సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బ్రహ్మముడి నటి .. ఏకంగా హీరోతో ప్రేమాయణం
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు హీరో హీరోయిన్లు సైలెంట్‌గా పెళ్లి పీటల మీదకు ఎక్కేస్తున్నారు. సినిమా వాళ్లే కాదు.. బుల్లితెర నటీనటులు కూడా దీనికి అతీతం కాదు. తమ సహనటులు, చిన్ననాటి స్నేహితులతో గుట్టుగా ప్రేమాయణం సాగిస్తూ వారితో ఏడాడుగులు నడిచేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా తెలుగునాట పాపులర్ సీరియల్స్‌లో ఒకటైన బ్రహ్మముడి నటి కూడా సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగు నాట పాపులర్ సీరియల్‌గా బ్రహ్మముడి
కార్తీక దీపం తర్వాత స్టార్ మాలో అంతటి క్రేజ్ తెచ్చుకుంది బ్రహ్మముడి. గొప్పింటి కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములను.. పేదవాళ్లయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు పెళ్లి చేసుకోవడం, వారికి ఎదురైన కష్టాల చుట్టూ ఈ సీరియల్ నడుస్తుంది. ఇందులో బిగ్‌బాస్ ఫేం మానస్ నాగులపల్లి- దీపిక రంగరాజులు లీడ్ రోల్స్ పోషిస్తుండగా కిరణ్ కాంత్, శ్రీకర్ కృష్ణ, రూప ముగ్గళ్ల, నైమిషా రాయ్‌లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సీరియల్‌లో అప్పూ అనే పాత్రలో హీరోయిన్‌కు చెల్లెలుగా నటించిన నైనిషా రాయ్. మగరాయుడిలా పెరిగే అప్పూ.. తన అక్కల జోలికి వస్తే ఎవ్వరినీ వదిలిపెట్టదు. హీరో తమ్ముడిని ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత కష్టపడి ఎస్ఐ ఉద్యోగం సంపాదిస్తుంది.

అప్పూ రోల్‌లో ఇరగదీసిన నైనిష
ఈ అప్పూ రోల్‌ను అద్భుతంగా పోషించారు నైనిషా రాయ్. బెంగాల్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ.. నటి కావడం కోసం ఎంతో కష్టపడింది. మంచి నటనతో పాటు తెలుగును అనర్గళంగా మాట్లాడటం ఈమెకు ప్లస్ పాయింట్. బ్రహ్మముడికి ముందు శ్రీమంతుడు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఇంటి గుట్టు, హంస గీత, భాగ్యరేఖ వంటి సీరియల్స్‌తో పాటు ప్లాన్ బి, కిడ్నాప్ వంటి సినిమాల్లోనూ నటించింది. నెగిటివ్ సీరియల్స్‌తోనే తను మంచి పేరు తెచ్చుకుంది.
గ్లామరస్ రోల్సే ఇష్టం
నిజానికి తనకు బ్రహ్మముడి సీరియల్ చేయాలని అస్సలు లేదని.. టామ్ బాయ్ అంటే నటనకు స్కోప్ ఉందని నైనిషా రాయ్ తెలిపారు. కానీ ఛానెల్ వాళ్లు బలవంతంగా తనను ఒప్పించారని.. మీకు మంచి పేరొస్తుందని చెప్పారని ఆమె వెల్లడించింది. వాళ్లు చెప్పినట్లుగానే అప్పూ పాత్రకు మంచి పేరొచ్చిందని నైమిష చెప్పింది. రియల్ లైఫ్‌లో తనకు గ్లామరస్ రోల్స్ ఇష్టమని.. చీరలు, స్టైలీష్ డ్రెస్‌లు వేసుకోవడం తనకు ఇష్టమని నైనిష చెప్పింది.
హీరోతో అప్పూ ఎంగేజ్‌మెంట్
తాజాగా నైనిషా రాయ్ అభిమానులకు షాకిచ్చారు. తన సహ నటుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. సీరియల్ హీరోగా ఉన్న ఆశిష్ చక్రవర్తితో నిశ్చితార్ధం చేసుకుని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎట్టకేలకు మేం సాధించామంటూ క్యాప్షన్ పెట్టింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఇలాంటి అద్భుతమైన రోజు వచ్చిందని నైనిషా పేర్కొన్నారు. తనకు ఇన్నాళ్లుగా అండగా నిలిచినందుకు చక్రవర్తికి థ్యాంక్స్ చెప్పింది. ఇక ఆశిష్ చక్రవర్తి విషయానికి వస్తే.. తెలుగులో చామంతి అనే సీరియల్‌లో నటిస్తున్నాడు. ఇతను తొలుత బాడీ బిల్డర్ అని తెలుస్తోంది. పలు ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని ట్రోఫీలు గెలుచుకున్నాడు. నైనిష- చక్రవర్తిల ఎంగేజ్‌మెంట్ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











