Manas Nagulapalli : మరో గుడ్ న్యూస్ చెప్పిన బ్రహ్మముడి హీరో ... ఫోటోలు వైరల్
స్టార్ మాలో స్టార్ రేటింగ్‌తో దూసుకెళ్తున్న సీరియల్ బ్రహ్మముడి. తెలుగు సీరియల్స్‌లో ఇప్పుడు ఇదే టాప్‌లో ఉందని బార్క్ రేటింగ్స్ చెబుతున్నాయి. ఈ సీరియల్ హీరోగా నటించిన మానస్ నాగులపల్లి.. అంతకుముందు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లినా రానీ క్రేజ్ ఈ ఒక్క సీరియల్‌తో వచ్చింది. తాజాగా మానస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే.
ఆగస్ట్ 2, 1990న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించారు మానస్ నాగులపల్లి. ఆయన పూర్తి పేరు మాస్టర్ రామ్ తేజ. చిన్నతనం నుంచే మానస్ తన ప్రతిభను చాటుకున్నారు. డ్యాన్సులు, యాక్టింగ్‌లోనే కాకుండా చదువుల్లో కూడా ఆయన టాపర్. మంచి ర్యాంక్ సాధించిన ఆయన ఏకంగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రశంసలు అందుకొన్నాడు. డ్యాన్సుల్లో ఇరుగదీసి.. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న టాలెంటెడ్.

మానస్ బాల నటుడిగా 2001లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. బీ గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ నరసింహానాయుడులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించిన ఆయన క్షీరసాగర మథనం, అర్జున్, వీడే లాంటి సినిమాల్లోనూ అలరించారు. ఈ ఫేమ్‌తో ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగులో అవకాశం దక్కించుకుని మరింత పాపులర్ అయ్యాడు. తన ఆట తీరుతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడమే కాకుండా వారి అభిమానాన్ని సాధించాడు. అయితే బిగ్‌బాస్ టైటిల్ సాధించాలనుకున్న కల తీరకుండానే వెనుదిరిగాడు.
బిగ్‌బాస్ రియాలిటీ షో మానస్ కెరీర్‌ను మలుపుతిప్పింది. ఈ షో తర్వాత మానస్‌కు భారీ ఆఫర్లు వచ్చాయి. బుల్లితెరపై ఫోకస్ చేసిన ఆయన కోయిలమ్మ, కార్తీక దీపంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే బ్రహ్మముడిలో హీరోగా అవకాశం దక్కించుకున్నారు. తన నటనతో మహిళా ప్రేక్షకులకు బాగా దగ్గరై బుల్లితెరపై టాప్ యాక్టర్లలో ఒకడనే పేరు తెచ్చుకున్నాడు. యాంకర్ విష్ణుప్రియతో కలిసి ఆయన చేసిన ప్రైవేట్ ఆల్బమ్స్‌కు మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది.
గతేడాది ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అయిన శ్రీజ నిశ్శంకరను పెళ్లి చేసుకున్నారు మానస్. పెళ్లయిన ఏడాది తిరగకుండానే గుడ్‌న్యూస్ చెప్పిన ఆయన ఇటీవల తండ్రి అయ్యాడు. ఆయన భార్య శ్రీజ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఈ చిన్నారి నామకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న మానస్.. తన కొడుకు పేరు కూడా రివీల్ చేశారు. ఈ చిన్నారి పేరు ధ్రువ నాగులపల్లి. దీంతో బుల్లితెర ప్రముఖులు, మానస్ స్నేహితులు, నెటిజన్లు బాబును ఆశీర్వదిస్తూ నాగులపల్లి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











