చెప్పినట్లే రాజ్ దగ్గరికి వెళ్లి ప్రపోజల్ పెట్టాను. తిట్టిన తిట్టకుండా పంపించాడని చెబుతాడు ఆ వ్యక్తి.
అన్ని తెలిసి కూడా నన్నెందుకు రాజ్ దగ్గరికి పంపించావు అని అడగ్గా.. నేను నీ దగ్గర బంగారం కొనాలి, కోటి రూపాయల బిజినెస్ ఇవ్వాలి కదా అని అంటాడు రాహుల్. కానీ నీకెం కావాలి అని ఆ వ్యక్తి ప్రశ్నిస్తాడు. నువ్వు స్మగుల్ గోల్డ్ కొనమని రాజ్ దగ్గరికి వెళ్లావు, నువ్వు వెళ్లింది, బయటకు వచ్చింది.. అంతా సీసీ కెమెరాలలో రికార్డ్ కావాలి, ఆ సాక్ష్యం కావాలి అని చెబుతాడు. నేను జైలుకి వెళ్తాను కదా అని ఆ వ్యక్తి అనగా.. బయటకు తీసుకురావడానికి నేను ఉన్నాను కదా అని అంటాడు రాహుల్. ఇంతలో స్వప్న రావడంతో రాహుల్ షాక్ అవుతాడు. పాపని రెడీ చేయమంటే ఫోన్‌లో కాలక్షేపం చేస్తున్నావా? అని ప్రశ్నిస్తుంది స్వప్న.
తనకు వచ్చిన కల, హారతి ఆరిపోవడం గురించి అపర్ణ, కావ్య, ఇందిరలు పూజారి గారిని అడుగుతారు. దాంతో ఆయన ఏం జరగబోతుందో తన దివ్యదృష్టితో తెలుసుకుంటాడు. సమస్య ఇంట్లో లేదని, బయటి నుంచే రాబోతోంది? అర్ధరాత్రి నిండు అమావాస్య నాడు అపశకునాలు కళ్ల ముందు తాండవిస్తున్నాయంటే అది కుటుంబ భవిష్యత్తుకే కీడు కలిగిస్తుంది. అమ్మాయి జాతకం ప్రకారం ఇన్నాళ్లూ శుక్ర మహర్దశ నడిచింది అందుకే అన్ని గండాలను అవలీలగా దాటింది.. కానీ రాబోయే రెండు మాసాలు గ్రహా సంచారం బాలేదు, రాహువు దూసుకొస్తోంది. ఆ రాహువు పక్కదారి పట్టేవరకు ఇలాంటి అలజడి తప్పదని పూజారి గారు చెప్పడంతో అపర్ణ, ఇందిర, కావ్యలు షాక్ అవుతారు.
ఇలాంటి వాటికి పరిహారం ఏం లేదా? అని ఇందిర అడుగుతుంది. శాస్త్రంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఏం లేదు.. అమ్మాయి ఇప్పుడు గర్బిణీ. తన చేతుల మీదుగా ఏ పరిహారం చేసే వీలు లేదని చెబుతారు పంతులుగారు. హోమాలు, యజ్ఞాలు సాధ్యం కాకపోవచ్చు కానీ దైవారాధనను మించిన పరిష్కారం, ఏముంటుంది? ప్రతినిత్యం ఉదయం, సాయంత్రం దేవుడికి దీపారాధన చేయండి, ప్రతిరోజూ ఈ కుంకుమని నుదిటన పెట్టుకోండి అని ఇస్తాడు పంతులుగారు. ఎలాంటి గండమైనా సులువుగా దాటగలరు అని చెబుతాడు. ఆ మాటలతో అపర్ణ, ఇందిర, కావ్యలు షాక్ అవుతారు.
దుగ్గిరాల వారింటికి రుద్రాణి కూతురు రేఖ వస్తుంది.. కూతురిని చూడగానే రుద్రాణి షాక్ అవుతుంది. ఫారిన్ నుంచి ఎప్పుడు వచ్చావు... రెండ్రోజుల క్రితం కూడా మాట్లాడావు నాతో ఏం చెప్పలేదని ప్రశ్నిస్తుంది. మా అమ్మ దగ్గరికి రావడానికి కారణం కావాలా? అని రేఖ ప్రశ్నిస్తుంది. నీకు చెప్పి రావాలా? ఈ ఇంటికి రావడానికి నీ పర్మిషన్ తీసుకోవాలా అని మండిపడుతుంది. వచ్చి రాగానే కన్నకూతురిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. కానీ నువ్వెంటీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావని ఫైర్ అవుతుంది రేఖ. పాపని రాహుల్ జాగ్రత్తగా రెడీ చేయడంతో స్వప్న సంతోషిస్తుంది. ఇందాక ఫోన్‌లో మాట్లాడుతూ నువ్వెందుకు కంగారు పడుతున్నావని రాహుల్‌ని ప్రశ్నిస్తుంది. మన పాప కోసమే కంగారు పడుతున్నాను, మనకి ఉన్నదే ఒక పాప.. అందుకే కంగారు పడ్డానని చెబుతాడు రాహుల్. పాప గురించి చాలా బాగా ఆలోచిస్తున్నావని స్వప్న మెచ్చుకుంటుంది.
అక్కడ మీ అమ్మగారు కూడా తన కూతురి గురించి అంతే ఆలోచిస్తుందని చెబుతుంది స్వప్న. ఫారిన్‌లో ఉన్న రేఖ ఇప్పుడెందుకు గుర్తొచ్చిందని అడుగుతాడు రాహుల్. ఆ రేఖ ఇంటికి వచ్చిందని స్వప్న చెప్పడంతో రాహుల్ సంతోషిస్తాడు. నువ్వు మళ్లీ ఎందుకు వచ్చావని రేఖపై సీరియస్ అవుతాడు రాహుల్. వద్దు వద్దు అంటున్నా ఫారిన్ వెళ్లావు.. ఇండియా ముఖం కానీ, ఇంటి ముఖం కానీ చూడను అన్నావు.. మళ్లీ ఎందుకొచ్చావని మండిపడతాడు. మనం ఎక్కడుంటే అది అక్కడికే రావాలి? ఇంకెక్కడికి వెళ్తుంది చెప్పు అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. నువ్వు ఏం చెప్పినా సరే .. అది ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు, వెళ్లిపోమని చెప్పు అని అంటాడు.
ఇంతలో ఇంటికొచ్చిన అపర్ణ, ఇందిర, కావ్యలు రేఖని చూసి నువ్వెప్పుడు వచ్చావని పలకరిస్తారు. మా మమ్మీ మాట వినకుండా వెళ్లిపోయిందని మండిపడతాడు. తను చదువుకోవాలని అనుకుంది, అందుకే ఫారిన్ వెళ్లింది, అన్నగా నువ్వు ఎంకరేజ్ చేయాలి కానీ కోప్పడవద్దని అంటాడు రాజ్. నువ్వయినా నన్ను అర్ధం చేసుకున్నావని థ్యాంక్స్ చెబుతుంది రేఖ. కావ్య ఇక ఆఫీస్‌కి రాదు.. తనకి నెలలు నిండాయి, ఈ రోజు నుంచి డెలవరీ అయ్యే వరకు నా కోడలు ఆఫీస్‌కి రాదని తేల్చిచెబుతుంది అపర్ణ. ఆయన ఒక్కరే ఆఫీసుకు ఎలా వెళ్తారని ప్రశ్నిస్తుంది కావ్య. నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా, మేమంతా సంతోషంగా ఉండాలన్నా నువ్వు ఇంట్లోనే ఉండాలని చెబుతుంది ఇందిర. అయితే నేను కూడా కళావతి పక్కనే ఉంటానని చెబుతాడు రాజ్.
రాజ్, కావ్యలు ఇంట్లోనే ఉంటామని చెబుతున్నారు కాబట్టి మీరిద్దరు ఆఫీస్‌కి వెళ్లాలని సుభాష్, ప్రకాశంలకు చెబుతారు ధాన్యలక్ష్మీ, అపర్ణ. ఆ మాటలకు అన్నదమ్ములు షాక్ అవుతారు. నా మనవరాలిని కాలు కింద పెట్టకుండా చూసుకోమని ఇందిర చెప్పగా... నా కళావతిని ఇప్పుడే కాలు కింద పెట్టకుండా చూసుకుంటానని కావ్యని ఎత్తుకుని తీసుకెళ్తాడు రాజ్. అది చూసిన రేఖ రగిలిపోతుంది. అసలు ఇండియాకు ఎందుకు వచ్చావని రేఖని పక్కకి తీసుకెళ్లి అడుగుతుంది రుద్రాణి. నాకు ఏ కష్టం వచ్చినా నా వాళ్లు ఉన్నారు, నన్ను చూసుకుంటారు అని నమ్మి ఇక్కడికి వచ్చాను.. అది నా తప్పు అని మండిపడుతుంది రేఖ. సొంత అన్నయ్యే నోటికొచ్చినట్లు మాట్లాడాడని చెబుతుంది. ముందు నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు? ఫారిన్‌లో ఏం జరిగింది? మార్క్ అనేవాడు పరిచయమయ్యాడు, వాడిని ప్రేమించాను, వాడిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవుతానని చెప్పావు.
మరి ఇంతలోనే సడెన్‌గా ఇండియాకు ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. మార్క్‌తో నాకు బ్రేకప్ అయిపోయింది.. వాడు నాకు అక్కర్లేదని చెబుతుంది రేఖ. ఆ మాటలతో రుద్రాణి షాక్ అవుతుంది. పెళ్లంటూ చేసుకుంటే ఆ ఇంగ్లీష్ వాడినే చేసుకుంటాను అన్నావు.. వాడు చాలా బాగా చూసుకుంటాడు అన్నావు కదా అని అంటుంది. అప్పుడు నేను వాడి మైకంలో ఉన్నాను.. వాడికి నా మీద ప్రేమ లేదు, డబ్బు లేదు. అందుకే వాడిని వదిలేసి పర్మినెంట్‌గా ఇండియాలో ఉండిపోదామని వచ్చేశానని చెబుతుంది రేఖ. నీ జీవితమైనా బాగుపడితే అంతే చాలు అనుకున్నాను అని అంటుంది రుద్రాణి. ఆరోజు రాజ్ బావకి నన్ను ఇచ్చి పెళ్లి చేసుంటే ఈరోజు నా లైఫ్ ఇలా ఉండేదా? నేనిలా దేశాలు పట్టుకుని తిరిగే పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నిస్తుంది రేఖ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











