Brahmamudi December 31st Episode: రాహుల్‌పై అప్పూ అనుమానం... రేఖతో రాజ్ పెళ్లికి రుద్రాణి- రాహుల్ కుట్ర
Photo Courtesy: JioHotstar
నువ్వు అప్పుడే రాజ్ బావతో నా పెళ్లి చేసుంటే నాకిలా దేశాలు పట్టుకుని తిరిగే పరిస్ధితి వచ్చేది కాదని రుద్రాణితో చెబుతుంది రేఖ. రాజ్‌కి నువ్వంటే ఇష్టం లేదని రుద్రాణి చెప్పగా.. కావ్యని బావ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా అని అంటుంది రేఖ. అర్ధరాత్రి మందు కొడుతూ కూర్చొన్న రేఖకి నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావని రాహుల్ క్లాస్ పీకుతాడు. ఇంతలో రాజ్ వచ్చి.. తనకు మనం తప్పించి ఎవరూ లేరని నచ్చచెబుతాడు. నీలాగా నన్ను ఈ ఇంట్లో ఎవరూ అర్ధం చేసుకోవడం లేదని రాజ్‌కి చెబుతుంది రేఖ.
ఉదయాన్నే కావ్యని వాకింగ్ చేయిస్తూ ఉంటాడు రాజ్. అది చూసిన రేఖ కుళ్లుకుంటుంది. ఇంతలో కావ్య కోసం రాజ్ జ్యూస్ తీసుకుని వస్తుండగా.. డిప్రెషన్ డ్రామా ఆడి జ్యూస్ తాగేస్తుంది. కావ్య టిఫిన్ చేసి, టాబ్లెట్స్ వేసుకోకపోవడంతో ఇందిర, అపర్ణలు పనిమనిషిపై మండిపడతారు. రేఖ అమ్మగారు పాస్తా అడిగారని, అది ఎలా చేయాలో నాకు తెలియదని పనిమనిషి చెప్పగా.. రేఖపై అపర్ణ, ఇందిరలు సీరియస్ అవుతారు. దాంతో అలిగి బయటకొచ్చేసిన రేఖని రాజ్ ఓదార్చి ఆమె కోసం పాస్తాని తెప్పిస్తాడు. ఇదంతా చూసిన కావ్యకు రేఖపై అనుమానం వస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 31వ తేదీ ఎపిసోడ్ 918లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మీ మనవడిని ఏడిపించే అవకాశం నాకు చాలా ఏళ్ల తర్వాత దొరికింది? వదిలిపెట్టేదే లేదని అంటుంది కావ్య. నాకు సేవలు చేస్తుంటే ఆయనకి టైంపాస్.. కానీ నాకు టైం పాస్ కావాలి కదా? అందుకే ఏడిపించే పని పెట్టుకున్నా? రేపు బిడ్డ పుట్టాక వాడితోనే సరిపోతుంది.. ఇక మీ మనవడితో ఆడుకునేది ఎప్పుడు అని అడుగుతుంది కావ్య. ఈ మేటర్ ఇప్పుడే లీక్ చేయొద్దు.. సార్‌కి డోస్ పెంచే పని ఉందని అంటుంది కావ్య. దొంగ బంగారం అమ్మేవాడి దగ్గర బంగారం కొంటాడు రాహుల్.. దానిని రాజ్ కారులో పెట్టేలా పన్నాగం పన్నుతాడు.
కావ్య భోజనం చేయనని మారాం చేయడంతో రాజ్ వచ్చి బతిమలాడతాడు. మాకు పూరీలు, ఉప్మాలు రుచించవు... పాస్తాలు లాంటివైవే బాగా రుచిస్తాయని అంటుంది. నాకు అన్నం అక్కర్లేదు.. వెళ్లి పాస్తాలు, బర్గర్‌లు తెప్పించి మీ మరదలికి తినిపించండి అంటుంది కావ్య. రేఖ డిప్రెషన్‌లో ఉందని అలా చేశాను, కావాలని చేయలేదని అంటాడు రాజ్. మరి నేను కడుపుతో ఉన్నానని అంటుంది కావ్య. అందుకే స్వయంగా నేనే భోజనం తీసుకొచ్చానని చెబుతాడు రాజ్. ఇంకెప్పుడూ రేఖతో క్లోజ్‌గా ఉండనని అంటాడు రాజ్. నువ్వు కొట్టు తిట్టు.. కానీ అన్నం తినను అంటే మాత్రం నా మీద ఒట్టు అనడంతో కావ్య తింటుంది. వారిద్దరి అనుబంధాన్ని చూసి రేఖ కుళ్లుకుంటుంది.
రాజ్ కారులో రాహుల్ దొంగ బంగారం పెట్టబోతుండగా అప్పూ చూసి పిలుస్తుంది. దాంతో రాహుల్ షాక్ అవుతాడు. ఇందాకటి నుంచి రాజ్ బావ కారు వైపు ఎందుకు చూస్తున్నావని ప్రశ్నిస్తుంది అప్పూ. రాజ్ కారు బాగుంది కదా? తొందరలో ఇలాంటిది కొందామని చూస్తున్నానని అంటాడు రాహుల్. రాజ్ బావ ఈ కారు కొని చాలా రోజులు అయ్యింది. ఎందుకిలా కంగారు పడుతున్నావని పశ్నిస్తుంది అప్పు. నాకేం కాలేదు.. నేను బాగానే ఉన్నానని అంటాడు రాహుల్. ముఖం నిండా చెమటలు ఏంటీ? అని అడగటంతో రాహుల్ వణికిపోతాడు. చేతిలో ఆ బ్రీఫ్ కేస్ ఏంటీ? ఎక్కడి నుంచి వస్తున్నావని ప్రశ్నిస్తుండగా స్వప్న వస్తుంది. నువ్వు పోలీస్‌వే.. కానీ మా ఆయన క్రిమినల్ కాదని అంటుంది. రాహుల్ కాదు.. బావ అని పిలువు అని అంటుంది స్వప్న. బావ టెన్షన్ పడుతుంటే ఏం జరిగింది? అని అడుగుతున్నానని అంటుంది అప్పూ.
మీ చెల్లెలు పోలీస్ కన్నా.. లాయర్ అవ్వాల్సిందని అంటాడు రాహుల్. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదని అంటుంది స్వప్న. వాడి ఫ్రెండ్ ఊరెళుతూ వాడి బ్రీఫ్ కేస్‌ని ఇంట్లో ఇవ్వమన్నాడు, రేపు ఉదయం ఇచ్చేద్దామని వచ్చానని తప్పించుకుంటాడు రాహుల్. కానీ రాహుల్ ఏదో చేయబోతున్నాడని అప్పూకి అనుమానం వస్తుంది. శృతితో మాట్లాడుతుండగా రేఖ చేయి కట్ చేసుకోవడాన్ని చూస్తాడు రాజ్. వెంటనే వెళ్లి రేఖని ఆపుతాడు. నాకు బతకాలని లేదు.. చచ్చిపోవాలని ఉంది, నన్ను చావని అంటుంది రేఖ. మనసు నిర్మలంగా ఉంచుకుని ఆలోచిస్తే సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది, ప్రశాంతత కూడా దొరుకుతుంది అని అంటాడు రాజ్. అసలు ఏం జరిగింది? అని రాజ్ అడుగుతాడు.
నాకు ఎవరు లేరు.. ఒంటరితనం నన్ను పట్టి పీడిస్తోందని అంటుంది రేఖ. నువ్వు ఒంటరిదానివి కాదు.. నీకు మేమంతా ఉన్నాం కదా అని చెబుతాడు రాజ్. జీవితాంతం గైడ్‌గా, నీకు తోడుగా నీతోనే ఉంటానని అంటాడు రాజ్. నిజంగానే నువ్వు నా పక్కన ఉంటానని ప్రామీస్ చేయమని రేఖ అడగ్గా... ప్రామీస్ అంటాడు రాజ్. నువ్వు గ్రేట్ బావ.. ఒక మనిషిని అర్ధం చేసుకోవడంలో నీ అంతటి గొప్పవాడే లేడు. నిజంగా ఏ ఆడపిల్లకైనా నీలాంటి వాడు భర్తగా వస్తే అంతకన్నా ఏ అదృష్టం ఉండదు.. అసలు నీలాంటి వాడే ఎందుకు? నువ్వు నా భర్తగా నా లైఫ్‌లోకి ఎందుకు రాకూడదు? నేనే నీ భార్యని ఎందుకు కాకూడదు? అని అనుకుంటుంది రేఖ.
రాహుల్ గురించి అప్పూ ఆలోచిస్తుండగా కళ్యాణ్ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. నాకు రాహుల్ మీద అనుమానంగా ఉంది.. ఈరోజు ఏదో సూట్‌కేస్ తీసుకొచ్చాడు, దాని గురించి అడిగితే టెన్షన్ పడుతూ ఏదేదో చెబుతున్నాడు. అక్కని బాధపెట్టడం ఎందుకని వదిలేశాను.. రాహుల్ బిహేవియర్ అనుమానం కలిగిస్తోంది అని అంటుంది అప్పూ. పెద్దత్తయ్య వాళ్ల పెళ్లి రోజున ఆర్ అనే కంపెనీ గురించి స్వప్న అక్క గొడవ చేసింది. ఆ రోజు అక్కకి అంతలా అనుమానం రావడం వెనుక కారణం ఏంటీ? రాహుల్ సడెన్‌గా మంచివాడిలా మాట్లాడుతున్నాడని అంటుంది అప్పూ. అక్కా, బావ కేరళకు వెళ్లినప్పుడు రాహుల్ కంపెనీ పెద్ద సక్సెస్ అయ్యింది? కావ్య అక్క డిజైన్స్‌ని కాపీ కొట్టావా అని పెద్ద మావయ్య గొడవ చేశాడు అని గుర్తుచేస్తుంది అప్పూ.
అమ్మ నిన్ను డ్యూటీ చేయొద్దని చెప్పినప్పటి నుంచి నీ బ్రెయిన్ మొత్తాన్ని ఇంట్లో వాళ్ల మీద ప్రయోగిస్తున్నావు.. రాహుల్‌ని మళ్లీ అనుమానిస్తున్నావని అంటాడు కళ్యాణ్. ఆ తర్వాత అప్పూ గురించి రాసిన పాటను చదివి వినిపిస్తాడు. అది విన్న వెంటనే అప్పూ ఎమోషనల్ అవుతుంది. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు.. నాకేం కావాలో తెలుసుకునే వాళ్లు ఎవరు లేరని రుద్రాణితో గొడవ పడుతుంది రేఖ. ఏదో దిక్కులేక.. దారి లేక ఇక్కడికి వచ్చినట్లుగా ఉందని అంటుంది. కనీసం నువ్వు కూడా నన్ను పట్టించుకోవడం లేదని మండిపడుతుంది. నీకేం కావాలని రుద్రాణి అడగ్గా.. నాకు బావ కావాలని చెబుతుంది రేఖ. ఆ మాట వినపగానే రుద్రాణి షాక్ అవుతుంది.
రాజ్ బావ నా సొంతం కావాలి, కావ్యకి పంచే ప్రేమ కావాలని చెబుతుంది రేఖ. కళ్లు మూసినా, కళ్లు తెరిచినా వాడి భార్య కావ్య తప్పించి వాడికి మరో ప్రపంచం తెలియదని అంటుంది రుద్రాణి. ఆ ప్రేమను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, బావ మనసు ఎలాంటిదో చూశాక బావకి దూరంగా ఉండలేకపోతున్నాను అని అంటుంది రేఖ. ఆ కావ్య స్థానంలో నేనుండాలని చెబుతుంది రేఖ. అది కలలో కూడా జరగదని రుద్రాణి చెబుతుండగా... రాహుల్ వచ్చి ఎందుకు జరగదని అంటాడు. చెల్లి కోరిక తీర్చడం తల్లిగా, అన్నయ్యగా మన బాధ్యత అంటాడు రాహుల్. ఇది పిచ్చి పిచ్చిగా వాగుతుంది.. ఇది ఉన్న పరిస్ధితుల్లో దారి తప్పుతోందని అంటుంది రుద్రాణి. కావ్యకి కడుపు వచ్చినప్పటి నుంచి ఎన్నో గండాల మధ్య అసలు కడుపు ఉంటుందా? పోతుందా? అనే భయం తర్వాత ఇప్పుడు ఆ కడుపు నిలబడిందని చెబుతాడు రాహుల్.
కానీ కావ్యకున్న సమస్య.. ఒకసారే ప్రెగ్నెంట్, ఒకే సంతానం .. రెండో సారి బిడ్డను కనే వీలు లేదని డాక్టర్లు తెగేసి చెప్పేశారు కదా అని అంటాడు రాహుల్. ఇంకో 2 నెలల్లో బిడ్డను కంటుంది.. అప్పుడు రెండో బిడ్డతో పనేముందని రుద్రాణి అడుగుతుంది. ఆ బిడ్డ ప్రపంచాన్ని చూడకపోతే.. ఆ బిడ్డ కావ్య కడుపులోనే కన్నుమూస్తే.. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడని కలలు కంటున్నవారు కళ్లు తేలేస్తారు. కావ్య మళ్లి బిడ్డను కనే ఛాన్స్ లేదు.. ఫ్యామిలీకి మాత్రం వారసుడు కావాలి, అప్పుడేం చేస్తారు అని రాహుల్ ప్రశ్నిస్తాడు. కావ్యని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు.. అప్పూ- కళ్యాణ్‌లకు పుట్టే బిడ్డను వారసుడని అనుకుంటారని చెబుతుంది రుద్రాణి. కానీ కావ్య అలా ఉండదు.. కుటుంబానికి ఇచ్చిన మాటను తప్పదు, కావ్యే దగ్గరుండి రాజ్‌కి మరో పెళ్లి చేస్తుందని చెబుతాడు రాహుల్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











