Brahmamudi December 4th Episode: రాహుల్ చేతికి కావ్య డిజైన్లు... కేరళలో ప్రమాదంలో పడ్డ రాజ్, కావ్య

Photo Courtesy: JioHotstar

రేణుక పాప సిరి మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను అప్పూ చెక్ చేస్తుండగా కళ్యాణ్ వచ్చి ఇంకా పడుకోలేదని గొడవపడతాడు. ఇంతలో అక్కడికి ప్రకాశం, ధాన్యం వచ్చి బెడ్ మీదున్న ఫైల్స్ చూసి షాక్ అవుతారు. అప్పూ మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యిందా అని ధాన్యం రగిలిపోతుంది. దాంతో తాను కొత్త పాట రాస్తున్నానని, అది పోలీస్ స్టేషన్, కేసులు చుట్టూ ఉంటుందని అందుకే ఆ ఫైల్ చూస్తున్నానని చెబుతాడు కళ్యాణ్. అప్పూ పోలీస్ ఆఫీసర్ కాబట్టి నాకు ఆ ఫైల్ చదివి వివరిస్తోందని అంటాడు.

రాజ్, కావ్యలు ఇచ్చిన కొత్త డిజైన్స్ కొట్టేయాల్సిందిగా మేనేజర్ సతీష్‌కు చెబుతాడు రాహుల్. ఇంతలో అక్కడికి వచ్చిన రుద్రాణికి తన ప్లాన్ చెబుతాడు. కొడుకు ప్లానింగ్ చూసి రుద్రాణి మురిసిపోతుంది. తనకు సిరి కనిపించిందంటూ రేణుక అప్పూకి కాల్ చేస్తుంది. దాంతో అప్పూ ఎలాగైనా బయటికి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. రాజ్, కావ్యలు కేరళకు వెళ్తుండగా... కళ్యాణ్, అప్పూలు వచ్చి ఎయిర్‌పోర్ట్‌లో మేం డ్రాప్ చేస్తామని చెబుతారు. అప్పూకి తన కేసు పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చింది.. ఇంట్లోవాళ్లని ఎలా మేనేజ్ చేయాలో తెలియక మనల్ని వాడుకున్నారు అని కావ్య చెబుతుంది. కేరళకు బయల్దేరుతూ... దుగ్గిరాల నిలయం వైపు చూస్తూ రాజ్, కావ్యలు ఎమోషనల్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 4వ తేదీ ఎపిసోడ్ 895లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 4th 2025 Episode 895 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

వారం రోజుల్లో నీకు పూర్తిగా నయమయ్యాకే తిరిగి ఈ ఇంట్లో అడుగుపెట్టాలని కావ్యతో చెబుతాడు రాజ్. ఈ వారం రోజుల్లో సమస్యలన్నీ తీరిపోతాయని అంటాడు. అటు ఇంట్లో వాళ్లని మోసం చేసి బయటికి రావడం నాకు నచ్చలేదు.. ఎలాగైనా సరే వారం రోజుల్లో ఈ కేసు క్లోజ్ చేసి మళ్లీ అత్తయ్య కోరుకున్న కోడలిగా ఈ ఇంట్లోనే ఉంటానని కళ్యాణ్‌తో చెబుతుంది అప్పూ. వారం రోజుల్లో కేసు సాల్వ్ చేస్తానని అంటుంది. మరోవైపు.. వారం రోజుల్లో మీ జీవితాలన్నీ తలకిందులు చేసేస్తానని రాహుల్ అనుకుంటాడు.

పాప కనిపించిన ప్లేస్‌ని అప్పూకి చూపిస్తుంది రేణుక. ఇంతలో ఆమె భర్త వచ్చి మళ్లీ నీకు పాప కనిపించిందా? అని మండిపడతాడు. ఈ విషయం మీకు కొత్త కావొచ్చు, నేను ఎన్నో రోజుల నుంచి అనుభవిస్తున్నానని అంటాడు రేణుక భర్త. పాప చనిపోయి ఏడాది అవుతోంది, అయినా పాప బతికే ఉంది, నేను చూశానని రోజుకొకసారి చెబుతూ అందరినీ పరుగులు పెట్టిస్తూనే ఉంటుందని అంటాడు. అయినా నేను కూడా తన బాధ చూడలేక, తన తృప్తి కోసం నేను కూడా పాపని వెతికే ప్రయత్నం చేశాను, చేయించానని చెబుతాడు. రోజు రోజుకు తన ప్రాబ్లమ్ పెద్దదవుతోందని బాధపడతాడు రేణుక భర్త. తనను ఎలాగైనా బాగు చేయాలని నేను అనుకుంటుంటే.. మళ్లీ లేని ఆశలు కల్పిస్తున్నారని అప్పూపై మండిపడతాడు. మీ వైఫ్ చెప్పేది నిజమో, అబద్ధమో అప్పుడు తేలుతుందని అప్పూ చెబుతుంది. పాప గురించి రేణుక ఇరుగుపొరుగు వారిని ఎంక్వైరీ చేస్తుంది అప్పూ.

వైద్యం కోసం కేరళలో అడుగుపెడతారు కావ్య, రాజ్. అక్కడ ఓ వ్యక్తి వచ్చి నేను మిమ్మల్ని వైద్యశాలకు తీసుకెళ్తానని చెబుతాడు. కావ్య వేసిన డిజైన్లను తెప్పించి రాహుల్‌కి ఇస్తాడు మేనేజర్ సతీష్. నువ్వు డెవలప్ కావాలంటే కావ్య వేసిన డిజైన్లు కావాలని అడిగాను, నిన్ను నువ్వు నిరూపించుకున్నావని అంటాడు రాహుల్. రాజ్ సార్ కంపెనీలో పనిచేస్తున్న నా అసిస్టెంట్‌ని ఒప్పించి వాడికి డబ్బు ఆశ చూపించి చాలా రిస్క్ చేసి కావ్య గారి డిజైన్లు దొంగిలించానని చెబుతాడు. రాజ్ సార్‌కి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడని భయపడతాడు మేనేజర్. రాజ్ నిన్ను చంపేస్తే.. నేను నిన్ను పచ్చనోట్లతో కొడతా, జీవితాంతం రాజ్‌కి దొరకకుండా కాపాడతానని అంటాడు రాహుల్.

ఈ డిజైన్లను వెంటనే మాన్యుఫాక్చరింగ్‌కి పంపించమంటారా? అని రాహుల్‌ని మేనేజర్ అడగ్గా.. ఈ డిజైన్లు నావి అని నా చుట్టూ ఉన్న వాళ్లకి తెలియాలి కదా అని చెబుతాడు రాహుల్. మన కంపెనీకి ఒక డిజైనర్ కావాలి, కావ్య డిజైన్‌లను గీసేవాడు కావాలని ఆర్డర్స్ వేస్తాడు. కావ్యకి చాలా టాలెంట్ ఉంది, సరిగ్గా వాడితే నువ్వు ఎక్కడో ఉంటావు.. కానీ ఫ్యామిలీ, సెంటిమెంట్స్ అని నువ్వు ఇక్కడే మిగిలిపోయావ్.. పాపం అనుకుంటాడు రాహుల్.

రాజ్, కావ్యలు ఆయుర్వేద వైద్యాలయానికి వచ్చి బుద్ధ భగవానుడికి దండం పెట్టుకుంటారు. ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉందని కావ్య అనడంతో.. ఉరుకులు, పరుగుల జీవితంలో బతుకుతున్నాం కాబట్టి.. ఇలాంటి ప్లేస్ అలాగే ఉంటుందని చెబుతాడు రాజ్. ఇంతలో ఒకావిడ వచ్చి నాకు యాక్సిడెంట్‌లో రెండు కాళ్లు విరిగిపోయాయి, డాక్టర్లే చేతులెత్తేశారు. కానీ వరసిద్ధి ఆచార్యుల వారి గురించి చెబితే ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు అడుగుతీసి అడుగు వేయగలుగుతున్నానని చెబుతుంది. నెల రోజులకే ఇలా నడుస్తున్నాను, మరో మూడు నెలల్లో పూర్తిగా నడుస్తున్నాను. మీ సమస్య కూడా తప్పకుండా తీరిపోతుందని ఆమె చెప్పడంతో రాజ్, కావ్యలు సంతోషిస్తారు.

గురువుగారిని కలిసి రిపోర్ట్స్ చూపిస్తారు రాజ్, కావ్య. మీ సమస్య నాకు అర్ధమైంది, పరిష్కారం లేని సమస్య లేదని అంటాడు గురువుగారు. ఎందరో డాక్టర్స్‌ని కలిశామని.. అందరూ బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టగలం, తల్లి ప్రాణం కాపాడలేమని చెప్పారని రాజ్ అంటాడు. చివరి ప్రయత్నంగా మీ దగ్గరికి వచ్చామని చెబుతాడు. కొన్నిసార్లు ఆ సైన్స్‌కి కూడా అందని పరిష్కారాలు, ప్రకృతి మనకు చూపిస్తుందని చెబుతాడు గురువుగారు. నా భార్య అంటే నాకు ప్రాణం, తనకి ఇలాంటి పరిస్ధితి వస్తుందని నేను ఊహించలేదు.. ఎలాగైనా మీరే కాపాడాలని వేడుకుంటాడు రాజ్. ప్రకృతిని నమ్మిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతాడు.

కావ్యకి పరీక్షలు చేసిన గురువుగారు.. కంగారు పడాల్సినది ఏం లేదని, అంతా మంచే జరుగుతుందని.. నేను ఇచ్చే కాషాయాలు తీసుకుంటూ ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని రాజ్‌తో చెబుతాడు. నేను ఇచ్చే గుళికలు క్రమం తప్పకుండా వాడాలి, నేను పంపించిన తైలాన్ని అమ్మాయి పొట్ట మీద సున్నితంగా మర్ధన చేయమని చెబుతాడు. ఒక వారం మీరు ఇక్కడే ఉంటే చాలని అంటాడు. మిమ్మల్ని నమ్మి ఇంతదూరం వచ్చాం.. మా నమ్మకాన్ని నిలబెట్టమని చెబుతాడు రాజ్. ప్రయత్నిస్తే ఫలితం అదే వస్తుందని అంటాడు. ట్రీట్‌మెంట్ మొదలైంది, ఇకపై ఎలాంటి ఇబ్బంది లేదని కావ్యతో చెబుతూ చాలా సంతోషిస్తాడు రాజ్. నీకు నయమైతే హైదరాబాద్ వెళ్లగానే ఆ పంతులుగారికి శాలువా కప్పి సన్మానం చేస్తానని అంటాడు. ఇకపై మనకు ఏ సమస్యా లేదని కావ్యతో అంటాడు రాజ్. ఇంతలో ఓ వ్యక్తిని రౌడీలు తరుముతూ వస్తుండగా.... అతను రాజ్ కారు కిందపడతాడు. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X