Brahmamudi December 5th Episode: అప్పూకి అగ్నిపరీక్ష... కేరళలో ఎంజాయ్ చేస్తోన్న రాజ్, కావ్య

Photo Courtesy: JioHotstar

రేణుక పాప సిరి మిస్సింగ్ కేసుకు సంబంధించి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి విచారణ చేస్తుంది అప్పూ. నేను పాపను ఇక్కడే చూశానని, మీకు చెప్పేలోగా వెళ్లిపోయిందని అప్పూతో అంటుంది రేణుక. ఇంతలో ఆమె భర్త వచ్చి పాప చనిపోయి ఏడాది అవుతోందని, మా బిడ్డ బతికే ఉందని రేణుక భ్రమల్లో ఉందని చెబుతాడు. ఇరుగుపొరుగు వారిని ఎంక్వైరీ చేసినా అప్పూకి అదే ఆన్సర్ రావడంతో ఆమెకు ఏం చేయాలో అర్ధం కాదు. స్వరాజ్ కంపెనీలో కావ్య వేసిన డిజైన్లను కొట్టేసి రాహుల్‌కి ఇస్తాడు మేనేజర్.

కావ్య, రాజ్‌లు కేరళలోని ఆయుర్వేద వైద్యశాలలో గురువుగారిని కలుస్తారు. కావ్యని పరీక్షించిన గురువుగారు.. ఆమెకు ఏ ఇబ్బంది లేదని, నేను నయం చేస్తానని చెప్పడంతో రాజ్ సంతోషిస్తాడు. తమ సమస్య తీరిపోయి, తల్లీ, బిడ్డా క్షేమంగా ఉంటారని రాజ్ ఎంతో సంతోషిస్తాడు. రాజ్, కావ్యలు వెళ్తుండగా ఓ వ్యక్తిని రౌడీలు వెంటాడుతుండగా అతను రాజ్ కారు కింద పడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 5వ తేదీ ఎపిసోడ్ 896లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 5th 2025 Episode 896 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్, కావ్యలు కారులో వెళ్తుండగా ఓ వ్యక్తి వారి కారుకు తగిలి పడిపోతాడు. అతను ఏదో చెప్పబోతూ రాజ్ చేతుల్లోనే ప్రాణాలు విడుస్తాడు. చనిపోయేముందు ఓ పెన్‌డ్రైవ్‌ని రాజ్ జేబులో వేస్తాడు ఆ వ్యక్తి. కేరళలో ఇలా జరగడంతో రాజ్, కావ్యలు భయపడతారు. బాడీనే అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోదామని చెబుతాడు రాజ్. ఇంతలో ఆ వ్యక్తిని తరుముకొచ్చిన వాళ్లు రాజ్, కావ్యలని ఆపి.. వాడు చనిపోయేముందు ఏం చెప్పాడని అడుగుతారు. వాడు మాకు ఏం చెప్పలేదని.. రాజ్ మండిపడతాడు. ఆ పెన్‌డ్రైవ్‌ని ఎలాగైనా దక్కించుకోవాలని వాళ్లు అనుకుంటారు.

రేణుక ఇంటి నుంచి వచ్చిన అప్పూ, కళ్యాణ్‌లు సైలెంట్‌గా తమ బెడ్‌రూమ్‌కి వెళ్తుండగా ధాన్యలక్ష్మీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. ఆమెను చూసి అప్పూ, కళ్యాణ్‌లు వణికిపోతారు. ఈ టైం వరకు పడుకోకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏం కావాలని అడుగుతుంది అప్పూ. నా ఆరోగ్యానికి ఏం కాలేదు కానీ.. నీ హెల్త్ ఎలా ఉందని ప్రశ్నిస్తుంది ధాన్యం. తనకేంటీ గుండ్రాయిలా ఉందని కళ్యాణ్ చెప్పగా.. గుండ్రాయిలా ఉంటే హాస్పిటల్‌కి ఎందుకు వెళ్లారని నిలదీస్తుంది ధాన్యం. నిన్నటిదాకా పొట్టి ఆరోగ్యం గుండ్రాయిలాగే ఉండదని, ఈరోజే గులకరాయిగా మారిపోయిందని చెబుతాడు కళ్యాణ్. హాస్పిటల్‌కు వెళ్లారు సరే.. ఇంత లేట్ అయ్యిందేంటీ? అని అడుగుతుంది ధాన్యలక్ష్మీ.

ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు.. ఏం చేశారు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అన్నయ్యని ఎయిర్‌పోర్ట్‌లో దించేసి మేం హాస్పిటల్‌కు వెళ్లామని చెబుతాడు కళ్యాణ్. రాజ్ ఫ్లైట్ 11 గంటలకు, మీ అపాయింట్‌మెంట్ 10 గంటలకి, మీరు బయల్దేరింది 9 గంటలకి అని చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఫ్లైట్ డీలే అయితే రాజ్‌కు ప్రాబ్లమ్ లేదని, టైమ్‌కి డాక్టర్ దగ్గరికి వెళ్లకపోతే అపాయింట్‌మెంట్ మిస్ అవుతుందని ఎలా వెళ్లారు? అని ప్రశ్నిస్తుంది. డాక్టర్ మా కోసం వెయిట్ చేశారని చెబుతుంది అప్పూ. అయినా ఇంత లేట్ ఎందుకు అయ్యిందని అడుగుతుంది ధాన్యం. పని అయిపోగానే ఇంటికి రావడానికి వాళ్లు నీలాగా, నాలాగా ముసలివాళ్లా? కుర్రాళ్లు కాబట్టి ఎక్కడికైనా షికారుకు వెళ్లారేమోనని అంటాడు ప్రకాశం.

హాస్పిటల్‌కు వెళ్తే టెస్టులు చేయించారా? మరి రిపోర్ట్స్ ఏవి అని అడుగుతుంది ధాన్యం. టెస్టులు చేశాక వెంటనే రిపోర్ట్స్ వచ్చేస్తాయా? 24 గంటలు టైం పడుతుందని చెబుతాడు ప్రకాశం. రెండుసార్లు హాస్పిటల్‌కి వెళ్లారు.. ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవద్దా అని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. ఆ రిపోర్ట్స్ చూసి నువ్వేం చేస్తావని ప్రశ్నిస్తాడు ప్రకాశం. కొడుకు కోడలు ఆకలితో ఉంటారు.. వాళ్లకి భోజనం పెడదామని ఉందా? లేదా? అని మండిపడతాడు. ఏ జన్మలో ఏం చేశానో నువ్వు నాకు తండ్రిగా పుట్టానని ప్రకాశంను మెచ్చుకుంటాడు కళ్యాణ్. ఈ నాన్నంటే వాడికి ఎంతో ప్రేమని పొంగిపోతాడు ప్రకాశం.

ఉదయం జరిగింది తలచుకుని కావ్య బాధపడుతుండటంతో... శ్రీమతి గారు ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నారని రాజ్ అడుగుతాడు. ఉదయం మనకారుకి తగిలిపడిపోయిన వ్యక్తి గురించి అని చెబుతుంది. వాడు మన కారుకి గుద్ధుకోలేదు.. కారు దగ్గరికి వచ్చి పడిపోయాడని అంటాడు రాజ్. చూస్తుండగానే ప్రాణం పోయింది.. మనం వచ్చింది దేనికి, అలా జరగడం ఏంటీ అని తలచుకుంటేనే భయమేస్తోందని చెబుతుంది కావ్య. ఇంకా ఆ విషయమే ఆలోచిస్తున్నావా? నువ్వు? అని అడుగుతాడు రాజ్. వాళ్లు రౌడీల్లాగా ఉన్నారు.. మనమేదో చంపినట్లు, మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రశ్నిస్తున్నారు.. కాస్తయితే మనం ఇరుక్కునేవాళ్లమని అంటుంది కావ్య.

వాళ్లు రౌడీలేంటీ? జోకర్లు అంటాడు రాజ్. వాళ్లు తింగరోళ్లు కాబట్టే తప్పించుకోగలిగామని చెబుతుంది కావ్య. తప్పు చేస్తే కదా తప్పించుకునేది. వాడు ఎవరో మనకి తెలియదు, ఆ జోకర్లు ఎవరో మనకి తెలియదు.. ఆ దారిలో వచ్చేశామని అంటాడు రాజ్. ఏది ఏమైనా ఒక మనిషి ప్రాణం మన కళ్ల ముందే పోయిందని అంటుంది కావ్య. వాడిది ప్రాణం.. కానీ మనది భవిష్యత్తు అని చెబుతాడు రాజ్. మనం వచ్చింది వైద్యం చేయించుకోవడానికి.. వైద్యం చేయించుకుని హైదరాబాద్ తిరిగి వెళ్లిపోవాలని అంటాడు. నువ్వు టెన్షన్ పడకూడదని, దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దని, టైంకి టాబ్లెట్ వేసుకుని, టైంకి కషాయం తాగాలని గురువుగారు చెప్పారని మండిపడతాడు రాజ్.

రాజ్ ఇచ్చిన కషాయం చేదుగా ఉండటంతో కావ్య తాగలేకపోతుంది. కషాయం చేదుగానే ఉంటుంది, తీయగా ఉండదని మండిపడతాడు రాజ్. అతను బలవంతంగా తాగించే ప్రయత్నం చేయగా.. నా వల్ల కాదని వెళ్లిపోతుంది. నీతో ఎలా తాగించాలో నాకు బాగా తెలుసని పాట పాడతాడు రాజ్. చివరికి కావ్య కషాయం తాగేస్తుంది. ఇందాక చేదుగా ఉంది అన్నావు కదా అని రాజ్ అడుగుతాడు. మా ఆయన పాట పాడితే తీయగా మారిపోయిందని అంటుంది కావ్య. నిజానికి ఆ కషాయం అంత చేదుగా లేదని కావ్య చెప్పగా.. మరి ఎందుకంత విషయం చేశావని మండిపడతాడు రాజ్. నేను అలిగితే మా ఆయన బుజ్జగించడం, ప్రేమగా పాటపాడటం నాకు చాలా నచ్చిందని అంటుంది కావ్య. రాజ్ సీరియస్ అవ్వగా.. భర్తని గట్టిగా హత్తుకుంటుంది కావ్య. భార్య సంతోషంగా ఉండటంతో రాజ్ సంతోషిస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X