Brahmamudi December 8th Episode: రాజ్- కావ్యల లైఫ్‌లోకి కొత్త విలన్... స్వప్న ఆస్తిపై రాహుల్ కన్ను

Photo Courtesy: JioHotstar

రేణుక కూతురు సిరి ఆచూకీ దొరకకపోవడంతో అసలు నిజంగా పాప బతికే ఉందా? చనిపోయిందా? మా డిపార్ట్‌మెంట్ చెప్పినా వినిపించుకోకుండా టైమ్ వేస్ట్ చేస్తున్నానా అని అప్పూ బాధపడుతుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి నీ మనసుకి ఏమనిపిస్తే అది చేయ్.. కేసు సాల్వ్ అయితే పాప తిరిగొస్తుంది, లేకపోతే టైం వేస్ట్ అవుతుందని ధైర్యం చెబుతాడు. ఇక కేరళలో రాజ్, కావ్యలు గుడికి వెళ్లి ట్రీట్‌మెంట్ బాగా జరగాలని దేవుడికి దండం పెట్టుకుంటారు. ఇంతలో రాజ్ కారు దగ్గర చనిపోయిన డానియేల్ అన్నయ్య శామ్యూల్ వచ్చి.. మా తమ్ముడు మీతో ఏమైనా చెప్పాడా? ఏదైనా పెన్‌డ్రైవ్ ఇచ్చాడా అని వారిద్దరినీ అడుగుతాడు. వాడేం చెప్పలేదు.. ఏ పెన్‌డ్రైవ్ ఇవ్వలేదని రాజ్, కావ్యలు కోపంగా వెళ్లిపోతారు. శామ్యూల్‌తో వారిద్దరూ మాట్లాడటాన్ని రౌడీలు చూసి రాజ్, కావ్యల దగ్గర ఖచ్చితంగా పెన్‌డ్రైవ్ ఉందని భావించి వారిని వెంబడిస్తారు.

కావ్య వేసిన డిజైన్లను మరో డిజైనర్‌తో కాపీ చేయిస్తాడు రాహుల్. అయితే డిజైన్లు సరిగా రాకపోవడంతో అతనిపై రాహుల్ సీరియస్ అవుతాడు. తాను ప్రొఫెషనల్ డిజైనర్‌ని అని నేను మంచి డిజైన్లు ఇస్తానని కాపీ కొట్టడం నా వల్ల కావడం లేదని చెబుతాడు డిజైనర్. ఇక ఆ డిజైన్లు తన డిజైన్లే అని స్వప్నని నమ్మించడానికి క్యారియర్ పేరుతో భార్యను ఆఫీసుకు రప్పిస్తాడు రాహుల్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 8వ తేదీ ఎపిసోడ్ 898లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 8th 2025 Episode 898 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్యకి గురువుగారు ట్రీట్‌మెంట్ చేస్తుండగా.. రాజ్ టెన్షన్‌తో అటు ఇటూ తిరుగుతాడు. వాళ్లిద్దరి కోసం రౌడీలు వచ్చి రాజ్‌ను చూస్తారు. రాజ్ దగ్గర పెన్‌డ్రైవ్ ఉందో లేదో కనుక్కుందామని వెళ్తారు. నీ దగ్గర ఉన్నది నాకు ఇచ్చేయమంటాడు. దాంతో రాజ్ లాగిపెట్టి కొడతాడు. చచ్చినవాడి బ్రదర్‌తో నీకెంటీ పని? నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? నీతో ఏం మాట్లాడాడని రాజ్‌ను వాళ్లు విసిగిస్తారు. చచ్చినవాడు నీకు పెన్‌డ్రైవ్ ఇస్తే మర్యాదగా ఇచ్చేయమని చెబుతారు రౌడీలు. అసలు ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందని రాజ్ అడగ్గా ఏముంటే నీకెందుకు అని మండిపడతారు రౌడీలు. దాంతో లాగిపెట్టి కొడతాడు రాజ్. చివరికి చేసేదేం లేక వాళ్లు వెళ్లిపోతారు.

ట్రీట్‌మెంట్ చేయించుకుని బయటకు వచ్చని కావ్యకు రౌడీలు కనిపించడంతో వాళ్లు ఎందుకొచ్చారని రాజ్‌ని అడుగుతుంది. ఇంతలో గురువుగారు వచ్చి నేను చేస్తున్న వైద్యం చక్కని ఫలితాన్ని ఇవ్వబోతోందని చెప్పడంతో రాజ్, కావ్యలు సంతోషిస్తారు. నేను చెప్పిన కషాయాన్ని తాగిస్తూ, గుళికలు తినిపిస్తే మరో 5 రోజుల్లో సంతోషంగా ఇంటికి వెళ్లిపోవచ్చని చెబుతాడు గురువుగారు. ఇక నీకు ఏ ప్రాబ్లం లేదని ఈ హ్యాపీ మూవ్‌మెంట్‌ని మనం సెలబ్రేట్ చేసుకోవాలని కావ్యతో చెబుతాడు గురువుగారు.

పాప మిస్ అయిన రోజు నాటి సీసీటీవీ ఫుటేజ్ గురించి అప్పూ ఆరా తీస్తుంది. కానీ ఎక్కడా ఏం దొరకలేదని కానిస్టేబుల్స్ చెబుతారు. ఇంతలో సీఐ వచ్చి కొత్త కేసు ఇస్తాడు. పాప రీ పోస్ట్‌మార్టం గురించి మిమ్మల్ని పర్మిషన్ అడుగుదామని అనుకున్నానని, మీరు ఇలా షాకిస్తున్నారని సీఐపై మండిపడుతుంది అప్పూ. నేను ఆ కేసును వదిలేయమంటే నువ్వెందుకు ఇలా చేస్తున్నావని సీఐ సీరియస్ అవుతాడు. అప్పుడు పొరపాటు జరిగిందని నాకు అనుమానంగా ఉంది.. ఇప్పుడు రీ పోస్ట్‌మార్టం జరిపిస్తే కొన్ని క్లూస్ దొరికే అవకాశం ఉందని అంటుంది అప్పూ.

ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేస్తున్నావు.. ఆ పాప రేణుక గారి పాపేనని నిర్ధారణ అయినప్పటికీ డిపార్ట్‌మెంట్ తప్పు చేసినట్లు మాట్లాడుతున్నావని సీఐ ఫైర్ అవుతాడు. ఇకపై ఈ కేసు గురించి వదిలేసి నేను ఇచ్చే కొత్త కేసు గురించి చూసుకో.. లేదంటే లీవ్ పెట్టి ఇంట్లో కూర్చోమని తేల్చిచెబుతాడు సీఐ. ఎమ్మెల్యే గారి మేనల్లుడి ఇంట్లో కేజీ బంగారం పోయింది, ఇంటి దొంగో బయటి దొంగో అర్ధం కావడం లేదు.. నువ్వు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్స్ వేస్తాడు.

పెన్‌డ్రైవ్ తీసుకు రాకపోవడంతో రౌడీలను వాళ్ల బాస్ చితకబాదుతాడు. మేం చాలా ట్రై చేశాం కానీ పెన్‌డ్రైవ్ దొరకలేదని చెబుతారు. నా నరాలు చిట్లిపోతున్నాయని బాస్ అంటాడు. ఆ డానియేల్ గాడు చచ్చిపోయే ముందు ఎవరినీ కలవలేదని అంటారు రౌడీలు. పెన్‌డ్రైవ్ ఎవ్వరికీ ఇవ్వలేదని, దాని గురించి మరిచిపోవడమే మంచిదని చెబుతారు. ఆ పెన్‌డ్రైవ్ ఎవరి చేతుల్లో పడ్డా నాకు చావు కన్ఫర్మ్.. అసలు ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందో తెలుసా? నా జీవితం ఉంది అని చెబుతాడు బాస్. ఫోన్‌లో ఎమ్మెల్యే తాలూకా అమ్మాయితో గడిపిన వీడియోలను వాళ్లకు చూపిస్తాడు. దీనికి సంబంధించిన వీడియోలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయని.. ఈ విషయం ఎమ్మెల్యేకి తెలిస్తే వాడు నన్ను చంపేస్తాడని అంటాడు.

అమ్మాయి సెట్ అవ్వగానే కక్కుర్తిపడి ఆ అమ్మాయికి దొరికిపోయాను. ఎప్పుడూ నేను వీడియో తీసుకునే వాడిని, ఇప్పుడు డానియేల్ గాడు షార్ట్ వీడియో తీశాడని చెబుతాడు బాస్. ఆ డానియేల్ గాడు చచ్చాడని రౌడీలు చెబుతారు. చచ్చేవాడు ఊరికే చావకుండా ఆ పెన్‌డ్రైవ్ ఎవరికో ఇచ్చి చచ్చాడని అంటాడు బాస్. రేపటికల్లా నాకు పెన్‌డ్రైవ్ తెచ్చి ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తానని వార్నింగ్ ఇవ్వడంతో ఆ పిల్ల రౌడీలు మళ్లీ రాజ్, కావ్యల దగ్గరికి వెళ్తారు.

రాజ్ వర్క్ చేసుకుంటూ ఉండగా.. కావ్య అందంగా ముస్తాబై వస్తుంది. భార్య అందాన్ని పొగుడుతుండగా రాజ్‌కి ఇందిర, అపర్ణలు ఫోన్ చేస్తారు. చలి ఎక్కువగా ఉందని అస్తమానం దుప్పటి కప్పుకోవద్దు.. అసలే కడుపుతో ఉన్న పిల్ల అని రాజ్‌కి వార్నింగ్ ఇస్తుంది ఇందిర. ఇంతమంది ఉంటేనే ఇంట్లో నిన్ను ఆపలేం.. అక్కడ మీరిద్దరే ఉన్నారు, అందుకే జాగ్రత్త చెబుతున్నానని అంటుంది. కావ్య వేసిన డిజైన్లను తల్లికి చూపిస్తాడు రాహుల్. వాటిని చూడగానే కావ్యను మెచ్చుకుంటుంది రుద్రాణి. పాపం నీ కంపెనీ ఎదుగుదల కోసం బాగా కష్టపడుతుందని సెటైర్లు వేస్తుంది. ఈ డిజైన్లు నీవేనని స్వప్నని ఎలా ఒప్పించబోతున్నావని రాహుల్‌ని అడుగుతుంది రుద్రాణి. తనను ఆఫీసుకు రమ్మని పిలిచి సగం నమ్మించేశాను, ఇప్పుడు తన చేతే ఈ డిజైన్లు సెలెక్ట్ చేయించి పూర్తిగా నమ్మించేస్తానని అంటాడు రాహుల్.

ఏ రోజూ నన్ను అత్తగారిగా, నిన్ను మొగుడిగా గుర్తించిందా? ఆ ముసలోడు ఇచ్చిన ఆస్తిని చూసి రెచ్చిపోయింది. అది చేసిన అవమానానికి దానికి ఇది సరిపోదని అంటుంది రుద్రాణి. ఈ డిజైన్లు దాని చేతే సెలెక్ట్ చేయించి నా బిజినెస్ డెవలప్‌ చేయించుకుంటానని చెబుతాడు రాహుల్. అలాగే నా బిజినెస్ డెవలప్‌మెంట్‌కు ఇన్వెస్ట్‌మెంట్ సరిపోలేదని... దాని పేరు మీదున్న ఆస్తి మొత్తం నా పేరు మీదకి రాయించుకుంటానని తన ప్లాన్ చెబుతాడు. నువ్వు నిజంగా ఆ పని చేస్తే ఆ స్వప్న కుక్కిన పేనులా మన దగ్గరే పడి ఉంటుందని అంటుంది రుద్రాణి. నోరేసుకుని పడిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతుంది. వీళ్లంతా సెంటిమెంటల్ ఫూల్స్.. ఇప్పుడు ఆ మంచితనమే వాళ్ల పతనానికి కారణం అవుతుందని అంటాడు రాహుల్. ఆ రాజ్‌నే నన్ను చూసి నేర్చుకోమనే స్థాయికి వెళ్తానని చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X