Brahmamudi December 9th Episode: స్వప్నని ముగ్గులోకి దించిన రాహుల్... కావ్య, రాజ్‌లను వెంటాడుతోన్న ప్రమాదం

Photo Courtesy: JioHotstar

కావ్యకి గురువుగారు ట్రీట్‌మెంట్ చేస్తుండగా రాజ్ బయటే వెయిట్ చేస్తాడు. ఇంతలో రౌడీలైన చోటు, మోటులు రాజ్ దగ్గరికి వచ్చి ఆ డానియేల్ గాడు ఇచ్చిన పెన్‌డ్రైవ్‌ని ఇవ్వమని గొడవ చేస్తాడు. దాంతో రాజ్ లాగి పీకుతాడు. చేసేదేం లేక వారిద్దరూ వెళ్లిపోతారు. వారిని కావ్య చూసి మళ్లీ వాళ్లు ఎందుకొచ్చారని అడుగుతుంది. పనిపాటా లేని వెధవలు అంటూ రాజ్ విసుక్కుంటాడు. పెన్‌డ్రైవ్ తీసుకురాకపోవడంతో చోటు, మోటులపై వాళ్ల బాస్ మండిపడతాడు.

ఆ పెన్‌డ్రైవ్‌లో నా జీవితం ఉంది.. అది నా చేతికి దొరక్కపోతే నా ప్రాణాలే పోతాయని చెబుతాడు. ఇంతకీ ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందని చోటు, మోటులు అడగ్గా.. ఎమ్మెల్యే తాలూకా అమ్మాయితో గడిపిన వీడియో ఉంటుంది. ఇది ఆ ఎమ్మెల్చే చేతికి దొరికితే వాడు నన్ను చంపేస్తాడు. ఏం చేసైనా సరే ఆ పెన్‌డ్రైవ్ నా చేతికి రావాలని అంటాడు. రేణుక పాప మిస్సింగ్ కేసును వదిలేసి మరో కేసు చూసుకోవాలని అప్పూకి సీఐ వార్నింగ్ ఇస్తాడు. కావ్య వేసిన డిజైన్లను రుద్రాణికి చూపిస్తాడు రాహుల్. దుగ్గిరాల ఫ్యామిలీనే కాదు స్వప్నని కూడా వదలను... దాని ఆస్తి మొత్తం నా పేరు మీదకి వచ్చేలా చేస్తానని తల్లితో చెబుతాడు రాహుల్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక డిసెంబర్ 9వ తేదీ ఎపిసోడ్ 899లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial December 9th 2025 Episode 899 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్యకి త్వరలోనే నయం కాబోతుండటంతో రాజ్ చాలా సంతోషిస్తాడు. భార్యని తీసుకుని రెస్టారెంట్‌కి వచ్చిన రాజ్.. ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు. మీరు ఏం తింటారో అది చెబితే క్షణాల్లో రెడీ చేయిస్తానని అంటాడు రాజ్. మీరు ఓవరాక్షన్ చేస్తుంటే నాకు సిగ్గేస్తుందని అంటుంది కావ్య. నేను సిగ్గుపడితే మీకు అంత ఇష్టమా అని అడుగుతుంది. ఎప్పుడూ నా మీద ఫైటింగ్ చేస్తూ, నన్ను డామినేట్ చేయాలని అనుకుంటావు కానీ ఎప్పుడైనా సిగ్గుపడ్డావా? అని ప్రశ్నిస్తాడు రాజ్. వాళ్ల దెబ్బలాట చూసిన కస్టమర్స్.. మీరిద్దరూ లవర్సా అని అడుగుతారు. మేం భార్యాభర్తలమని కావ్య చెప్పబోతుండగా రాజ్ ఆపుతాడు. మీ జంట చాలా బాగుందండి, మీరు భార్యాభర్తలు లాగా లేరని చెబుతుంది.

ఇంతలో చోటు, మోటులు వెయిటర్‌ల మాదిరిగా డ్రెస్ మార్చుకుని రాజ్, కావ్యల మాటలు గమనిస్తారు. వీళ్లు ఇక్కడ తినేపనిలో ఉన్నారు కాబట్టి.. మనం వాళ్ల రూమ్‌లోకి వెళ్లి పెన్‌డ్రైవ్ కొట్టేద్దామని ప్లాన్ చేస్తారు. వారి రూమ్ లాక్ చేసి ఉండటంతో దొంగచాటుగా తాళం కొట్టేసి రాజ్, కావ్యల రూమ్‌లోకి వెళ్లి వెతుకుతారు చోటు, మోటు. కానీ ఎంత వెతికినా వాళ్లకి పెన్‌డ్రైవ్ దొరకదు. ఇంతలో ఆ రూమ్‌లోకి రూమ్ సర్వీస్ వాళ్లు వచ్చి ఎవరు మీరు అని అడుగుతాడు. బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి వచ్చిన వర్కర్స్ మీరేనా అని అడుగుతాడు. ఆ మాటలు వినగానే చోటు, మోటులు షాక్ అవుతారు. తప్పించుకోవడానికి బాగుంటుందని బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి ఒప్పుకుంటారు. రూమ్ క్లీన్ చేస్తుండగా ఒక వ్యక్తికి పెన్‌డ్రైవ్ దొరుకుతుంది. అతను దానిని తీసుకెళ్లి రిసెప్షన్‌లో ఇస్తాడు.

స్వప్న అందంగా రెడీ అవ్వడంతో ఆమెను మెచ్చుకుంటాడు రాహుల్. మన పెళ్లయ్యాక ఫస్ట్ టైం నువ్వు నన్ను లంచ్‌కి తీసుకెళ్తానని అన్నావు కదా? ఈ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా అని అడుగుతుంది స్వప్న. ఇన్నిరోజులు మా అమ్మ మాట విని మూర్ఖంగా ప్రవర్తించాను, ఇక నుంచి అలా ఉండకూడదని అనుకుంటున్నానని చెబుతాడు. ఆ వెంటనే స్వప్న మెడలో ఖరీదైన నెక్లెస్ వేయడంతో ఆమె చాలా సంతోషిస్తుంది. ఇది ఎప్పుడు కొన్నావని స్వప్న అడగ్గా.. నీకోసమే స్పెషల్‌గా డిజైన్ చేయించానని అంటాడు రాహుల్. ఇన్నిరోజులు ఇంట్లో రాజ్, కళ్యాణ్‌లను చూసి వాళ్ల లాగా నా రాహుల్ ఎప్పుడు మారతాడోనని అనుకునేదానిని అని బాధపడుతుంది స్వప్న.

ఇకపై నువ్వు నా వల్ల బాధపడవని ప్రామిస్ చేస్తున్నానని చెబుతాడు రాహుల్. నేను మూడు రోజులు ఎంతో కష్టపడి కొన్ని డిజైన్లు గీయించాను, వాటిని ఫైనల్ చేసి ఈరోజు మాన్యుఫ్యాక్చరింగ్‌కి పంపించాలని అనుకుంటున్నానని చెబుతాడు రాహుల్. వాటిలో ఏవి బాగున్నాయో ఏంటో నువ్వే సెలెక్ట్ చేయమని చెబుతాడు. నా కంపెనీలో మొదటిసారి తయారు చేసిన డిజైన్స్. వీటికి టాలెంట్‌తో పాటు లక్ కూడా ఉండాలి. నా అదృష్ట దేవతవి నువ్వే కదా? వీటిలో ఏది బాగుందో నువ్వే సెలెక్ట్ చేయమని అడుగుతాడు. ఆ మాటలతో స్వప్న సిగ్గుపడుతుంది. దాంతో స్వప్న కొన్ని డిజైన్లు సెలెక్ట్ చేసి రాహుల్‌కి ఇస్తుంది. నాకేం నచ్చాయో నీకు కూడా అవే నచ్చాయని అంటాడు.

నేను మారితే మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతామని ఆ దేవుడు ముందే రాసిపెట్టినట్లుగా ఉన్నాడు.. అందుకే మనల్ని ఇలా కలుపుతాడు రాహుల్. ఈ డిజైన్స్‌ని మన మేనేజర్‌కి ఇచ్చి వస్తానని చెబుతాడు. నువ్వెప్పుడు ఇలాగే ఉంటావు కదా అని అడుగుతుంది స్వప్న. ఇకపై మనం సంతోషంగా లైఫ్‌ని లీడ్ చేయబోతున్నామని చెబుతాడు రాహుల్. రెస్టారెంట్‌లో కావ్యతో కలిసి భోజనం చేస్తుంటాడు రాజ్. ఇంతలో చోటు దగ్గరికి మారువేషంలో వస్తాడు మోటు. వాళ్లిద్దరూ మారువేషంలో వచ్చిన విషయాన్ని రాజ్ గుర్తిస్తాడు. ఆ పెన్‌డ్రైవ్ మన దగ్గర లేదు కదా? అని కావ్య అడగ్గా.. ఈ విషయం ఆ వెధవలకి తెలియదు కదా అని అంటాడు రాజ్.

రాజ్, కావ్యలు ఏం వింటున్నారో తెలుసుకోవాలని మోటు.. అటు ఇటు తిరుగుతుంటాడు. అయినా తన ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో అతను చిరాకు పడతాడు. నా ఫోన్ వాళ్ల దగ్గర పెట్టి.. నీ ఫోన్‌లో వాళ్లు ఏం మాట్లాడతారో వింటానని మోటుతో చెబుతాడు చోటు. రాజ్, కావ్యలకి తెలియకుండా ఫోన్ వాళ్ల టేబుల్ కింద పెడతాడు మోటు. అది గమనించిన రాజ్.. ఆ పెన్‌డ్రైవ్ శృతికి ఇచ్చేశావా అని కావ్యతో కావాలని అంటాడు. దానిని ఎప్పుడో శృతికి ఇచ్చేశానని కావ్య చెప్పడంతో ఈ మాటలు విన్న చోటు, మోటులు తమకు పెన్‌డ్రైవ్ జాడ తెలిసిందని సంతోషిస్తారు. మోటు ఫోన్ చూసిన రాజ్.. దానిని కావాలని కిందకి విసిరేయగా.. ఓ వ్యక్తి దానిని తొక్కేస్తాడు. పదివేల రూపాయల ఫోన్ పోయిందని మోటు బాధపడతాడు. ఫోన్ పోయినా మనకి ఇన్ఫర్మేషన్ దొరికిందని అంటాడు చోటు. ఆ శృతి అన్న అమ్మాయి ఎవరో వెతకాలని అనుకుంటారు చోటు మోటు. ఇంతలో ఇద్దరు సంగీత విధ్వంసులు.. శృతి శృతి అనడంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. ఆ శృతి ఎక్కడ అని అడగ్గా.. వాళ్లిద్దరూ హార్మోనియం, తబాలా వాయించేస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X