Brahmamudi December 30th Episode: రాజ్‌పై కన్నేసిన రుద్రాణి కూతురు.. కావ్యకి మళ్లీ సవతి పోరు

Photo Courtesy: JioHotstar

దొంగ బంగారం అమ్మేవాడి డీల్ వినగానే అతనిపై రగిలిపోతాడు రాజ్. స్వరాజ్ కంపెనీ నమ్మకానికి అమ్మ వంటిదని, మేం ప్రజలకు ద్రోహం చేయమని అతనిని తిట్టి పంపేస్తాడు. రాజ్‌ని కలిసిన విషయాన్ని ఆ వ్యక్తి.. రాహుల్‌కి చెప్పగానే చాలా సంతోషిస్తాడు. నువ్వెళ్లి రాజ్‌తో మాట్లాడినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అవుతుంది నాకు అదే కావాలని అంటాడు రాహుల్. తనకు వచ్చిన కల గురించి, ఇంట్లోని పరిస్ధితుల గురించి పూజారి గారికి చెబుతుంది కావ్య. దాంతో ఆయన నీకు కష్టాలు మొదలవ్వబోతున్నాయని.. ఈసారి తప్పించుకోవడం అంత తేలిక కాదని చెబుతాడు పంతులగారు.

ఇంతలో దుగ్గిరాల వారింటికి ఫారిన్ నుంచి రుద్రాణి కూతురు రేఖ వస్తుంది. ఆమెను చూడగానే రాహుల్, రుద్రాణిలు షాకై మండిపడతారు. మేం చెప్పినా వినిపించకుండా ఫారిన్ వెళ్లావని రాహుల్ క్లాస్ పీకుతాడు. ఇంతలో రాజ్ వచ్చి తనకు మీరు తప్పించి ఎవరు లేరు, ఇక్కడికి కాకుండా ఎక్కడికి వెళ్తుందని నచ్చచెబుతాబు. రేపటి నుంచి కావ్య ఆఫీస్‌కి రాదని, ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకోమ్మని అపర్ణ, ఇందిరలు చెప్పడంతో కళావతిని ఎత్తుకుని తీసుకెళ్తాడు రాజ్. ఇది చూసిన రేఖ రగిలిపోతుంది. నేను ప్రేమించిన వాడిని వదిలేశాను, నాకు రాజ్ కావాలని రుద్రాణికి తేల్చిచెబుతుంది రేఖ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 30వ తేదీ ఎపిసోడ్ 917లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 30th 2025 Episode 917 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

అప్పుడే రాజ్ బావని నా సొంతం చేసుంటే నేనిలా దేశాలు పట్టుకుని తిరగాల్సిన అవసరం ఉండేది కాదని రుద్రాణితో అంటుంది రేఖ. వాడికి నువ్వంటే ఇష్టం లేదు కదా? నన్ను ఏం చేయమంటావు? అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. రాజ్ బావకి మాత్రం కావ్య అంటే ఇష్టం ఉండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా? నువ్వే కదా ప్లాన్ చేసి కావ్య మెడలో తాళి కట్టేలా చేశావని అంటుంది రేఖ. అత్తయ్య, మావయ్యలతో మాట్లాడి ఉంటే హ్యాపీగా రాజ్ బావని పెళ్లి చేసుకుని ఉండేదానిని, నీ వల్లే నా జీవితం ఇలా తయారైందని అంటుంది రేఖ. కూతురి మాటలతో రుద్రాణి ఆలోచనలో పడుతుంది. రేఖ మందు తాగుతూ ఉండగా చెల్లెలికి క్లాస్ పీకుతాడు రాహుల్. అక్కడ ప్రశాంతంగా లేదనే ఇండియాకి వచ్చాను, నువ్విలా టార్చర్ పెడితే ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోతానని అంటుంది రేఖ. ఇంతలో రాజ్ వచ్చి ఇన్నిరోజుల తర్వాత చెల్లెలు ఇస్తే ఇలాగేనా మాట్లాడేది అని మండిపడతాడు.

అర్ధం చేసుకోవాల్సిందిపోయి.. నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెబుతున్నావని సీరియస్ అవుతాడు రాజ్. ఫారిన్‌లో ఒకడితో రిలేషన్‌లో ఉంది, వాడితో బ్రేకప్ అయిపోయింది.. ఆ డిప్రెషన్ అంతా ఇక్కడ చూపిస్తానంటే ఎలా? నువ్వే చూడు ఎలా తాగుతుందోనని చూపిస్తాడు రాహుల్. మందు బాటిల్ చూసిన రాజ్ షాక్ అవుతాడు. నువ్వు పడుతున్న బాధకి నువ్వే కారణం.. పెద్దవాళ్ల మాటలు వినకుండా వెళ్లిపోయింది నువ్వు, అక్కడ సెటిల్ అవుతానని కలలు కన్నది నువ్వు అని సీరియస్ అవుతాడు రాహుల్. రేఖతో నేను మాట్లాడతానని చెప్పి రాహుల్‌ను పంపేస్తాడు రాజ్. నువ్వేం చేస్తున్నావో నీకు బాగా తెలుసు.. కానీ నువ్వు ఉన్న పెయిన్ నుంచి వీలైనంత త్వరగా బయటపడటానికి ట్రై చేయమంటాడు.

నీలాగా నన్ను ఎవరూ ఈ ఇంట్లో అర్ధం చేసుకోవడం లేదు, కనీసం ప్రేమగా కూడా మాట్లాడటం లేదని అంటుంది రేఖ. నేనైనా, పెద్దవాళ్లయినా నీ లైఫ్ బాగుండాలనే కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం ఏ సలహా ఇచ్చినా అది నీకు తప్పుగానే కనిపిస్తుందని అంటాడు రాజ్. అందుకే ముందు ఆ డిప్రెషన్ నుంచి బయటకు రా అని చెబుతాడు. నా కోసం ఎవరూ లేరు, నా గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదని బాధపడుతుంది రేఖ. అలా అయితే నేను ఇక్కడి వరకు రాను కదా? నువ్వు మారాలని కోరుకుంటున్నాను, అందుకే రాహుల్ మీద కూడా అరిచాను.. నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుందని రాజ్ చెప్పడంతో రేఖ సరేనని అంటుంది.

ఉదయాన్నే కావ్యని దగ్గరుండి నడిపిస్తాడు రాజ్.. ఇక నా వల్ల కావడం లేదని కావ్య చెబుతున్నా రాజ్ వినిపించుకోడు. ఇంతలో ఆమె కాలికి రాయి గుచ్చుకోవడంతో కంగారుపడతాడు. నీకోసం ఫ్రెష్ జ్యూస్ చేసి తీసుకొస్తానని రాజ్ చెప్పగా.. నేను నడుస్తానని అంటుంది కావ్య. ఇదంతా చూసిన రేఖ కుళ్లుకుంటుంది. రాజ్ జ్యూస్ చేసి తీసుకొస్తుండగా.. హాల్‌లో టాబ్లెట్స్ వేసుకుంటూ రేఖ కనిపించడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇవి డిప్రెషన్ టాబ్లెట్స్ అని రేఖ చెప్పగా.. ఇన్నేసి టాబ్లెట్స్ వేసుకుంటే డిప్రెషన్ పోవడం కాదు, నువ్వు పోతావని అంటాడు రాజ్. ఏదో తెలియని ఒంటరి ఫీలింగ్, నాకంటూ ఎవరూ లేరనే బాధ, దిగులు నన్ను వెంటాడుతున్నాయని చెబుతుంది రేఖ. అలాంటి ఫీలింగ్ పోవాలంటే మనుషుల దగ్గరికి వెళ్లాలని చెబుతాడు రాజ్. మనుషులతో కలువు, ఇలాంటి జ్యూస్‌లు తాగు అని చెప్పగా.. రాజ్ చేతుల్లోని జ్యూస్ లాక్కుని తాగేస్తుంది రేఖ. దాంతో రాజ్ షాక్ అవుతాడు.

ఈ జ్యూస్ నా కోసం కాదా? అని రేఖ అడగ్గా.. నీకోసమే స్పెషల్‌గా చేశానని అంటాడు రాజ్. దాంతో అతనిని హత్తుకుని థ్యాంక్స్ చెబుతుంది రేఖ. ఇదంతా చూసిన కావ్య షాక్ అవుతుంది. నీలాగా కేరింగ్‌గా చూసుకునేవాళ్లు నాకు లేరని రేఖ నటిస్తుంది. నీకు మేమంతా ఉన్నాం కదా? హ్యాపీగా ఉండమని అంటాడు రాజ్. జ్యూస్ తీసుకొస్తానని మరదలితో కబుర్లు చెబుతున్న రాజ్‌పై మండిపడుతుంది కావ్య. తను కాస్తా డిప్రెషన్‌లో ఉంది కదా అని రాజ్ చెప్పబోతుండగా.. పెళ్లాన్ని మరిచిపోయారు అంటుంది. కావాలంటే ఇంకో జ్యూస్ తీసుకొస్తానని రాజ్ చెప్పగా.. నాకేం అక్కర్లేదని అంటుంది కావ్య.

సుభాష్, ప్రకాశంలు నీరసంగా ఆఫీసుకి బయల్దేరబోతుండగా మీ ముఖాలు నీరసంగా ఎందుకు పెట్టారని అడుగుతుంది ఇందిర. ఇన్నాళ్లకు మాకు గోల్డెన్ డేస్ వచ్చాయి.. హాయిగా రిటైర్ అయిపోయి ఎంజాయ్ చేద్దామనుకుంటే మా గోల్డెన్ డేస్ లాక్కుపోయారని బాధపడతాడు సుభాష్. ఈరోజంతా మ్యాచ్ చూసి ఫ్రెష్‌గా రేపటి నుంచి ఆఫీసుకి వెళ్తామని ప్రకాశం, సుభాష్‌లు అడగ్గా.. అలాంటిది ఒప్పుకోవద్దని ఇందిరకి ధాన్యలక్ష్మీ చెబుతుంది. మా కోడళ్ల కోసం ఇంట్లో పనులు మేం చూసుకుంటాం.. మీరు ఆఫీసుకి వెళ్లాలని తేల్చేస్తుంది అపర్ణ. 2 నెలలు ఓపికపడితే హాయిగా ఇంట్లోనే ఉండొచ్చని చెబుతుంది ఇందిర.

కావ్య ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకోకపోవడంతో పనిమనిషిపై మండిపడుతుంది ఇందిర. కావ్యకి టాబ్లెట్స్ ఇవ్వకుండా ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తుంది. రేఖమ్మ గారు పాస్తా అడిగారు.. మూడు సార్లు ట్రై చేసినా రాలేదని అంటుంది. ఇంతలో రేఖ వచ్చి పాస్తా రెడీ అయ్యిందా? లేదా? అని అడుగుతుంది. ఆకలి వేస్తే వండుకుని తిను.. నీకు తోచిన వెరైటీలు నువ్వే చేసుకుని తినమని రేఖకి క్లాస్ పీకుతారు అపర్ణ, ఇందిర. కావ్యకి కావాల్సినవి ఇచ్చాకే ఇంట్లో ఎవరి సంగతైనా పనిమనిషి చూస్తుందని అంటుంది ఇందిర. ఈ మాటలన్నీ విన్న రాజ్.. పాస్తా ఆర్డర్ చేసి మరదలి దగ్గరికి వెళ్తాడు. కావ్య కూడా భర్త వెనుకే వెళ్తుంది.

నేనెవ్వరికీ ఇష్టం లేదు, నేనెవ్వరికీ నచ్చనని అంటుంది రేఖ. నీ ఇంటికి నువ్వు వచ్చావు.. ఇంకెక్కడికి వెళ్తావని అడుగుతాడు రాజ్. ఒక పాస్తా కోసం అన్నేసి మాటలు అంటారా? అని ప్రశ్నిస్తుంది రేఖ. పెద్దవాళ్లు నాలుగు మాటలు అంటారు.. అవన్నీ పట్టించుకోవద్దని చెబుతాడు రాజ్. నువ్వెప్పుడు ఒంటరి దానివి కాదు.. నీకు నేను ఉన్నాను, నీకేం కావాలో నన్ను అడుగు అని చెబుతాడు రాజ్. చిన్నచిన్న విషయాలకి బాధపడొద్దని అంటాడు. కానీ నాకు పాస్తా అంటే చాలా ఇష్టం.. ఆ విషయంలో మాత్రం బాధపడతానని చెబుతుంది రేఖ. ఇంతలో పాస్తా ఆర్డర్ రావడంతో రేఖ సంతోషంతో రాజ్‌ని హత్తుకుంటుంది. ఇదంతా చూసిన కావ్య తన భర్తపై మండిపడుతూ సీరియస్‌గా లోపలికి వెళ్లిపోతుంది. నా మనవడు శ్రీరామచంద్రుడని నీకు తెలియదా? అని కావ్యని అడుగుతుంది ఇందిర. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X