Brahmamudi December 3rd Episode: దుగ్గిరాల ఫ్యామిలీపై రాహుల్ కుట్ర.. కావ్య, అప్పూలకు కష్టాలు
Photo Courtesy: JioHotstar
గుడిలో భగవంతుడి ఆశీస్సులు తీసుకుని వస్తుండగా కావ్య కళ్లు తిరిగి పడిపోబోతుంది. దాంతో కావ్యను రాజ్ పట్టుకుని ఆ రోజు నేను చెబితే నువ్వు అబార్షన్ చేయించుకోలేదని మండిపడతాడు. నా కోసం కళ్లు తెరవకుండా బిడ్డను చంపడం పాపమని అంటుంది కావ్య. ఈ మాటలు విన్న పంతులు గారు.. ఏం జరిగింది? అమ్మాయిని ఎందుకు అబార్షన్ చేయించుకోమని చెబుతున్నావని అడుగుతాడు. దాంతో జరిగినదంతా చెబుతాడు ఈ మాటలు విన్న పంతులుగారు.. మా అమ్మాయికి కూడా ఇలాగే జరిగిందని కేరళలో ఈ సమస్యకు పరిష్కారం ఉందని చెబుతారు. దాంతో రాజ్ కావ్యలు కేరళ వెళ్లాలని నిర్ణయించుకుంటారు.
ఆఫీస్‌లో మార్చాల్సిన కొత్త డిజైన్లను శృతికి చేతికి ఇచ్చి జాగ్రత్తలు చెబుతారు రాజ్, కావ్య. కాఫీ కోసం, టీ కోసం అపర్ణ, ధాన్యలక్ష్మీలని విసిగిస్తుంటారు ప్రకాశం, సుభాష్. ఇంతలో రాజ్, కావ్య వచ్చి రేపటి నుంచి మీరిద్దరూ ఆఫీస్‌కి వెళ్లాలని చెబుతారు. నేను, కావ్య కేరళ టూర్‌కి వెళ్తున్నామని అంటాడు. ఇంతలో ఈ మాటలన్నీ విన్న రాహుల్.. రాజ్, కావ్యలు తిరిగొచ్చేసరికి దుగ్గిరాల కంపెనీని నా కాళ్ల కిందకి తెచ్చుకోవాలని కుట్ర చేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 3వ తేదీ ఎపిసోడ్ 894లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
పాప మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తోన్న అప్పూకి.. చనిపోయిన మరో పాప డెడ్‌బాడీకి సంబంధించిన ఫైల్ కనిపించకపోవడంతో కానిస్టేబుల్ శేషుపై సీరియస్ అవుతుంది. ఫైల్ ఎక్కడో ఉంటుంది.. వెతికి నేను తీసుకొస్తానని శేషు చెబుతాడు. నేను చెప్పేవరకు మీరు మా ఇంటికి రావొద్దని ఫైర్ అవుతుంది అప్పూ. పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ వాట్సాప్‌లో నాకు పంపించమని చెబుతుంది. కేసు కారణంగా ఆలస్యంగా పడుకోవడంతో అప్పూపై మండిపడతాడు కళ్యాణ్. ఇంతలో ప్రకాశం వచ్చి.. ఎవరో ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేశారని చెబుతాడు. అయితే బెడ్‌పై పేపర్స్, ఫైల్స్ ఉండటం చూసిన ప్రకాశానికి అనుమానం వస్తుంది.
నువ్వు డ్యూటీలో లేవు కదా? ఈ ఫైల్స్‌తో నీకేంటీ పని అని అడుగుతాడు ప్రకాశం. ఇంతలో ధాన్యలక్ష్మీ వచ్చి అదే ప్రశ్న వేస్తుంది. ఓ ప్రొడ్యూసర్ ఈ ఫైల్ నాకు ఇచ్చి.. పోలీస్ డిపార్ట్‌మెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ పాట రాయమన్నాడని చెబుతాడు కళ్యాణ్. అయితే ఈ ఫైల్ అప్పూ ఎందుకు చదువుతోందని ప్రకాశం అడుగుతాడు. తను పోలీస్ ఆఫీసర్ కాబట్టి.. ఆ టెర్మినాలజీ నాకు తెలియదు, అందుకే అప్పూ అది చదివి నాకు చెబుతుందని అంటాడు కళ్యాణ్. ఇంతకీ కేసు ఏంటీ? ఆ స్టోరీ ఏంటీ అని అడుగుతాడు ప్రకాశం. దాంతో ఓ పెద్దింటికి చెందిన అమ్మాయి.. కుటుంబానికి చెప్పకుండా సీక్రెట్‌గా మర్డర్ కేసులు సాల్వ్ చేస్తుందని చెబుతాడు కళ్యాణ్.
స్టోరీ ఇంట్రెస్ట్‌గా ఉందని ప్రకాశం మెచ్చుకోనగా.. ఫ్యామిలీని మోసం చేసి మర్డర్ కేసులు సాల్వ్ చేయడం గొప్పకాదని మండిపడుతుంది ధాన్యం. ఇలాంటి చెత్తకథలకు నువ్వు పాటలు రాయొద్దు.. ఆ డైరెక్టర్‌ను ఇంటికి రమ్మని చెప్పు నేను క్లాస్ పీకుతానని వార్నింగ్ ఇస్తుంది ధాన్యం. కుటుంబాన్ని మోసం చేస్తున్నామని కథ చెబితేనే ఇంత రచ్చ చేసిన అత్తయ్య గారు.. నిజం తెలిస్తే మనల్ని క్షమిస్తారా? అని కళ్యాణ్‌తో అంటుంది అప్పూ. ఆ మాటలతో కళ్యాణ్ నవ్వుకుంటాడు. పెళ్లికి ముందు ఎలా ఉండేదానివి.. ఎవ్వరినీ లెక్క చేసేదానివి కాదు, అలాంటిది మా అమ్మ అంటే ఎందుకు భయపడుతున్నావు? అని అడుగుతాడు. ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజే అత్తయ్య గారికి మాట ఇచ్చాను.. తనకు నచ్చని పని ఏది చేయనని అంటుంది అప్పూ. అలా చేసి గొడవలై, మనిద్దరి మధ్య దూరం పెరిగితే... అది నేను తట్టుకోలేనని చెబుతుంది. ఈ విషయం బయటపడకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటానని అంటాడు కళ్యాణ్.
మేనేజర్ సతీష్‌కి ఫోన్ చేసిన రాహుల్.. స్వరాజ్ కంపెనీ నుంచి డిజైన్లు మొత్తం కొట్టేయమని చెబుతాడు. రాజ్-కావ్య ఇద్దరూ వూళ్లో ఉండటం లేదని ఇదే మంచి ఛాన్స్ అని అంటాడు. నువ్వు స్వరాజ్ కంపెనీలో ఉన్న నీ మనుషుల్ని ఎలా ఒప్పిస్తావో తెలియదు, రేపు మార్నింగ్ కల్లా ఆ డిజైన్లు నా టేబుల్ మీద ఉండాలని ఆర్డర్స్ వేస్తాడు. ఇంతలో రుద్రాణి అక్కడికి వచ్చి ఈ మాటలన్నీ వింటుంది. నీ పనుల్లో పడిపోయి.. రాజ్ కంపెనీని ఎక్కడ పట్టించుకోవడం మానేస్తావోనని భయంగా ఉందని చెబుతుంది రుద్రాణి. నా కంపెనీని పైకి తీసుకురావడం ఎంత ముఖ్యమో, ఆ రాజ్ కంపెనీని తొక్కేయడం కూడా అంతే ముఖ్యమని చెబుతాడు రాహుల్.
ఆ రాజ్ కంపెనీ క్లయింట్స్ అందరూ నిన్ను రిజెక్ట్ చేశారు కదా అని మండిపడుతుంది రుద్రాణి. రిజెక్ట్ చేసిన వాళ్లే... నా డిజైన్స్ కావాలని నా వెంట పడతారని చెబుతాడు రాహుల్. నీ దగ్గర అంత స్పెషల్ డిజైన్స్ ఏమున్నాయని అడుగుతుంది రుద్రాణి. ఆ కావ్య వేసిన డిజైన్స్‌ని కొట్టేసి నావి అని చెబుతానని అంటాడు రాహుల్. డిజైన్స్ దొంగతనం చేసినట్లు కావ్య, రాజ్‌లకు తెలిస్తే నిన్ను వదిలిపెట్టరని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. వాళ్లని ఆపడానికి స్వప్న ఉంది కదా? ఆ డిజైన్స్ అన్ని నేనే వేసినట్లు నమ్మిస్తానని, అప్పుడు స్వప్నే నన్ను కాపాడుతుందని అంటాడు రాహుల్. కొడుకు ప్లానింగ్‌తో రుద్రాణి మురిసిపోతుంది. కంపెనీ నీ చేతుల్లో పెట్టి రాజ్ గాడు.. వాడి గొయ్యి, వాడే తవ్వుకున్నాడని అంటుంది.
పిల్లలు ఆడుకుంటూ ఉండగా.. తన పాప గుర్తొచ్చి ఇక్కడే ఉండాలని వాళ్లని అడుగుతుంది. ఇంతలో పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఆమెపై కోప్పడతారు. ఆ వెంటనే అప్పూకి రేణుక ఫోన్ చేసి.. నేను మా పాప సిరిని చూశానని, నేను వెళ్లేసరికి పాప లేదని చెబుతుంది. ఆ మాటలు విన్న అప్పూ నేను ఇప్పుడే వస్తున్నానని అప్పూ బయల్దేరబోతుండగా కళ్యాణ్ ఆపుతాడు. అమ్మని ఎలా మేనేజ్ చేస్తావని అడగ్గా.. ఇంతలో కింద రాజ్, కావ్యలు కేరళ ప్రయాణానికి వెళ్తుంటారు. కానీ కావ్య మాత్రం టెన్షన్ పడుతూ అపర్ణని హత్తుకుంటుంది. మీరు టూర్‌కి వెళ్తున్నారా? ఇంకేదైనా పని మీద వెళ్తున్నారా? అని రుద్రాణి అడుగుతుంది. ఆ మాటలతో ధాన్యలక్ష్మీ, ఇందిరలు ఆమెకు క్లాస్ పీకుతారు.
ఇంతలో కళ్యాణ్, అప్పూలు వచ్చి ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తామని చెబుతారు. అప్పూ నీ వెనకాలే ఎందుకు? ఇంట్లోనే ఉంటుందని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. అన్నయ్యకి నేను, వదినకి అప్పూ శాండాఫ్ ఇస్తామని చెబుతాడు కళ్యాణ్. బయటికి వెళ్లగానే మీరు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లండి.. మేం మా పని చూసుకుంటామని కళ్యాణ్ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. అప్పూకి తన కేసు పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చింది.. ఇంట్లోవాళ్లని ఎలా మేనేజ్ చేయాలో తెలియక మనల్ని వాడుకున్నారు అని కావ్య చెబుతుంది. కావ్య, రాజ్‌లకు సెండాఫ్ ఇచ్చేసి అప్పూ, కళ్యాణ్ వెళ్లిపోతారు. కేరళకు బయల్దేరుతూ... దుగ్గిరాల నిలయం వైపు చూస్తూ రాజ్, కావ్యలు ఎమోషనల్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











