Brahmamudi December 2nd Episode: కావ్య ప్రాణాల కోసం రాజ్ సాహసం.. కళావతి డిజైన్లపై రాహుల్ కన్ను

Photo Courtesy: JioHotstar

రాజ్ పర్మిషన్ లేకుండా, రాజ్‌కి ఒక్క మాట కూడా చెప్పకుండా మేనేజర్ సతీష్‌ని నీ దగ్గర ఎందుకు పనిలో చేర్చుకున్నావని రాహుల్‌పై సుభాష్ మండిపడతాడు. సతీష్ లాంటి అనుభవం ఉన్న మేనేజర్ రాహుల్ దగ్గర ఉండటం కరెక్ట్ అంటాడు రాజ్. నువ్వు ఇలా ప్రతీదానిని లైట్ తీసుకోవడం వల్లే చిన్నాచితకా కంపెనీలు కూడా మనకు పోటీ వస్తున్నాయని సీరియస్ అవుతాడు సుభాష్. రేణుక భర్తని కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పూకి కాల్ చేస్తాడు.

ఎలాగైనా తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని కళ్యాణ్‌ను అడుగుతుంది అప్పూ. దాంతో చెకప్ కోసం వెళ్తున్నట్లు ధాన్యలక్ష్మీ దగ్గర అబద్ధం ఆడి బయటికి తీసుకెళ్తాడు కళ్యాణ్. కానీ ధాన్యానికి కొడుకు, కోడలిపై అనుమానం వస్తుంది. రాజ్, కావ్యలు కొత్త డిజైన్లు వేస్తుండగా వాటిని ఎలాగైనా కొట్టేయాలని రాహుల్ ప్లాన్ చేస్తాడు. రాజ్, కావ్యలు ఉదయాన్నే గుడికి వెళ్లగా.. వారిని ఫాలో అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 2వ తేదీ ఎపిసోడ్ 893లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 2nd 2025 Episode 893 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్యకి తెలివితేటలు ఎక్కువైపోయాయని .. దానిని సైలెంట్ చేయమని దేవుడికి దండం పెట్టుకుంటాడు రాజ్. మీరు బయటికే అన్నారని రాజ్‌పై సెటైర్లు వేస్తుంది. పూజారి గారు వచ్చి కావ్య చేతిలో డిజైన్లు పెట్టి ఆశీర్వదిస్తాడు. గుడిలో నుంచి బయటకు వస్తుండగా కావ్య కళ్లు తిరిగి పడిపోతుంటే రాజ్ ఆమెను పట్టుకుంటాడు. ఆసుపత్రికి వెళ్దామని రాజ్ ఎంత చెబుతున్నా కావ్య వినిపించుకోదు. అప్పుడప్పుడు ఇలా అవుతుందని డాక్టర్ గారు ముందే చెప్పారు కదా అని అంటుంది కావ్య. నీది తగ్గిపోయే ప్రాబ్లమా? మనం మరిచిపోయినా? నీకున్న సమస్య ఇలా గుర్తుచేస్తూనే ఉంటుందని రాజ్ మండిపడతాడు. నీ కోసం నవ్వుతూ బతుకుతున్నాను కానీ, ప్రతిరోజూ ఒక గండంలా గడుస్తోందని బాధపడతాడు.

నా మాట విని అబార్షన్ చేయించుకుని ఉంటే, ఈరోజు నీ పరిస్ధితి ఇలా ఉండేదా? అని మండిపడతాడు రాజ్. బిడ్డను కనాలని అన్నావు.. బిడ్డను కళ్లారా చూడాలని నన్ను నిస్సహాయుడిని చేశావని ఫైర్ అవుతాడు. నన్ను బతికించుకోవడానికి బిడ్డను చంపడం ఏంటీ? అని ప్రశ్నిస్తుంది కావ్య. వీరిద్దరి మాటలను విన్న పంతులు గారు.. ఏం జరిగిందని అడుగుతాడు. ఆడపిల్లకు గర్భం అనేది ఆ దేవుడిచ్చిన వరమని, దానిని కాలదన్నుకుంటున్నావ్ అని పంతులుగారు ఫైర్ అవుతారు. ఎంతోమంది బిడ్డలు లేనివాళ్లు.. అమ్మ అని పిలిపించుకోవడం కోసం ఎంత ఆశపడుతున్నారో తెలుసా అని ప్రశ్నిస్తాడు. పరిస్ధితులు బాలేదని పుట్టే బిడ్డను కాదనుకోవద్దని చెబుతాడు పంతులుగారు.

బిడ్డను కాదనకపోతే నా భార్య నాకు దూరమవుతుందని రాజ్ అంటాడు. తన కడుపులో ఉన్న బిడ్డ ఈ లోకాన్ని చూసిన క్షణం నా భార్య చనిపోతుంది. ఆ దేవుడు నాకు భార్యనో, బిడ్డనో ఎవరినో ఒక్కరినో తేల్చుకోమని కండీషన్ పెట్టాడని చెబుతాడు రాజ్. భార్య కావాలంటే బిడ్డ దక్కదు.. బిడ్డ కావాలంటే భార్య దక్కదని అంటాడు. ఇలాంటి సమస్య నా కూతురికి వచ్చిందని, డాక్టర్లంతా తల్లినో, బిడ్డనో ఒక్కరినే కాపాడగలమని అన్నారు. ఆరు నెలలు పాటు ఇంటిల్లిపాది ఆ దుర్గామాతను నమ్ముకుని భయంతో బతికామని చెబుతాడు. కానీ ఆ దేవుడే పరిష్కారం చూపించాడని చెబుతాడు పంతులుగారు. ఆ అమ్మవారే నాకు ఓ దారి చూపించింది.. తల్లిని, బిడ్డను ఇద్దరినీ క్షేమంగా కాపాడుకోగలిగామని చెబుతారు.

కేరళలో దీనికి వైద్యం ఉంది.. అలెప్పి దగ్గర అడవిలో సింధూర అనే చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో వరసిద్ధి ఆచార్యుల వారు ఈ సమస్యకు ప్రకృతి వైద్యం అందించారు అని చెబుతాడు పంతులుగారు. నా కూతురిని అక్కడికి తీసుకెళ్లగా.. ఆ ఆచార్యుల వారు మూలికా వైద్యంతో గర్భసంచిని, పిండానికి అనుకూలంగా మార్చి తల్లికి, బిడ్డకి ఏ ప్రాణహానీ లేకుండా చేశారని చెబుతాడు. ఒకసారి అమ్మాయిని కేరళకి తీసుకెళ్లమని చెబుతాడు. సైన్స్, టెక్నాలజీల వల్ల కానిది ప్రకృతి వైద్యాన్ని కూడా నమ్మండి అని అంటాడు పంతులుగారు. నేను ఖచ్చితంగా నా భార్యని తీసుకెళ్తానని అంటాడు రాజ్. ఇలాంటి అవకాశం వస్తుందని, ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని నేను అనుకోలేదు.. వెంటనే కేరళ వెళ్దామని చెబుతాడు రాజ్. మనం అనుకున్నది జరగకపోతే ఎలా అని ప్రశ్నిస్తుంది కావ్య. డాక్టర్లే మా వల్ల కాదని తేల్చేశారు.. అలాంటిది ఈ వైద్యం వల్ల ఓ దారి దొరుకుతుందని చూద్దామని చెబుతాడు రాజ్. ఈ వైద్యం వల్ల నాకు ఏమైనా జరిగితే అని ప్రశ్నిస్తుంది కావ్య. ఇంట్లో వైద్యం కోసం వెళ్తున్నామని చెప్పొద్దని రాజ్‌తో అంటుంది కావ్య.

స్వరాజ్ కంపెనీ బిజినెస్ చేసే క్లయింట్స్‌ని ఆఫీసుకు రప్పించిన రాహుల్.. ఆ కంపెనీ ఇచ్చే దాని కంటే ఎక్కువ మార్జిన్ ఇస్తానని ఎర వేస్తాడు. మిమ్మల్ని నమ్మి స్వరాజ్ కంపెనీని వదిలేసి, మీ కోసం ఎందుకు బిజినెస్ చేయాలని అడుగుతారు క్లయింట్స్. మీ డిజైన్స్ ఎలా ఉన్నాయో తెలియదు, మార్కెట్‌లోకి వెళితే రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియదని చెబుతారు. స్వరాజ్ కంపెనీలో కావ్య డిజైన్స్‌కి ఓ బ్రాండ్ ఉందని వాటిని వదిలి మీ దగ్గరికి రాలేమని చెప్పి వెళ్లిపోతారు. వాళ్లకు మనం ఇచ్చిన ఆఫర్ నచ్చక కాదు.. మన డిజైన్స్ మీద నమ్మకం లేక వెళ్లిపోయారని, అవే డిజైన్లు మన దగ్గరకి వస్తే చాలని మేనేజర్‌తో అంటాడు రాహుల్. కావ్య వేసిన డిజైన్లను శృతికి ఇస్తాడు రాజ్. ఈ కొత్త డిజైన్లు మార్కెట్‌లోకి రిలీజ్ చేసే వరకు బయటి వ్యక్తులకు తెలియకూడదని శృతికి చెబుతుంది కావ్య. మేం బయటికి వెళ్తున్నామని వారం రోజుల పాటు సెక్యూరిటీ టైట్‌గా ఉండాలని ఆర్డర్స్ వేస్తాడు రాజ్.

అపర్ణ, ధాన్యలక్ష్మీలు తీసుకొచ్చిన కాఫీ, టీలు బాగోకపోవడంతో సుభాష్, ప్రకాశంలు వారిని విసిగిస్తారు. మా ప్రాణాలు ఎందుకు తీస్తున్నారని అపర్ణ, ధాన్యంలు మండిపడతారు. ఇకపై మీ ఇద్దరికీ ఆ ప్రాబ్లం లేదని నాన్న, బాబాయ్‌లు తిరిగి ఆఫీసుకు వెళ్తారని రాజ్, కావ్యలు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నేను, కళావతి కేరళ వెళ్తున్నామని చెబుతాడు రాజ్. ఇంతలో రాహుల్ వచ్చి కేరళ టూర్ క్యాన్సిల్ చేయడం కుదురుతుందా అని అడుగుతాడు. దాంతో రాజ్, కావ్యలు షాక్ అవుతారు. ఏం జరిగిందని రాజ్ అడగ్గా.. తాను కొన్ని డిజైన్లు వేయించానని, ఆఫీసుకి వచ్చి అవి ఎలా ఉన్నాయో చెబుతావని అలా అడిగానని అంటాడు రాహుల్.

ఇప్పుడు ఆ కంపెనీ నీది, ఏ నిర్ణయమైనా నీదేనని చెబుతాడు రాజ్. రేపటి నుంచి వారం రోజుల పాటు నాన్న, బాబాయ్ ఆఫీస్‌కి వెళ్తారని రాజ్ అనడంతో సుభాష్, ప్రకాశంలు షాక్ అవుతారు. వారం కాకపోతే... నెల రోజులు తిరిగి రండి నా కొడుకుల్ని ఆఫీసుకు పంపిస్తానని అంటుంది ఇందిర. ఖాళీగా ఉండి నా కోడళ్లని విసిగిస్తున్నారని సుభాష్, ప్రకాశంలపై ఫైర్ అవుతుంది ఇందిర. మీరు కేరళ నుంచి తిరిగొచ్చేలోపు స్వరాజ్ గ్రూప్ నా కాళ్ల కింద ఉంటుందని మనసులో అనుకుంటాడు రాహుల్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X