Brahmamudi December 6th Episode: రాజ్, కావ్యలను వెంటాడుతోన్న రౌడీలు... రాహుల్ ట్రాప్‌లో స్వప్న

Photo Courtesy: JioHotstar

రాజ్, కావ్యల కారు తగిలి ఓ వ్యక్తి పడిపోతాడు. అప్పటికే తీవ్రగాయాలతో ఉన్న ఆ వ్యక్తి చనిపోతూ చనిపోతూ.. రాజ్ జేబులో ఒక పెన్‌డ్రైవ్ వేస్తాడు. ఆ పెన్‌డ్రైవ్ కోసమే అతనిని వెంటాడని రౌడీలు.. రాజ్, కావ్యల దగ్గరికి వచ్చి డానియేల్ గాడు ఇచ్చిన పెన్‌డ్రైవ్ ఎక్కడ అని అడుగుతారు. మేం మంచినీళ్లు ఇచ్చేలోపు వాడు చనిపోయాడని రాజ్, కావ్యలు చెబుతారు. రేణుక ఇంటి నుంచి వచ్చిన అప్పూ- కళ్యాణ్‌లను ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. దాంతో కొడుకు, కోడలిని ప్రకాశం కాపాడతాడు.

తన కళ్ల ముందే ఓ వ్యక్తి చనిపోవడంతో కావ్య బాధపడుతుండటంతో రాజ్ ఓదారుస్తాడు. గురువుగారు ఇచ్చిన కషాయం చేదుగా ఉండటంతో నేను తాగలేనంటూ కావ్య మారాం చేస్తుంది. దాంతో రాజ్ ఓ పాట పాడి ఆమెను బుజ్జగిస్తాడు. చివరికి కావ్య కషాయం తాగడంతో రాజ్ సంతోషిస్తాడు. మీరు ప్రేమగా చూసుకోవడం, నాకోసం పాటపాడటం చాలా బాగుందని అంటూ రాజ్‌ను హత్తుకుంటుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 6వ తేదీ ఎపిసోడ్ 897లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 6th 2025 Episode 897 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రేణుక వాళ్ల పాప సిరి మిస్సింగ్ కేసు కొత్త కొత్త మలుపులు తిరుగుతుండటంతో అప్పూకి ఏం చేయాలో అర్ధం కాదు. రేణుక చుట్టూ ఉన్నవాళ్లే ఆమెకు పిచ్చి అని, భ్రమ అని ఏదేదో అంటున్నా.. ఆమె మాత్రం పాపని చూశాననే చెబుతోందని కళ్యాణ్‌తో అంటుంది అప్పూ. రేణుక మాట నమ్మాలని అనిపిస్తుంది.. ఓ పక్క జనం చెప్పేది నిజమా? అని నమ్మాలి అనిపిస్తుందని చెబుతుంది అప్పూ. ఏ తల్లి కూడా చనిపోయిన కూతురు బతికే ఉందని భ్రమపడదు కదా అని అంటుంది. రేణుక మాటల్ని నమ్మొద్దని నీ మనసుకు ఏది నచ్చితే అదే చేయమని చెబుతాడు కళ్యాణ్. నీలాంటి ధైర్యంగల ఆఫీసర్ కన్‌ఫ్యూజన్‌లో ఉండకూడదని అంటాడు. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న అప్పూ మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తానని చెబుతుంది.

ఉదయాన్నే టాబ్లెట్స్ వేసుకుని, కషాయం తాగాలని కావ్యని నిద్రలేపుతాడు రాజ్. నేను లేవన అంటూ కావ్య మారాం చేయడంతో రాజ్ దుప్పటి లాగేస్తాడు. అయితే అప్పటికే కావ్య రెడీ అయిపోయి ఉండటంతో రాజ్ షాక్ అవుతాడు. నేను ఫ్రెష్ అయి రెండు గంటలైందని, నేను రెడీ అయి అలా వచ్చి మీ పక్కన పడుకున్నానని చెబుతుంది కావ్య. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. మీరు మాత్రం ముందే లేచినట్లు బిల్డప్ ఇస్తున్నారని సెటైర్లు వేస్తుంది కావ్య. ఇప్పటి వరకు నన్ను ఆటపట్టిస్తావా? అని రాజ్ ఫైర్ అవుతాడు. మీరు మాత్రం నా మీద నీళ్లు పోస్తానని నన్ను బ్లాక్ మెయిల్ చేయలేదా అని కౌంటర్ ఇస్తుంది. దాంతో కోప్పడిన రాజ్.. నన్నే ఫూల్‌ని చేస్తావా అంటూ ఫైర్ అవుతాడు. దీనికి పనిష్మెంట్ తప్పదని కావ్య మీదకి రాబోతుండగా.. నాకు ట్రీట్‌మెంటో జరుగుతోందని భర్తని ఆపుతుంది కళావతి.

కావ్య వేసిన డిజైన్లను ఓ డిజైనర్‌కి చూపిస్తాడు రాహుల్. ఒరిజినల్‌కి, దీనికి ఒక చిన్న తేడా కూడా ఉండకూడదని వార్నింగ్ ఇస్తాడు. చిన్న డైమండ్ కానీ, చిన్న ముత్యం కానీ.. అక్కడ ఎలా ఉంటే ఇక్కడ అలాగే గీయాలని సీరియస్ అవుతాడు రాహుల్. నేను ఇంతకంటే కొత్తవి, క్రియేటివ్‌గా డిజైన్ చేస్తానని డిజైనర్ చెప్పగా.. నీ క్రియేటివిటీ, నీ టాలెంట్ నాకేం అవసరం లేదు.. నాకు జస్ట్ దీనిని కాపీ చేసి ఇస్తే చాలని చెబుతాడు రాహుల్. కావ్య గారి డిజైన్లను మనం కాపీ కొట్టి ఇస్తే క్లయింట్స్ మనవేనని నమ్ముతారా అని మేనేజర్ అడుగుతాడు. ప్రపంచం మొత్తం నమ్మాల్సిన అవసరం లేదు... నా భార్య నమ్మితే చాలు, కథని తనే నమ్మిస్తుందని అంటాడు రాహుల్.

ఆ వెంటనే స్వప్నకి రాహుల్ ఫోన్ చేసి నేను లంచ్‌కి రావడం లేదు, ఆఫీసులో హెవీ వర్క్ ఉందని చెబుతాడు రాహుల్. ఇంటికి రాలేను, నువ్వు భోజనం చేయమని రాహుల్ చెప్పగా.. అన్నం తినకుండా వర్క్ ఎలా చేస్తావు నేను క్యారేజ్ తీసుకొస్తానని చెబుతుంది స్వప్న. తన ప్లాన్ సక్సెస్ కావడంతో రాహుల్ సంతోషిస్తాడు. కేరళలో ఆలయానికి వెళ్తారు రాజ్, కావ్య. కళావతికి ఎలా నయం చేయాలా? అని బాధపడుతున్న నాకు నువ్వే ఓ దారి చూపించావు, తనకి త్వరగా నయం అయ్యేలా చేయమంటాడు రాజ్. నా బిడ్డ క్షేమంగా బయటకు వచ్చేలా చేయమని కావ్య కోరుకుంటుంది. నువ్వెంత సంతోషంగా ఉంటే నీ ఆరోగ్యం అంత బాగుంటుందని కావ్యతో చెబుతాడు రాజ్.

దేవుడిని ఏం కోరుకున్నావని కావ్య అడగ్గా.. లేడీస్ ఫస్ట్ కాబట్టి నువ్వే చెప్పమని అంటాడు రాజ్. ఇకపై మీకు ఏ బాధ ఉండకూడదని మొక్కుకున్నానని అంటుంది కావ్య. నిజంగా మనం అనుకున్నది, అనుకున్నట్లే జరుగుతుందా అని అడుగుతుంది కావ్య. నాలో లేనిపోని ఆశలు రేపిన దేవుడు.. ఇదంతా ఎక్కడ కల అని మోసం చేస్తాడోనని భయంగా ఉందని అంటుంది కళావతి. నీకు, నీ కడుపులోని బిడ్డకు ఏమీ కానివ్వనని చెబుతాడు రాజ్. ఆ మాటలతో కావ్య ఎమోషనల్ అవుతుంది.

రాజ్, కావ్యలు ఆశ్రమానికి బయల్దేరుతుండగా రాజ్ చేతిలో చనిపోయిన డానియేల్ వాళ్ల బ్రదర్ శామ్యూల్ వస్తాడు. మా తమ్ముడు చనిపోయినప్పుడు మీకు ఏదైనా ఇచ్చాడా అని అడుగుతాడు. మాకు అతను ఏం ఇవ్వలేదని.. అతనిని వెతుక్కుంటూ ఎవరో ఇద్దరు వచ్చారని, వాళ్లే అంతా చూసుకుంటామన్నారని కావ్య అంటుంది. మేం ఇక్కడికి వచ్చిన పనివేరు, పర్పస్ వేరు.. మా పనికి అడ్డొస్తే పోలీస్ స్టేషన్‌కి వెళ్తామని రాజ్ వార్నింగ్ ఇస్తారు. డానియేల్ వాళ్ల అన్నతో మాట్లాడుతుండగా .. రాజ్‌ని నిన్న కలిసిన రౌడీలు చూస్తారు. రాజ్, కావ్యలకి చచ్చినవాడు పెన్‌డ్రైవ్ ఇచ్చుంటాడు, అందుకే వాళ్ల అన్నని పిలుచుకుని ఆ పెన్‌డ్రైవ్‌ని ఇచ్చేసి ఉంటాడని అంటాడు. శామ్యూల్ గాడిని మనం పట్టుకోలేం కాబట్టి.. ఆ వైఫ్ అండ్ హజ్బెండ్‌ని మనం పట్టుకోవాలని రౌడీలు అనుకుంటారు.

కావ్య వేసిన డిజైన్లను సరిగా వేయకపోవడంతో డిజైనర్ మీద కోప్పడతాడు రాహుల్. కొత్త డిజైన్‌లని నేను చాలా బాగా వేస్తాను, కానీ కావ్య గారు వేసిన డిజైన్లను వేయడం కష్టంగా ఉందని అంటాడు డిజైనర్. శాలరీ ఇచ్చేవాడి మీద సెటైర్లు వేస్తే రిటైర్ మాత్రమే అవుతారు.. కానీ ఈ రాహుల్ మీద సెటైర్లు వేస్తే నువ్వు డిజైన్లు వేయడానికి ఫింగర్స్ ఉండవని అంటాడు రాహుల్. ఇంతలో స్వప్న ఆఫీసుకు రావడంతో రాహుల్ మాట మార్చేస్తాడు. మూడు రోజుల నుంచి చెబుతున్నాను, డిజైన్లు సరిగా వేయడం రావడం లేదని మండిపడతాడు.

మీ వైఫ్ రాగానే క్రియేటివ్ జీనియస్‌లా మాట్లాడుతున్నావ్.. నువ్వొక కాపీ క్యారెక్టర్ అని ఆమెకు తెలిసిన రోజున మామూలుగా ఉండదని మనసులో అనుకుంటాడు డిజైనర్. స్వప్నని చూసిన రాహుల్ బాగా బిల్డప్ ఇస్తాడు. డిజైన్లు బాగానే ఉన్నాయి కదా ఎందుకు నచ్చడం లేదని అడుగుతుంది స్వప్న. రాజ్ కంపెనీ లాంటి కంపెనీలు సిటీలో చాలా ఉన్నాయి.. వాటికి పోటీ ఇవ్వాలంటే డిజైన్లు బాగుండాలని చెబుతాడు రాహుల్. భోజనం చేసిన తర్వాత పనిచేసుకోవచ్చని స్వప్న బలవంతం చేస్తుంది. ఈ డిజైన్లు నావీ అని స్వప్న నమ్మడంతో తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని రాహుల్ సంతోషిస్తాడు. ఇకపై రాజ్, కావ్యలు అడిగినా స్వప్నే నన్ను కాపాడుతుందని అనుకుంటాడు రాహుల్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X